ఐఐఆర్ఆర్ 60వ వార్షిక సమావేశంలో ఐకార్ డీజీ మంగీలాల్ జాట్
దేశంలో ప్రధాన పంటగా ఉన్న వరిలో పోషక విలువలను పెంచాలని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) డైరెక్టర్ జనరల్, వ్యవసాయ విద్యాపరిశోధన శాఖ కార్యదర్శి మంగీలాల్ జాట్ సూచించారు. భారత వరి పరిశోధన సంస్థ(ఐఐఆర్ఆర్) ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఆదివారం జరిగిన అఖిల భారత వరి సమన్వయ పరిశోధన ప్రాజెక్టు 60వ వార్షిక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ… ధాన్యం సాగు, ఉత్పత్తిలో ప్రపంచంలో దేశం రెండోస్థానంలో ఉందన్నారు. ఇక్కడ ఏటా బియ్యం మిగులు తేలుతోందని, మధుమేహం వంటివి వస్తాయనే భావనతో అందరూ తినడం లేదన్నారు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత, వ్యవసాయ శాస్త్రాల అభివృద్ధి ట్రస్టు(టాస్) చైర్మన్ ఆర్ఎస్ పరోడా మాట్లాడుతూ.. చైనాలో సగటు వరి దిగుబడి హెక్టారుకు 6 టన్నులు ఉండగా, భారతదేశంలో అది 3.5 టన్నులు మాత్రమేనని, కొత్త వంగడాలు, ఉత్తమ యాజమాన్య పద్ధతులతో ఈ అంతరాన్ని పూరించాలన్నారు. ఐకార్ పంట శాస్త్రాల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డీకే యాదవ్ మాట్లాడుతూ.. దేశంలో సంకర వరి సాగు విస్తీర్ణాన్ని పెంచాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. సమావేశంలో ఐఐఆర్ఆర్ డైరెక్టర్ ఆర్ఎం సుందరం, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఏపీ ఎన్జీ రంగా వర్సిటీ వీసీలు అల్దాస్ జానయ్య, శారదా జయలక్ష్మిదేవి, ఐకార్ శాస్త్రవేత్త ఏకే సింగ్, ఐకార్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఎస్ కె ప్రధాన్, ఫార్చ్యూన్ రైస్ లిమిటెడ్ ఛైర్మన్ అజయ్ భలోటియా, నార్మ్ డీజీ ఆర్సి అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ప్రచురణలను విడుదల చేశారు.ప్రారంభమయ్యాక అక్కడ పదికి పైగా ప్యాక్ హౌస్లను ప్రారంభించాలని ఉద్యానశాఖ భావిస్తోంది.

