ఔషధ మొక్క… వడిసె / కడిసె

వడిసె కాలానుగుణంగా ఆకులు రాల్చుతూ మరల పుట్టించు ఒక చిన్న చెట్టు. బెరడు ముదురు గోధుమ రంగు, ఎరుపు రంగుతో కూడిన నలుపు రంగులో గరుకుగా ఉండి, నలుచదరపు కొయ్య పొలుసులుగా ఊడిపోతుంది. ఆకులు ఒకదాని తర్వాత ఒకటిగా ఏర్పడి, రబ్బరులాగా, గుండ్రంగా లేదా కోడిగుడ్డు ఆకారంలో 1.53 అం. పొడవు, రంగుతో ఆకు మొదలులో గుత్తులుగా ఏర్పడతాయి. క్యాప్సూల్ కొయ్యలాగా తొడిమ లేకుండా, గుండ్రంగా, 3 లేదా 4 చీలిన భాగాలు కలిగి ఉంటుంది. దక్షిణ భారతదేశంలో దీని విషపూరిత స్వభావం ఒక సమస్య.

సాధారణ నామం : గరారి శాస్త్రీయ నామం : క్లిస్టాంతస్ కోల్లినస్ కుటుంబం: ఫిల్లాంతేసి

ఉపయోగాలు : వ్యవసాయరంగంలో

  • వడిసాకు డికాక్షన్ (50%) వరి నాశించే తాటాకు తెగులు (హిస్పా), ఆకుచుట్టు పురుగు, కాండంతొలుచు పురుగులను నివారించింది. ప్రత్యేకంగా గొట్టం పురుగు (నిమ్‌ఫ్యులా డిపంక్టాలిస్)ని సమర్ధవంతంగా నివారించింది. ఈ ద్రావణాన్ని ఒకసారి పిచికారి చేస్తే అన్ని పురుగులు 12 గంటలలో సంహరించబడ్డాయి.. పంటకోత వరకు పురుగులు ఆశించలేదు (భారతి అహిర్వార్, ఆమె అనుచరులు, 2011).
  • జార్ఖండ్‌లోని రాంచి జిల్లాకి చెందిన రైతులు వరిలో ఉల్లికోడు నివారణకు వడిసాకులను సేకరించి ఎకరానికి 40 కి. చొప్పున వేస్తారు.
  • 100 చ.మీ.కి 5 కి. వడిసె తాజా ఆకులను చల్లి గొట్టం పురుగుని నివారించవచ్చు. (శ్రీవాస్తవ, అతని అనుచరులు, 2009)
  • వడిసె ఆకులోని రసాయనాలు నిల్వ ధాన్యాన్ని ఆశించే పురుగులను, పిండినల్లులను, లద్దె పురుగులు / లార్వాలను సమర్ధవంతంగా నివారిస్తాయి. దీనిని జీవ పురుగు మందుగా ఉపయోగించవచ్చు.(నమ్రతాకుమారి, ఆమె అనుచరులు, 2016).
  • వడిసె మొక్కలోని పాలిఫినాలిక్ పదార్థం పల్స్ బీటిల్, చెదలు, ప్రత్తి ఆకు తినే ఆర్మివర్మ్‌పై కీటకనాశక చర్య ప్రదర్శించింది. అనేక నిల్వ ధాన్యాలనాశించే పురుగుల లార్వాలను సంహరించే శక్తిని ప్రదర్శించింది (పరితోష్ భట్టాచార్య, 2016).
  • తోటకూర పంటపై వడిసె ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసి తోటకూర ఆకులను తినే లార్వా (హైమెనియా రికర్వాలిస్)ల సంఖ్యను తగ్గించవచ్చు. (అరివుడైనంబి, అతని అనుచరులు, 2010)
  • వడిసె ఆకు ద్రావణం ప్రయోగశాలలో ప్రత్తికాయతొలుచు పురుగు, హెలికోవర్ప ఆర్మిజరాపై కీటకనాశక చర్యను ప్రదర్శించింది (దేశ్‌ముఖ్, అతని అనుచరులు, 2013).
  • వడిసె లేత కొమ్మలను, పొడి ఆకుపొడిని వరి పొలంలో పురుగుల నివారణకు, నిల్వ ధాన్యంలో ఆశించే పురుగుల నివారణకు ఉపయోగించవచ్చు. (సౌమిత్‌బెహరా, అతని అనుచరులు, 2006).
  • వడిసె ఆకులనుపయోగించి హెర్బల్ ద్రావణం తయారు చేసి అనేక పురుగులను నివారించవచ్చు.

హెర్బల్ ద్రావణం తయారు చేసే పద్ధతి :
కావలసిన పదార్థాలు :
వడిసె ఆకులు – 1కి.
ఉమ్మెత్త కాయలు – 1 కి.
మధుక లాంగిఫోలియాపిండి – 1 కి.
గన్నేరు పప్పు – 1 కి.
పొగాకు రద్దు – 500 గ్రా.
సున్నం – 250 గ్రా.
ఆవుమూత్రం – 5 లీ.
మట్టికుండ – 1

తయారు చేసే పద్దతి :

  • ఒక మట్టి కుండలో వడిసె మొక్క ఆకులు, సన్నగా తరిగిన ఉమ్మెత్త కాయల ముక్కలు, గన్నేరు గింజలు అన్నింటినీ నూరి, మధుకలాంగి ఫోలియాపిండి, పొగాకు రద్దు, సున్నం కలిపి 5 లీ. ఆవు మూత్రం పోయాలి.
  • మట్టి పాత్రను మూతతో కప్పి ఎరువు గుంత / మట్టిలో 7 రోజులు పూడ్చి ఉంచాలి.
  • పై మిశ్రమాన్ని వడపోసి 1:10 నిష్పత్తిలో నీటితో కలిపి పిచికారి చేసి అన్ని పురుగులను నివారించవచ్చు.
  • వడిసె ఆకులు వికర్షక చర్యతో చెదలను అరికడతాయి.
  • వరిలో పసుపు రంగు కాండంతొలుచు పురుగు నివారణకు ఎకరానికి 80 కి. వడిసె ఆకులను వేయాలి.
  • పశ్చిమ బెంగాల్‌కి చెందిన పురులియా గ్రామ రైతులు వరి చేలో ఎకరానికి 150 కి. వడిసె ఆకులను వేసి పసుపుపచ్చ కాండంతొలుచు పురుగు, గొట్టపు పురుగు, హిస్పాలను సమర్ధవంతంగా నివారించడమేగాక 20-40% అధిక దిగుబడులను పొందారు (కళ్యాణ్ కెవికె, పశ్చిమబెంగాల్, 2017)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

పలు తెగుళ్ళ నివారిణి… 10 శాతం వావిలాకు కషాయం

వావిలాకు మనకు విస్తారంగా దొరుకుతుంది. ఇది పురుగుల నియంత్రణలోనే కాకుండా తెగుళ్ళ నియంత్రణలో కూడా ఉపయోగపడుతుంది. 10 కిలోల వావిలాకు తీసుకొని బాగా ఉడకబెట్టి చల్లార్చి కాచి వడపోయాలి. దీనిలో కుంకుడు కాయ రసం కలుపుకొని 100-150 లీటర్ల నీటిలో కలుపుకొని ఒక ఎకరాకు వాడుకోవచ్చు. దీనివలన వరిలో వచ్చు మచ్చ తెగులు, చాలా రకాల తెగుళ్ళు, పూతలో వచ్చు బూజు తెగులు, గింజ నల్లబారడం లాంటి తెగుళ్ళు నియంత్రించబడతాయి.

దానిమ్మ తొక్కల కషాయం
దానిమ్మ తొక్కలు ఒక కేజీ తీసుకొని బాగా రుబ్బి నానబెట్టాలి. వీటి నుండి తీసిన కషాయం అగ్గితెగులు నియంత్రించుటలో బాగా పని చేస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది అగ్గితెగులు శిలీంధ్ర తంతువుల పెరుగుదలను నిలిపివేస్తుంది.

తులసి-తమలపాకు-పారిజాతం ఆకుల కషాయం
ఈ ఆకుల కషాయాన్ని వరిలో వచ్చు అన్ని రకాల తెగుళ్ళ నివారణకు సాంప్రదాయంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రైతులు వాడేవారని విన్నీపియేరా తన పుస్తకం ‘టెండింగ్ ద ఎర్త’లో పేర్కొన్నారు.

10శాతం తుమ్మ ఆకుల కషాయం
తుమ్మ ఆకుల కషాయం చాలా రకాల వ్యాధుల నియంత్రణలో ఉపయోగ పడుతుంది. ఇది ముఖ్యంగా ఆకులపై వచ్చు వ్యాధుల నియంత్రణలో బాగా పనిచేస్తుంది.

Read More

మాంసం, వరి పొట్టుతో కునపజలం

ఆదికాలంలోనే భారతీయ వ్యవసాయ శా¢స్తం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. ప్రసిద్ధ ప్రాచీన వ్యవసాయ శా¢స్తవేత్తలు ప్రాచీన రుషులు, పరాశరుడు, సురపాలుడు తదితరులు అతద్భుతమైన పరిశోధనలు జరిపి గ్రంథస్థం చేశారు. సురపాల మహర్షి రాసిన వృక్షాయుర్వేదంలో కునపజలం అనే ద్రావణ ఎరువుని ప్రస్తావించారు. సంస్కృతంలో కునప అంటే మృత కళేబరం. జలం అంటే నీరు. అంటే శవం కంపుకొట్టే నీరని అర్థం. ఇది మొక్కలకు పోషక ద్రావణంగానూ ఉపయోగపడుతుంది. దీన్ని చేపల వ్యర్థాలతోనూ, కోడిమాంసం వ్యర్థాలతోనూ, పంది, జింక, ఇతర అడవి జంతువుల మాంసంతోనూ తయారుచేసేవారు. అడవులు అంతరించి జంతువులు కనుమరుగవుతున్న కాలంలోనే ప్రస్తుతం చేపల వ్యర్థాలు, కోడి మాంసం వ్యర్థాలతోనూ తయారు చేసుకోవచ్చు. కోడి మాంసపు వ్యర్థాలతో చేసేదాన్ని కుక్కుట కునప అంటారు.

ఆవు పేడ, పంచితం, పాలు, పెరుగు, నెయ్యి తదితరాలతో తయారుచేసే ‘కునపజలం’ పంటలు ఏపుగా పెరగడానికి.. పురుగులు, తెగుళ్ల ఉధృతిని అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది. అయితే, మాంసం, వరిపొట్టు కూడా కలిపి కునపజలం తయారుచేస్తే, మరింత శక్తివంతంగా పనిచేస్తుందంటున్నారు సికింద్రాబాద్‌కు చెందిన విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త (ప్లాంట్ పాథాలజిస్ట్) ఇక్రిశాట్ మాజీ డిప్యూటీ డైరెక్టర్ అయిన డా॥ వై.ఎల్.నెనె. ఒక్క మాటలో చెప్పాలంటే సాధారణ కునపజలం కన్నా ఈ కునపజలం అత్యంత శక్తివంతంగా పనిచేస్తుందని డా॥ నెనె అంటున్నారు.

తయారీకి కావాల్సిన పదార్థాలు: ఆవు పేడ 5 కిలోలు, పంచితం 4 లీటర్లు, పాలు 3 లీటర్లు, పెరుగు 2 లీటర్లు, నెయ్యి కిలో, మాంసం (గొడ్డు మాంసం తప్ప ఏదైనా) 3 కిలోలు, వరిపొట్టు 2 కిలోలు, చెరకు రసం 3 లీటర్లు లేదా నల్లబెల్లం కిలో, లేత కొబ్బరినీరు 2 లీటర్లు, బాగా మగ్గిన అరటిపండ్లు 12, కల్లు 3 లీటర్లు.

తయారుచేసే పద్ధతి: మాంసాన్ని, వరిపొట్టును ఉడకబెట్టిన తర్వాత మాత్రమే కునపజలం తయారీలో వాడాలి. మాంసంలో అధిక పోషకాలుంటాయి. వరిపొట్టులో సిలికా ఉంటుంది. పురుగులు, తెగుళ్లను తట్టుకునే శక్తిని సిలికా పెంపొందిస్తుంది. ఉడకబెట్టిన మాంసం, వరిపొట్టుతో పాటు పేడ, పంచితాలను వెడల్పాటి మూతిగల మట్టి లేదా ప్లాస్టిక్ తొట్టి లేదా డ్రమ్ములో కలిపి, పాత్రపై పలుచని వస్త్రాన్ని కప్పి, నీడగా ఉండే ప్రాంతంలో రెండు వారాలు పులియనివ్వాలి. ప్రతి ఉదయం, సాయంత్రం సవ్యదిశలో కొద్దిసేపు కర్రతో కలపాలి. 2 వారాల తర్వాత మిగతా వాటిని కూడా కలిపి మరో వారం రోజులు పులియబెట్టాలి. ఆ తర్వాత వడకట్టి వాడుకోవచ్చు. ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది.

ఉపయోగించే విధానం: ఎకరానికి 100-150 లీటర్ల నీటిలో 3 లీటర్ల కునపజలాన్ని కలిపి 20 రోజుల వ్యవధిలో 3 నుంచి 4సార్లు పంటలపై పిచికారీ చేయాలి. ఈ మధ్యలో వర్షం కురిస్తే 1 లేదా 2 సార్లు అదనంగా పిచికారీ చేయాలి.

ఉపయోగాలు: ముఖ్యంగా పత్తి, మిరప, వరి, కూరగాయలు, పండ్ల తోటలపై బాగా పనిచేస్తుంది. దీనివల్ల పంట గింజల బరువు పెరుగుతుంది. పురుగులు, తెగుళ్లు పంటలను ఆశించవు. పంట ఏపుగా పెరుగుతుంది. పండ్ల నాణ్యత పెరిగి సహజసిద్ధమైన రంగు, రుచి, వాసన వస్తుంది. కూరగాయ పంటల నాణ్యత పెరిగి మంచి మెరుపు వస్తుంది.

దిగుబడిని పెంచే కునపజలం
కావలసిన పదార్థాలు : మాంసం-1 కిలో; మినప పప్పుపొడి -1/4 కి.; నువ్వులు- 1/4 కి.; నల్లబెల్లం- 1/4 కి.; ఆవుపాలు – 1 లీటరు; ఆవునెయ్యి లేదా నువ్వుల నూనె – 50 గ్రాములు; మంచి నీరు – 5 లీటర్లు

తయారు చేసే విధానం : మాంసాన్ని నీటిలో వేసి సన్నని మంటపై సగం కషాయం అయ్యే వరకు ఉడికించాలి. 2 గంటలు చల్లార్చి పలుచని గుడ్డతో వడపోయాలి. సన్నని మంటపై మళ్ళీ మరగించాలి. పొంగువచ్చిన తర్వాత మినపపిండి, దంచిన నువ్వులు, బెల్లం వేసి కలియబెడుతూ ఉండాలి. పొంగు వచ్చిన వెంటనే పాత్రను దించి, చల్లార్చి, మట్టికుండలో పోయాలి. అందులో ఆవుపాలు పోసి, కుండపైన మూకుడు పెట్టి గట్టి గుడ్డతో వాసిన కట్టి పెంట పోగు కింద లేక మట్టి గుంతలో పాతి పెట్టాలి. 11వ రోజు బయటకు తీసి కషాయాన్ని వడపోయాలి. ఈ కషాయాన్ని వేరొక కుండలో పోసి దానికి నెయ్యి లేక నూనె కలిపి పాత్రపై మూకుడు పెట్టి ఒక ప్లాస్టిక్ కాగితంలో ఉంచి గట్టిగా తాడుతో కట్టి 10 రోజులు చీకటి గదిలో ఉంచాలి. 11వ రోజు నుంచి ఈ కషాయాన్ని ఉపయోగించవచ్చు. 3 లీటర్ల కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి ఏ పంటపైనన్నా పిచికారి చేయవచ్చు. పంటకాలంలో రెండుసార్లు పిచికారి చేయవచ్చు. ఇది ప్రభావశీల ఔషధం. పంట దిగుబడి 20% పెరుగుతుంది.

Read More

వృథా నీటితో వరి పంటకు జీవం

నిర్మల్ జిల్లా మామడ మండలం పరి మండల్‌కు చెందిన రైతు సంతోష్ రెండెకరాల వరి చేతికొచ్చే పరిస్థితిలో బోరులో నీరు అడుగంటింది. గట్టెక్కడం ఎలా అని మధనపడుతుంటే… ఎగువ పొలాలు తడవగా.. పొర్లి దిగువకు వృథాగా పోతున్న నీరు కనిపించింది. దాన్ని కల్వర్టు దగ్గరే ఆపి మళ్లించాలనుకున్నారు సంతోష్. ఇసుక బస్తాలు, టార్పాలిన్‌తో అడ్డుకట్ట వేసి.. చిన్న బావిలా మార్చారు. మోటారు, పైపుల సాయంతో ఆ నీటిని 300 మీటర్ల దూరంలోని తన పొలానికి అందిస్తున్నారు.

Read More

ఖరీఫ్‌లో 48.70 లక్షల టన్నుల ధాన్యం సేకరణ

రాష్ట్ర విభజన తర్వాత అత్యధికంగా ఈ ఖరీఫ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 48.70 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. 7.83 లక్షల మంది రైతులు ప్రభుత్వానికి ధాన్యం విక్రయించగా ప్రభుత్వం రూ.11,557 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసింది. అధికశాతం రైతులకు 48 గంటల్లోపే ఈ చెల్లింపులు పూర్తిచేశారు. 2025 ఖరీఫ్‌లో 43.37 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా సుమారు 94 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేశారు. మార్చి 31 కి 48.70 లక్షల టన్నులు సేకరించారు.

Read More

విత్తనోత్పత్తిలో రైతులు

తెలంగాణాలో చాలామంది రైతులు ఇటీవల విత్తనోత్పత్తి చేపడుతున్నారు. పొలాస, కూనారం, వరంగల్, రుద్రూరు, రాజేంద్రనగర్, మారుటేరు, నెల్లూరు తదితర పరిశోధన స్థానాల నుంచి తెచ్చిన బ్రీడర్, ఫౌండేషన్, ట్రూత్‌ఫుల్ లేబుల్ విత్తనాలను సాగుచేసి పండిన పంటను తిరిగి విత్తనంగా విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తూ తోటి రైతులకు నాణ్యమైన వంగడాలను చేరవేస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయశాఖ ద్వారా గత వానాకాలానికి ముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో వరి, పెసర, మినుము, కంది, వేరుసెనగ, నువ్వులు తదితర పంటల విత్తనాలిచ్చారు. వీటిని సాగు చేసినవారు తోటి రైతులకు సైతం విత్తనాలను చేరవేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఈ యాసంగిలో 9.59 లక్షల ఎకరాల్లో సాగు చేసిన వరి పైరు ప్రస్తుతం గొలక దశ నుంచి నూర్పిడి దశ వరకు శాస్త్రవేత్తలు విత్తన ప్రాధాన్యతను రైతులకు వివరిస్తున్నారు. పొలంలో కల్తీ కర్రలు, బెరకు కేళీలను ఏరివేసి పంటను వేరుగా నూర్పిడి చేసుకొని రైతు విత్తనంగా వాడుకోవచ్చు. దీంతో కల్తీలు, నకిలీల బెడద ఉండదు. మన నేలల్లోనే పండించిన పంట కాబట్టి స్థిరమైన దిగుబడి వస్తుంది. ప్రైవేటుగా విత్తనాలను కొంటే హెక్టారుకు రూ. 3 వేల నుంచి రూ. 6 వేల వరకు విత్తనానికి వెచ్చించాల్సి వస్తోంది. అదే రైతు విత్తనమైతే సగం ఖర్చుతోనే సరిపోతుంది. వచ్చే వానాకాలం సీజన్‌లో సన్నాలను అధికంగా సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్నందున ఇప్పటినుంచే రైతులు మేలైన సన్న గింజ రకాలను సేకరించుకోవాలి. మక్క, పత్తి తదితర హైబ్రిడ్స్ మినహా వరి నువ్వులు, పెసర, మినుము, అలసంద తదితర సూటి రకాల్లో ప్రతి పంటకు నూతన విత్తనం కొనకుండా రైతు విత్తనాన్ని వినియోగించాలని ఏడీఆర్ డా. హరీశ్ కుమార్ శర్మ సూచించారు.

Read More

తుపాన్లను తట్టుకునే వరి రకం

ఆచార్య ఎన్ౙీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని మార్టేరు పరిశోధన కేంద్రం ఎంటీయూ 1318 రకాన్ని విడుదల చేసి 2020లో మినీ కిట్లు ఇచ్చి రైతులతో సాగుచేయించగా మంచి ఫలితాలు వచ్చాయి ఈ రకాన్ని 2022 నుంచి సాగుకు అందుబాటులోకి తీసుకొచ్చారు. తుపాన్లను తట్టుకుని దీటుగా నిలబడి మంచి దిగుబడులు ఇస్తుండటంతో గత ఖరీఫ్ లో శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు సుమారు 6 లక్షల ఎకరాల్లో ఎంటీయూ 1318 రకం సాగైంది.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలుమూరు మండలం పెనికేరులో తుపానుకు పడిపోయిన స్వర్ణ రకం వరి. పక్కనే నేలవాలకుండా నిలబడిన ఎంటీయూ 1318 రకం మొంథాను తట్టుకుని…. ఉభయగోదావరి, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో వరిపై మొంథా తుపాను తీవ్ర ప్రభావం చూపింది. 3 లక్షలకు పైగా ఎకరాల్లో పంట దెబ్బతింది. కనీసం ఎకరాకు 15-20 బస్తాల దిగుబడికి నష్టం వాటిల్లింది. ఇలాంటి ప్రకృతి విపత్తులను దృష్టిలో ఉంచుకుని స్వర్ణ స్థానంలో ఇతర రకాలను రైతులు ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఎంటీయూ 1318ని.. కృష్ణా, గోదావరి జిల్లాల్లో 5 లక్షల ఎకరాలకుపైగా సాగు చేశారు. మొంథా తీవ్ర అలజడి సృష్టించినా 90% పంట పడిపోకుండా నిలబడింది. రెండేళ్ల సగటును పరిశీలిస్తే ఎకరాకు 35-40 బస్తాల దిగుబడి వస్తుంది. వర్షాలకు పంట నేలవాలలేదు.
ఎకరాకు 4-5 బస్తాల అధిక దిగుబడి

  • పాలడుగు సత్యనారాయణ, పరిశోధన సంచాలకులు, ఆచార్య ఎన్ౙీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
    మార్టేరు పరిశోధన కేంద్రంలో పనిచేసినప్పుడు ఎంటీయూ 1318ని రూపొందించా. స్వర్ణ రకాన్ని ఎంటీయూ 1064(అమర)తో సంకరపరిచి అభివృద్ధి చేసిన విత్తనమిది. 150-155 రోజుల వ్యవధిలో దిగుబడినిచ్చే ఈ రకం.. కాండం దృఢంగా ఉండటం వల్ల తుపాన్లకు నేల వాలదు. దోమపోటు, ఎండాకు, అగ్గితెగుళ్లను తట్టుకుంటుంది. స్వర్ణతో పోలిస్తే ఎకరాకు 4-5 బస్తాల దిగుబడిని అదనంగా ఇస్తుంది.
Read More