పరిశ్రమలా వ్యవసాయాన్ని మలచుకోవాలి

వ్యవసాయాన్ని ఆర్థిక వృద్ధికి దోహదపడే డైనమిక్‌ పరిశ్రమగా మలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అసోసియేటెడ్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఆఫ్‌ ఇండియా (అసోచామ్‌) దక్షిణ భారత వ్యవసాయ, ఆహార ప్రాసెసింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ డా. రంగయ్య వి. సెట్లెం కోరారు. అసోసియేటెడ్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో గురువారం బేగంపేటలోని గ్రీన్‌ పార్క్‌ హోటల్‌లో అగ్రిబ్రిజ్‌ కనెక్ట్‌ -2025 సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆయనతో పాటు కొండాలక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డా. రాజిరెడ్డి, కేపీఎంజీ ఇండియా భాగస్వామి, సీనియర్‌ అడ్వైజర్‌ గోపీనాథ్‌ కోనేటి, రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ పద్మశ్రీ వెంకటేశ్వరరావు, అసోచామ్‌ దక్షిణ ప్రాంతీయ డైరెక్టర్‌ దినేష్‌బాబు, వ్యవసాయ పరిశ్రమలకు చెందిన సుమారు 200 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.

Read More

క్వింటాల్‌కు రూ.1,000 నుంచి రూ.1,500 పెరిగిన మిరప ధర

గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈసారి మిరప విత్తన వ్యాపారం పడిపోయింది. నారు పోసే పరిస్థితి కానరాక నర్సరీలూ వెలవెలబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్‌ల్లోనూ సాగు భారీగా తగ్గనుంది. దీంతో వ్యాపారుల మాయాజాలం మొదలైంది. రేట్లు కాస్త కదిలిస్తే పెరిగిన మిరప ధరలతో రైతుల్లో ఆశ మొదలవుతుందని, మళ్లీ ముమ్మరంగా సాగుకు సిద్ధమవుతారని భావించారు. ఈ మూడు రోజుల్లోనే ధరలు క్వింటాలు రూ. 1,000 నుంచి రూ.1,500 వరకు పెరిగాయి. కిందటి నెలతో పోలిస్తే సగటున రూ.2వేలు ధర పెరిగింది. ఏసీలో నిల్వ ఉంచిన మిరపకాయలకు రకాల వారీగా రూ.11 వేల నుంచి రూ.15 వేల వరకు ఇస్తున్నారు. గుంటూరు మార్కెట్లో రోజూ 50 వేలకు పైగా బస్తాల అమ్మకం జరుగుతోంది. *ధర ఇప్పుడే పెరగటానికి కారణాలు ఏమిటి?* వాస్తవానికి గుంటూరు పరిధిలోని శీతల గోదాముల్లోనే సుమారు 40 లక్షల బస్తాలు నిల్వ ఉన్నట్లు అంచనా. అయినా రైతులు అమ్మకానికి రావడం లేదు. దీంతో వ్యాపారులు ధరల్ని కొంతమేర పెంచుతున్నారు. సీజన్‌ కావడంతో పాటు నాణ్యమైన సరుకు అమ్మకానికి రాకపోవడంతోనే కొంతమేర ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.

Read More

భద్రాద్రిలో జిల్లాకు మునగ సాగులో జాతీయ స్థాయి గుర్తింపు

రైతు ఆదాయం పెంపు లక్ష్య సాధనలో భాగంగా చేపట్టిన కార్యక్రమంతో జాతీయ స్థాయిలో భద్రాద్రి జిల్లాకు గుర్తింపు లభించింది. భద్రాద్రి జిల్లా రైతులు మునగ సాగులో సాధించిన సత్ఫలితాలను ‘లక్ష్యసాధన జిల్లాలు'(యాస్పిరేషనల్‌ డిస్ట్రిక్ట్స్‌) అనే పేరుతో నీతిఆయోగ్‌ తాజాగా విడుదల చేసిన నివేదికలో ప్రత్యేకంగా వివరించింది. దాదాపు 50 శాతం అటవీ భూభాగమున్న ఈ జిల్లా జనాభాలో 37 శాతం గిరిజనులే. భారీ వర్షపాతం నమోదవుతున్నా సాగునీటి పారుదల వ్యవస్థలు సరిగా లేవు. అధిక పెట్టుబడి వ్యయంతో పత్తి, మొక్కజొన్న సాగుచేస్తున్నా ఫలితం ఉండట్లేదు. పోషకాహారలేమి వల్ల జిల్లా ప్రజలు రక్తహీనత (అనీమియా)తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం రైతుల ఆదాయం పెంచేందుకు ప్రయోగాత్మకంగా 415 ఎకరాల్లో మునగ పంటను సాగు చేయించింది. తమిళనాడు వ్యవసాయ యూనివర్శిటీ సహకారంతో అశ్వారావుపేట వ్యవసాయ కాలేజీ శాస్త్రవేత్తలు ఈ పంట సాగుపై రైతులకు మెలకువలు నేర్పారు. ఉపాధి హామీ పథకం అనుసంధానంతో జిల్లా యంత్రాంగం సహకారం అందించింది. మునగ మొక్కల సాగుతో రైతులకు మంచి ఆదాయం వచ్చింది. అంతర పంటలుగా కూరగాయల సాగుతో కూడా ఆదాయం సమకూరింది. మునగ ఆకులను కూరలుగా తినడంతోపాటు పశువులకు దాణాగా కూడా ఇచ్చారు. ఈ జిల్లాలోని మైలారం గ్రామానికి చెందిన జమీల్‌ అనే రైతు కోళ్లకు మేతగా మునగాకును వినియోగించి సత్ఫలితాలు సాధించినట్లు తెలిపారని నీతిఆయోగ్‌ వివరించింది. మునగ సాగు వల్ల రైతుల ఆదాయం రెట్టింపు కావడమే కాకుండా.. దేశాన్ని అనీమియా రహిత భారత్‌గా మార్చేందుకు ఉపకరిస్తుందని స్పష్టం చేసింది.

Read More

పంటలకు సమృద్ధిగా సాగునీరు: మంత్రి ఉత్తమ్‌

వివిధ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల వలన తెలంగాణాలో ప్రాజెక్టులు నిండటంతో వానాకాలం పంటలకు సమృద్ధిగా సాగునీటిని అందించనున్నట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమకుమార్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 388 టీఎంసీల నీటి అవసరాలు ఉన్నాయని, చివరి ఎకరా వరకు ఆటంకం లేకుండా సాగునీరు సరఫరా చేసేలా జిల్లా స్థాయి అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లో సచివాలయం నుంచి సీఈలు, ఎస్‌ఈలు ఇతర ఇంజినీర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘జూరాల, శ్రీశైలం, సాగర్లకు భారీ ప్రవాహాలు వస్తున్నాయి. ఎస్సారెస్పీ, సింగూరుకు వరద వస్తోంది. రాష్ట్రంలో 34,740 చెరువులకు 12,023 నిండగా, మరో 9,100 చెరువులు 75-100 శాతం నిండాయి. వరదలకు 177 చెరువులు, కాలువలు, లిఫ్టులు దెబ్బతిన్నాయి. వాటి పునరుద్ధరణకు రూ.355 కోట్లతో అంచనాలు సిద్ధం చేశాం. ఇప్పటికే 3,500 చోట్ల తాత్కాలిక మరమ్మతులు చేపట్టాం’ అని, యాసంగి పంటలకు కూడా సాగునీటి ప్రణాళిక ఉండాలని పేర్కొన్నారు.

Read More

వ్యవసాయ రుణాలు ఆంధ్రప్రదేశ్‌లో రూ.3.08 లక్షల కోట్లు

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రుణాలు ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.3,08,716.83 కోట్లకు చేరినట్లు కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్‌ ఠాగూర్‌ తెలిపారు. ఇందులో రూ.2,11,657.36 కోట్ల రుణాలు (68.56%) చిన్న, సన్నకారు రైతులవేనని ఆయన తెలిపారు. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి రూ. 12,49,500 కోట్ల రుణాలున్నట్లు చెప్పారు. రాజ్యసభలో మంగళవారం తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ద్వారా ఈ విషయం వెల్లడైంది.

Read More

భవిష్యత్‌ అంతా ఉద్యానపంటలదే – మంత్రి తుమ్మల

కొండా లక్ష్మణ్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీలో అక్షయ డైనింగ్‌ హాలును ఈ రోజు తెలంగాణా వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించడం జరిగింది. భారతదేశంలోనే అన్ని సౌకర్యాలతో హార్టికల్చర్‌ యూనివర్సిటీని తెలంగాణాలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. మిగతా అన్ని రంగాల కంటే వ్యవసాయరంగానికే అత్యంత ప్రాధాన్యం ఉంది. భవిష్యత్తు అంతా వ్యవసాయానిదే. గత 4 సంవత్సరాల క్రితం కరోనా సమయంలో అన్ని వ్యవస్థలు మూతపడినా, నాగలి ఆగలేదు. రైతు శ్రమ ఆగలేదు. ఇంకా ఎక్కువ మొత్తంలో దిగుబడులు సాధించడం జరిగింది. హార్టికల్చర్‌ విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనీ, విద్యార్థులు ప్రావీణ్యతను పెంచుకుంటే, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల కన్నా, మీకు ఎక్కువ డిమాండ్‌ ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులు మొత్తం కోర్సులో సగానికి కన్నా ఎక్కువ రోజులు పొలాల్లో ఉండి, వ్యవసాయంలో ప్రావీణ్యం సంపాదించుకోవాలని, రైతు చేసే వ్యవసాయ విధానాలను పరిశీలించాలని తెలిపారు. హార్టికల్చర్‌ పంటలను అభివృద్ధి చేస్తే, అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, దేశంలో లక్ష కోట్లతో పామాయిల్‌ దిగుమతి చేసుకోవడం జరుగుతుందని, పామాయిల్‌ దిగుమతి తగ్గించాలంటే, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న 13 లక్షల ఎకరాలలో ఉన్న పామాయిల్‌ పంటను 70 లక్షల ఎకరాలకి విస్తరించినట్లయితే, డిమాండ్‌ను అధిగమించడానికి అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 2.65 లక్షల ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ సాగు చేయడం జరుగుతుందని, ఆయిల్‌ పథకాన్ని అమలు చేయడంలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలోఉందని, రానున్న 4 సంవత్సరాలలో రాష్ట్రంలో పామాయిల్‌ పంటను 10 లక్షల ఎకరాలకు విస్తరించడానికి ప్రణాళిక చేయడం జరిగిందన్నారు. కూరగాయలు, పండ్ల తోటలతో పాటుగా జాజి, వక్క, మెకడమియా లాంటి పంటలను పండించడానికి తెలంగాణ నేలలు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. భవిష్యత్తు అంతా హార్టికల్చర్‌దే అని నేను భావిస్తున్నానని పేర్కొన్నారు. రైతుల ఆదాయం పెరగడానికి ఉద్యానపంటలు ఒక గ్రోత్‌ ఇంజన్‌గా నిలుస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. హార్టికల్చర్‌ శాస్త్రవేత్తలు, రైతులు హార్టికల్చర్‌ పంటలు సాగుచేయడానికి అవసరమైన పరిశోధనలను విస్తృతం చేసి, సూచనలు సలహాలు అందించాలని మంత్రి పేర్కొన్నారు. యూనివర్సిటీలో పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక బోధన విషయాలలో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయకమిషన్‌ చైర్మన్‌ కోదండ రెడ్డి, వైస్‌ చాన్స్‌లర్‌ రాజిరెడ్డి, వ్యవసాయశాఖ సెక్రటరి రఘునందన్‌ రావు, వ్యవసాయ కమిషన్‌ సభ్యులు మరియు యూనివర్సిటీ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.

Read More

జీడి, మిర్చి, మామిడి రైతుల ప్రయోజనాల కోసం బోర్డులు ఏర్పాటు చేయమని కేంద్రమంత్రిని కోరిన లోకేశ్‌

‘జీడిపప్పు ఉత్పత్తిలో ఏపీ రెండో స్థానంలో ఉంది. ప్రాసెసింగ్‌ వ్యవస్థ ఆధునికీకరణ, సరైన మార్కెటింగ్‌ కోసం జీడి బోర్డు అవసరం. మిర్చి బోర్డు ఏర్పాటైతే ధరల హెచ్చుతగ్గులను నియంత్రించవచ్చు. రాష్ట్రంలో ఏటా దాదాపు 50 లక్షల మెట్రిక్‌ టన్నుల మామిడి దిగుబడి వస్తోంది. ఈ పంటలు సాగు చేసే రైతుల కష్టాలు తొలగడానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని శ్రీకాకుళంలో జీడి, గుంటూరులో మిర్చి, చిత్తూరులో మామిడి బోర్డులు ఏర్పాటు చేయాలని కేంద్రవాణిజ్యమంత్రి పీయూష్‌ గోయల్‌ను మంత్రి లోకేశ్‌ కోరారు. మూలపేట, చిలమత్తూరు, కుప్పం, దొనకొండల్లో 4 కొత్త పారిశ్రామిక నోడ్‌లను అభివృద్ధి చేసేందుకు అనుమతులివ్వాలి. నీరు, విద్యుత్తు, రైల్వే కనెక్టివిటీ వంటి మౌలిక వసతుల కల్పనకు రూ.5,811 కోట్ల గ్రాంట్‌ మంజూరు చేయండి. విజయవాడ- చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో చిత్తూరు నోడ్‌కు అనుమతివ్వాలి. ఓర్వకల్లు, కొప్పర్తి నోడ్‌ల మాస్టర్‌ప్లాన్లు ఆమోదం పొంది, టెండర్లకు సిద్ధంగా ఉన్నాయి. వీటి ఈపీసీ విడుదలకు నేషనల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి ఆమోదం ఇప్పించండి’ అని విజ్ఞప్తి చేశారు.

Read More

ఎరువుల కొరత సమస్యలపై 9154970454కు ఫోన్‌ చేయండి

ఎన్‌టిఆర్‌ జిల్లాలో ఎరువుల సరఫరాపై ఏవైనా ఫిర్యాదులు లేదా సమాచారాన్ని అందించేందుకు విజయవాడ కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 9154970454కు ఫోన్‌ చేయవచ్చని రైతులకు కలెక్టర్‌ జి. లక్ష్మీశ సూచించారు. ఈ నంబర్‌ను ఎరువుల దుకాణాలు, సొసైటీల వద్ద తప్పనిసరిగా ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్‌ నుంచి క్షేత్రస్థాయి అధికారులతో ఆదివారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఖరీఫ్‌ వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న క్రమంలో ఎరువులు సమృద్ధిగా ఉన్నట్లు తెలిపారు. కిలో ఎరువు కూడా పక్కదారి పడడానికి వీల్లేదన్నారు. సాగు అవసరాల మేరకే ఎరువులు తీసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎరువుల లెక్కలకు సంబంధించి ఫిజికల్‌, ఆన్‌లైన్‌ రికార్డులతో లావాదేవీలు పారదర్శకంగా ఉండాలన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని వివరించారు. జిల్లాలో 6,388 మెట్రిక్‌ టన్నుల యూరియాతో పాటు, డీఏపీ, ఎంవోపీ, ఎస్‌.ఎస్‌.పి. కాంప్లెక్సు. ఇలా మొత్తం 23,820 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్‌ వెల్లడించారు. నానో ఎరువుల వినియోగంతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

Read More

అగ్రివర్సిటీ కళాశాలల్లో 15% సీట్లు రైతుకూలీల పిల్లలకు

2025-26 విద్యాసంవత్సరం నుంచి తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం బీఎస్సీ(అగ్రి), బీటెక్‌ (ఫుడ్‌ టెక్నాలజీ) కోర్సుల్లో రైతు కూలీల పిల్లలకు 15 శాతం ప్రత్యేక కోటాను అమలు చేయనుంది. దీనికి ఎవరు అర్హులనే దానిపై అగ్రివర్సిటీ ఆదివారం మార్గదర్శకాలను విడుదల చేసింది.

  • విద్యార్థులు 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యాభ్యాసంలో కనీసం నాలుగేళ్లు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివి ఉండాలి.
  • విద్యార్థి లేదా అతడి తల్లితండ్రులు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం(జాబ్‌) కార్డును కలిగి ఉండాలి. జాబ్‌ కార్డు లేని పక్షంలో వారు ఎకరం లోపు భూమిని కలిగి ఉండాలి.
Read More

ఆంధ్రప్రదేశ్‌లో ఆహార నాణ్యత పరీక్షా కేంద్రాలు ఏర్పాటు

రాష్ట్రస్థాయి ఆహార నాణ్యత పరీక్షా కేంద్రాలు విశాఖ, గుంటూరు, తిరుమల, తిరుపతి, కర్నూలులో ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాతో కలిసి వీటిని అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. ల్యాబొరేటరీల నిర్మాణం, ఆధునికీకరణకు సుమారు రూ.100 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. తిరుమల, విశాఖపట్నంలలోని రాష్ట్రస్థాయి లేబొరేటరీల్లో ఆహార నమూనాల పరీక్షలు నెల రోజుల్లో ప్రారంభిస్తామన్నారు. ఒంగోలు, ఏలూరుల్లోని ప్రజా రోగ్య ప్రయోగశాలలలో రూ.13 కోట్లతో ఆధునిక పరికరాల కొనుగోలుకు అనుమతిచ్చినట్లు వివరించారు.

Read More