మత్స్యశాఖ కమిషనర్‌గా రామశంకర్‌ నాయక్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రామశంకర్‌ నాయక్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన రెండేళ్ల పాటు పదవిలో ఉంటారు. ఇప్పటి వరకు కమిషనర్‌గా వ్యవహరించిన ఐఓఎఫ్‌ఎస్‌ (ఇండియన్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీస్‌ సర్వీస్‌)కు చెందిన డోలా శంకర్‌ మాతృశాఖకు వెళ్లారు.

Read More

పాముకాటుకు చికిత్స అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టండి

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం

పాముకాటు సమస్య దేశమంతటా ప్రబలంగా ఉందని, దీనికి సంబంధించిన చికిత్సను అందుబాటులోకి తీసుకురావడానికి తగిన చర్యలు చేపట్టాలని సోమవారం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాముకాటు చికిత్సలో కీలకమైన యాంటీ (పాలీ)వీనమ్‌ కొరత కారణంగా దేశం గణనీయమైన ప్రజారోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని దాఖలైన పిటిషన్‌ను జస్టిస్‌ బి.ఆర్‌. గవాయ్‌, జస్టిస్‌ ఎస్‌.వి.ఎన్‌ భట్టిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఏటా సుమారు 58,000 పాము కాటు మరణాలు భారత దేశంలో సంభవిస్తున్నాయని, యాంటీవీనమ్‌ కొరత కారణంగా చికిత్స ఆలస్యమై బాధితులు మరణిస్తున్నారని పిటిషనర్‌ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాముకాటు మరణాలను తగ్గించడానికి ప్రజా చైతన్య ప్రచారాలను నిర్వహించాని విజ్ఞప్తి చేశారు. అన్ని వైద్య కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన వైద్యులతో పాముకాటు చికిత్స, సంరక్షణ విభాగాలను ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్‌ సుప్రీంకోర్టును కోరారు. ఈ సమస్యపై కేంద్రంతో పాటు రాష్ట్రాలూ తమ అభిప్రాయాలను తెలియజేయాలని ధర్మాసనం పేర్కొంది. రాష్ట్రాల వైద్య ప్రతినిధులతో సమావేశమై ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని కేంద్రం తరపు న్యాయవాదికి తెలిపింది.
Read More

కలుపు తీసే ‘బ్యాటరీ’ యంత్రం

అన్నదాతల ఇబ్బందులను తొలగించేందుకు బ్యాటరీతో నడిచే కలుపు తీసే యంత్రాన్ని రూపొందించారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనకాపల్లి వ్యవసాయ ఇంజనీరింగ్‌ పాలిటెక్నిక్‌ కళాశాల మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు. ఆ వివరాలను ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్‌ పీవీకే జగన్నాథరావు, డాక్టర్‌ పి. శ్రీదేవి సోమవారం విలేకరులకు వివరించారు. ‘చెరకు సాగులో కలుపు ప్రధాన సమస్య. రెండు పర్యాయాలు కలుపు తీయాలి. ఇందుకు రైతులు ఒకసారికి దాదాపు రూ. 10 వేల చొప్పున ఖర్చు చేస్తున్నారు. కలుపు తీసేందుకు డీజిల్‌, పెట్రోల్‌తో నడిచే వీడర్లు ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. నాలుగు బ్యాటరీలను ఉపయోగించి కలుపు తీసే వీడర్‌ను విద్యార్థులు తయారు చేశారు. దీనిద్వారా ఎకరా భూమిలో కలుపు తీయడానికి మూడు గంటల సమయం పడుతుంది. బ్యాటరీలు ఒక సారి ఛార్జి చేస్తే నాలుగు నుంచి ఐదు గంటలు నడుస్తుంది. సౌరశక్తితోనూ ఛార్జింగ్‌ చేయవచ్చు. ఒక కేవీ సామర్థ్యం కలిగిన ప్యానల్‌ను ఉపయోగిస్తే సరిపోతుంది. ఈ యంత్రం ఖరీదు రూ. 80 వేలు. దీన్ని విద్యార్థులు మణిరత్నం, ప్రశాంతి, అజయ్‌, భాను, రష్మి, జనార్ధన్‌, జహ్నివిరాణి, సాయి సుదర్శిని, లావణ్య తయారు చేశారు’ అని శాస్త్రవేత్తలు వివరించారు.

Read More

గోపాలమిత్రల సేవలు విస్తరించాలి

రాష్ట్ర గోపాలమిత్రల సంఘం అధ్యక్షుడు చెరుకు శ్రీనివాస్‌

తెలంగాణలో గోపాలమిత్రలను పశుసంవర్థక శాఖ పరిధిలోకి చేర్చాలని, నెలకు కనీస వేతనం రూ. 24 వేలు చెల్లించాలని రాష్ట్ర గోపాలమిత్రల సంఘం అధ్యక్షుడు చెరుకు శ్రీనివాస్‌ పశుసంవర్థక శాఖ సంచాలకుడు గోపీని కోరారు. ఇతర నేతలతో కలిసి చెరుకు శ్రీనివాస్‌ గోపీని హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. 1508 మంది గోపాలమిత్రులుగా పశువైద్య సేవలందిస్తున్న తమకు తక్కువ వేతనం ఇస్తున్నారని, శాఖలోని ఆఫీస్‌ సబార్డినేట్‌ ఖాళీలను తమతో భర్తీ చేయాలన్నారు. అనంతరం పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ మల్లీశ్వరిని కలిని వినతిపత్రం సమర్పించారు.

Read More

ఖాళీ స్థలాల్లో గోదాములు నిర్మించండి

గిడ్డంగుల సంస్థకు మంత్రి తుమ్మల ఆదేశాలు

తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఖాళీ స్థలాల్లో కొత్త గోదాములను నిర్మించాలని, ఆహార ఉత్పత్తుల నిల్వ సౌకర్యాలు పెంచాలని గిడ్డంగుల సంస్థ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సచివాలయంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థపై సమీక్ష నిర్వహించారు. సంస్థ ఛైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, ఎండీ కొర్రా లక్ష్మి ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ”ఈ ఏడాది కొత్తగా 30,000 టన్నుల సామర్థ్యాన్ని అందుబాటులోకి తెచ్చాం. మరో 1,03,800 టన్నుల నిల్వ సామర్థ్యంతో 8 ప్రాంతాల్లో కొత్త గిడ్డంగుల నిర్మాణం చేపట్టాం. గోదాముల్లో సరకుల నిల్వ, రవాణా, వాహనాల రాకపోకలపై నిఘా ఏర్పాట్లు ప్రారంభించాం. మార్కెట్లో గిట్టుబాటు ధరలు రాని సందర్భంలో అన్నదాతలు గోదాముల్లో సరకులను నిల్వ చేసుకోవాలి. సన్న, చిన్నకారు రైతులు ధాన్యం, పంట ఉత్పత్తులను నిల్వ చేస్తే వారికి 35 శాతం రాయితీ ఇస్తున్నాం. నిల్వ చేసిన సరకు ద్వారా బ్యాంకులను నుంచి రుణాలు సైతం పొందవచ్చు” అని మంత్రి తెలిపారు.

Read More

ప్రకృతి.. సేంద్రియ వ్యవసాయం పెంచండి

గ్రామాల్లో రైతు ఉత్పత్తిదారులు సంఘాల (ఎఫ్‌పీవో) ఏర్పాటు ద్వారా సేంద్రియ వ్యవసాయం విస్తీర్ణం పెంచాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సేంద్రీయ ఉత్పత్తులు ధ్రువీకరణ సంస్థ చైర్మన్‌ శావల దేవదత్‌ సూచించారు. తిరువూరులో బుధవారం నియోజకవర్గంలోని వ్యవసాయ, ఉద్యాన అధికారులు, గ్రామ సహాయకులకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రస్తుతం 66 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా అందులో 2,300 ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు వస్తున్నాయన్నారు. వచ్చే ఏడాది బడ్జెట్‌లో సేంద్రియ వ్యవసాయానికి నిధులు అధికంగా కేటాయిస్తామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం విస్తీర్ణం పెంచాలన్నారు. డీఏవో విజయకుమారి, ఏడీఏ కెనడి పాల్గొన్నారు.

Read More

ఉద్యాన పంటల సాగును పెంచాలి వ్యవసాయ కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి

ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ కోదండ రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం హైదరాబాద్‌లోని కమిషన్‌ కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సమావేశంలో కమిషన్‌ సభ్యులు కేవీఎన్‌రెడ్డి, రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, భవానీ, ఉద్యాన శాఖ సంచాలకురాలు యాస్మీన్‌ బాషా తదితరులు పాల్గొన్నారు.

Read More

పాడి పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

  • మంత్రి అచ్చెన్నాయుడు

వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఈ నెల 31 వరకు నిర్వహిస్తున్న పశుఆరోగ్య శిబిరాలను సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో కలిసి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరులో ఆయన ప్రారంభించారు. అనంతరం లేగ దూడలకు నట్టల నివారణ మందు వేశారు. ఏపీ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్‌ చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 12,220 గ్రామాల్లో ఈ శిబిరాలు నిర్వహిస్తున్నామని, ఎన్‌ఆర్‌జీఎస్‌ ద్వారా గోకులం షెడ్లు మంజూరు చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో పశుసంవర్ధకశాఖ కార్యదర్శి ఎంఎం నాయక్‌, డైరెక్టర్‌ దామోదర్‌ నాయుడు పాల్గొన్నారు.

Read More

చిరుధాన్యాలకు చిరునామా దక్షిణ భారత్‌ పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న సాగుసంపూర్ణ ఆహార భద్రతకు ఊతం ఎంఎస్‌ స్వామినాథన్‌ పరిశోధన సంస్థ అధ్యయనంలో వెల్లడి

చిరుధాన్యాలకు దక్షిణ భారత రాష్ట్రాలు చిరునామాగా మారుతున్నాయని ఎంఎస్‌ స్వామినాథన్‌ పరిశోధన సంస్థ (ఎంఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్‌) అధ్యయనం వెల్లడించింది. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళలలో వీటి సాగు భారీగా పెరుగుతోందని, వినియోగం విస్తరిస్తోందని పేర్కొంది. నాణ్యమైన విత్తనాలు, యాంత్రీకరణతో కూడిన నవీన సాగు విధానాలు, అధిక దిగుబడులకు అనుకూలతలు, ఆధునాతన శుద్ధి, మెరుగైన మార్కెటింగ్‌ మార్గాలు వీటి సాగు విస్తరణకు దోహదపడుతున్నాయని వివరించింది. ఈ పంటలను ప్రోత్సహిస్తే ఆదాయం 5 రెట్లు పెరుగుతుందని వెల్లడైనట్లు తెలిపింది. తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో సంస్థ అధ్యయనం నిర్వహించి ''చిరుధాన్యాల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం.. దక్షిణ భారత అధ్యయనం నుంచి పాఠాలు'' పేరిట తాజాగా నివేదికను విడుదల చేసింది. 2023 అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ అధ్యయనంలో అలివర్‌కింగ్‌, భారతీయ గణాంకసంస్థ ఆర్ధిక విశ్లేషణ విభాగ ''శాఖాధిపతి మధురస్వామినాథన్‌, ఎంఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్‌ శాస్త్రవేత్త పి. పి.యువరాజ్‌, పోషకాహార శాస్త్రవేత్త డీజే నిత్యల బృందం పాల్గొంది. దేశంలో చిరుధాన్యాల స్థితిగతులు, ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలు, సాగు పునరుజ్జీవం, రైతులకు ఆదాయం పెంపు వంటి అంశాలపై తమ నివేదికను తాజాగా వెల్లడించింది. తమిళనాడులోని నామక్కల్‌ జిల్లాలోని కె.హిల్స్‌ బ్లాక్‌ కేంద్రంలో అధ్యయనాంశాలను వెల్లడించింది. 

స్థితిగతులు ఇలా..
దేశంలో మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి 200 మిలియన్‌ టన్నులు కాగా.. అందులో చిరుధాన్యాల ఉత్పత్తి 20 మిలియన్‌ టన్నుల కంటే తక్కువగా ఉంది. దేశంలో చిరుధాన్యాలకు ప్రస్తుత నికర రాబడి హెక్టారుకు దాదాపు రూ.10,000 మాత్రమే. కందగడ్డను పండించడం ద్వారా హెక్టారుకు రూ.25 వేలు వస్తోంది. వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్‌ గణాంకాలను అనుసరించి ఆహారధాన్యాల ద్వారా వచ్చే ఆదాయం తక్కువ. 2011-15 సంవత్సరాలలో వరికి వెచ్చించిన ఖర్చు కంటే వచ్చిన ఆదాయం 224 శాతం, గోధుమలకు 304 శాతం కాగా, చిరుధాన్యాలకు 100 శాతమే ఉంది.

ఆరోగ్యసిరి ధాన్యాలు
అత్యధిక పోషక విలువలకు చిరుధాన్యాలు పేరు పొందాయి. వాటిలో ప్రొటీన్‌, డైటరీ ఫైబర్‌, సూక్ష్మపోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కరవు నిరోధక పంటలు. తీవ్రమైన ఉష్ణోగ్రతలను తట్టుకోగలవు. వీటిని బంజరుభూముల్లోనూ సాగు చేయవచ్చు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019- 21)లో ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల పెరుగుదల స్థాయి స్వల్పంగా తగ్గింది. బరువు తగ్గుతున్న వారి శాతం 38 నుంచి 36కి, తక్కువ బరువు ఉన్నవారి శాతం 21 నుంచి 19కి తగ్గింది. 6 నుంచి 59 నెలల వయస్సు ఉన్న పిల్లల్లో రక్తహీనత 59 నుంచి 67 శాతానికి పెరిగింది. మహిళల్లో ఊబకాయం 21 నుంచి 24 శాతానికి, పురుషులలో 19 నుంచి 23 శాతానికి హెచ్చింది. ఈ సమస్యలకు చిరుధాన్యాలు పరిష్కారం చూపగలవు. కేంద్ర ప్రభుత్వం 2018 నుంచి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా జొన్న ఆధారిత ఉత్పత్తులను, పాఠశాల విద్యార్థుల మధ్యాహ్న భోజనం పథకంలోనూ ప్రయోగాత్మకంగా చేర్చింది.

కె. హిల్స్‌లో ఏం జరిగింది
చిరుధాన్యాల ఉత్పత్తిలో తమిళనాడు 7వ స్థానంలో ఉంది. మిల్లెట్‌ పంటల ఉత్పత్తిని పునరుద్ధరించడానికి, చెన్నైలోని ఎంఎస్‌ స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ 1990 నుంచి తమిళనాడులోని కె.హిల్స్‌ ప్రాంతంలో సాగును ప్రోత్సహించేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్‌లోని చిరుధాన్యాల పరిశోధన సంస్థ, ఇక్రిశాట్‌ తదితర సంస్థల సహకారంతో వనరుల పరిరక్షణ, సాగు, వినియోగం, వాణిజ్యంపై దృష్టి సారించింది. కొత్త వ్యవసాయ పద్ధతులతో నాణ్యమైన విత్తనాలు, ఆవిష్కరణలు, ఆధునిక శుద్ధి, విలువ ఆధారిత విధానాలపై శిక్షణ ఇచ్చింది. మెరుగైన రకాలతో విత్తన బ్యాంకును ఏర్పాటుచేసింది. పంటల సాగు కోసం ఆధునిక వ్యవసాయ పరికరాలను పంపిణీ చేసింది. ఫలితంగా ఇక్కడ సాగు పెరిగింది.

ఇదీ అధ్యయనం…
కె.హిల్స్‌లో స్వామినాథన్‌ పరిశోధన సంస్థ చేయూతతో జరిగిన మార్పులపై తాజాగా శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. సర్వే ప్రకారం ప్రతి ఇంటికి 0.15 హెక్టార్ల భూమిలో జొన్నలు సాగు చేశారు. హెక్టారుకు 1157 కిలోలు దిగుబడి వచ్చింది చిన్నకమతాలు గల సాగుదారులకు ఆధికాదాయం సమకూరింది. చిరుధాన్యాల సాగుకు హెక్టారుకు రూ.11,644 ఖర్చు కాగా.. రూ. 16,868 ఆదాయం వచ్చింది. 2021-22 నాటికి గ్రామంలో అన్ని కుటుంబాలు నెలకు 9 రోజుల చొప్పున చిరుధాన్యాలను తింటున్నాయి. 46 శాతం మంది సగటున నెలలో ప్రతి మూడు రోజులకోసారి చిరుధాన్యాలను వినియోగిస్తున్నారు. 42 శాతం మంది నెలకు రెండుసార్లు వాటిని భుజిస్తున్నారు. పండించిన చిరుధాన్యాలను శుద్ధి చేయడానికి ప్రత్యేక విధానాలు చేపట్టారు. చిన్న పిండిమిల్లులు అందుబాటులోకి వచ్చాయి. కె. హిల్స్‌ ఆగ్రో డైవర్సిటీ కన్జర్వర్స్‌ ఫెడరేషన్‌ పేరిట 92 గ్రామాల్లోని 109 స్వయం సహాయక సంఘాలు వీటిని నిర్వహిస్తున్నాయి. వాటితో వివిధ ఆహార పదార్థాలను తయారుచేసి ‘కొల్లి హిల్స్‌ నేచురల్‌ ఫుడ్‌ బ్రాండ్‌’ పేరిట తమిళనాడులోని 12 జిల్లాల్లో విక్రయిస్తున్నారు. చిరుధాన్యాల శుద్ధి యంత్రాలను ఉపయోగించడంపై శిక్షణ పొందిన తర్వాత తనకు ఆత్మ విశ్వాసం పెరిగిందని హిల్స్‌లోని ఎట్టడిపరై గ్రామ మహిళ పూంగోడి తెలిపారు. 2020కి ముందు నామక్కల్‌ జిల్లాలో బరువు తక్కువగా ఉన్న పిల్లల నిష్పత్తి 39 శాతం కాగా చిరుధాన్యాల ఉత్పత్తులను భుజించడం వల్ల ఆ నిష్పత్తి 18 శాతానికి తగ్గింది.

నివేదికలో సిఫార్సులు

  • దిగుబడే కాకుండా మిల్లెట్‌ సాగు ద్వారా రాబడిని పెంచడానికి చర్యలు చేపట్టాలి.
  • చిరుదాన్యాల శుద్ధి వల్ల మహిళలకు వంటింట్లో పనిభారం తగ్గుతుంది.
  • రైతు నేతృత్వంలోని మార్కెటింగ్‌ సమాఖ్య వంటి కొత్త సంస్థలను నెలకొల్పాలి.
  • ప్రభుత్వ సంస్థల ‘మధ్య సమన్వయం, భాగ స్వామ్యాలు అవసరం.
  • జాతీయ ఆహార భద్రతాచట్టం కింద ప్రజాపంపిణీ వ్యవస్థ, పాఠశాల భోజనం, ఇతర పోషక కార్యక్రమాల్లో చిరుధాన్యాలను అందించాలి.

చిరుధాన్యాలకు భారీగా ప్రోత్సాహకాలుండాలి
-ప్రొఫెసర్‌ మధుర స్వామినాథన్‌, భారతీయ గణాంక సంస్థ ఆర్థిక విశ్లేషణ విభాగం శాఖాధిపతి
చిరుదాన్యాలు వ్యవసాయ జీవవైవిధ్యాన్ని పరిరక్షిస్తాయి. కొత్త వ్యవసాయ పద్ధతులతో మంచి నాణ్యమైన విత్తనాల లభ్యత ఫలితంగా ఉత్పత్తి పెరిగిందని అధ్యయనం వెల్లడించింది. మెరుగైన శుద్ధి సాంకేతికతలు, విలువ ఆధారిత ఉత్పత్తుల లభ్యత వల్ల చిరుదాన్యాల వినియోగం ఎక్కువగా ఉండటంతో పాటు అధిక ఆదాయాలు కూడా పెరిగాయి. దక్షిణ భారతదేశంలోని ఈ అధ్యయనాన్ని ప్రాతిపదికగా తీసుకొని చిరుధాన్యాల సాగును పెద్దఎత్తున చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. పెంపకందారులకు భారీగా ప్రోత్సాహకాలుండాలి. పరిశోధన, విస్తరణ కార్యక్రమాలకు భారీగా నిధులందించాలి. లాభదాయక ధరలు, నమ్మకమైన మార్కెటింగ్‌ మార్గాలుండాలి. కొత్త సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చిరుధాన్యాల పంటలకు ధర మద్దతు లభించేలా చర్యలుండాలి.

Read More

చేపల వ్యాపారంలో యువ రైతు సంచలనం 26న రాష్ట్రపతి చేతుల మీదుగా సత్కారం!

మహారాష్ట్రకు చెందిన ఓ గిరిజన యువకుడు చేపల వ్యాపారంలో సంచలనం సృష్టిస్తున్నాడు. అతడి విజయాలను మెచ్చిన అధికారులు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న అతడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా సత్కారం అందుకోనున్నారు. అతడే యోహన్‌ అరవింద్‌ గావిత్‌. నందుర్బార్‌ జిల్లా నవాపుర్‌ తాలూకాలోని భావ్రేకు చెందిన అరవింద్‌ ఎనిమిదేళ్ల క్రితం చేపల వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఇందుకోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ప్రభుత్వం నుంచి 60శాతం రాయితీ పొందాడు. ఈ పథకం ద్వారా అతడికి 18 బోనుల ఏర్పాటుకు సుమారు రూ.32.40 లక్షల నిధులు మంజూరయ్యాయి. దీంతో గావిత్‌ తన గ్రామంలోని సరస్సులో చేపల పెంపకం ప్రారంభించాడు. ఈ వ్యాపారం వల్ల ఆర్థికంగా లాభపడ్డాడు. అంతేకాకుండా తన చేపల చెరువులో చేప పిల్లలను పెంచి రైతులకు సరఫరా చేస్తున్నాడు. గావిత్‌ ప్రోత్సాహంతో భావ్రే, సమీప గ్రామాల రైతులు చేపల వ్యాపారం వైపు మొగ్గు చూపి సత్ఫలితాలను సాధిస్తున్నారు. ఇటీవల ఈ ప్రాజెక్టును పరిశీలించిన మహారాష్ట్ర మత్స్యశాఖ అధికారులు దీనిపై కేంద్రానికి నివేదికను సమర్పించారు. అరవింద్‌ గావిత్‌ కృషికి గుర్తింపుగా గణతంత్ర వేడుకల సందర్భంగా దిల్లీలో రాష్ట్రపతి ఆయన్ను సన్మానించనున్నారు.

Read More