ఒడిశాలోని ధమ్రా పోర్టు నుంచి 10,800 టన్నుల యూరియా రాష్ట్రానికి కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చిందని.. ఎవరూ అందోళన పడొద్దని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో వివరించారు. యూరియా కోసం ఎదురుచూస్తున్న ప్రాంతాల్లోని రైతులకు వెంటనే దీన్ని పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు 6న గంగవరం పోర్టుకు 15,000 టన్నులు, సెప్టెంబరు రెండో వారంలో కాకినాడ పోర్టుకు 30,000 టన్నుల యూరియా సరఫరా చేసేందుకు కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. ఎరువుల కొరత తలెత్తకుండా మార్క్ఫెడ్ ద్వారా 1.10 లక్షల టన్నుల బఫర్ నిల్వలు సిద్ధంగా ఉంచామని అచ్చెన్నాయుడు తెలిపారు.

26 Aug, 2025
