పోలవరం పూర్తికి సహకరించాలని కేంద్రానికి వినతి

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల్లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరారు. రాష్ట్రానికి చెందిన వివిధ అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకురావడానికి దిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి సోమవారం మధ్యాహ్నం జలశక్తి శాఖ కార్యాలయంలో కేంద్ర మంత్రిని కలిశారు. వివిధ అంశాలపై చర్చించి, వినతిపత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, తెదేపా పార్లమెంటరీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు, రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, నీటిపారుదలశాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Read More

పశువులకు వసతిగృహాలు

ఉపాధి హామీ పథకం నిధులతో ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాకు ఐదు చొప్పున పశు వసతిగృహాలను నిర్మించి పశువులకు ఆశ్రయం కల్పిస్తూ, పోషణ, వైద్య సేవలు అందించనున్నారు. ఇప్పటికే 8 జిల్లాల్లో వీటికి భూ కేటాయింపులు పూర్తి కావచ్చాయని పశు సంవర్ధక శాఖ సంచాలకుడు డాక్టర్ టి. దామోదర్ నాయుడు వెల్లడించారు. మిగిలిన జిల్లాల్లోనూ స్థలాల కేటాయింపులపై అధికారులు సమీక్షిస్తున్నారని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి వీటి నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యం నిర్దేశించినట్లు చెప్పారు. ఈ వసతిగృహాలకు జంతు ప్రేమికులు, జంతు సంక్షేమ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సహకారం అందించాలని కోరారు. ఈ వసతిగృహాల ఏర్పాటుకు రెవెన్యూ శాఖ స్థలాన్ని సమకూర్చనుండగా, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్మాణ బాధ్యతలు తీసుకోనుంది. ఎంపిక చేసిన స్వయం సహా యక సంఘాలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. ఒక్కో వసతిగృహాన్ని అర ఎకరం స్థలంలో రూ.10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. ఒక్కో చోట 20-25 పెద్ద పశువులకు ఆశ్రయం కల్పిస్తారు. అదే ప్రాంగణంలో గడ్డి సాగుతో పాటు తాగునీటి వసతి కల్పిస్తారు.

Read More

ఖరీఫ్‌లో 48.70 లక్షల టన్నుల ధాన్యం సేకరణ

రాష్ట్ర విభజన తర్వాత అత్యధికంగా ఈ ఖరీఫ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 48.70 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. 7.83 లక్షల మంది రైతులు ప్రభుత్వానికి ధాన్యం విక్రయించగా ప్రభుత్వం రూ.11,557 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసింది. అధికశాతం రైతులకు 48 గంటల్లోపే ఈ చెల్లింపులు పూర్తిచేశారు. 2025 ఖరీఫ్‌లో 43.37 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా సుమారు 94 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేశారు. మార్చి 31 కి 48.70 లక్షల టన్నులు సేకరించారు.

Read More

పశువుల ఆరోగ్యంకు రూ.1.70 కోట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పశు సంపద ఆరోగ్యం, వ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద రూ.1.70 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపి, వేరే పథకాలకు ఈ నిధులను మళ్లించరాదని పశు సంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Read More

రాయలసీమ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టును ఆమోదించండి

ఆంధ్ర వర్షాభావ ప్రాంతాలైన రాయలసీమలోని 8 జిల్లాలతో పాటు ప్రకాశం, మార్కాపురం జిల్లాలను హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పథకానికి త్వరగా అనుమతులివ్వాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అనురాధ ఠాకుర్‌కు విజ్ఞప్తిచేశారు. ‘కరవు ప్రభావిత పది జిల్లాలను ఉద్యాన పంటల కేంద్రంగా మార్చడానికి రాష్ట్రం రూ.41,352 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే డీపీఆర్ సమర్పించింది. రాష్ట్రం సమర్పించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపండి’ అని ఆయన కేంద్ర అధికారులకు విజ్ఞప్తిచేశారు.

Read More

ఈకేవైసీకి గడువు పెట్టకూడదు

ఆంధ్రప్రదేశ్‌లో రీసర్వే పూర్తయిన 4,783 గ్రామాల్లో రాజముద్రతో కూడిన కొత్త పాసు పుస్తకాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 22.33 లక్షల పుస్తకాలు ముద్రించి, ఈ ఏడాది జనవరి 2 నుంచి 9 వరకు పంపిణీ చేశారు. తీరా వాటిలో రైతుల పేర్లు, విస్తీర్ణం, మొబైల్ నంబర్లలో తప్పులు దొర్లడం, చనిపోయిన వారి పేర్లతోనూ ముద్రించడంతో భూ యజమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. దీంతో వాటన్నిటినీ సరిచేసి, తప్పుల్లేని పాసు పుస్తకాల్ని పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు.

ప్రతి నియోజకవర్గంలో రీసర్వే పూర్తయిన రెండు గ్రామాల్ని ఎంచుకుని తప్పులను సరిదిద్దాలని రెవెన్యూ శాఖ ఆదేశాలిచ్ౘ్ింది. దీని ప్రకారం రైతులకు నెల ముందు నుంచే భూముల వివరాలు తెలియజేసి, వారి ఈకేవైసీ తీసుకోవాలి. తర్వాతే పాసు పుస్తకాల ముద్రణకు పంపాలి. వాటిని ప్రతి నెలా 2వ తేదీ నుంచి 9వ తేదీ లోగా ప్రజాప్రతినిధులతో భూ యజమానులకు పంపిణీ చేయించాలి. ఫిబ్రవరిలో 280 గ్రామాల పరిధిలో 1.83 లక్షల పాసు పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకున్నారు. మార్ౘ్ిలోనూ ఇదేవిధంగా అందజేయాలని అధికారులు నిర్ణయించారు.

ఈకేవైసీకి గడువు పెట్టకూడదంటున్న రైతులు
ఎంపిక చేసిన గ్రామాల్లోని వీఆర్వోలు అక్కడి భూ యజమానులకు ముందుగా అన్ని వివరాలతో కూడిన ముసాయిదా పట్టాదారు పాసు పుస్తకాల కాపీలు అందించాలి. వాటిలో వివరాలన్నీ సరిగా ఉన్నాయో లేదో ధ్రువీకరణ తీసుకోవాలి. మార్ౘ్ిలో పంపిణీ చేసే పట్టాదారు పాసు పుస్తకాలకు.. ఫిబ్రవరి 9వ తేదీ వరకే ఈకేవైసీకి అవకాశం ఇచ్ౘ్ారు. 10వ తేదీ నుంచి రైతులు అందుబాటులో ఉన్నా ఈకేవైసీ తీసుకోవడం లేదు. 9వ తేదీ తర్వాత యాప్ పనిచేయడం లేదని అధికారులు చెబుతున్నారు. మళ్లీ ఎప్పుడు ఈకేవైసీ తీసుకుని పాసు పుస్తకాలిస్తారని అడిగితే తమకేం తెలియదని చెబుతున్నారు.

తర్వాత నెలలో అదే నియోజకవర్గంలో రెండు గ్రామాల్ని ఎంపిక చేసుకుని, పంపిణీకి అవకాశం ఇస్తారు. కిందటి నెలలో పంపిణీ చేసిన గ్రామాల్లో మిగిలిన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకునే అవకాశం ఉండటం లేదు. అంటే వారికి 1బీ వివరాలు తెలియడం లేదు. తప్పులు సరిదిద్ది కొత్త పాసు పుస్తకాలిచ్ౘ్ే అవకాశం లేదు. దీంతో తప్పులు లేని పాసు పుస్తకాలు పంపిణీ చేయాలనే లక్ష్యం పూర్తిగా నెరవేరడం లేదు. నిర్దేశిత గడువు లేకుండా ఎప్పుడైనా ఈకేవైసీ తీసుకుని, పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్ౘ్ే విధానం అమలు చేయాలని భూ యజమానులు కోరుతున్నారు.
Read More

రూ.2.84 కోట్లు పులిచింతల ప్రాజెక్టు నిర్వహణ పనులకు

ఆంధ్రప్రదేశ్‌లోని పులిచింతల ప్రాజెక్టులో డీజిల్ జనరేటర్ సెట్ల ఏర్పాటు, కుడివైపున ప్యానెల్ కంట్రోల్ గదిలో అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు, ఇతర నిర్వహణ పనులకు రూ.2.84 కోట్లు ఖర్చు చేసేందుకు వీలుగా ప్రభుత్వం పాలనామోదం ఇచ్చింది. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు.

Read More

పశువైద్యశాలల బలోపేతానికి నిధులు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పశువైద్యశాలలు, డిస్పెన్సరీలు, సంచార పశు వైద్యశాలల అభివృద్ధి, బలోపేతానికి రూ. 32.83 కోట్ల విడుదలకు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఈ నిధులను ఇతర ఏ పథకాలకూ మళ్ళించడానికి వీల్లేదని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్వి బి. రాజశేఖర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Read More

‘రాజముద్ర’తో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు

ఆంధ్రప్రదేశ్‌లో తొలివిడత రీసర్వే పూర్తయిన గ్రామాల్లోని రైతులకు ఎవరి చిత్రాలూ లేకుండా కేవలం రాజముద్రతో భూమి యాజమాన్య హక్కు పత్రం, పట్టాదారు పాసు పుస్తకాలు ప్రభుత్వం ముద్రించింది. పల్నాడు జిల్లాలోని 12 మండలాల్లో 10 వేల మంది రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 15న వీటిని పంపిణీ చేసేందుకు రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read More