రాష్ట్రంలో పాడిపశువులకు ఉచిత కృత్రిమ గర్భధారణ కార్యక్రమం

కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పాడిపశువులకు జాతీయ ఉచిత కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని అమలుచేయాలని నిర్ణయించింది. దీని కింద శుక్రవారం నుంచి రాష్ట్రంలోని 20 లక్షల పాడిపశువులకు కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్లు వేస్తామని రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ ముఖ్యకార్యనిర్వహణ అధికారి సి. హెచ్‌. మల్లీశ్వరి తెలిపారు. గతంలో కృత్రిమ గర్భధారణకు రుసుములు వసూలు చేసేవారని, కేంద్ర కార్యక్రమం ద్వారా పాడిరైతులు ఇప్పుడు ఉచిత సేవలు పొందవచ్చని వివరించారు. దీని కింద రైతులకు ఆర్థికభారం తగ్గడంతోపాటు మేలు జాతి పశువుల సంతతి అభివృద్ధి చెందుతుందని, పాల దిగుబడి గణనీయంగా పెరుగుతుందన్నారు.

Read More

ఆదర్శ రైతు.. నిమ్మల

ఎకరాకు 65 బస్తాలు పండించిన మంత్రి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఆగరిపాలెంలోని తన పొలంలో రబీ వరిలో ఎకరానికి 65 బస్తాల (బస్తాకు 75 కిలోల చొప్పున) సగటు దిగుబడి సాధించి ఆదర్శంగా నిలిచారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం పాలకొల్లులో ఏడీఏ అడ్డాల పార్వతి వెల్లడించారు. రామానాయుడు మొత్తం ఆరెకరాల విస్తీర్ణంలో వరి పీఆర్‌ 126 రకం (గ్రేడ్‌ ఎ) సాగు చేయగా.. 390 బస్తాల దిగుబడి వచ్చిందన్నారు. సకాలంలో నారు పోసి నాట్లు వేయడం, సరిపడా ఎరువులు, పురుగుమందుల వినియోగం, నీటి యాజమాన్య పద్ధతులు, తెగుళ్ల నివారణ చర్యలు, శాస్త్ర వేత్తల సూచనలు పాటించి అధిక దిగుబడి సాధించారని తెలిపారు.

Read More

రైతు ముంగిట్లోకి వ్యవసాయ శాస్త్రవేత్తలేనా!

ఉద్యాన, పశువైద్యశాఖలూ పాల్గొనాలని మంత్రి ఆదేశం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో ఉద్యాన, పశువైద్యశాఖలు, విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు పాల్గొనకపోవడంపై వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయా శాఖలు సైతం పాల్గొనాలని ఆయన ఆదేశించారు. రైతులకు పంటలు, వాటి అనుబంధ రంగాలపై అవగాహన కల్పించేందుకు వీలుగా ఇటీవల ప్రభుత్వం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం చేపట్టింది. దీనిలో వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య శాఖల అధికారులు, సిబ్బంది, ఆయా విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు పాల్గొనాలంది. వ్యవసాయశాఖ అధికారులు, విశ్వవిద్యాలయం, పరిశోధనఃనా కేంద్రాలు, కృషివిజ్ఞాన కేంద్రాల శాస్త్రవేత్తలు, కళాశాలలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులు పాల్గొంటున్నారు. ఉద్యానవనాలు, పాడి, చేపల పెంపకం, పశువైద్య సమస్యలపైనా శాస్త్రవేత్తలను రైతులు ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయాధికారులు ఈ అంశాన్ని మంత్రి తుమ్మల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఆయా శాఖల అధికారులను, విశ్వవిద్యాలయాల అధికారులను ప్రశ్నించారు. తమకు శాస్త్రవేత్తలు తక్కువగా ఉన్నారని వర్సిటీలు చెప్పగా… ఎంతమంది ఉన్నా హాజరు కావాల్సిందేనని మంత్రి ఆదేశించినట్లు తెలిసింది.

Read More

మామిడిలో భారీగా కార్బైడ్‌ వినియోగం

నాణ్యత పరీక్ష ఫలితాల ఆధారంగా చర్యలు: మంత్రి తుమ్మల

తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా మామిడికాయలను మగ్గబెట్టేందుకు వ్యాపారులు హానికరమైన కార్బైడ్‌తోపాటు మోతాదుకు మించి ఎథిలీన్‌ సాచెట్లను వినియోగిస్తున్నట్లు తేలింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు మార్కెటింగ్‌, ఆహారభద్రత విభాగం అధికారులు మంగళవారం 110 నమూనాలను సేకరించి, నాణ్యత పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. ఈ సందర్భంగా కార్బైడ్‌ ప్యాకెట్లతోపాటు ఎథిలిన్‌ సాచెట్లనూ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని జాంబాగ్‌, గడ్డి అన్నారం, బాటసింగారం, వరంగల్‌, జగిత్యాల తదితర మార్కెట్లలోని వ్యాపారులు తెచ్చిన పండ్లను తనిఖీ చేశారు. పలువురు కార్బైడ్‌ వాడిన పండ్లతో, మరికొందరు ఎథిలీన్‌ సాచెట్లతో దొరికారు. దాంతో అధికారులు వారి వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ”సీజన్‌ ముగిసే వరకు రాష్ట్రవ్యాప్తంగా నిత్యం అన్ని మార్కెట్లతోపాటు పండ్ల విక్రయ ప్రాంతాల్లో మామిడి పండ్లను తనిఖీ చేస్తాం. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే లైసెన్సుల రద్దుతోపాటు కేసులు నమోదు చేస్తాం” అని హెచ్చరించారు.

Read More

క్షీర ధేనువు!

రోజుకు 20 లీటర్ల పాలతో ఒంగోలు ఆవు రికార్డు

ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేటలో రైతు వేగుళ్ల మురళీకృష్ణకు చెందిన ఒంగోలు ఆవు ఒక్క రోజులో 21.19 కిలోల (20.56 లీటర్లు) పాలు ఇచ్చి సరికొత్త రికార్డు సాధించినట్లు కేంద్రీయ పశు నమోదు పథకం ప్రతినిధి డి. రాజేశ్వరరావు తెలిపారు. పథకంలో భాగంగా కేంద్రం ఏర్పాటు చేసిన యాప్‌లో… ఉదయం, సాయంత్రం పాల దిగుబడి వివరాలను నమోదు చేసినట్లు తెలిపారు. ఆవు సోమవారం వరకు రోజుకు 18 కిలోల పాలు ఇచ్చేదని చెప్పారు. మంగళవారం 21.19 కిలోల (ఉదయం 11.52, సాయంత్రం 9.67) పాలు ఇచ్చిందని వివరించారు. ఐదేళ్ల వయసు గల గోవు 2023లో తాడేపల్లిగూడెంలో నిర్వహించిన దేశీయ ఆవు పాల పోటీలో పూటకు 7.17 కిలోలు ఇచ్చి ప్రథమ బహుమతి సాధించిందన్నారు. పోషక విలువల దాణా ఇవ్వడంతో ఈ దిగుబడి సాధ్యమైందని పశువైద్య ఉన్నతాధికారి వెంకటేశ్వరరావు తెలిపారు.

Read More

పోలవరం-బనకచర్లకు త్వరితగతిన అనుమతులు తీసుకోవాలి: చంద్రబాబు

పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు త్వరితగతిన పర్యావరణ అనుమతులు సాధించాలని అధికారులను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గోదావరి వరద జలాలను రాయలసీమకు మళ్లించేలా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు కసరత్తు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ఏర్పాట్లపై జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు ఏయే అనుమతులు కావాలో అవి పొందేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని ఆయన అధికారులకు సూచించారు.

Read More

రైతులే నిజమైన శాస్త్రవేత్తలు : మంత్రి తుమ్మల

రైతులే నిజమైన శాస్త్రవేత్తలని, వారి అనుభవాలతోపాటు వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడులు సాధించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వికారాబాద్‌ జిల్లా ధారూర్‌ మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సేంద్రియ వ్యవసాయానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. పంట నష్టపోయిన రైతులకు పంట బీమా వర్తింపచేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తే నష్టాలుండవన్నారు. రైతు సంక్షేమ కమిషన్‌ ఛైర్మన్‌ కోదండరెడ్డి మాట్లాడుతూ.. భూభారతి చట్టం ద్వారా లక్షలమంది రైతులకు భూహక్కులు కల్పిస్తామన్నారు. కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, వ్యవసాయశాఖ కమిషనర్‌ గోపి, జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి జానయ్య తదితరులు పాల్గొన్నారు.

*మామిడి పక్వానికి కార్బైడ్‌ వాడితే కఠిన చర్యలు*

మామిడికాయలు పండేందుకు హానికర రసాయనం కార్బైడ్‌ వాడితే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వెంటనే రాష్ట్రవ్యాప్తంగా పండ్ల మార్కెట్లలో తనిఖీలు చేపట్టాలని సూచించారు. సోమవారం మామిడి మార్కెట్లపై మార్కెటింగ్‌ డైరెక్టర్‌ సురేంద్రమోహన్‌ ఇతర అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ”ఈ సీజన్‌లో కార్బైడు భారీగా వాడుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఎవరైనా కార్బైడ్‌ను వినియోగిస్తున్నారని తేలితే వారి లైసెన్సులు రద్దు చేస్తాం” అని మంత్రి చెప్పారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం నుంచి మార్కెటింగ్‌ అధికారులు, జీహెచ్‌ఎంసీ ఆహార భద్రత విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ ప్రసాద్‌రావు తదితరులు హైదరాబాద్‌లోని జాంబాగ్‌, బాటసింగారం పండ్ల మార్కెట్లలో తనిఖీలు చేపట్టారు. పలుచోట్ల పండ్లను నాణ్యత పరీక్షల కోసం ప్రయోగశాలలకు పంపారు.

Read More

తడిసిన ప్రతి ధాన్యం గింజా కొంటాం

తేమ 22 శాతం వరకు అనుమతి
తరుగు 5 కేజీలు మించనివ్వం మంత్రి నాదెండ్ల మనోహర్‌ హామీ

రైతులు ఆందోళన చెందవద్దని, వర్షాలకు తడిసిన ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జె. తిమ్మాపురం, జగ్గంపేట మండలం కాట్రావులపల్లి, కాకినాడ గ్రామీణంలోని చీడిగలో సోమవారం మంత్రి పర్యటించి, భారీ వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం కాకినాడ కలెక్టరేట్‌లో కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల జేసీలు, పౌరసరఫరాలు, మార్కెటింగ్‌ శాఖలు, మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. విలేకర్లతో మంత్రి మాట్లాడుతూ ‘పంటను యంత్రాలతో కోస్తుండటం వల్ల తేమ శాతం 16-17 అంటే ఇబ్బంది. 22 శాతం వరకు అనుమతించాలని, తరుగు 5 కేజీల కంటే ఎక్కువ ఉండకూడదని ఆదేశాలిచ్చాం. ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లకు 1:2 బ్యాంకు గ్యారంటీ వెసులు బాటు కల్పించాం. దిగుబడి ఎక్కువగా ఉన్నందున కొనుగోలుకు అదనపు లక్ష్యాలు నిర్దేశించాం. అదనంగా తూర్పుగోదావరిలో 50 వేలు, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో లక్ష, కాకినాడ జిల్లాలో మరో 50 వేల మెట్రిక్‌ టన్నుల సేకరణకు అనుమతిచ్చాం. బాయిల్డ్‌ రైస్‌ వెరైటీ (బొండాలు రకం) జాప్యం లేకుండా కొనుగోలు చేస్తారు. వర్షాలకు నష్టంపై అంచనాలు వేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించాం’ అని వివరించారు.

Read More

కౌలు రైతులకూ సుఖీభవ

అటవీ భూ హక్కుదారులకూ వర్తింపు
20వ తేదీలోగా అర్హుల జాబితాలు సిద్ధం చేయాలన్న ప్రభుత్వం

సొంత భూమి ఉన్న రైతులే కాదు, కౌలు రైతులకూ ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద సాయం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో రైతు కుటుంబానికి 3 విడతల్లో రూ.20 వేల చొప్పున అందజేయనుంది. ‘పీఎం కిసాన్‌’ కింద ఇచ్చే రూ.6 వేలతో కలిపి ఈ మొత్తాన్ని జమ చేయనుంది. అటవీ భూములపై హక్కు కలిగిన (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) వారినీ అర్హులుగా గుర్తించనుంది. వ్యవసాయ, ఉద్యాన, పట్టు సహాయకులతోపాటు తహసీల్దారు, మండల వ్యవసాయాధికారి తమ పరిధిలోని రైతుల వివరాలను పరిశీలించి, ధ్రువీకరించిన అర్హుల జాబితాలను ఈ నెల 20 టికి లోగా ‘అన్నదాత సుఖీభవ’ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని సూచించింది. పథకం అమలుకు సంబంధించి వ్యవసాయశాఖ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది.- భర్త, భార్య, పిల్లలతో కూడిన కుటుంబం యూనిట్‌గా పథకం అమలు చేయనుంది. పిల్లలకు వివాహమైతే వారిని ప్రత్యేక యూనిట్‌గా పరిగణించి సాయం అందిస్తారు. వ్యవసాయ, ఉద్యాన, పట్టుకు సంబంధించిన పంటల సాగుదారులకూ పథకం వర్తిస్తుంది.- ఆర్థికంగా ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి పథకం వర్తించదు. తాజా, మాజీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, శాసనమండలి సభ్యులు, మేయర్లు, జడ్పీ చైర్‌ పర్సన్లు తదితర రాజ్యాంగబద్ధ పదవులు నిర్వహించిన/నిర్వహించే వారు అర్హులు కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, కార్యాలయాలు, శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, స్థానిక సంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన పనిచేసేవారికీ పథకం వర్తించదు. నెలకు రూ.10 వేలు, ఆపైన పెన్షన్‌ తీసుకునే వారూ అర్హులు కారు. మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌, క్లాస్‌- 4, గ్రూప్‌ డి ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చారు.- వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, ఛార్టర్డ్‌ అకౌంటెంట్లు, ఆర్కిటెక్టులు, నమోదైన ఇతర వృత్తి నిపుణులూ అర్హులు కారు. గత సంవత్సరంలో పన్ను చెల్లించిన వారూ పథక ప్రయోజనాలు అందుకోలేరు.- వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర భూములుగా మార్చినా పథకం వర్తించదు.

*సంతృప్తికర స్థాయిలో ‘పీఎం కిసాన్‌’*

‘పీఎం కిసాన్‌ ‘నూ సంతృప్తికర స్థాయిలో అమలు చేసేందుకు వీలుగా జాబితాను నవీకరించాలని కేంద్రం ఆదేశించింది. మే ఆఖరులోగా ఈ జాబితాలనూ సిద్ధం చేయనున్నారు. చనిపోయిన వారి పేర్ల తొలగింపు, భూ రికార్డులకు అనుగుణంగా లబ్ధిదారుల నమోదు, రైతుల ఐడీ నంబర్లు, పెండింగ్‌లో ఉన్న ఆధార్‌, ఈకేవైసీ వివరాలు సరిదిద్దాలి. గిరిజనశాఖతో సమన్వయం చేసుకుంటూ అటవీ హక్కుల చట్టం, ఆదివాసీ గిరిజనుల(పీవీటీజీ) కు సంబంధించి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించింది.

Read More

రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు

కేంద్ర పథకాలకు ఇకపై ఇదే ప్రామాణికం

గుర్తించింది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలలోని భూములు, పంటల వివరాలే కేంద్రానికి అందుతున్నాయి. రైతుల వారీగా పంటల వివరాలు, ఇతరత్రా సమాచారం అందడం లేదు. వ్యవసాయ శాఖ డిజిటలీకరణకు ఇది సమస్యగా మారింది. వీటన్నింటికీ పరిష్కారంగా విశిష్ట గుర్తింపు సంఖ్యతో ప్రత్యేక కార్డులు జారీచేయాలని నిర్ణయించింది. ఇప్పటికే 19 రాష్ట్రాలు కేంద్రంతో ఒప్పందం చేసుకొని నమోదు ప్రక్రియను పూర్తిచేశాయి. తెలంగాణలో వాయిదా పడిన ఈ కార్యక్రమాన్ని సోమవారం నుంచి ‘అగ్రిస్టాక్‌ తెలంగాణ ఫార్మర్‌ రిజిస్ట్రీ’ పేరుతో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండల వ్యవసాయ అధికారులు (ఎంఏవో), వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో)కు శిక్షణ ఇచ్చింది. విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదుకు భూయాజమాన్య పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్‌, ఫోన్‌ నంబర్‌తో ఎంఏవో లేదా ఏఈవో వద్ద నమోదు చేసుకోవాలి. అనంతరం లబ్దిదారుకు ఓటీపీ వస్తుంది. దాని ధ్రువీకరణ ద్వారా విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు. ఈ సంఖ్యను కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు అనుసంధానం చేస్తారు. పీఎం కిసాన్‌లో తదుపరి విడత నిధుల విడుదలకు దీనినే ప్రామాణికంగా తీసుకుంటామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది.*రాష్ట్రంలో పథకాలకు సంబంధం లేదు* రైతుల విశిష్ట సంఖ్యకు.. రాష్ట్రంలో అమలయ్యే రైతుభరోసా, రుణమాఫీ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫార్మర్‌ రిజిస్ట్రీలో నమోదు.. రాష్ట్రంలో చట్టబద్ధ భూయాజమాన్య హక్కు కల్పించదని, రెవెన్యూశాఖ వద్ద ఉన్న భూ యాజమాన్య వివరాలే ప్రామాణికంగా ఉంటాయని వ్యవసాయశాఖ పేర్కొంది.

Read More