కలెక్టర్ల సదస్సులో వ్యవసాయం చేసే రోబోలు వచ్చేశాయని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ‘ఆ రోబో చూడటానికి ఎద్దు మాదిరే ఉంది. భూములు దున్నేందుకు దాన్ని వినియోగిస్తున్నారు. ఒక చిన్న సూట్‌కేస్ పెట్టి తీసుకెళ్లొచ్చు. పొలం లోకి వెళ్లి, ఆన్ చేసి పనిచేయించి.. మళ్లీ సూట్‌కేసులో పెట్టి తీసుకోచ్చేయొచ్చు. సాంకేతికత ఆ స్థితికి వచ్చేసింది’ అని పేర్కొన్నారు. రోబో పని తీరు వీడియోను తన కార్యాలయంలో చూశానని తెలిపారు. దాన్ని మీకు షేర్ చేశానని.. చూశారా అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ను అడిగారు. సాంకేతికత ఆ స్థాయికి వచ్చేసిందని, ఇక కూలీలు దొరకడం లేదని మీరు అనకూడదని సరదాగా నవ్వుతూ వ్యాఖ్యానించారు. అది ఏఐ జెనరేటెడ్ వీడియోలా ఉందని రాజశేఖర్ అనడంతో.. సీఎం స్పందిస్తూ.. ఏఐ జెనరేటెడ్ అయ్యుండొచ్చేమో చూసుకోండి.. అదే అయితే ఐ డోంట్ మైండ్ అని నవ్వారు. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ రోబోటిక్ సేవలు ప్రవేశిస్తున్నాయని పునరుద్ఘాటించారు.

9 May, 2026
వ్యవసాయంలో రోబోటెక్ సేవలు
#Agriculture, #AgricultureNews, #AgriInnovation, #AgriTech, #AI, #AIinAgriculture, #AndhraPradesh, #ChandrababuNaidu, #DigitalAgriculture, #FarmingRobots, #FarmingTechnology, #FarmTech, #futurefarming, #ModernFarming, #RobotFarming, #Robotics, #Rythu, #SmartFarming, #TechNews, #TeluguNews, agri news, Agriculture, Andhra Pradesh, telangana, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
