ఏఐ-ఆధారిత మట్టి పరీక్షా పరికరాన్ని అభివృద్ధి చేసిన రిటైర్డ్‌ ఇస్రో శాస్త్రవేత్త

ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) రిటైర్డ్‌ శాస్త్రవేత్త మధుకాంత్‌ పటేల్‌ ఏఐ-ఆధారిత సాయిల్‌ ఎనలైజర్‌ను అభివృద్ధి చేశారు, ఇది సెకన్లలో మట్టి ఆరోగ్యంపై నివేదికను అందిస్తుంది. పటేల్‌ ఇటీవల వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు ప్రోటోటైప్‌ను సమర్పించారు, ఐఎఫ్‌ఎఫ్‌సిఓ మరియు గుజరాత్‌ రాష్ట్ర ఎరువులు మరియు రసాయనాలు (జిఎస్‌ఎఫ్‌సి) సంస్థలతో పాటు అన్ని మట్టి పరీక్షా ప్రయోగశాలలను, పరికరాన్ని క్రమాంకనం చేయడానికి 5,000 మట్టి పరీక్ష నివేదికలను తనకు అందించమని కోరారు. స్పెక్ట్రోస్కోపీ సూత్రంపై పనిచేసే ఈ పరికరం దాని సెన్సార్‌లను దాదాపు 400 గ్రాముల మట్టిలో ఉంచిన సెకన్లలో మట్టి ఆరోగ్య నివేదిక కార్డును అందిస్తుంది. ప్రభుత్వ ప్రయోగశాలలలో సాంప్రదాయ నేల పరీక్షలో ‘తడి రసాయన పద్ధతి’ ఉంటుంది, ఇందులో గ్రైండింగ్‌, వేడి చేయడం మరియు మట్టి నమూనాలకు రసాయనాలను కలపడం వంటివి ఉంటాయి. ఈ పరికరం ఆన్‌-సైట్‌ పరీక్షను అనుమతిస్తుంది, మట్టిని ప్రయోగశాలలకు రవాణా చేయవలసిన అవసరాన్ని తొలగిస్తుంది అని పటేల్‌ చెప్పారు. ”ఈ పరికరం నేలలోని పోషకాల ఉనికి మరియు పరిమాణాన్ని నిర్ణయించడానికి అల్ట్రావైలెట్‌ మరియు ఇన్‌ఫ్రారెడ్‌ కాంతిని ఉపయోగిస్తుంది. నానోటెక్నాలజీ సహాయంతో, ఇతర నేల లక్షణాలను కొలవడానికి మెటల్‌ రాడ్‌లను అభివృద్ధి చేశారు. సహజ వ్యవసాయానికి కీలకమైన సేంద్రీయ పదార్థం, హ్యూమస్‌ మరియు కార్బన్‌ కంటెంట్‌ను కూడా ఈ పరికరం కొలవగలదు” అని పటేల్‌ చెప్పారు. ఈ పరికరం ప్రయోజనకరమైన బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాల ఉనికిని గుర్తించగలదని, ఇది సహజ వ్యవసాయం కోసం నేలను సిద్ధం చేయడానికి ఒక వరంలా మారుతుందని ఆయన అన్నారు. నేల ఆరోగ్య నివేదిక సెకన్లలో ఎలా తెలియజేస్తుందో వివరిస్తూ, పరికరం ద్వారా సంగ్రహించబడిన డేటా సేకరించబడుతుందని మరియు డేటాను స్పెక్ట్రోగ్రాఫ్‌గా మార్చడానికి కృత్రిమ మేధస్సు మరియు మిషన్‌ లెర్నింగ్‌ సాధనాలను ఉపయోగించామని శాస్త్రవేత్త చెప్పారు.

Read More

ఉద్యాన పంటలకు రూ. 3.11 కోట్ల రాయితీ

ఉద్యాన పంటల సాగు పెంపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయి. మిషన్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ (ఎంఐడీహెచ్‌), రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన (ఆర్‌కేవీవై) అమలు చేస్తున్నాయి. వీటి అమలుతో ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులకు భారీగా రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. 2025-2026 సంవత్సరానికి రాయితీలకుగాను కరీంనగర్‌ జిల్లాకు రూ. 3,11,00,000 నిధులు కేటాయించారు. పంటనుబట్టి ఎకరాల పరిమితి వేర్వేరుగా ఉంటుంది.*ప్రతి ఎకరాకు రాయితీ వివరాలు ఇలా (రూ.లలో)..* డ్రాగన్‌ ఫ్రూట్‌ 65,000, ముదురు మామిడి తోటల పునరుద్ధరణ 9,600, టిష్యు కల్చర్‌ అరటి సాగుకు 16,800, అవకాడో 12,000, బొప్పాయి 7,200, అధిక సాంద్రత విధానంలో మామిడి సాగుకు 19,200, నిమ్మ సాగుకు 19,200, జామ చెట్లకు 19,200. మిర్చి, టమాట, వంకాయ (వంగ), క్యాబేజి, కాలిఫ్లవర్‌ నారుకు ఎకరాకు 10 వేలు, వంకాయ, కాకర, బీర అంట్లు కట్టిన మొక్కలు అందిస్తారు. తాడు సాయంతో కూరగాయల సాగుకు, షేడ్‌నెట్‌ విధానంలో పువ్వులు, కూరగాయల సాగుకు 4 వేల చొప్పున రూ.35.5 లక్షల వరకు రాయితీ ఇస్తారు. గులాబీ, మల్లె తోటల పెంపకానికి 8 వేలు, దుంప లిల్లి, తదితర దుంప పువ్వుల సాగుకు 16 వేలు, మల్చింగ్‌ విధానంలో పండ్లు, కూరగాయలు, పువ్వుల సాగులకు 8 వేలు, కనీసం పన్నెండు ఏళ్లపాటు శాశ్వత పందిరి సాగు చేసే రైతులకు అర ఎకరాకు 50 వేలు.*ఇతర అంశాలకు..* సమీకృత సమగ్ర సస్యరక్షణ కింద వేసే అన్ని పంటలకు ఎకరాకు రూ.600 చొప్పున రాయితీ ఇస్తారు. తేనెటీగల పెంపకానికి 700 బాక్స్‌లకు, ఒక్కో దానికి రూ.2,400, తేనె తీసే పరికరానికి రూ.8 వేలు రాయితీ ఇస్తారు. ప్యాకింగ్‌, గ్రేడింగ్‌ షెడ్డు కింద నాలుగు యూనిట్లకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల రాయితీ ఇస్తారు. మామిడి, అరటి పండ్ల బ్యాగులకు 12.5 ఎకరాల్లో, ఎకరాకు రూ.10 వేలు ఇస్తారు. 1100 ఎకరాల్లో బిందు సేద్యానికి, 275 ఎకరాల్లో స్ప్రింక్లర్లు ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం, సన్న, చిన్న కారు, బీసీ రైతులకు 90 శాతం, ఇతరులకు 80 శాతం రాయితీ ఉంటుంది. ప్రీ కూలింగ్‌ 2 యూనిట్లకు ఒక్కో యూనిట్‌కు రూ.1,75,000, కాయలను పండ్లుగా మాగబెట్టే 1 యూనిట్‌కు రూ. 35 లక్షలు, 3 చిన్న ట్రాక్టర్లకు రూ.2.45 లక్షల చొప్పున, 9 పవర్‌ టిల్లర్లకు రూ. లక్ష చొప్పున రాయితీ, 18 పవర్‌ వీడర్లకు ఒక్కో దానికి రూ.75 వేల రాయితీ, 29 బ్రష్‌ కట్టర్లకు ఒక్కో దానికి రూ.20 నుంచి 25 వేల రాయితీ, 5 వర్మికంపోస్టు యూనిట్లకు ఒక్కో దానికి రూ.50 వేల రాయితీ ఇస్తారు. కరీంనగర్‌ జిల్లాలో నాలుగు డివిజన్లు ఉన్నాయి. కరీంనగర్‌- 89777 14035, హుజూరాబాద్‌-89777 14037, చొప్పదండి 89777 14036, మానకొండూర్‌- 89777 14034 ఉద్యాన అధికారుల చరవాణి నంబర్లలో సంప్రదించవచ్చు.*అర్హుల నుంచి త్వరలో దరఖాస్తులు* అర్హులైన రైతులు రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి. త్వరలోనే దరఖాస్తులు స్వీకరిస్తాం. కరీంనగర్‌ జిల్లాలో పండ్లు, కూరగాయలు, పువ్వుల తోటల పెంపకానికి కృషి చేస్తున్నాం. ఆసక్తి ఉన్న వారు సంబంధిత ఉద్యానవన శాఖ అధికారులను అడిగి తెలుసుకోవచ్చు. *- ఆర్‌. శ్రీనివాస్‌ రావు, డీడీ, జిల్లా ఉద్యాన శాఖ*

Read More

వరిలో కొత్త వంగడాలే మేలు ఇరి సమావేశంలో శాస్త్రవేత్తలు

వాతావరణ మార్పులు, చీడ పీడలు, నీటి కొరత దృష్ట్యా రైతులు వరి సాగు విధానాలను మార్చాలని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (ఐఆర్‌ఆర్‌ఐ ఇరి) శాస్త్రవేత్తలు సూచించారు. గురువారం ఇరి ఆధ్వర్యంలో ఇక్రిశాట్‌ కార్యాలయంలో ‘వరి విత్తన విస్తరణ’పై సమావేశం నిర్వహించారు. ఇరి దక్షిణాసియా విభాగాధిపతి స్వాతినాయక్‌, ప్రాంతీయ విత్తన విభాగాధిపతి వికాస్‌ కుమార్‌ సింగ్‌, శాస్త్రవేత్తలు మొషారఫ్‌ హొసేన్‌, గుత్తా లింగారెడ్డి, సంకల్ప్‌ భోస్లేలతోపాటు రాష్ట్ర విత్తన సంస్థలు, ప్రైవేట్‌ విత్తన సంస్థలు, చిన్న, మధ్య తరహా విత్తన వ్యాపారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వాతినాయక్‌, వికాస్‌ కుమార్‌లు మాట్లాడుతూ… ”భారత్‌ ప్రపంచంలోనే అత్యధికంగా వరి ధాన్యం ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, పాత రకాలను ఎక్కువ కాలం సాగు చేయడంతో హెక్టారుకు ఉత్పాదకత తక్కువగా ఉంది” అని పేర్కొన్నారు. ప్రతి కూలతలను తట్టుకొని రైతులకు లాభాలను అందించే కొత్త వరి రకాలను దేశంలో భారీగా విస్తరించేందుకు కార్యాచరణ చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.

Read More

సన్నాలు సాగు చేద్దాం మార్టేరు వరి పరిశోధన స్థానంలో వినూత్న ప్రయోగం ఎకరంలో 15 సన్న రకాల సాగు

సన్న బియ్యానికి గిరాకీ బాగా ఉండటంతో రైతులు కూడా వాటిని పండించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణ రకాలతో పోలిస్తే క్వింటాలుకు రూ.250 వరకు అధిక ధర లభిస్తుంది. అయితే అన్ని రకాలూ అన్ని ప్రాంతాల్లో సాగుకు అనుకూలం కాకపోవడంతో.. సరైన దిగుబడులు రావడం లేదు. తమ ప్రాంతానికి ఏ రకం అనుకూలమైనదో గుర్తించి సాగు చేస్తే పంట లాభదాయకం అవుతుంది. పశ్చిమగోదావరి జిల్లా మార్టేరు వరి పరిశోధన స్థానంలో ఎకరం భూమిలో 15 సన్న రకాల వరిని సాగు చేసి అక్కడి శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో భూముల తీరుకు అనుగుణంగా అనువైన రకాల ఎంపిక, నారు నుంచి కోత వరకు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులపై మార్టేరు వరి పరిశోధనా స్థానానికి చెందిన గోదావరి మండలం సహ పరిశోధన సంచాలకుడు టి. శ్రీనివాస్‌, విస్తరణ విభాగం ప్రధాన శాస్త్రవేత్త కృష్ణాజీ వివరాలు తెలియజేశారు.
సాగు విధానం ఇలా: విత్తనం ద్వారా వ్యాపించే తెగుళ్ల నివారణకు కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజమ్‌తో విత్తన శుద్ధి చేసుకోవాలి. నానబెట్టి మడి కట్టి (విత్తనాలపై గడ్డి కప్పి) 24 గంటల తర్వాత నారుమడిలో చల్లితే బాగా మొలకలు వస్తాయి. నారు బాగా రావడానికి సెంటు మడికి నత్రజని, భాస్వరం, పొటాష్‌లు కిలో చొప్పున వేయాలి. ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ., కాలిబాట ఉండేలా నాట్లు వేయాలి. దీంతో తెగుళ్ల ఉనికి గమనించవచ్చు. కలుపు నివారణకు ఎకరాకు 1.25 లీటర్ల బుటాక్లోర్‌ వాడాలి. ఉల్లికోడు తెగులుకు ఎకరానికి 10 కిలోల కార్బోప్యురాన్‌ చల్లాలి. వ్యాధులు, తెగుళ్లకు అనుగుణంగా వ్యవసాయాధికారుల సలహాల మేరకు మందులు చల్లాలి.
లాభాలు మెండు.. 1000 సన్న గింజల బరువు 13 నుంచి 15 గ్రాములు ఉండాలి.. బియ్యం పొడవు వెడల్పు నిష్పత్తి 2:5 కన్నా ఎక్కువగా ఉంటుంది. అన్నం ముద్ద కాకుండా మెతుకు పై నిలువు గీత లేకుండా ఉంటుంది. ఈ లక్షణాల వల్ల సాధారణ రకాల కంటే బస్తాకు రూ.250 ఎక్కువ ధర ఉంటుంది.
ఎకరాకు 35 బస్తాలు.. రూ.9వేల అదనపు ఆదాయం: నారు నుంచి కోత వరకు శాస్త్రవేత్తలు చెబుతున్న యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరానికి 35 బస్తాల (బస్తా 75 కిలోలు) వరకు దిగుబడి సాధించవచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం సన్నాలకు ఉన్న డిమాండ్‌ ప్రకారం ఆదాయం కూడా పెంచుకోవచ్చు. సాధారణ రకాల కంటే బస్తాకు రూ.250 వరకు అదనంగా బయట మార్కెట్లో ధర వస్తుంది. అంటే ఎకరా నికి దాదాపు రూ. 9 వేల వరకు అధిక ఆదాయం పొందవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సాగుకు అనుకూల రకాలివే..
రాయలసీమ, తెలంగాణలో అన్ని ప్రాంతాలకు ఎన్‌ఎల్‌ఆర్‌ 34449, ఎన్‌ఎల్‌ఆర్‌ 3354, ఎన్‌ఎల్‌ఆర్‌ 3648, ఎన్‌డీఎల్‌ఆర్‌ 7, ఎంటీయూ 1282, ఎంటీయూ 1426, ఎంటీయూ 1224
ఏలూరు, కృష్ణా, బాపట్ల, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, నెల్లూరు, ప్రకాశం: బీపీటీ 5204, ఎంసీఎం 103
నెల్లూరు, చిత్తూరు, తిరుపతి: ఆర్‌ఎన్‌ఆర్‌ 15048, కెఎన్‌ఎం 1638, కేఎన్‌ఎం 733
పల్నాడు జిల్లా: జేజీఎల్‌ 348
అన్ని ప్రాంతాల్లో సేంద్రియ సాగుకు: జైశ్రీరామ్‌, హెచ్‌ఎంటీ సోనా

Read More

వ్యవసాయ పట్టభద్రుల పేర్ల ముందు డాక్టర్‌ పెట్టుకోవద్దు

వ్యవసాయ పట్టభద్రులను డాక్టర్లుగా పరిగ ణించలేమని, వారు తమ పేర్లకు ముందు ‘డాక్టర్‌’ అని పెట్టుకోకూడదని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌ -ఐకార్‌) స్పష్టంచేసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం మానవ, పశు వైద్య కోర్సుల్లో పట్టభద్రులైన వారు మాత్రమే ‘డాక్టర్‌’ అని పెట్టుకోవడానికి అర్హులంది. వ్యవసాయంలో పంటలు, మొక్కల రక్షణ, చీడపీడల నివారణ, విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల నాణ్యతలపై అధ్యయనం చేసి పట్టభద్రుడినైన తాను వైద్యుడినేనని భావిస్తున్నానని, తన పేరుకు ముందు డాక్టర్‌ అని పెట్టుకోవడానికి అనుమతించాలని కోరుతూ తమిళనాడుకు చెందిన వ్యవసాయ పట్టభద్రుడు కె.శ్రీరామ్‌ ఇటీవల ఐకార్‌కు లేఖ రాశారు. దాన్ని ఐకార్‌ పరిశీలించి, కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం తీసుకుంది. అనంతరం ఐకార్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఏఎస్‌ యాదవ్‌… వ్యవసాయ పట్టభద్రుడు శ్రీరామ్‌కు ప్రత్యుత్తరమిస్తూ పైవివరాలను వెల్లడించారు.

Read More

అధిక దిగుబడులకు మరిన్ని పరిశోధనలు అవసరం

నాబార్డు మాజీ ఛైర్మన్‌ చింతల గోవిందరాజులు
ఘనంగా ఆంగ్రూ వజోత్సవాలు ప్రారంభం

సన్న, చిన్నకారు రైతులకు ఉపయోగపడేలా, అధిక దిగుబడులు సాధించేలా మరిన్ని పరిశోధనలు చేయాలని నాబార్డు మాజీ చైర్మన్‌ చింతల గోవిందరాజులు సూచించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 60 సంవత్సరాల వజ్రోత్సవం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. తొలుత వేడుకను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఆంగ్రూ వజ్రోత్సవ పైలాన్‌ను, ఆచార్య ఎన్జీరంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్టాల్స్‌ను సందర్శించారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్‌ మాట్లాడుతూ ఆంగ్రూ ఐకానిక్‌ భవన డిజైన్‌ ఎంపికకు చాలా సమయం పట్టిందని, 2018లో పనులు ప్రారంభించామన్నారు. ప్రస్తుతం మరికొంత నిధులు అవసరం ఉందన్నారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ ఆంగ్రూలో చదువుకుని ఎంతో విజ్ఞానాన్ని పొందానన్నారు. వ్యవసాయ శాఖ సంచాలకులు ఢిల్లీరావు మాట్లాడుతూ పూర్వ విద్యార్థిగా విశ్వవిద్యాలయం అభివృద్ధికి రూ.2 లక్షలు అందించనున్నట్లు ప్రకటించారు. నాబార్డు మాజీ చైర్మన్‌ చింతల గోవిందరాజులు రూ.2 లక్షలు అందించనున్నట్లు తెలిపారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ జానయ్య, ప్రొఫెసర్‌ విజయపాల్‌శర్మ, రైతు సాధికార సంస్థ వైస్‌ చైర్మన్‌ టి. విజయకుమార్‌, అగ్రిమిషన్‌ వైస్‌ చైర్మన్‌ మర్రిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడారు. సావనీర్‌, ఆంగ్రూ పుస్తకాలను మంత్రి అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. ఆంగ్రూ వీసీ డాక్టర్‌ ఆర్‌. శారదజయలక్ష్మిదేవి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, వీసీలు జె.వి. రమణ, డాక్టర్‌ గోపాల్‌, మత్స్యవిశ్వవిద్యాలయం ప్రత్యేకాధికారి టి. సుగుణ, రైతునేస్తం ఫౌండేషన్‌ ఛైర్మన్‌ వై. వేంకటేశ్వరరావు, ఆంగ్రూ పూర్వ వీసీ దామోదర్‌ నాయుడు పాల్గొన్నారు.

Read More

వ్యవసాయంలో 4.0 దశ ప్రారంభం కావాలి

సీఐఐ వ్యవసాయ సదస్సులో ఎన్‌ఆర్‌ఎస్‌ఏ డైరెక్టర్‌ వేమూరి చౌదరి

డిజిటల్‌ సాంకేతికత, కృత్రిమ మేధల సమ్మిళితంగా వ్యవసాయ రంగంలో 4.0 దశ ప్రారంభం కావాల్సిన అవసరం ఉందని ఇస్రోకు చెందిన నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌(ఎన్‌ఎఆర్‌ఎస్‌ఏ) అగ్రి సైన్సెస్‌ అధ్యయనాల విభాగం డైరెక్టర్‌ వేమూరి చౌదరి అభిప్రాయపడ్డారు. అధునాతన విధానాలతో భవిష్యత్తులో దేశంలో సేద్యం ఉజ్వలంగా మారుతుందని చెప్పారు. ‘డిజిటల్‌ వ్యవసాయంతో ఉత్పాదకత పెంపు, స్థిరత్వం’ అనే అంశంపై భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ”డిజిటల్‌ సాంకేతికత పంటల సాగు ఖర్చును తగ్గించడంతోపాటు దిగుబడులను పెంచడానికి ఇది దోహదపడుతుంది. ఉపగ్రహాల ద్వారా పంటల పర్యవేక్షణ, దిగుబడి అంచనాలను ముందే వెల్లడిస్తూ రైతులకు లాభం చేకూరుస్తుంది” అని అన్నారు. కొండాలక్ష్మణ్‌ ఉద్యాన వర్సిటీ వీసీ రాజిరెడ్డి మాట్లాడుతూ.. వర్సిటీలు, పరిశోధన సంస్థల్లో భారీ ఎత్తున పరిశోధనలు, ఆవిష్కరణలు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. అంకురాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని అగ్రిహబ్‌ సీఈవో విజయ్‌ ఆకాంక్షించారు. సీఐఐ తెలంగాణ వ్యవసాయ, ఆహార శుద్ధి విభాగం సలహాదారు ప్రవీణ్‌ రావు, సీఐఐ తెలంగాణ విభాగం ఛైర్మన్‌ ఆర్‌ఎస్‌ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యకక్షుడు ఎం. గౌతంరెడ్డి, సదరన్‌ రీజియన్‌ మాజీ ఛైర్మన్‌ అనిల్‌ కుమార్‌ తదితరులు ప్రసంగించారు. వ్యవసాయంలో సుస్థిరత సాధించే, ప్రపంచంతో పోటీ పడే వ్యూహాలను అన్వేషించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. సదస్సులో నిపుణులు సుబ్బారెడ్డి, ఆదర్శ్‌ నూరి, ప్రేమకుమార్‌ అమిత్‌ వాత్సాయన్‌, ఎస్‌ బీ ఐ, నాబార్డు అధికారులు, కంపెనీల ప్రతినిధులు, అంకుర సంస్థల వ్యవస్థాపకులు పాల్గొన్నారు.

Read More

ఆహార భద్రతలో ఆంగ్రూ పాత్ర కీలకం

ఐకానిక్‌ భవనానికి నిధులు ఇస్తాం – వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు

ప్రజలకు ఆహార భద్రత కల్పించడంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రూ) పాత్ర చాలా కీలకమైనదని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖా మంత్రి కె. అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గుంటూరు లాంఫాంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాల కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అరవై ఏళ్ల కాలంలో అనేక రకాల వరి వంగడాలను అందించిన ఘనత ఈ విశ్వవిద్యాలయానికి ఉందన్నారు. కృత్రిమ మేధను కూడా వ్యవసాయంలో వర్తింపజేయాలన్నారు. సేంద్రియ సాగు, ప్రకృతి వ్యవసాయాన్ని జోడించి రైతులకు మేలు జరిగేలా పరిశోధనలు చేయాలని సూచించారు. ఆంగ్రూ ఐకానిక్‌ భవనానికి అవసరమైన నిధుల మంజూరుకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో ఆంగ్రూ వీసీ డాక్టర్‌ ఆర్‌.శారద జయలక్ష్మీదేవి, పీజేటీఎస్‌ ఏయూ వీసీ అల్దాస్‌ జానయ్య, నాబార్డు మాజీ చైర్మన్‌ గోవిందరాజులు, వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్‌, డైరెక్టర్‌ దిల్లీరావు తదితరులు పాల్గొన్నారు.

Read More

వరిలో పోషక విలువలు పెంచాలి

ఐఐఆర్‌ఆర్‌ 60వ వార్షిక సమావేశంలో ఐకార్‌ డీజీ మంగీలాల్‌ జాట్‌

దేశంలో ప్రధాన పంటగా ఉన్న వరిలో పోషక విలువలను పెంచాలని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్‌) డైరెక్టర్‌ జనరల్‌, వ్యవసాయ విద్యాపరిశోధన శాఖ కార్యదర్శి మంగీలాల్‌ జాట్‌ సూచించారు. భారత వరి పరిశోధన సంస్థ(ఐఐఆర్‌ఆర్‌) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన అఖిల భారత వరి సమన్వయ పరిశోధన ప్రాజెక్టు 60వ వార్షిక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ… ధాన్యం సాగు, ఉత్పత్తిలో ప్రపంచంలో దేశం రెండోస్థానంలో ఉందన్నారు. ఇక్కడ ఏటా బియ్యం మిగులు తేలుతోందని, మధుమేహం వంటివి వస్తాయనే భావనతో అందరూ తినడం లేదన్నారు. పద్మభూషణ్‌ పురస్కార గ్రహీత, వ్యవసాయ శాస్త్రాల అభివృద్ధి ట్రస్టు(టాస్‌) చైర్మన్‌ ఆర్‌ఎస్‌ పరోడా మాట్లాడుతూ.. చైనాలో సగటు వరి దిగుబడి హెక్టారుకు 6 టన్నులు ఉండగా, భారతదేశంలో అది 3.5 టన్నులు మాత్రమేనని, కొత్త వంగడాలు, ఉత్తమ యాజమాన్య పద్ధతులతో ఈ అంతరాన్ని పూరించాలన్నారు. ఐకార్‌ పంట శాస్త్రాల డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ డీకే యాదవ్‌ మాట్లాడుతూ.. దేశంలో సంకర వరి సాగు విస్తీర్ణాన్ని పెంచాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. సమావేశంలో ఐఐఆర్‌ఆర్‌ డైరెక్టర్‌ ఆర్‌ఎం సుందరం, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఏపీ ఎన్జీ రంగా వర్సిటీ వీసీలు అల్దాస్‌ జానయ్య, శారదా జయలక్ష్మిదేవి, ఐకార్‌ శాస్త్రవేత్త ఏకే సింగ్‌, ఐకార్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌ కె ప్రధాన్‌, ఫార్చ్యూన్‌ రైస్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ అజయ్‌ భలోటియా, నార్మ్‌ డీజీ ఆర్‌సి అగర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ప్రచురణలను విడుదల చేశారు.ప్రారంభమయ్యాక అక్కడ పదికి పైగా ప్యాక్‌ హౌస్‌లను ప్రారంభించాలని ఉద్యానశాఖ భావిస్తోంది.

Read More

మామిడికి తెలంగాణ బ్రాండ్‌

విదేశాలకు ఎగుమతికి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
రూ.35 కోట్లతో యంత్రాల కొనుగోలుకు ఉద్యానశాఖ ప్రతిపాదనలు

రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మామిడిపండ్లను శుద్ధి చేసి తెలంగాణ బ్రాండ్‌ పేరిట రైతుల ద్వారానే విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఉద్యానశాఖ రూ.35 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. తెలంగాణ మామిడికి విదేశాల్లో ఆదరణ లభిస్తోంది. రాష్ట్రంలో ఏటా ఆరు వేల టన్నుల మామిడి కాయలు కాస్తుండగా.. అందులో వేయి టన్నుల వరకు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇక్కడి మామిడి పండ్లను ప్రైవేటు కంపెనీలు కొనుగోలు చేసి ముంబయి, బెంగళూరులకు తీసుకెళ్లి శుద్ధి చేసి, విదేశాలకు పంపి లాభాలను ఆర్జిస్తున్నాయి. ఎగుమతులకు అవసరమైన శుద్ధి సౌకర్యాల కల్పనకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించడంతో ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌ హౌస్‌ల పేరిట యంత్ర పరికరాల కొనుగోలుకు ఉద్యాన అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. 

ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌ హౌస్‌ ఏర్పాటు
మామిడిపై ఉండే పురుగులను తొలగించేందుకు వీలుగా రేడియేషన్‌ ప్రక్రియ(ఎరాడికేషన్‌)ను నిర్వహించేందుకు రూ.24 కోట్లతో అటామిక్‌ రీసెర్చ్‌ ఎనర్జీ యంత్రం, మామిడిని మెరిసేలా చేసేందుకు రూ.5 కోట్లతో వేపర్‌ హీట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌, మామిడిని మగ్గబెట్టేందుకు రూ.3 కోట్లతో హాట్‌ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌, రూ.4 కోట్లతో కోల్డ్‌ రూమ్స్‌ ఏర్పాటుతో పాటు ఇంటిగ్రేటెడ్‌ ప్యాకింగ్‌కు రూ. 2 కోట్లు వెచ్చించాలని నిర్ణయించారు. ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌ హౌస్‌ల కింద బాటసింగారం పండ్ల మార్కెట్‌తో పాటు పలుచోట్ల మౌలిక వసతుల కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. కోహెడలో అంతర్జాతీయ మార్కెట్‌

Read More