వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధికి సహకారంభారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ సంచాలకుడు శ్రీనివాసరావు

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ అభివృద్ధికి అన్నివిధాలా సహకరిస్తామని ఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్‌ఐ) డైరెక్టర్‌ చెరుకుమల్లి శ్రీనివాసరావు తెలిపారు. డైరెక్టర్‌గా నియమితులైన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ఆయన్ను భారత మృత్తికా శాస్త్ర సంఘం హైదరాబాద్‌ చాప్టర్‌ సోమవారం రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ కళాశాలలో సన్మానించింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వర్సిటీ శాస్త్రవేత్తలు నూతన పరిశోధనలతో ముందుకు సాగాలని, విద్యార్థులు ఆవిష్కరణలపై దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని, మృత్తికా శాస్త్రం మరింత కీలకపాత్ర పోషించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌, విస్తరణ సంచాలకుడు యాకాద్రి, పూర్వ ఉపకులపతి డాక్టర్‌ పద్మరాజు, మృత్తికా శాస్త్ర విభాగాధిపతి జయశ్రీ. హైదరాబాద్‌ చాప్టర్‌ ప్రధాన కార్యదర్శి పవన్‌ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వర్సిటీలో యంత్ర ప్రదర్శన
వ్యవసాయ వర్సిటీలో సోమవారం రాష్ట్రస్థాయి వ్యవసాయ యంత్రాల ప్రదర్శన నిర్వహించారు. న్యూమాటిక్‌ ప్లాంటర్‌, రిమోట్‌ ఆపరేటెడ్‌ మల్టీపర్సన్‌ అగ్రికల్చర్‌, ఇతర ఆధునిక యంత్రాలు, వాహనాలను ప్రదర్శించారు. వ్యవసాయ యంత్ర పరికరాల విభాగం ప్రధాన శాస్త్రవేత్త రాజయ్య, వరి పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త దామోదర్‌రాజు, మొక్కజొన్న పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త సుజాత, ఏరువాక తాండూరు కేంద్రం కోఆర్డినేటర్‌ లక్ష్మణ్‌ తదితరులు పాల్గొని వాటి గురించి తెలిపారు.

Read More

రోజూ చిరుధాన్యాలు తినండి: ఏడో భారతీయ సంస్కృతి ఉత్సవంలో డాక్టర్‌ ఖాదర్‌ వలీ

పాశ్చాత్య ఆహారపు అలవాట్లతో అనారోగ్యం పాలై ఆసుపత్రుల పాలు కావొద్దని మిల్లెట్‌ మ్యాన్‌ డాక్టర్‌ ఖాదర్‌ వలీ సూచించారు. ”సామలు, ఊదలు, అరికెలు, కొర్రలు, అండుకొర్రలు వంటి చిరుధాన్యాలు రోజూ రెండు పూటలు తినడం ద్వారా అనారోగ్యాల నుంచి దూరంగా ఉండొచ్చు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా చిరుధాన్యాలు వర్షాభావ ప్రాంతాల్లోనూ పండుతాయి. వరి, గోధుమల సాగుకు నీటి వనరులు ఎక్కువగా అవసరమవడమే కాకుండా… వీటిని పరిమితికి మించి తిన్నవారి శరీరంలోని రక్తంలో క్రమంగా గ్లూకోజ్‌ పెరుగుతుంది. తిండికి, ఆరోగ్యానికి, వ్యవసాయానికి సంబంధం ఉన్నప్పుడు దీనిపై ఎందుకు ఎవరూ అంతగా మాట్లాడటం లేదు. ఏదో ఒకటి తిని మాత్రలు మింగాల్సిన పరిస్థితి రాకూడదంటే రోజూ చిరుధాన్యాలు తీసుకోవాలి. దీంతో ఆరోగ్యకర జీవనం సాగించవచ్చు” అని కర్ణాటకలోని సేడంలో జరుగుతున్న ఏడో భారతీయ సంస్కృతి ఉత్సవంలో డా|| ఖాదర్‌ వలీ పేర్కొన్నారు. ఈ ఉత్సవంలో ఆహార ఆరోగ్య సదస్సును కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఆదివారం ప్రారంభించారు.

Read More

లక్ష ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అమలు లక్ష్యం

  • మంత్రి పయ్యావుల కేశవ్‌
    అనంతపురం జిల్లాలో ఈ ఏడాది లక్ష ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అమలు చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. గురువారం ఉరవకొండలో సూక్ష్మ సేద్య పరికరాల పంపిణీని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు.

Read More

వ్యవసాయ వర్సిటీకి కొత్త రిజిస్ట్రార్‌, డైరెక్టర్‌, డీన్లు!

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్‌, పరిశోధన డైరెక్టర్‌, విస్తరణ సంచాలకుడు, వ్యవసాయ, విద్యార్థుల వ్యవహారాలు, ఇంజినీరింగ్‌, కమ్యూనిటీ సైన్స్లకు డీన్లు, గ్రంథపాలకుడు తదితర పోస్టుల్లో కొత్త అధికారుల నియామకానికి పాలకమండలి ఆమోదం తెలిపింది. గురువారం ఉపకులపతి అల్దాస్‌ జానయ్య అధ్యక్షతన వర్సిటీలో మండలి సమావేశం జరిగింది. ఇప్పటి వరకు ఈ పోస్టుల్లో ఇన్‌ఛార్జ్‌లు ఉండగా.. ఇకపై మూడేళ్ల పదవీకాలంతో అధికారులను నియమించాలని మండలి నిర్ణయించింది. పాలకమండలి ఇదివరకే ఆమోదించిన అధికారుల జాబితాకు ప్రభుత్వ ఆమోదం తీసుకున్న అనంతరం వీసీ అల్దాస్‌ జానయ్య విడుదల చేశారు. రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్‌ డా. జి.ఇ.సిహెచ్‌. విద్యాసాగర్‌ గారిని నియమించారు.

Read More

హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లో ప్రారంభమైన నర్సరీ మేళా

తెలంగాణ ఈవెంట్‌ ఆర్గనైజర్‌ వారు నెక్లెస్‌ రోడ్డులో నిర్వహించిన 17వ గ్రాండ్‌ నర్సరీ మేళా – ఆల్‌ ఇండియాని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. 30 జనవరి నుండి 3 ఫిబ్రవరి వరకు 5 రోజుల పాటు ఇది జరుగనుంది. ఈ నర్సరీ మేళాలో 150 స్టాల్స్‌లలో టెర్రస్‌ గార్డెనింగ్‌, వర్టికల్‌ గార్డెనింగ్‌ మరియు హైడ్రోపోనిక్‌ గార్డెనింగ్‌కు సంబంధించిన పూలమొక్కలు, ఔషధ మొక్కలు, బోన్సాయి మొక్కలు, అలంకరణ మొక్కలు మొదలైన అన్ని రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. మొక్కలను పెంచడానికి కావాల్సిన మెటీరియల్స్‌, ఆర్గానిక్‌ ఎరువులు, ఫెర్టిలైజర్స్‌, టెర్రకోట కుండీలు మొదలైనవి కూడా అందుబాటులో ఉంటాయి. ఈ మేళాలో రూ. 20 నుంచి మొదలుకొని రూ. 2.50 లక్షల వరకు విలువగల మొక్కలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Read More

ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతితో ఇక్రిశాట్‌ నూతన డైరెక్టర్‌ జనరల్‌గా ఇటీవల ఎంపికైన డాక్టర్‌ హిమాన్షు పాఠక్‌ భేటీ

ప్రస్తుతం భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఏఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్‌ హిమాన్షు పాఠక్‌ ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్యను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్‌ హిమాన్షు పాఠక్‌ ఇటీవలనే హైదరాబాదులోని ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా ఎంపికయ్యారు. మార్చిలో బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా హైదరాబాద్‌ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. నూతనంగా భాద్యతలు చేపట్టనున్న డా.పాఠక్‌ను, ఉపకులపతి జానయ్య ఈ సందర్భంగా అభినందించారు. రాబోయే కాలంలో ఇక్రిశాట్‌తో ఉన్న భాగస్వామ్యాన్ని మరింత పటిష్టపరిచి నూనె గింజలు, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఈ పంటల సాగు పెంపొందించేందుకు తగు సాంకేతిక సహాయాన్ని అందించాలని జానయ్య కోరారు. దీనికి డాక్టర్‌ పాఠక్‌ సానుకూలంగా స్పందించారు. తన వంతు సహకారాన్ని తెలంగాణ వ్యవసాయ అభివృద్ధికి అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉపకులపతి జానయ్య,డాక్టర్‌ హిమాన్షు పాఠక్‌లు ఐసిఏఆర్‌ లో ఏ.ఆర్‌.ఎస్‌ లో తాము ఇద్దరూ బ్యాచ్‌మేట్‌ లు కావడం మరియు ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధన స్థానంలో సహ శాస్త్రవేత్తలుగా పని చేసిన వారు కావడంతో కలిసి పని చేసిన ఆనాటి రోజులను,అనుభవాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

Read More

ఆయిల్‌ పాం సాగులో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో ఉంచాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఆయిల్‌ పాం సాగులో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో ఉంచాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. నేడు సచివాలయంలో ఆయిల్‌ పాం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రిగారు.. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ఆయిల్‌ పాం సాగు చేపట్టాలన్నారు. ఈ సంవత్సరంలో 16,729 ఎకరాలలో ఆయిల్‌ పాం సాగు చేపట్టగా, మార్చిలోగా 19,271 ఎకరాలలో ఆయిల్‌ పాం సాగయ్యేటట్టు చర్యలు తీసుకొని, లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ఆయిల్‌ పాం గెలల ధర కూడా పెరిగినందున రైతులను ఆయిల్‌ పాం సాగు వైపు ప్రోత్సహించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టలన్నారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట ఆయిల్‌ పాం ప్రాసెసింగ్‌ యూనిట్‌ జూన్‌ 1 కల్లా పూర్తి చేసి, ఆయిల్‌ పాం గెలల ప్రాసెసింగ్‌ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బీచ్‌పల్లి, కల్లూరు గూడెంలలో ప్రాసెసింగ్‌ ప్యాక్టరీల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ చేపట్టి, పనులు ప్రారంభించాలన్నారు. దీనివలన ఆయిల్‌ పాం సాగు చేపడుతున్న కొత్త జిల్లాలలో రైతులకు ప్రయోజనం చేకూరడంతో పాటు, కొత్త రైతులు ముందకు రావడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అదేవిధంగా సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూములను సంస్థ పేరు మీదకు మార్చుకొని, చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్పోరేట్‌ సంస్థ మాదిరిగా పనిచేసేందుకు కార్పోరేట్‌ మోడల్లో వివిధ విభాగాలకు నిపుణత కలిగిన సిబ్బందిని నియమించుకునేట్టుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

*సహకార విద్యుత్‌ సరఫరా సంఘం లిమిటెడ్‌, సిరిసిల్ల (సెస్‌)*

నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరాను రైతులకు మరియు పవర్‌ లూమ్‌ పరిశ్రమకు అందించాలని సెస్‌ అధికారులను మంత్రి ఆదేశించారు. అదనంగా ట్రాన్స్‌ ఫార్మర్లను అందుబాటులో ఉంచుకొని, సమస్య వచ్చిన వెంటనే మార్చి, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలన్నారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా విద్యుత్‌ రెగ్యులేటరి కమిషన్‌ నియమాల ప్రకారం సంస్థను నడిపించాలన్నారు. సంస్థ సిబ్బంది ప్రజాప్రతినిధులను కలుపుకొని వారి సూచనల మేరకు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలన్నారు.

*చేనేత జౌళి శాఖ*

చేనేత అభయ హస్తము పథకంను ప్రణాళికబద్దంగా అమలు చేయాలన్నారు. ఈ పథకమును త్వరితగతిన అమలు చేయుటకు నేత కార్మికులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని మరమగ్గాల యూనిట్లకు 25 హెచ్‌పి వరకు 50% విద్యుత్‌ సబ్సిడీ అమలు చేయాలని, యారన్‌ డిపో ద్వారా ఆసాములకు మాత్రమే నూలు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఆసాములకు నూలుకు అవసరమగు పెట్టుబడిని బ్యాంకుల ద్వారా అందజేయుటకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. తద్వారా ఆసాములు ఇతరుల మీద ఆధారపడకుండా స్వయంగా నూలు కొనుగోలు చేయడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. యారన్‌ డిపో లో నూలు స్టాకులను పెంచి నూలు కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. జీ.వో.ఎంఎస్‌.నం. 1, తేదీ: 18.03.2024 ప్రకారము ఏ ఏ శాఖలు ఇప్పటిదాకా తమకు కావాల్సిన వస్త్ర ఇండెట్లు టెస్కో కు సమర్పించడం లేదో ఆయా శాఖల మీద చర్యలు తీసుకొనుటకు, చేనేత సహకార సంఘాలకు మరియు పవర్‌ లూమ్‌ సంఘాలకు టెస్కో ద్వారా చెల్లించవలసిన బకాయిలు వెంటనే చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశాలలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీమతి శైలజా రామయ్యర్‌, వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్‌ రావు, సహకారశాఖ డైరెక్టర్‌ ఉదయ్‌ కుమార్‌, హార్టికల్చర్‌ డైరెక్టర్‌ శ్రీమతి యాస్మిన్‌ బాషా ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read More

జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి, ప్రభుత్వానికి వ్యవసాయం అత్యంత ప్రాధాన్యతాంశమని రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. రుణమాఫీ, రైతు భరోసా, రైతు భీమా, వడ్లకు బోనస్‌, 24 గంటల ఉచిత విద్యుత్‌ వంటి ఎన్నో పథకాలని అమలు చేస్తున్నామని వివరించారు. ఏడాదికి వ్యవసాయ రంగానికి సుమారు 50 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని తెలిపారు. ఈరోజు ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఆయన సందర్శించారు. రాజేంద్రనగర్‌ వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో జరిగిన విద్యార్థులతో ఇష్టాగోష్టి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తన సొంత జిల్లాలో నెలకొన్న ఈ విశ్వవిద్యాలయం అంటే తనకెంతో అభిమానం అన్నారు. అలాగే తన జిల్లా పరిధిలోని తాండూర్‌ కందికి భౌగోళిక గుర్తింపు లభించి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించడం సంతోషదాయకం అని స్పీకర్‌ అన్నారు. ఈ గుర్తింపు వెనక పిజేటిఏయు కృషి ఎంతో ఉందన్నారు. సమర్థుడు, మేధావి అయిన ఉపకులపతి ప్రొఫెసర్‌ ఆల్దాస్‌ జానయ్య నేతృత్వంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ ఆకాంక్షించారు. విశ్వవిద్యాలయం భూములు మరియు ఆస్తుల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అందుకు తాను పూర్తిగా సహకరిస్తానన్నారు. విశ్వవిద్యాలయానికి సంబంధించి నిధులు, నియామకాలు, బోధన బోధనేతర సమస్యల గురించి స్థానిక శాసనసభ్యుడు ప్రకాష్‌ గౌడ్‌, ఉపకులపతిని తీసుకొని ముఖ్యమంత్రితో చర్చిస్తామని హామీ ఇచ్చారు. విశ్వవిద్యాలయ సమగ్ర అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. ఉపకులపతిగా నియమితులైన కొన్ని నెలల్లోనే ఆల్దాస్‌ జానయ్య విశ్వవిద్యాలయ అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారని స్థానిక రాజేంద్రనగర్‌ శాసనసభ్యుడు టి. ప్రకాష్‌ గౌడ్‌ అభినందించారు. సవాళ్లను అధిగమిస్తూ విశ్వవిద్యాలయానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు. అందరి సహకారంతో ఈ మధ్యనే విశ్వవిద్యాలయ వజ్రోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని ఉపకులపతి ఆల్దాస్‌ జానయ్య అన్నారు. రైతాంగం, విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది అభివృద్ధి, సంక్షేమం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా విశ్వవిద్యాలయ భూములను పూర్తిగా రక్షిస్తామన్నారు. అన్యాక్రాంతం, ఆక్రమణలకు గురైన భూముల్ని వెనక్కి తీసుకుంటామన్నారు. రైతుల కళ్ళల్లో కొత్త వెలుగులు తీసుకురావడానికి కృషి చేస్తామని ఆల్దాస్‌ జానయ్య వివరించారు. స్కిల్‌ యూనివర్సిటీతో భాగస్వామ్యం కుదుర్చుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయానికి నిధులు పెంచాలని, నియామకాలు చేపట్టాలని, కొత్త వసతి గృహాలు నిర్మించాలని విద్యార్థులు కోరారు. అలాగే పరిశోధనలకి నిధులు అత్యధికంగా కేటాయించాలని, ఖాళీ పోస్టుల్ని భర్తీ చేయాలని, హెల్త్‌ కార్డులు, మెడికల్‌ రియంబర్స్మెంట్‌ నిధులు మంజూరు చేయాలని బోధన, బోధ నేతర సిబ్బంది కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More

వ్యవసాయానికి ఏఐ సాయం!

ఎన్‌ఐఆర్డీలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌కు కేంద్రం బాధ్యతలు

హైదరాబాద్‌లో ఉన్న జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ(ఎన్‌ఐఆర్డీ) లోని ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’కు కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత ప్రాజెక్టుల రూపకల్పన, అమలు, విస్తరణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం అప్పగించింది.కృత్రిమ మేధ: అభివృద్ధి చెందిన పలు దేశాల్లో అన్ని రంగాల్లో కృత్రిమ మేధను వాడుతున్నారు. ప్రకృతి విపత్తులపై రైతులను ముందుగానే అప్రమత్తం చేయడం.. కాలానికి తగిన పంటల సాగు, ఎరువులు, పురుగు మందుల వాడకంలోనూ ఈ సాంకేతికతను వినియోగిస్తున్నారు. అల్గందం వాడకం వల్ల కచ్చితమైన విశ్లేషణ లభిస్తుంది. మెషిన్‌ లెర్నింగ్‌తో పంటల నుంచి కలుపు మొక్కలను తొలగించడానికి ఆకులు పరిమాణం, ఆకారం, రంగును కంప్యూటర్‌ విజన్‌ విశ్లేషిస్తుంది.

*వివిధ దేశాల్లో ఇలా…*

డ్రోన్లు: విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పిచికారీతో పాటు మొక్కల వ్యాధులను గుర్తించడానికి డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి. దిగుబడి అంచనాలు.. గ్రేడింగ్‌: పంట దిగుబడులను తెలుసుకునేందుకు రియల్‌ టైమ్‌లోఏఐ.. అల్గరిదంలను ఉపయోగిస్తుంది. 3డీ మ్యాపింగ్‌, సెన్సర్లు, డ్రోన్ల నుంచి డేటాను విశ్లేషించి కచ్చితమైన దిగుబడిని అంచనా వేస్తుంది. అత్యాధునిక సాంకేతికతతో పంట ఉత్పత్తులను పరిమాణం, రంగు ఆధారంగా గ్రేడింగ్‌ చేయవచ్చు.పంటలకు రక్షణ: దొంగలు, జంతువులు, పకక్షుల నుంచి పంటల రక్షణకు ఏఐ ద్వారా వీడియో సర్వైలెన్స్‌ సిస్టమ్‌.. కంప్యూటర్‌ విజన్‌తో పశువులు, దొంగల ప్రవేశాలను గుర్తించి అప్రమత్తం చేస్తుంది.

*మన దేశంలో ఇప్పుడిప్పుడే..*

కేంద్ర ప్రభుత్వం రూ.2,817 కోట్లతో డిజిటల్‌ అగ్రికల్చర్‌ మిషన్‌ను ఏర్పాటు చేసింది. డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఏఐ, బిగ్‌ డేటా, రిమోట్‌ సెన్సింగ్‌లతో సహా సరికొత్త సాంకేతికతలను ఇందులో పొందుపరిచింది. అన్ని రాష్ట్రాల్లో ఏఐ ప్రాజెక్టుల నిర్వహణకు జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థకు బాధ్యతలు అప్పగించింది. దేశవ్యాప్తంగా డ్రోన్ల వినియోగాన్ని పెంచేందుకు ‘నమో డ్రోన్‌ దీదీ’ పథకం కింద మహిళా సంఘాల ద్వారా 15 వేల డ్రోన్లను మంజూరు చేసింది. దేశంలో ఇప్పటికే ఏఐ సాయంతో తయారు చేసిన ‘కిసాన్‌ సువిధ’ లాంటి యాప్‌లు రైతులకు సేవలందిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, సిస్కో సంస్థలతో ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తగిన సాంకేతికత, మౌలిక వసతులు లేనందున దేశంలో ఏటా పెద్దఎత్తున పంట వృథా అవుతోంది. కృత్రిమమేధ సాయంతో ఆ సమస్యను పరిష్కరించి, దిగుబడినీ పెంచాలన్నది ఈ ఒప్పందం లక్ష్యం. దీనికోసం ఐదు కోట్ల మంది రైతుల సమాచారాన్ని కేంద్రం ఈ సంస్థలకు అందజేసింది. మైక్రోసాఫ్ట్‌ వంద గ్రామాల్లో పని ప్రారంభించగా, అమెజాన్‌ మొబైల్‌ యాప్‌తో రైతులకు మార్గనిర్దేశం చేస్తోంది. ఈ చర్యలను పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన చోట గత ఏడాది 30 శాతం అధిక దిగుబడి సాధించినట్లు ‘నీతి ఆయోగ్‌’ పేర్కొంది.

*ఏఐ విస్తరణకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ సాయం*

కేంద్రం మాకు కీలక బాధ్యతలు అప్పగించింది. దీనిపై ఇటీవలే అన్ని రాష్ట్రాల కార్యదర్శులతో వర్క్‌షాపు ఏర్పాటు చేసి కార్యాచరణ చేపట్టాం. ఏఐ విస్తరణకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ సాయం అందిస్తుంది. విస్తృత పరిశోధనలు చేపట్టడంతోపాటు, అంకురాలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో వినూత్న ప్రాజెక్టులను రూపకల్పన చేసి ప్రయోగాత్మకంగా వాటిని అమలు చేస్తాం.- ఎన్‌ఐఆర్‌డీ డైరెక్టర్‌ జనరల్‌ నరేంద్రకుమార్‌

Read More

విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్‌గా సతీశ్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్‌గా యడ్లపల్లి సతీశ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన విభాగ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనను ఏడాది కాలానికి డిప్యుటేషన్‌పై నియమించింది.

Read More