రాష్ట్ర విభజన తర్వాత అత్యధికంగా ఈ ఖరీఫ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 48.70 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. 7.83 లక్షల మంది రైతులు ప్రభుత్వానికి ధాన్యం విక్రయించగా ప్రభుత్వం రూ.11,557 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసింది. అధికశాతం రైతులకు 48 గంటల్లోపే ఈ చెల్లింపులు పూర్తిచేశారు. 2025 ఖరీఫ్‌లో 43.37 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా సుమారు 94 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేశారు. మార్చి 31 కి 48.70 లక్షల టన్నులు సేకరించారు.

9 Apr, 2026
