కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పాడిపశువులకు జాతీయ ఉచిత కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని అమలుచేయాలని నిర్ణయించింది. దీని కింద శుక్రవారం నుంచి రాష్ట్రంలోని 20 లక్షల పాడిపశువులకు కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్లు వేస్తామని రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ ముఖ్యకార్యనిర్వహణ అధికారి సి. హెచ్. మల్లీశ్వరి తెలిపారు. గతంలో కృత్రిమ గర్భధారణకు రుసుములు వసూలు చేసేవారని, కేంద్ర కార్యక్రమం ద్వారా పాడిరైతులు ఇప్పుడు ఉచిత సేవలు పొందవచ్చని వివరించారు. దీని కింద రైతులకు ఆర్థికభారం తగ్గడంతోపాటు మేలు జాతి పశువుల సంతతి అభివృద్ధి చెందుతుందని, పాల దిగుబడి గణనీయంగా పెరుగుతుందన్నారు.

9 May, 2025
