బస్తా నిమ్మకాయల ధర రూ. 4,350/-
హైదరాబాద్ (షరీఫ్) మార్కెట్‌లో గురువారం నిమ్మకాయలు బస్తా ధర రూ.4,350 పలికింది. వేసవి తీవ్రమవడంతో డిమాండ్ పెరగడం, ఖరీఫ్ సీజన్ ముగింపు సమయంలో కురిసిన భారీ వర్షాలతో దిగుబడి తగ్గడంతో.. ఈ పరిస్థితి ఏర్పడింది. గతంలో తామెన్నడూ ఇలాంటిది చూడలేదని కనగల్ మండలం మంచినీళ్లబావి గ్రామానికి చెందిన రైతు బోదనపు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మంచి ధర దక్కించుకున్న రైతులు మురిసిపోతున్నారు.





