సాధారణ నామం : కొండగన్నేరు / విసాగ్ని
శాస్త్రీయ నామం : ఆల్స్టోనియా వెనెనేట; కుటుంబం: అపోసైనేసి
తెల్లగన్నేరు సుమారు 6 మీ. ఎత్తు వరకు పెరిగే చిన్న లేదా మధ్య రకం చెట్టు. చెట్టు బెరడు బూడిద రంగుతో కూడిన గోధుమ వర్ణం కలిగి ఉంటుంది. వేరు చిక్కటి పసుపు రంగులో ఉండి గట్టిగా కర్రలాగా ఉంటుంది. ప్రతి కణుపు వద్ద 3-6 ఆకులు చుట్టూ అమరి ఉంటాయి. ఆకులు పలుచగా, బళ్ళెం ఆకారంలో ఉండి, అంచులు అలల్లాగా ఉంటాయి. ఆకు కొనలు సన్నగా మొనదేలి ఉంటాయి. అనేక ఈనెలు దగ్గర దగ్గరగా, సమాంతరంగా ఉండి ఆకుల చివర్ల నుండి పుట్టిన సన్నని దారంలాంటి ఈనెలతో కలపబడి ఉంటాయి. పూలు తెల్లగా ఉండి కొమ్మల చివర్లలో వస్తాయి. కాయలు కాడ కలిగి రెండు చివర్లు కొనదేలి ఉంటాయి. అనేక విత్తనాలు బల్లపరుపుగా, రెండు చివర్లలో వెంట్రుకలు కలిగి ఉంటాయి.
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
- తెల్లగన్నేరు వేర్లు, పండ్లు ఔషధాల తయారీలో ఉపయోగించబడుతున్నాయి.
- వీటిలో ఇండోల్ ఆల్కలాయిడ్స్ అధికంగాను, ఆల్స్టోవినైన్, వినినాటైన్, రిసర్పెåన్ మొదలైన రసాయనాలు ఉంటాయి.
- వేర్లను చర్మవ్యాధులు, కుష్టు, చెవిపోటుల చికిత్సలో ఉపయోగిస్తారు.
- వీటిని పాము కాటు, ఇతర విషపు పురుగుల కాట్ల చికిత్సలో కూడా ఉపయోగిస్తారు.
- మూర్ఛ రోగం, ఆయాసం, జ్వరం మొదలగు వాటి చికిత్సకు, పుండ్లు, సిఫిలిస్, పిచ్చి వంటి జబ్బుల చికిత్సకు ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో …
- ఆల్స్టోనియా బూనీ ఆకులు మరియు కాండం బెరడు ద్రావణాలు గులాబి రంగు కాండం తొలుచు పురుగు, సెసేమియాకెలామిస్టిస్ లార్వాలపై విషపూరిత చర్యను, పెరుగుదలనరికట్టే చర్యను ప్రదర్శించాయి. వీటిని గులాబి రంగు కాండంతొలుచు పురుగు నివారణకు రసాయన పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. (ఆయిజయాన్గ్బె, అతని అనుచరులు, 2007).
- ఆల్స్టోనియా స్కాలారిస్ కాండం బెరడు మరియు ఆకుల నీటి ద్రావణాలు, పాక్షికంగా శుద్ధి చేసిన ద్రావణాలు లిమ్నేయ అక్యూమినేట (నత్త)పై మొల్లస్కిసైడల్ మరియు యాంటికోలినెస్టరేజ్ చర్యలను ప్రదర్శించాయి. కాండం బెరడు ద్రావణాలు ఆకు ద్రావణాల కన్నా బలమైన మొల్లస్కసైడల్ చర్యను ప్రదర్శించాయి. (సింగ్ అండ్ ఇసంగ్, 2003).
- ఆల్స్టోనియా స్కాలారిస్ మొక్క అసిటోన్ లేటెక్స్ ద్రావణాలు లాబియో రోహిత (చేప)పై నీటి ద్రావణాలకన్నా 23 రెట్లు అధిక విషపూరిత చర్యను ప్రదర్శించాయి (సింగ్ అండ్ సింగ్, 2010).
- ఆల్స్టోనియా స్కాలారిస్ ఆకుద్రావణాలు ఈడెస్ ఆల్బోపిక్టస్ 3వ దశ లార్వాలపై లార్విసైడల్ చర్యను ప్రదర్శించాయి.
- ఆల్స్టోనియా స్కాలారిస్ క్లోరోఫాం, ఇథనాల్, నీటి ద్రావణాలు బాక్టీరిసైడైల్, ఫంగిసైడల్, యాంతెల్మింటిక్ చర్యలను ప్రదర్శించాయి. బాసిల్లస్ సీరియస్, క్లెబ్సియెల్లా న్యుమోనియె, ఎస్కెరిచియా కోలి, ఫిగెల్లా డీసెంట్రియేపై బాక్టీరిసైడల్ చర్యను ప్రదర్శించింది. రైజోపస్ ఒరైజె, క్లాడోస్పోరియం హెర్పారమ్, ఆస్పర్ౙిల్లస్ నైగర్, రైజోపస్ ఒరైజెపై ఫంగిసైడల్ చర్యను ప్రదర్శించింది.
- ఆల్స్టోనియా స్కాలారిస్ 100% ఆకుల ద్రావణాన్ని 15 రోజుల వయసు పార్థినియం మొక్కలపై 5 రోజుల వ్యవధిలో పిచికారి చేస్తే, మొదటి పిచికారి చేసిన 15 రోజుల తర్వాత వేర్లు మరియు కాండం జీవపదార్థం గణనీయంగా తగ్గింది. ఆకుల నీటి ద్రావణంలో ఉన్న కలుపు నాశక పదార్థాలు పార్థినియం నివారణకుపయోగిస్తాయి (జావైద్, అతని అనుచరులు, 2010).
- ఆల్స్టోనియా స్కాలారిస్ ఆకు ఎసిటోన్ ద్రావణం చెదపురుగులపై వికర్షక చర్యను ప్రదర్శించింది (సోహైల్ అహ్మద్, అతని అనుచరులు)
- ఆల్స్టోనియాస్కాలారిస్ ఇథనాల్ ద్రావణం స్పోడోప్టెరా లిటూర 3వ దశ లార్వాలపై యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది.
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

