రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) గ్రామీణ మహిళలకు జీవనోపాధి, ఆర్థిక సాధికారత కల్పించేందుకు జూన్ 2 నుంచి కొత్త పథకాన్ని ప్రారంభించబోతోంది. దీనికింద మహిళలతో పొట్టేళ్ల యూనిట్లు, గొర్రె, మేక పిల్లల పెంపకం కేంద్రాలు, నాటు కోళ్లు, ఈము పక్షుల కొనుగోళ్ల యూనిట్లు ఏర్పాటు చేయిస్తారు. వారికి బ్యాంకు లింకేజీలు, రివాల్వింగ్ ఫండ్లు, సబ్సిడీల ద్వారా ఆర్థికసాయం అందిస్తారు. పథకానికి ఎంపికైన మహిళా సంఘాల లబ్దిదారులకు పశువైద్య వర్సిటీ శిక్షణ ఇస్తుంది. దీనిపై పీవీ నరసింహారావు తెలం గాణ పశువైద్య విశ్వవిద్యాలయంతో సెర్ప్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం హైదరాబాద్ బీఆర్కే భవన్లో సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్, పశు వైద్య వర్సిటీ రిజిస్ట్రార్ శరత్చంద్ర ఒప్పందంపై సంతకాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు తెలంగాణ స్వయంసహాయక సంఘాల అభ్యున్నతి, పశుసంపద వృద్ధి కోసం ఒప్పందం చేసుకున్నట్లు దివ్యా దేవరాజన్ తెలిపారు.

12 May, 2026
సెర్ప్ నుంచి గ్రామీణ మహిళలకు కొత్త పథకం
#AgricultureIndia, #AnimalHusbandry, #BankLinkage, #EmpoweringWomen, #EmuFarming, #FinancialEmpowerment, #goatfarming, #LivestockDevelopment, #OrganicFarming, #PoultryFarming, #RuralDevelopment, #RuralIndia, #RuralWomen, #Seethakka, #SelfHelpGroups, #SERP, #SERPScheme, #SheepFarming, #SHGWomen, #SubsidyScheme, #SustainableLivelihood, #Telangana, #TelanganaGovernment, #TelanganaNews, #TeluguNews, #VeterinaryTraining, #VillageWomen, #WomenEmpowerment, #WomenEntrepreneurs, #WomenSupport, agri news, Agriculture, Andhra Pradesh, natural farming, telangana, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
