సమగ్ర విత్తన చట్టం తీసుకొచ్చే దిశలో ప్రభుత్వం

రైతు ప్రయోజనాల పరిరక్షనే చట్టం పరమావధి కావాలి.

  • ప్రస్తుతం ఉన్న చట్టంలో నష్టపరిహారం గురించి ఎలాంటి ప్రస్తావన లేదు.
  • వివిధ రాష్ట్రాలలో విత్తనచట్టం 1966కు అదనంగా అమలు అవుతున్న చట్టాలపై చర్చ
    1966లో తీసుకొచ్చిన విత్తన చట్టం మారిన పరిస్థితుల దృష్ట్యా మరియు స్థానిక అవసరాల దృష్ట్యా వాటిలో కొన్ని అదనపు రూల్స్‌ లేదా క్లాజ్‌లను కలపాల్సి ఉంటుందని, మరీ ముఖ్యంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కంపెనీల ఆర్‌ అండ్‌ డి వసతులపై నిరంతర నిఘా అవసరమని, ఎవరైనా కల్తీ విత్తనాలు సరఫరా చేస్తే తీసుకొనే చర్యలు కఠినంగా రూపొందించాలని, అదేవిధంగా విత్తనోత్పత్తి రైతులను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చే విధంగా విత్తనచట్టం 1966లో కొన్ని మార్పులు తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం మంత్రి అధ్యక్షతన జరిగిన సమగ్ర విత్తన చట్టం, ఆవశ్యకత, చట్టంలో అదనంగా చేర్చాల్సిన అంశాలు, మున్నగువాటిపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ మార్పులు కూడా చట్టాల పరిధిలోకి లోబడి తీసుకొచ్చేవిధంగా ముసాయిదా రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించారు. దానికి సమావేశంలో సభ్యులు వెల్లిబుచ్చిన అభిప్రాయాలు అన్నిటినీ పరిగణలోనికి తీసుకోవాలని ఆదేశించారు. 3 నుండి 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిన ఒక నిర్ధిష్టమైన కాలపరిమితిలో 3 నెలలలో ముసాయిదా సిద్ధం అయ్యేట్లు చూడాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయకమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి, వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్‌ రావు, డైరెక్టర్‌ గోపి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
    ఛైర్మన్‌ కోదండరెడ్డి మాట్లాడుతూ…. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ కాలంలో విత్తనచట్టంలో మార్పుల కోసం కొన్ని ప్రయత్నాలు జరిగాయని, అప్పటి ప్రభుత్వం ప్రయత్నం వల్లనే బి.టి కాటన్‌ విత్తనం ధర రూ.1800 నుండి రూ. 650కి రావడం జరిగిందని తెలిపారు.
    సునీల్‌ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాలలో అమలవుతున్న చట్టాల వివరాలు ముఖ్యంగా మహారాష్ట్రలో అమలవుతున్న పరిహారం చెల్లింపు వంటివి పరిశీలించవచ్చని తెలిపారు.
    వ్యవసాయశాఖ డైరెక్టర్‌ గోపి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం విత్తనోత్పత్తి రాష్ట్రంగా ఉందని, విత్తన రైతుల ప్రయోజనాలు కూడా కాపాడేవిధంగా చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు.
Read More

వ్యవసాయంలో ‘కృత్రిమ మేధ’ వినియోగం

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయంలో ఉపయోగపడే విధంగా కృత్రిమ మేధ సాంకేతికతను వినియోగించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దీనికి అవసరమైన కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. మంత్రి బుధవారం సచివాలయంలో వివిధ సాంకేతిక కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ”పంటలకు వచ్చే చీడపీడలను ముందుగానే గుర్తించడం, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు జరిగే పంట నష్టాన్ని త్వరితగతిన అంచనా వేయడం, పంటల కొనుగోళ్లకు సంబంధించి ముందుగానే దిగుబడులు అంచనా వేయడం, నమోదైన సాగు విస్తీర్ణాలను ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా సరిపోల్చడం తదితర అంశాల్లో ఏఐని వినియోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది” అని మంత్రి పేర్కొ న్నారు. అనంతరం ఇక్రిశాట్‌, అగ్రివాస్‌ కంపెనీ ప్రతినిధులు పలు అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. సమావేశంలో వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read More

తక్కువ ఖర్చుతో రైతులకు సాంకేతిక సహకారం

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

రైతులకు తక్కువ ఖర్చుతో అవసరమైన సాంకేతిక సహకారం, మార్కెటింగ్‌ సౌకర్యాన్ని కల్పించేందుకు డిజిటల్‌ గ్రీన్‌ సంస్థతో ఒప్పందం చేసుకోనున్నట్లు సెర్ప్‌ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలోని కార్యాలయంలో ఆయన బుధవారం డిజిటల్‌ గ్రీన్‌ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి కార్యకలాపాలను సంస్థ ప్రతినిధులు వివరించారు.

Read More

వానలే వానలు

ఈ ఏడాది సాధారణానికి మించి
తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వర్షాలకు అవకాశం
భారత వాతావరణ విభాగం వెల్లడి

వ్యవసాయ రంగానికి భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలం (జూన్‌-సెప్టెంబరు)లో దేశ వ్యాప్తంగా సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో భూవిజ్ఞాన శాస్త్ర శాఖ కార్యదర్శి ఎం. రవిచంద్రన్‌, ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 1971 నుంచి 2020 వరకు ఉన్న గణాంకాల ఆధారంగా చూస్తే.. దేశవ్యాప్తంగా దీర్ఘకాలంలో సగటున 87 సెంటీమీటర్ల వర్షం కురుస్తూ వస్తోందని, ఇప్పుడు అందులో 105% దాకా వర్షాలు పడొచ్చని వారు పేర్కొన్నారు. అలాగే సాధారణానికి మించి, అధిక వర్షపాత అంచనాలు కలిపి చూస్తే మంచి వర్షాలకు 56% అవకాశం ఉందని వివరించారు. ఈ ఏడాది ఎల్‌నినో ఏర్పడే పరిస్థితులు లేవని చెప్పారు. డిసెంబరు-మార్చి మధ్య హిమాలయాలు, యూరో ఏసియా ప్రాంతంలో మంచు తక్కువగా ఉందని తెలిపారు. ఇవన్నీ మంచి వర్షాలు కురవడానికి శుభపరిణామాలని పేర్కొన్నారు. అలాగే జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌, ఈశాన్య రాష్ట్రాలు, తమిళనాడు, బిహార్‌లలో సాధారణం కంటే తక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని, మిగిలిన అన్ని ప్రాంతాల్లో సాధారణం, అంతకంటే ఎక్కువ వానలు కురిసే వీలుందని వివరించారు. జూన్‌-సెప్టెంబరు మధ్య ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో సాధారణానికి మించి వర్షాలు ఉండొచ్చని చెప్పారు. ప్రత్యేకించి ఏపీలోని ఉత్తర కోస్తాలో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ వర్షాలు ఉండొచ్చని అంచనా వేశారు.

Read More

వాతావరణ మార్పులకు అనుగుణంగా సుస్థిర వ్యవసాయం

భారత్‌, శ్రీలంక మధ్య ఒప్పందం

వాతావరణ మార్పులకు అనుగుణంగా సుస్థిర వ్యవసాయ విధానాల అమలుపై ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార పథకం (యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ) ద్వారా భారతదేశం, శ్రీలంక మధ్య ఒప్పందం కుదిరింది. మంగళవారం అమరావతి సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ ఎక్స్‌ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌, యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ భారతదేశ ప్రతినిధి, సంచాలకులు ఎలిజబెత్‌ ఫౌర్‌ పాల్గొని ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, తమిళనాడులో ఐదేళ్లపాటు దీన్ని అమలు చేస్తారు. ఇందులో భాగంగా వైఎస్సార్‌ జిల్లాలో వ్యవసాయ శాఖ, ప్రపంచ ఆహార పథకం ద్వారా రైతుసాధికార సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడతారు. వాతావరణ మార్పులు, ప్రతికూల ప్రభావాల నుంచి సన్న, చిన్నకారు, మహిళా రైతుల జీవనోపాధిని సురక్షితం చేయడానికి ఈ పథకం దోహదపడుతుందని రాజశేఖర్‌ తెలిపారు.

Read More

ఏటా 60 లక్షల టన్నుల బియ్యం ఎగుమతికి అవకాశం

ఫిలిప్పీన్స్‌కు 10 లక్షల టన్నులు..
ఉత్పత్తి, ఎగుమతులకు ప్రోత్సాహం

  • రాష్ట్ర మంత్రి ఉత్తమకుమార్‌ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం నుంచి ఏటా 60 లక్షల టన్నుల వరకు బియ్యం ఎగుమతికి అవకాశం ఉందని పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమకుమార్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజల అవసరాలు, ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా, కేంద్ర నిల్వలన్నింటికీ కలిపి వినియోగించే దొడ్డు, సన్న బియ్యం పోనూ రాష్ట్రంలో భారీగా మిగులు నిల్వలు ఉంటాయన్నారు. ఫిలిప్పీన్స్‌కు దొడ్డు బియ్యం ఎగుమతి ప్రారంభించామని.. ఏడాదికి 10 లక్షల టన్నులు పంపేందుకు వీలుందన్నారు. ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ‘బియ్యం ఎగుమతి విధానం’ అంశంపై మంగళవారం నిర్వహించిన సదస్సులో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”తెలంగాణ ఈ ఏడాదిలో రికార్డుస్థాయిలో 280 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. రైతుల కృషితో పాటు అనుకూల వాతావరణ పరిస్థితులు, ప్రకృతి సహకారం, నూతన వరి రకాల వల్లే ఇది సాధ్యమైంది. రైతులను ప్రోత్సహించేందుకు సన్నధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్‌ ఇచ్చి ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. దొడ్డు రకాలైన ఎంటీయూ-1010, ఐఆర్‌-64లకు ఫిలిప్పీన్స్‌లో మంచి డిమాండ్‌ ఉంది. వరి నేరుగా విత్తడం, రోజు విడిచి రోజు నీరు పెట్టడం, తక్కువ రసాయన ఎరువులు, పురుగుమందులు వాడటం వంటి విధానాలతో వరి రకాలను ఉత్పత్తి చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం. ఎగుమతికి అనుకూల రకాల ఉత్పత్తికి రైతులకు.. వాటి ఎగుమతికి ఔత్సాహికులకు.. విధానపరమైన ప్రోత్సాహకాలిస్తాం. ఆధునిక రైస్‌ మిల్లు నమూనాను అగ్రి వర్సిటీలో ఏర్పాటుచేసి రైతులకు, యువతకు శిక్షణ ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం” అని మంత్రి తెలిపారు. విశ్వవిద్యాలయ వీసీ అల్దాస్‌ జానయ్య, పరిశోధన సంచాలకుడు బలరాం, శాస్త్రవేత్త దామోదర్‌రాజు, వరల్డ్‌ ఫుడ్‌ప్రైజ్‌ ఫౌండేషన్‌ అవార్డు గ్రహీత, యూజీసీ ప్రొఫెసర్‌ ఆఫ్‌ ప్రాక్టీస్‌ సమరేందు మహంతి, అఖిలభారత రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ అధ్యకక్షుడు కృష్ణారావు, ఎఫ్‌సిఐ, అపెడా అధికారులు, రైతు నాయకులు, విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, పౌర సరఫరాలశాఖ అధికారులు పాల్గొన్నారు.

Read More

కొత్త శనగ రకానికి దివంగత శాస్త్రవేత్త ‘అశ్విని’ పేరు

భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్‌ఐ) కొత్తగా రూపొందించిన పూస శనగ- 4037 రకానికి తెలంగాణ దివంగత మహిళా వ్యవసాయ శాస్త్రవేత్త నూనావత్‌ అశ్విని పేరు పెట్టింది. ఖమ్మం జిల్లా గంగారంతండాకు చెందిన అశ్విని ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయపుర్‌లో వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉద్యోగం పొందారు. సెమినార్‌లో పాల్గొనేందుకు గతేడాది సెప్టెంబరులో తండ్రితో కలిసి కారులో వెళ్తూ మహబూబాబాద్‌ జిల్లా ఆకేరు వాగు సమీపంలో వరద ప్రవాహంలో మునిగి మరణించారు.

Read More

మళ్లీ అమెరికాకు మన రొయ్య

  • ఎగుమతికి సిద్ధంగా 30 వేల నుంచి 40 వేల టన్నులు
  • 100 కౌంట్‌ రొయ్యలకు కిలోకు రూ.220 నుంచి రూ.230
  • 30, 60 కౌంట్‌ రొయ్యకు నామమాత్రపు ఊరట
  • సుంకాలకు ముందున్న ధరలతో పోలిస్తే రూ.40 తక్కువే

పెంచిన సుంకాల అమలును వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యకక్షుడు ట్రంప్‌ ప్రకటించడంతో.. ఆంధ్ర రొయ్యకు మళ్లీ కాస్త ఊపిరొచ్చింది. వందల కంటెయినర్లు మళ్లీ సముద్ర మార్గాన బయల్దేరేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో శీతల గోదాముల్లోని నిల్వలు క్రమంగా ఖాళీ అవుతున్నాయి. అయితే రైతుకు మాత్రం.. సుంకాల ప్రకటనకు ముందున్న ధరలైతే దక్కడం లేదు. 100 కౌంట్‌కు ఇచ్చే ధర గతంలో రూ.240 ఉండగా ఇప్పుడు రూ. 230 వరకు లభిస్తోంది. 30 కౌంట్‌ ధరలో తేడా చాలా ఎక్కువగా ఉంది. సుంకాల ప్రకటనకు ముందు కిలో రూ.470 చొప్పున కొనగా.. ఇప్పుడు రూ.420 నుంచి రూ.430 మాత్రమే ఇస్తున్నారు. వీటికి ధరలు పెంచాలని రైతులు కోరుతున్నారు.

మధ్యాహ్నం నుంచి కాస్త పెరిగిన ధరలు
సుంకాల ప్రకటనకు ముందు రైతుల నుంచి కొన్న రొయ్యలు గోదాముల్లోనే ఉన్నాయి. సుంకాల అమలుకు 90 రోజులు గడువు ఇవ్వడంతో వాటన్నింటిని అమెరికాకు ఎగుమతి చేసేందుకు వ్యాపారులు సిద్ధమయ్యారు. ఇవి సుమారు 30 వేల నుంచి 40 వేల టన్నులు ఉంటాయని అంచనా. అంటే సుమారు 3 వేల నుంచి 4వేల కంటెయినర్ల సరకు. ఎగుమతికి వ్యాపారులు సిద్ధమవడంతో రొయ్యల కొనుగోలులో పురోగతి కనిపించింది. సోమవారం ఉదయంతో పోలిస్తే మధ్యాహ్నం నుంచి రొయ్య ధరల్లో కొంత పెరుగుదల కనిపించింది. 30 కౌంట్‌ రొయ్య ఉదయం కిలో రూ.420 ఉండగా మధ్యాహ్నం తర్వాత రూ.10 పెరిగి రూ.430 అయింది. 25 కౌంట్‌ రొయ్య కిలో రూ.470 నుంచి రూ.500కి చేరింది.
చిన్నకౌంట్‌ రొయ్యకు కిలోకు రూ.5-10 పెంచారు.

ఆక్వా సలహా కమిటీ సమావేశం అర్ధాంతరంగా ముగింపు
రొయ్యల ధరలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆక్వా సలహా కమిటీ సమావేశం సోమవారం జూమ్‌ విధానంలో జరిగింది. అప్సడా వైస్‌ చైర్మన్‌ ఆనం వెంకట రమణారెడ్డి, ఉపసభాపతి రఘురామకృష్ణరాజుతోపాటు ఎగుమతిదారులు, రైతు ప్రతినిధులు హాజరయ్యారు. రొయ్యలకు ధర పెంచాలని రైతులు కోరగా.. ఇప్పటికిప్పుడు ధరలు నిర్ణయించలేమని ఎగుమతి వ్యాపారులు సమాధానమిచ్చారు. 70% ఉత్పత్తి కొనుగోలు ట్రేడర్ల ద్వారా జరుగుతోందని వివరించారు. రైతుల నుంచి కొనుగోలు చేసేది ట్రేడర్లే అయినా చివరకు చేరేది వ్యాపారులకేనని రైతులు, ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. వ్యాపారులు నిర్ణయించిన ధరకే వారు కూడా కొంటారని.. ప్రతి 15 రోజులకోసారి ధరలు ప్రకటించాలని కోరారు. దీనిపై కొద్దిసేపు వాడీవేడిగా వాదనలు చోటుచేసుకున్నాయి. తాము మిగిలిన వ్యాపారులతో చర్చించి నిర్ణయం వెలువరిస్తామని, ఇప్పటికిప్పుడు ధరలు ప్రకటించలేమంటూ ఎగుమతిదారుల సంఘ ప్రతినిధులు స్పష్టం చేయడంతో సమావేశం అర్ధంతరంగా ముగిసింది.

Read More

వెదురుతో దుర్భేద్య బంకర్లు ఐఐటీ పరిశోధకుల పరిశోధన

బంకర్లు, రక్షణశాఖ షెల్టర్ల నిర్మాణానికి అక్కరకొచ్చే మిశ్రమ పదార్థాలను వెదురు సాయంతో భారత పరిశోధకులు అభివృద్ధి చేశారు. సంప్రదాయ కలప, ఇనుము, లోహాలకు బదులుగా దీన్ని ఉపయోగించొచ్చు. గువాహటిలోని ఐఐటీ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. దీన్ని భారత సైన్యం పరీక్షిస్తోంది.
స్వీయ బరువుతో పోలిస్తే అందించే అత్యుత్తమ బలం కారణంగా ఏరో స్పేస్‌, పౌర, నౌకాదళ రంగాల్లో గ్లాస్‌ ఫైబర్‌, కార్బన్‌ ఫైబర్‌, శాండ్‌విచ్‌ కాంపోజిట్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే వీటి ఉత్పత్తి, పారవేతలో పర్యావరణ సవాళ్లు గణనీయంగానే ఉన్నాయి. చెట్ల నరికివేతపై ఆంక్షలు, హరిత ప్రత్యామ్నాయాలకు పెరుగుతున్న డిమాండ్‌ కారణంగా.. వెదురు ఆధారిత మిశ్రమ పదార్థాల రూపకల్పనపై గువాహటి ఐఐటీ శాస్త్ర వేత్తలు కొంతకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. వెదురు చెట్టు వేగంగా పెరుగుతుంది. నాలుగైదేళ్లలోనే పూర్తిస్థాయిలో సిద్ధమవుతుంది. సంప్రదాయ టేకు వంటి చెట్లకు ఇందుకు 30 ఏళ్లు పడుతుంది. వెదురుకు పునరుత్పాదక లక్షణం ఉంది. పైగా బరువు తక్కువ. పర్యావరణ అనుకూలం. స్థానికంగా లభ్యమవుతుంది. ఫర్నిచర్‌, ఇళ్ల నిర్మాణం వంటి అవసరాలకు వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఐఐటీ పరిశోధకులు తాజాగా రూపొందించిన వెదురు ఆధారిత మిశ్రమ పదార్థం.. లోహాల తరహాలో వంపునకు వీలుగా ఉంటుంది. తూటాలనూ తట్టుకునేంత బలం దీని సొంతం. ఈ లక్షణాల దృష్ట్యా ఇది సైనిక అవసరాలకు బాగా అక్కరకొస్తుందని పరిశోధకులు తెలిపారు.

Read More

జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ నుండి ఐదు ఉత్తమ మొక్కజొన్న హైబ్రిడ్‌ రకాలు విడుదల

ఇటీవల భారత వ్యవసాయ పరిశోధన మండలి ఆద్వర్యంలో తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో నిర్వహించిన అఖిల భారత మొక్కజొన్న పరిశోధన సమన్వయ సమావేశంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇటీవల రూపొందించిన ఐదు ఉత్తమమైన మొక్కజొన్న హైబ్రిడ్‌ రకాలను విడుదల చేశారని విశ్వవిద్యాలయ ఉప కులపతి ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్య ఒక పత్రిక ప్రకటనలో తెలియజేశారు. నూతనంగా విదుదలైన హైబ్రిడ్‌ రకాలు దక్కన్‌ హైబ్రిడ్‌ మక్కా -144, డి.హెచ్‌.యం. 182, డి.హెచ్‌.యం.193, డిహెచ్‌.యం.206,డిహెచ్‌.యం.218 లతో కలిపి ఈ విశ్వవిద్యాలయం నుండి మొత్తం 24 మొక్కజొన్న హైబ్రిడ్‌ రకాలు విడుదల అయ్యాయి. ఇందులో డి.హెచ్‌.యం. 144 (తెలంగాణ మక్క – 6) రకంలో అధిక పిండి పదార్థాలు ఉండటం వలన ఇథనాల్‌ ఉత్పత్తికి బాగా అనుకూలంగా ఉంటుందని తెలిపారు. అదే విధంగా డి.హెచ్‌.యం. 206 (తెలంగాణ మక్క – 3) మెట్ట సాగుకు అనుకూలమైనదని మరియు ఎండు తెగులును సమర్థ వంతంగా తట్టుకుంటుందని తెలియజేశారు. అంతేకాకుండా ప్రస్థుతం రైతాంగానికి అందుబాటులో ఉన్న వివిధ మొక్కజొన్న వంగడాలతో పోల్చితే డి.హెచ్‌.యం. అన్ని విధాలుగా మేలైందని పరిశోదనలో తేలింది. కాబట్టి ఈ సదవకాశాన్ని రాబోయే కాలంలో రైతాంగం వినియోగించుకోవలసిందిగా విశ్వవిద్యాలయ అధికారులు కోరుతున్నారు.

16 పంట రకాలకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటిత రకాలుగా గుర్తింపు
ఈ మధ్య కాలంలో జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన 16 వివిధ పంటల రకాలకు ఇటీవల కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖలో జరిగిన సమీక్ష సమావేశంలో అధికారిక ప్రకటిత రకాలుగా (నోటిఫైడ్‌ వెరైటీస్‌) గుర్తిస్తూ ప్రకటన విడుదల చేసారు. తద్వార జయశంకర్‌ వర్సిటీ విడుదల చేసిన ఈ పంట రకాలను కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ద్వారా విత్తనోత్పత్తి ప్రణాళికలు రూపొందించి ఈ రకాలను రైతాంగానికి అందుబాటులోనికి తేవడానికి సహకరిస్తుంది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని వివిధ విత్తన సంస్థలు ఈ రకాల మూల విత్తన సరఫరా కొరకు విశ్వవిద్యాలయాన్ని సంప్రదించాలని విశ్వవిద్యాలయ అధికారులు సూచిస్తున్నారు.

Read More