వరంగల్‌ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు

  • మందం, ప్రకాశంతమైన రంగుతో ప్రత్యేకత
  • సౌందర్య సాధనాలు, ఆహార, పానీయాలు, వస్త్ర పరిశ్రమల్లో వినియోగం

వరంగల్‌ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ రిజిస్ట్రీ నుంచి బుధవారం ధృవీకరణ పత్రం అందిందని శ్రీ కొండా లక్ష్మణ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి (వీసీ) దండా రాజిరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా జీఐ గుర్తింపు పొందిన వాటిలో వరంగల్‌ చపాటా మిరప 984వది అని, తెలంగాణ నుంచి నమోదైన వాటిలో అది 18వది అని ఆయన వివరించారు. పలు ప్రత్యేకతలు ఉన్న వరంగల్‌ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు కోసం వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘం, మహబూబాబాద్‌ జిల్లా మల్యాలలోని ఉద్యాన పరిశోధన కేంద్రం, కొండా లక్ష్మణ్‌ వర్సిటీ… జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ రిజిస్ట్రీకి దరఖాస్తులు సమర్పించాయి. వీటిపై అధ్యయనం చేసిన రిజిస్ట్రీ తాజాగా భౌగోళిక గుర్తింపునకు ఆమోద ముద్ర వేస్తూ ధృవీకరణ పత్రాన్ని జారీ చేసింది.

వరంగల్‌ నేలలు, వాతావరణం అనుకూలం
వరంగల్‌ చపాటా మిరపకాయ పండ్లు లావుగా, ప్రకాశంతమైన ఎరుపు రంగులో ఉంటాయి. కొద్దిగా టమాటా ఆకారంలో ఉండే వీటిని ‘టమాటా మిరప కాయ’ అని కూడా పిలుస్తారు. తక్కువ ఘాటుతో రుచికరంగా, శుద్ధికి,ఎగుమతికి అనువువగా ఉంటాయి. పచ్చళ్లకు చపాటా మిర్చి పొడిని అధికంగా వాడుతుంటారు. మిఠాయితో పాటు ఆహార, సౌందర్యసాధనాలు, పానీయాలు, ఔషధ, వస్త్ర పరిశ్రమల్లోనూ చపాటా మిర్చిని రంగుగా ఉపయోగిస్తున్నారు. స్థానిక నేలలు, వాతావరణ అనుకూలతల వల్ల ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే ఈ పంట ఎక్కువగా సాగవుతోంది. ఇక్కడ 20 వేల మందికి పైగా రైతులు ఏటా దాదాపు 7 వేల ఎకరాల్లో 10 వేల టన్నులకు పైగా ఉత్పత్తి చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఈ పంటను 80 సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు. భౌగోళిక గుర్తింపు లభించడం ద్వారా వరంగల్‌ చపాటా మిర్చి పంటకు డిమాండ్‌ పెరిగి ప్రపంచవ్యాప్తంగా విశేష ఖ్యాతి లభించనుందని ఉద్యాన వర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి తెలిపారు. చపాటా మిర్చి సాగు చేసే రైతులకు భౌగోళిక గుర్తింపు ద్వారా ఎన్నో ప్రయోజనాలు దక్కనున్నాయని మల్యాల లోని ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త కె. భాస్కర్‌ వివరించారు. జీఐ కారణంగా చపాటా మిరపకు అంతర్జాతీయ విపణిలో మంచి ధర లభించి రైతుల ఆదాయం పెరగనుందని తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యకక్షుడు రాజ్‌కుమార్‌రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.

Read More

ఆయిల్‌ పాం రైతులకు శుభవార్త – మంత్రి తుమ్మల

ఆయిల్‌ పాం రైతులకు మంచిరోజులు వచ్చాయని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. టన్ను ఆయిల్‌ పాం గెలల ధర రూ. 21000లకి చేరిందని, దీని ద్వారా 64,582 మంది ఆయిల్‌ పాం రైతులకు అదనపు లబ్ధి చేకూరనుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రైతు భరోసా, రైతు రుణమాఫీ వంటి వివిధ పథకాలను రైతులకు అందిచడం ద్వారా వ్యవసాయ మరియు అనుబంధ రంగాలను లాభదాయకంగా మార్చడానికి అన్ని చర్యలు తీసుకుంటుందని, రాష్ట్రంలో పంట మార్పిడి ఆవశ్యకత మరియు వంటనూనెల డిమాండును దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్‌ పామ్‌ సాగును పెద్ద ఎత్తున చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆ సందర్భంగా ఆయన తెలియజేశారు.


రాష్ట్రంలోని (31) జిల్లాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు విస్తరణ చేపట్టేందుకు (14) కంపెనీలకు అనుమతులివ్వడం జరిగిందని, ఇప్పటివరకు సుమారు 2.43 లక్షల ఎకరాలను ఆయిల్‌ పామ్‌ సాగులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఆయిల్‌ పామ్‌ తోటల యాజమాన్యం మరియు అంతర పంటల సాగు కొరకు 45,548 మంది రైతుల ఖాతాలలోకి రు.72 కోట్లను ప్రభుత్వం జమ చేసిందని, రైతులకు అధిక ధరలను అందించి, ఆయిల్‌ పామ్‌ సాగును లాభసాటిగా చేసి కొత్త రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటుందని అన్నారు.


ముడి పామ్‌ ఆయిల్‌ పై దిగుమతి సుంకాన్ని తిరిగి విధించి దేశీయ పామ్‌ ఆయిల్‌ రైతులను ప్రోత్సహించుటకు చర్యలను తీసుకోవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం ద్వారా, కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ముడి పామ్‌ ఆయిల్‌ దిగుమతిపై సుంకాన్ని 27.5%కు పెంచింది. 2023 మార్చిలో టన్ను ఆయిల్‌ పామ్‌ గెలల ధర రూ.14,174/- గా ఉండగా, ఈ నెల టన్ను ఆయిల్‌ పామ్‌ గెలల ధర రూ.21,000/- కు పెరిగిందని అన్నారు. పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని పెద్ద మొత్తంలో రైతులు ముందుకు వచ్చి ఆయిల్‌ పామ్‌ సాగు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు.

Read More

వాట్సప్‌ ద్వారా ధాన్యం విక్రయించిన 16వేల మంది రైతులు: మంత్రి మనోహర్‌

ఆంధ్రప్రదేశ్‌లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ధాన్యం సేకరణపై సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నచ్చిన మిల్లుకు తీసుకెళ్లి రైతులు ధాన్యం విక్రయించుకోవచ్చని చెప్పారు. వాట్సప్‌ ద్వారా కూడా ధాన్యం అమ్ముకునే అవకాశాన్ని కల్పించినట్లు వెల్లడించారు. వాట్సప్‌ ద్వారా 16వేల మంది రైతులు ధాన్యాన్ని విక్రయించినట్లు తెలిపారు. రైతులకు గన్నీ బ్యాగ్స్‌ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.

Read More

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం

కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి ప్రారంభించిన మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

– 12,500 టన్నులతో బయల్దేరిన మొదటి నౌక-

ప్రపంచ మార్కెట్లలో విక్రయాల దిశగా ముందడుగు వేశామన్న మంత్రి

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతి ప్రారంభమైంది. ఏపీలోని కాకినాడ పోర్టు నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం లోడ్‌తో వెళ్లే నౌకను సోమవారం హోప్‌ ఐలాండ్‌ సమీపంలోని ఇన్నర్‌ యాంకర్‌ వద్ద రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ వీసీ జానయ్య, సీపోర్టు అధికారులు పాల్గొన్నారు. లోడింగ్‌ ప్రక్రియను పరిశీలించిన అనంతరం మంత్రి ఉత్తమ్‌ విలేకరులతో మాట్లాడారు. ”తెలంగాణలోని మిగులు ధాన్యాన్ని ప్రపంచ మార్కెట్లలో విక్రయించే దిశగా ముందడుగు వేశాం. వచ్చే వర్షాకాలంలో 150 లక్షల టన్నులు, వేసవిలో 130 లక్షల టన్నులు ఉత్పత్తి అయ్యే అవకాశాలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన కోటా కంటే అధికంగా రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి అవుతోంది. మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలుకు రాష్ట్రం భారీగా నిధులను వెచ్చిస్తోంది. కస్టమ్‌ మిల్లింగ్‌కు అయ్యే వ్యయాన్ని చెల్లించడంలో ఎఫ్‌సీఐ తీవ్ర జాప్యం చేయడం వల్ల ప్రభుత్వంపై వడ్డీల భారం పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అవసరాలకుపోను మిగులు బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయం తీసుకున్నాం. నాణ్యత పరిశీలించి దిగుమతి చేసుకోవడానికి ఫిలిప్పీన్స్‌ ముందుకొచ్చింది. మొత్తం 8 లక్షల టన్నుల ఐఆర్‌ 64/1010 రకం బియ్యం ఎగుమతికి ఫిలిప్పీన్స్‌తో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు ఒప్పందం కుదిరింది. మొదటి విడతగా లక్ష టన్నులు ఎగుమతి చేస్తున్నాం. రూ.45 కోట్ల విలువైన 12,500 టన్నులతో మొదటి నౌక బయల్దేరింది. రైతులకు మేలు చేయడానికి ఆఫ్రికాతోపాటు ఆగ్నేయాసియాలోని పలు దేశాలతో మార్కెటింగ్‌ ఒప్పందాలు చేసుకుంటాం. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. తెలంగాణ బియ్యం త్వరలో అంతర్జాతీయ మార్కెట్లలో బలమైన స్థానాన్ని పొందుతుందని విశ్వసిస్తున్నాం. రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడంతో పాటు రాష్ట్ర ఆర్థిక భారాన్ని తగ్గించే కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది” అని ఉత్తమ్‌ తెలిపారు.

Read More

బాపట్ల జిల్లాలో రూ. 88 కోట్లతో ఆక్వా పార్కు

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలంలోని పరిశవారిపాలెం (దిండి) వద్ద రూ. 88.08 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా పార్కు పనులకు ప్రభుత్వం గురువారం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేంద్ర ప్రభుత్వం రూ. 52.85 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 35.23 కోట్లు చొప్పున భరిస్తాయి. ఇందులో రూ. 25.79 కోట్లతో చేపల విభాగం, రూ. 18.58 కోట్లతో రొయ్యల విభాగం, రూ. 13.78 కోట్లతో సీఫుడ్‌ పార్కు, రూ. 9.88 కోట్లతో పీతల విభాగం, రూ. 6.72 కోట్లతో సీ వీడ్‌ పార్కు, రూ. 7.23 కోట్లతో ఆర్నమెంటల్‌ ఫిష్‌ టెక్నాలజీ పార్కు ఏర్పాటు చేస్తారు.

Read More

ఆర్గానిక్‌ పసుపు పంట పండించాలి

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచన

ఆర్గానిక్‌ పద్ధతిలో పసుపు పంటను పండించుటకు తగిన చర్యలు తీసుకోవాలని పసుపు బోర్డు సెక్రటరీ శ్రీమతి భవాని శ్రీ, ఐ.ఎ.ఎస్‌ గారికి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. అత్యధిక కుర్క్‌మిన్‌ ఉండే పసుపు విత్తనాన్ని రైతులకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోలని, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా పసుపు పంటను పండించేందుకు రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పసుపు ఆధారిత ఉప ఉత్పత్తులను తయారుచేసే పరిశ్రమలను ప్రోత్సహించాలని మంత్రి తుమ్మల అన్నారు.

Read More

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం

తొలివిడతగా 12,500 టన్నులతో రేపు బయల్దేరనున్న నౌక
కాకినాడ పోర్టుకు మంత్రి ఉత్తమ్‌ వెళ్లే అవకాశం

ఫిలిప్పీన్స్‌కు 8 లక్షల టన్నుల తెలంగాణ బియ్యం ఎగుమతి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా అందులో తొలి విడతగా దాదాపు 12,500 టన్నులు కాకినాడ పోర్టుకు చేరింది. నౌకలో లోడింగ్‌ చేస్తున్నారు. ఫిలిప్పీన్స్‌కు వెళ్లే నౌక ప్రయాణం గురువారం ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ నౌక ప్రయాణాన్ని పౌరస రఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించే అవకాశం ఉంది. ‘ఎంటీయూ 1010’ రకం ముడి బియ్యాన్ని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఎగుమతి చేస్తోంది. బియ్యం అక్కడకు చేరిన 60 రోజుల్లోగా డబ్బులు చెల్లించాలని ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. కొద్దినెలల క్రితం హైదరాబాద్‌లో జరిగిన సదస్సుకు వచ్చిన ఫిలిప్పీన్స్‌ అధికారులు ఇక్కడి బియ్యం నాణ్యతను పరిశీలించారు. నచ్చడంతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌తో చర్చించి ఒప్పందం కుదుర్చుకున్నారు. మరో రెండు దేశాలకు కూడా బియ్యం ఎగుమతిపై పౌరసరఫరాల సంస్థ దృష్టి పెట్టింది. డీఎస్‌ చౌహాన్‌ ఇప్పటికే సంప్రదింపులు మొదలు పెట్టారు. ఆ ప్రక్రియ త్వరలో కొలిక్కి రానుందని సమాచారం. ఆ దేశాల పేర్లను పౌరసరఫరాలశాఖ వెల్లడించడం లేదు.

Read More

పీఎం కిసాన్‌తో ఏపీలో 41 లక్షల మందికి లబ్ధి

పీఎం కిసాన్‌ కింద 19వ విడత (2024 డిసెంబరు-మార్చి 2025) నిధుల విడుదలలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు రూ.854.28 కోట్లు ఇచ్చామని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ చెప్పారు. దీనివల్ల ఏపీలో 41,27,619 మంది రైతులు లబ్ధి పొందారని వివరించారు. లోక్‌సభలో ఎంపీ బెన్నీ బెహనన్‌ మంగళవారం అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు.

Read More

ప్రపంచం అసూయపడే స్థాయికి అరకు కాఫీని తీసుకెళ్తాం

కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌

పార్లమెంటులో స్టాళ్ల ప్రారంభం

గిరిజనులు పండించే అరకు కాఫీ బ్రాండ్‌ను విస్తృత పరచడానికి పార్లమెంటు ఆవరణలో రెండు స్టాళ్లను గిరిజన సహకార సంఘం సోమవారం ప్రారంభించింది. కూటమి ఎంపీల విజ్ఞప్తి మేరకు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అనుమతి ఇవ్వగా లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల క్యాంటీన్లలో.. కేంద్ర వాణిజ్య శాఖామంత్రి పీయూష్‌ గోయల్‌, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్‌రిజిజు, గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయెల్‌ ఓరం, పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు స్టాళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ… భౌగోళిక ప్రత్యేక గుర్తింపు ఉన్న అరకు కాఫీ బ్రాండ్‌ను ప్రోత్సహించడానికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న చొరవను అభినందించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాలు.. అరకు కాఫీని అత్యంత ప్రాధాన్య ఉత్పత్తిగా ప్రపంచం అసూయపడేలా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాయని చెప్పారు. జుయెల్‌ ఓరం మాట్లాడుతూ.. అరకులోయలో కాఫీ పెంపకం వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ప్రారంభించామన్నారు. అప్పట్లో ఇందుకోసం రూ. 200 కోట్లు ఇచ్చినట్లు గుర్తుచేశారు. కిరణ్‌ రిజిజు మాట్లాడుతూ…. ‘గిరిజనులు అంకితభావంతో పండించిన సుసంపన్నమైన కాఫీని ఇక్కడ విక్రయించడం గర్వకారణం. ఇది గిరిజనుల సాధికారత, స్వావలంబనకు నిదర్శనం’ అని అన్నారు.

*చంద్రబాబు ప్రయత్నాల వల్లే…*

రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ…సీఎం చంద్రబాబు చేపట్టిన విస్తృత కార్యక్రమాల వల్ల అరకు కాఫీ ప్రపంచస్థాయి గుర్తింపు పొందిందన్నారు. ఆయన దావోస్‌లోనూ అందరికీ అరకు కాపీని ఇచ్చి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేశారన్నారు.

Read More

అకాలవర్షాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలి

తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాల దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలని ఉద్యాన విశ్వ విద్యాలయం ఉపకులపతి దండా రాజిరెడ్డి సూచించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కూరగాయలు, పండ్లతోటలు, పసుపు తదితర పంటలపై అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. పంట పొలాల్లో నిలిచిన నీటిని 24 గంటల్లోపు బయటకు పంపాలని, టమాటాలకు పగుళ్లు రాకుండా నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.

Read More