బత్తినేని విమల 3.6 కోట్ల ఫెలోషిప్ కు ఎంపిక

*సుస్థిర వ్యవసాయంలో పరిశోధనల కోసం ప్రతిష్టాత్మక 3.6 కోట్ల danish ఫెలోషిప్ కు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ కు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త బి. విమల ఎంపికయ్యారు. వీరు 2019-2023 మధ్య రేకుల కుంటలో పనిచేశారు. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ డెన్మార్క్ లో మూడేళ్ల పాటు డెన్మార్క్ లో పౌష్టికాహార భద్రత , వాతావరణ మార్పులు నేపథ్యం అంశం గురించి పరిశోధన చేస్తారు. 2026 సెప్టెంబర్ లో ప్రారంభం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ప్రొఫెసర్ Morten Birkved, a leading expert in agriculture and life cycle assessment వీరికి గైడ్ గా ఉంటూ మార్గ నిర్దేశనం చేస్తారు. Dr Srinivasa Raghavendra Bhuvan Gummidi, an Associate Professor specialising in remote sensing, and Dr Vinay Chakravarthi Gogineni, an Associate Professor specialising in Artificial Intelligence లు వీరి పరిశోధనలకు సహ పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు. వీరికి రైతునేస్తం అభినందనలు తెలియచేస్తోంది.

Read More

సర్ ర్థర్ కాటన్‌పై అభిమానంతో శ్రామికులకు రూ.20 లక్షల సాయం

ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన సర్ ఆర్థర్ కాటన్ జయంతి రోజున ఆయన సేవలను స్మరించుకుంటూ తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన కౌలు రైతు సత్తి భాస్కరరెడ్డి (కందరెడ్డి) కొన్నేళ్లుగా తన వద్ద నమ్మకంగా పనిచేస్తున్న శ్రామికులకు రూ.20 లక్షలు అందజేసి ఆదర్శంగా నిలిచారు. కాటన్‌పై అభిమానంతో తన ఇంటి ముందు ఆయన విగ్రహాన్ని నిర్మించారు. ఏటా కాటన్ జయంతికి వేదపండితుల ఆశీర్వచనాలతో విగ్రహానికి పట్టువస్త్రాలు సమర్పించి, ధాన్యంతో అభిషేకాలు చేయిస్తుంటారు. ఈసారి కూడా యథావిధిగా ఆ కార్యక్రమాలన్నీ చేసి, ఏళ్ల తరబడి తన వద్ద పనిచేస్తున్న పది కుటుంబాలకు రూ. రెండేసి లక్షల చొప్పున రూ.20 లక్షలు అందజేశారు. రైతుల ప్రగతిలో శ్రామికుల కష్టాన్ని గుర్తించి వారికి బాసటగా నిలవాలనే ఉద్దేశంతోనే ఈ సాయం చేసినట్లు భాస్కరరెడ్డి తెలిపారు.

Read More

పోలవరం పూర్తికి సహకరించాలని కేంద్రానికి వినతి

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల్లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరారు. రాష్ట్రానికి చెందిన వివిధ అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకురావడానికి దిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి సోమవారం మధ్యాహ్నం జలశక్తి శాఖ కార్యాలయంలో కేంద్ర మంత్రిని కలిశారు. వివిధ అంశాలపై చర్చించి, వినతిపత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, తెదేపా పార్లమెంటరీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు, రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, నీటిపారుదలశాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Read More

సెర్ప్ నుంచి గ్రామీణ మహిళలకు కొత్త పథకం

రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) గ్రామీణ మహిళలకు జీవనోపాధి, ఆర్థిక సాధికారత కల్పించేందుకు జూన్ 2 నుంచి కొత్త పథకాన్ని ప్రారంభించబోతోంది. దీనికింద మహిళలతో పొట్టేళ్ల యూనిట్లు, గొర్రె, మేక పిల్లల పెంపకం కేంద్రాలు, నాటు కోళ్లు, ఈము పక్షుల కొనుగోళ్ల యూనిట్లు ఏర్పాటు చేయిస్తారు. వారికి బ్యాంకు లింకేజీలు, రివాల్వింగ్ ఫండ్లు, సబ్సిడీల ద్వారా ఆర్థికసాయం అందిస్తారు. పథకానికి ఎంపికైన మహిళా సంఘాల లబ్దిదారులకు పశువైద్య వర్సిటీ శిక్షణ ఇస్తుంది. దీనిపై పీవీ నరసింహారావు తెలం గాణ పశువైద్య విశ్వవిద్యాలయంతో సెర్ప్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం హైదరాబాద్ బీఆర్‌కే భవన్‌లో సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్, పశు వైద్య వర్సిటీ రిజిస్ట్రార్ శరత్‌చంద్ర ఒప్పందంపై సంతకాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు తెలంగాణ స్వయంసహాయక సంఘాల అభ్యున్నతి, పశుసంపద వృద్ధి కోసం ఒప్పందం చేసుకున్నట్లు దివ్యా దేవరాజన్ తెలిపారు.

Read More

వ్యవసాయంలో రోబోటెక్ సేవలు

కలెక్టర్ల సదస్సులో వ్యవసాయం చేసే రోబోలు వచ్చేశాయని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ‘ఆ రోబో చూడటానికి ఎద్దు మాదిరే ఉంది. భూములు దున్నేందుకు దాన్ని వినియోగిస్తున్నారు. ఒక చిన్న సూట్‌కేస్ పెట్టి తీసుకెళ్లొచ్చు. పొలం లోకి వెళ్లి, ఆన్ చేసి పనిచేయించి.. మళ్లీ సూట్‌కేసులో పెట్టి తీసుకోచ్చేయొచ్చు. సాంకేతికత ఆ స్థితికి వచ్చేసింది’ అని పేర్కొన్నారు. రోబో పని తీరు వీడియోను తన కార్యాలయంలో చూశానని తెలిపారు. దాన్ని మీకు షేర్ చేశానని.. చూశారా అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ను అడిగారు. సాంకేతికత ఆ స్థాయికి వచ్చేసిందని, ఇక కూలీలు దొరకడం లేదని మీరు అనకూడదని సరదాగా నవ్వుతూ వ్యాఖ్యానించారు. అది ఏఐ జెనరేటెడ్ వీడియోలా ఉందని రాజశేఖర్ అనడంతో.. సీఎం స్పందిస్తూ.. ఏఐ జెనరేటెడ్ అయ్యుండొచ్చేమో చూసుకోండి.. అదే అయితే ఐ డోంట్ మైండ్ అని నవ్వారు. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ రోబోటిక్ సేవలు ప్రవేశిస్తున్నాయని పునరుద్ఘాటించారు.

Read More

మొక్కజొన్న కొనుగోళ్లలో కలెక్టర్లకు పూర్తి అధికారాలు

సచివాలయంలో మొక్కజొన్నల కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించి, రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లలో వేగం పెంచాలని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. దీనిపై జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇస్తున్నామని, వారు హమాలీ, రవాణా, గన్నీ బ్యాగులు, గోదాములు వంటి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సూచించారు. అన్ని ఉమ్మడి జిల్లాల్లో కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగేలా ప్రత్యేకాధికారులను నియమించినట్లు తెలిపారు. ‘ఇప్పటికే రూ.1650 కోట్లతో 1.22 లక్షల మంది రైతుల నుంచి 6.74 లక్షల టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేశాం. అకాల వర్షాల దృష్ట్యా కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకొని, మార్క్‌ఫెడ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. కొనుగోళ్లు, రవాణాను సత్వరమే పూర్తి చేయాలి. రవాణాలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నోడల్ అధికారితో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలి. రైతులు గన్నీ బ్యాగులను సొంతంగా తెచ్చుకుంటే దానికి సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేస్తుంది’ అని తుమ్మల సూచించారు.
మంత్రి ఆదేశాల మేరకు మొక్కజొన్న కొనుగోళ్ల పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్‌లను ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్, కరీంనగర్-బి. గోపి, మెదక్, ఖమ్మం- రాహుల్రాజ్, మహబూబ్ నగర్, రంగారెడ్డి-యాస్మీన్ బాషా, నల్గొండ, ఆదిలాబాద్ -కె. చంద్రశేఖర్ రెడ్డి, నిజామాబాద్‌కు కొర్రా లక్ష్మిలను నియమించింది. రవాణా శాఖ తరఫున మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్‌కు నోడల్ అధికారి బాధ్యతలు అప్పగించింది.

Read More

ఉత్తరాంధ్రలో రెండేళ్లలో 11 ప్రాజెక్టులు పూర్తి

ఉత్తరాంధ్రలో 11 ప్రాజెక్టులు రాబోయే రెండేళ్లలో రూ.2 వేల కోట్లు ఖర్చు చేసి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. దీంతో 2.69 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి రాగా, మరో 2.49 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుందన్నారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్ లపై వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘2021లో వంశధార ట్రైబ్యునల్ వెలువరించిన తీర్పును గెజిట్ ప్రచురణ చేయించడంలో సీఎం చంద్రబాబు కృషి ఫలించింది. కేంద్ర మంత్రి, కేంద్ర జలశక్తి అధికారులతో తరచూ సంప్రదింపులు జరిపి ఇది సాధించారు. ఫలితంగా నేరడి బ్యారేజీ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి’ అని పేర్కొన్నారు. సమావేశంలో జలవనరులశాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఇంజినీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి, ఓఎస్డీ కె.వి.ఎల్.ఎన్. చౌదరి, ఉత్తరాంధ్ర జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Read More

నకిలీ విత్తనాల వలన రైతులకు పరిహారం

హైదర్‌గూడలోని శ్రీకాంత్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్, ధన్య సీడ్స్ సంస్థలను నకిలీ మిరప విత్తనాల విక్రయం కేసులో నష్టపోయిన రైతులకు రూ.16.80 లక్షలు చెల్లించాలంటూ హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-1 ఆదేశించింది. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లికి చెందిన ఎనిమిది మంది రైతులు 2017లో వేర్వేరుగా దాఖలు చేసిన ఫిర్యాదులను విచారించిన అనంతరం ఒక్కో రైతుకు రూ.2 లక్షల పరిహారం, కేసు ఖర్చులు రూ.10 వేల చొప్పున చెల్లించాలని స్పష్టంచేసింది. ఏ. వీరన్న, జి. వెంకన్న, ఎం. ముఖేష్, రామ్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, ఉపేందర్, టి.వెంకట్‌రెడ్డి, వి. యాకుబ్ రెడ్డి 2016 జులైలో శ్రీకాంత్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ నుంచి ‘ధన్య మిరప విత్తనాలు’ కొనుగోలు చేశారు. టాటా సంస్థ ఉత్పత్తిగా ప్రచారం చేసిన ఈ విత్తనాలు తెలంగాణ వాతావరణానికి సరిపోతాయని డీలర్ హామీ ఇవ్వడంతో ఒక్కొక్కరు రూ.300కి ఒక ప్యాకెట్ చొప్పున అవసరమైనన్ని కొనుగోలు చేశారు. వీటిని పొలంలో చల్లగా నవంబరు నాటికి మొక్కలు ఏపుగా పెరిగినా పూత, దిగుబడి రాలేదు. దీంతో 2016 నవంబరు 29న మహబూబాబాద్ ఏఈవోకు ఫిర్యాదు చేయగా.. డిసెంబరు 17న జిల్లా హార్టికల్చర్, సెరీకల్చర్ అధికారి ఆధ్వర్యంలోని అధికారుల బృందం వారి పొలాలను పరిశీలించి నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా రైతులంతా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ విత్తనాలు నాణ్యమైనవే అని నిర్ధారించే ల్యాబ్ రిపోర్టులున్నాయని ప్రతివాదులు కమిషన్‌కు తెలుపగా… ఆ రిపోర్టుల్లో తేదీల వ్యత్యాసం ఉందని, ప్రభుత్వ ల్యాబ్ సర్టిఫికేషన్ లేదని కమిషన్ స్పష్టం చేసింది. ఇనెస్పెక్షన్‌కు కంపెనీ ప్రతినిధి ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం రైతులకు పరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించింది.

Read More

ఏప్రిల్ 16 వరకు పాడి పశువుల పథకం దరఖాస్తు చేసుకోవాలి

ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాక, ఎస్సీ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ‘రెండు పాడి పశువుల పథకం దరఖాస్తు గడువు ఏప్రిల్ 16 వరకు పొడిగించినట్లు తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార సంస్థ ఎండీ హన్మంతునాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతోపాటు ఫొటో, ఆధార్, రేషన్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు, భూమి పట్టా పాస్‌బుక్‌లు కాపీ (జిరాక్స్)లతో ఒక సెట్ మండల పరిషత్ లేదా మున్సిపాలిటీ కార్యాలయాల్లో సమర్పించాలని కోరారు.

Read More

రాయలసీమ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టును ఆమోదించండి

ఆంధ్ర వర్షాభావ ప్రాంతాలైన రాయలసీమలోని 8 జిల్లాలతో పాటు ప్రకాశం, మార్కాపురం జిల్లాలను హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పథకానికి త్వరగా అనుమతులివ్వాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అనురాధ ఠాకుర్‌కు విజ్ఞప్తిచేశారు. ‘కరవు ప్రభావిత పది జిల్లాలను ఉద్యాన పంటల కేంద్రంగా మార్చడానికి రాష్ట్రం రూ.41,352 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే డీపీఆర్ సమర్పించింది. రాష్ట్రం సమర్పించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపండి’ అని ఆయన కేంద్ర అధికారులకు విజ్ఞప్తిచేశారు.

Read More