సాధారణ నామం : కంట్రీ యారోరూట్, ఈస్ట్ ఇండియన్ యారోరూట్, ట్రావెన్‌కూర్ స్టార్చ్,
పాలపిండి దుంప, పాలగుండ శాస్త్రీయ నామం : కర్కుమా ఆంగస్టిఫోలియా కుటుంబం: జింజిబెరేసి

ఇది 50-75 సెం.మీ. ఎత్తు వరకు పెరిగే దుంప జాతి మొక్క. బల్లెం ఆకారంలో ఉన్న ఆకులు పెద్దవిగా, పొడవుగా, వెడల్పుగా ఉండి కింద భాగంలో కాడవలె సన్నబడి ఉంటాయి. పసుపు పచ్చ పూలు కంకిలాగ వస్తాయి. దీనిని దుంపల ద్వారా వ్యాప్తి చేస్తారు. ఇది పసుపు మొక్కను పోలి ఉంటుంది.

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • దీని దుంపలు లేదా దుంప కొమ్ములు పాలపిండి / పాలగుండ తయారు చేయుటకు ఉపయోగిస్తారు.
  • దీని పిండిని వీర్యవృద్ధికి, మూత్రకోశ వ్యాధులకు, కడుపులో పుండ్ల నివారణకు ఉపయోగిస్తారు. తెల్లని పిండిని పిల్లలలో కడుపునెప్పి నివారణకు వాడతారు.

వ్యవసాయరంగంలో

  • దేశవాళి పాలగుండ ఆకుల నుండి వేరు చేసిన వోలటైల్ ఆయిల్ యాంటీమైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటుంది (రాణి అండ్ చౌహాన్, 2012).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.