ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నిర్లక్ష్యం వద్దు
ధాన్యం అమ్మిన రైతుల చెల్లింపుల కోసం అవసరమైన నిధులకు ఎలాంటి కొరత లేదు, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం, జాప్యం జరిగినా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని పౌరసరఫరాలశాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం కాంటా వేసిన దశ నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమయ్యే వరకు జీరో పెండెన్సీ విధానాన్ని ప్రభుత్వం కట్టుదిట్టంగా అమలు చేస్తోందని వివరించారు. ధాన్యంతో వచ్చిన వాహనాలను రైస్ మిల్లులు వెంటనే అన్ లోడ్ చేసి, డిజిటల్ ఎక్‌నాలెడ్ౙ్‌మెంట్ ఇచ్చేలా చూడాలని జిల్లాల పౌరసరఫరాల అదికారులను కమిషనర్ గురువారం ఒక ప్రకటనలో ఆదేశించారు.










