వ్యవసాయాన్ని ఆర్థిక వృద్ధికి దోహదపడే డైనమిక్ పరిశ్రమగా మలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) దక్షిణ భారత వ్యవసాయ, ఆహార ప్రాసెసింగ్ కౌన్సిల్ చైర్మన్ డా. రంగయ్య వి. సెట్లెం కోరారు. అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం బేగంపేటలోని గ్రీన్ పార్క్ హోటల్‌లో అగ్రిబ్రిజ్ కనెక్ట్ -2025 సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆయనతో పాటు కొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డా. రాజిరెడ్డి, కేపీఎంజీ ఇండియా భాగస్వామి, సీనియర్ అడ్వైజర్ గోపీనాథ్ కోనేటి, రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ పద్మశ్రీ వెంకటేశ్వరరావు, అసోచామ్ దక్షిణ ప్రాంతీయ డైరెక్టర్ దినేష్‌బాబు, వ్యవసాయ పరిశ్రమలకు చెందిన సుమారు 200 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.

22 Aug, 2025
