ఆంధ్ర వర్షాభావ ప్రాంతాలైన రాయలసీమలోని 8 జిల్లాలతో పాటు ప్రకాశం, మార్కాపురం జిల్లాలను హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పథకానికి త్వరగా అనుమతులివ్వాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అనురాధ ఠాకుర్‌కు విజ్ఞప్తిచేశారు. ‘కరవు ప్రభావిత పది జిల్లాలను ఉద్యాన పంటల కేంద్రంగా మార్చడానికి రాష్ట్రం రూ.41,352 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే డీపీఆర్ సమర్పించింది. రాష్ట్రం సమర్పించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపండి’ అని ఆయన కేంద్ర అధికారులకు విజ్ఞప్తిచేశారు.

17 Mar, 2026
