ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రుణాలు ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.3,08,716.83 కోట్లకు చేరినట్లు కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాగూర్ తెలిపారు. ఇందులో రూ.2,11,657.36 కోట్ల రుణాలు (68.56%) చిన్న, సన్నకారు రైతులవేనని ఆయన తెలిపారు. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి రూ. 12,49,500 కోట్ల రుణాలున్నట్లు చెప్పారు. రాజ్యసభలో మంగళవారం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ద్వారా ఈ విషయం వెల్లడైంది.

20 Aug, 2025
