ఎగుమతులు లేక మిర్చి ధరలు తగ్గుదల

మన దేశం నుంచి మిరప ఎగుమతుల్లో చైనా వాటా 30-35 శాతం మధ్య ఉంటుంది. 2020-21 సంవత్సరంలో 1.80 లక్షల టన్నులు, 2021-22లో 1.91 లక్షల టన్నులు, 2022-23లో 1.58 లక్షల టన్నులు, 2023-24లో 1.80 లక్షల టన్నులు చైనాకు ఎగుమతయ్యాయి. ఈ ఏడాది మరింత తగ్గాయి. ఎగుమతులు లేకపోవడమే మిర్చి ధరల పతనానికి ప్రధాన కారణమని వ్యాపారులు వివరిస్తున్నారు.
ఎగుమతికి అనుకూలమైన మిరప ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోనే లభిస్తుంది. ఇందులో అధిక శాతం చైనాకు ఎగుమతి అవుతుంది. మిరప అనుబంధ ఉత్పత్తులకు ఆశించిన స్థాయిలో ఎగుమతులు లేకపోవడంతో చైనాతోపాటు ఇతర దేశాల వద్ద నిల్వలు తరగడం లేదు. యూరప్‌, అమెరికాల్లో ఆర్థిక ఒడుదొడుకులే దీనికి కారణం. ఘాటు ఉండే మిరపకాయలను చైనాలో పండిస్తుడటంతో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎగుమతి అయ్యే తేజ రకానికి పోటీ వాతావరణం ఏర్పడింది.
బంగ్లాదేశ్‌, శ్రీలంక, సింగపూర్‌లకు ఎగుమతులు ఆశాజనకంగా ఉండటం కొంత ఉపశమనం కలిగిస్తోంది. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌లో పచ్చిమిర్చికి ఎక్కువగా కోయడం, ఎండుమిర్చి నాణ్యత దెబ్బతినడంతో అక్కడి నుంచి మన మార్కెట్‌కు పోటీ లేదు. ఆంధ్రప్రదేశ్‌లోనూ సాధారణ విస్తీర్ణం కంటే సాగు సుమారు 2 లక్షల ఎకరాలు తగ్గింది. ఉత్పత్తి తగ్గితే… ధరలు పెరగొచ్చనే ఆశలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.
గుంటూరు మార్కెట్‌కే…
గుంటూరు మిర్చియార్డుకు సగటున 40-45 వేల బస్తాలు వస్తున్నాయి. గుంటూరు మినహా ఇతర ప్రాంతాల్లో అమ్మకాలు ఆశాజనకంగా లేకపోవడంతో సరకు మొత్తం ఇక్కడికే వస్తోంది. వారం రోజుల నుంచి కొత్త పంట అమ్మకాలు మొదలయ్యాయి. ఎమ్మిగనూరు, నంద్యాల, కర్నూలు, ఆదోని తదితర ప్రాంతాల నుంచి 4-5 వేల బస్తాలు వస్తుండగా, క్వింటాకు గరిష్టంగా రూ. 14 వేల ధర మాత్రమే లభిస్తోంది.

Read More

అన్నదాతకు పెద్దపీట

తొలి ఏడాదిలో రైతుల సంక్షేమానికి రూ. 55 వేల కోట్లు!22.22 లక్షల మంది రైతుల రుణమాఫీకి రూ. 17,870 కోట్లుఉచిత విద్యుత్‌ సబ్సిడకి 10,444 కోట్లుఏడాది పాలనలో వ్యవసాయరంగంపై సీఎంవో ప్రకటన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలి ఏడాదిలో అన్నదాతకు పెద్ద పీట వేసింది. వ్యవసాయరంగంపై ప్రత్యేక దృష్టిసారించిన సర్కారు… రైతుల సంక్షేమానికి సుమారుగా రూ. 55 వేల కోట్లు ఖర్చు చేసింది. కీలకమైన రుణమాఫీతోపాటు రైతుభరోసా, ఉచిత విద్యుత్తు, రైతుబీమా పథకాలకు పెద్దఎత్తున నిధుల కేటాయింపులు చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. తెలంగాణ రైతులను దేశానికే తలమానికంగా నిలపాలనే ఉద్దేశంతో రైతుల సంక్షేమం, అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం తొలి ఏడాదిలోనే భారీగా నిధులు ఖర్చు చేసినట్లు పేర్కొంది. ఏడాదిలో రూ. 54,280 కోట్లతో వివిధ పథకాలను అమలు చేసినట్లు ప్రకటించింది. దేశంలోనే వరి సాగు విస్తీర్ణంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని, 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా గతంలో ఎన్నడూ లేని విధంగా 153 లక్షల టన్నుల దిగుబడి వచ్చిందని పేర్కొంది. ‘దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు ఒకేసారి రూ. 2 లక్షల వరకు పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. కేవలం 27 రోజుల్లోనే దాదాపు 22.22 లక్షల మంది రైతుల కుటుంబాలకు దాదాపు రూ. 17,870 కోట్ల రుణమాఫీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ఇటీవలే వేములవాడ సభలో సీఎం రేవంత్‌ ప్రకటించారు. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తుకు ఈ ఏడాది రూ. 10,444 కోట్లు సబ్సిడీగా చెల్లించినట్లు’ సీఎంవో వెల్లడించింది. ‘ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారం చేపట్టిన తొలి మూడు నెలల్లోనే రైతు భరోసా నిధులను పంపిణీ చేసింది. యాసంగి సాగుకు పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ. 5వేల చొప్పున రైతు భరోసా నిధులను రైతులందరి ఖాతాలో జమ చేసింది. మొత్తం 1,57,51,000 ఎకరాలకు రూ. 7,625 కోట్లు విడుదల చేసింది. మొత్తం 69,86,519 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ నిధులు జమ చేసింది. గతంలో ఎన్నడూ లేనంత వేగంగా రైతు భరోసా నిధులను మే నెల మొదటి వారంలో జమ చేసినట్లు సీఎంవో ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలో రైతుల తరఫున పంటల బీమా ప్రీమియం చెల్లిచేందుకు రూ. 1,300 కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది. రైతు కుటుంబాలు ధీమాగా ఉండేలా రైతు బీమాను అమలు చేసిందని, ఎవరైనా రైతులు ఏ కారణంతో మరణించినా రూ. 5 లక్షల బీమా పరిహారం బాధిత కుటుంబానికి అందిస్తోందని పేర్కొంది. రైతు బీమా పథకం ప్రీమియంగా రూ. 1,455 కోట్లు చెల్లించినట్లు వెల్లడించింది.

Read More

ప్రకృతి వ్యవసాయ విధానాలపై అవగాహన

ప్రకృతి వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి. లక్ష్మీష సంబంధిత అధికారులకు సూచించారు. పర్యావరణానికి మేలు చేయడంతో పాటు, ఆరోగ్యకర జీవనానికి ఉపకరించే స్వచ్ఛమైన పంట ఉత్పత్తులు ప్రకృతి వ్యవసాయం ద్వారా లభిస్తాయన్నారు. ఈ క్రమంలో ప్రకృతి సాగు విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. పత్తి తదితరాల్లో అంతర పంటల సాగు వంటివి చేపట్టి, తక్కువ పెట్టుబడితో… రైతులకు అధిక ఆదాయం లభించేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలోని కలెక్టరేట్‌లో వ్యవసాయ, ఉద్యాన, సూక్ష్మ సేద్య విభాగాల అధికారులతో బుధవారం సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ… వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పొలం పిలుస్తోంది కార్యక్రమాలను ప్రతి మంగళ, బుధవారాల్లో నిర్వహించాలని అదేశించారు. రైతు సేవా కేంద్రాల (ఆర్‌ఎస్‌కే) సిబ్బంది, గ్రామ వ్యవసాయ సహాయకులు క్షేత్ర స్థాయిలో కీలకంగా వ్యవహరించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలన్నారు. వ్యవసాయం, రైతుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని కోరారు. మామిడి, మిర్చి, పామాయిలు తదితర పంటల సాగు, విస్తీర్ణంపై ఆయా శాఖల అధికారులు కలెక్టర్‌కు నివేదించారు. డీఏవో డి.ఎం.ఎఫ్‌. విజయకుమారి, ఉద్యానశాఖ అధికారి పి. బాలాజీ కుమార్‌, ఏపీఎంఐపీ పీడీ పి.ఎం. సుభానీ తదితరులు పాల్గొన్నారు.

Read More

వ్యవసాయ వర్సిటీలు, కళాశాలల ఏర్పాటుకు ఇకపై ఐకార్‌ అనుమతి తప్పనిసరి

దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కళాశాలలను కొత్తగా ప్రారంభించడానికి, తమ ముందస్తు అనుమతి తప్పనిసరి అని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్‌) తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు మంగళవారం లేఖ రాసింది. వ్యవసాయ విద్య నాణ్యత దెబ్బతింటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఐకార్‌ డైరెక్టర్‌ జనరల్‌, వ్యవసాయ పరిశోధన, విద్య కార్యదర్శి హిమాంశు పాఠక్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. ‘ఐకార్‌ తాజా లేఖ నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వ వ్యవసాయ కళాశాలల ప్రాధాన్యాన్ని గుర్తించాలి. ప్రైవేటు కళాశాలల ప్రలోభాలకు గురికావద్దు. నిబంధనల మేరకు కళాశాలలున్నాయో, లేదో తెలుసుకున్నాకే వాటిలో చేరాలి. ఐకార్‌ నిబంధనలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతాను’ అని వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్దాస్‌ జానయ్య తెలిపారు.

Read More

పత్తి కొనుగోళ్లు ఆపొద్దు

సీసీఐ సీఎండీతో కేంద్ర మంత్రి పెమ్మసాని

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పత్తి కొనుగోళ్లు ఆగకూడదని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంథ్రేఖర్‌ స్పష్టం చేశారు. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సీఎండీ లలిత్‌కుమార్‌ గుప్తాను మంగళవారం ఢిల్లీలో పెమ్మసాని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు కలక్కుండా పూర్తి స్థాయిలో కొనుగోళ్లు జరపాలని, తేమ శాతంలోనూ న్యాయం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా లలిత్‌కుమార్‌ మాట్లాడుతూ రైతుల సమస్యలపై 'కాటన్‌ యాలీ' యాప్‌ అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ యాప్‌ ద్వారా పత్తి సేకరణ, ఉత్పత్తి, ఆధార్‌ లింక్‌, బ్యాంక్‌ అకౌంట్‌ అనుసంధానం ద్వారా రైతులకు నగదు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
Read More

దేశంలో కెల్లా నంబర్‌ 1 స్థానంలో మన వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉండాలి- తుమ్మల నాగేశ్వర రావు

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని దేశంలో నెంబర్‌ 1 స్థానంలో నిలబెట్టడానికి అందరూ కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ప్రధానుల చేతుల మీదుగా 60 ఏళ్ల క్రితం ప్రారంభమైన విశ్వవిద్యాలయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. డిసెంబర్‌లో జరగనున్న విశ్వవిద్యాలయం వజ్రోత్సవ ఉత్సవాలు (డైమండ్‌ జూబ్లీ) ఫ్లయర్‌, లోగోలనీ మంత్రి ఈ ఉదయం సైఫాబాద్‌లో ఉన్న విశ్వవిద్యాలయం కమ్యూనిటీ సైన్స్‌ కళాశాలలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ యం. కోదండ రెడ్డి, తెలంగాణ ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ జి. చిన్నారెడ్డి, పిజెటిఏయు ఉపకులపతి ప్రొఫెసర్‌ అల్థాస్‌ జానయ్య, విశ్వవిద్యాలయ అధికారులు, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. దేశంలోనే మన రాష్ట్రం వ్యవసాయ రంగంలో అగ్రగామిగా ఉందనీ, అలాగే విశ్వవిద్యాలయాన్ని నెంబర్‌ 1 స్థానానికి తీసుకెళ్లాలని తుమ్మల సూచించారు. డైమండ్‌ జూబ్లీ ఉత్సవాలని ఉపయోగించుకొని ఈ లక్ష్యాలని సాధించాలన్నారు. ముఖ్యమంత్రికి వ్యవసాయం అత్యంత ప్రాధాన్యత అంశం అని వివరించారు. అందుకే బడ్జెట్‌లో వ్యవసాయానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. ఈ డైమండ్‌ జూబ్లీ ఉత్సవాలు విశ్వవిద్యాలయం భవిష్యత్తుని నిర్ణయించేలా ఉండాలన్నారు. 60 ఏళ్ల విజయాల గురించి సంతృప్తి చెందకుండా భవిష్యత్‌ ప్రణాళికల్ని రూపొందించాలని సూచించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి సలహాలు, ఆదేశాలు తీసుకొని ముందుకెళ్లాలన్నారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లవేళలా తోడుంటుందని అన్నారు. అదేవిధంగా ఈనెల 30న మహబూబ్‌ నగర్‌ లో రైతు సదస్సు ఉండనుందని.. 28 నుంచే ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. రైతులకి ఆచరణలో ఉపయోగపడేలా ఈ ప్రదర్శనలు ఉండాలన్నారు. చిన్నారెడ్డి, కోదండ రెడ్డిలు నిరంతరము రైతులు, వ్యవసాయ రంగాల గురించే మాట్లాడుతారని వారి సేవలను వ్యవసాయ విశ్వవిద్యాలయం పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.
ఏడాదిగా రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవసాయం, రైతుల సంక్షేమానికి అనేక చర్యలు చేపడుతున్నదని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ యం. కోదండ రెడ్డి అన్నారు. ఈ సమయంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం డైమండ్‌ జూబ్లీ ఉత్సవాలు జరగడం సంతోషదాయకమన్నారు. ఈ సందర్భంగా ఈ వేడుకల ద్వారా రాష్ట్ర వ్యవసాయరంగ భవిష్యత్‌కి సంబంధించి వ్యవసాయ విశ్వవిద్యాలయం మంచి సందేశం ఇవ్వాలని ఆయన సూచించారు. 1971-78 ల మధ్య తాను రాజేంద్రనగర్‌ క్యాంపస్‌ లోనే వ్యవసాయ విద్యన్ని అభ్యసించానని ప్లానింగ్‌ బోర్డ్‌ వైస్‌ చైర్మన్‌ జి. చిన్నారెడ్డి తెలిపారు. ఉత్సాహవంతులైన ఉపకులపతి నేతృత్వంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని పునర్నిర్మించాలని సూచించారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈమధ్య ప్రధాని విడుదల చేసిన వంగడాల్లో తెలంగాణవి లేకపోవడం ఆలోచించవలసిన విషయం అని చిన్నారెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 1964 లో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారని పిజెటిఏయు ఉపకులపతి ప్రొఫెసర్‌ అల్థాస్‌ జానయ్య అన్నారు. 1964లో ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి విశ్వవిద్యాలయాన్ని, 1966 లో పరిపాలన భవనాన్ని ప్రధాని ఇందిరా గాంధీ ప్రారంభించారన్నారు. ఇన్నేళ్ళ విశ్వవిద్యాలయ విజయాలు, సేవల్ని స్మరించుకుంటూ వజ్రోత్సవాలని నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా లోగో, ఫ్లయర్‌ లని విడుదల చేశామన్నారు. డిసెంబర్‌ 20, 21 తేదీల్లో ఉత్సవాల్ని నిర్వహించాలని నిర్ణయించామని, భవిష్యత్తులో తేదీలు మారవచ్చని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, యుజిసి చైర్మన్‌, ఐసిఏఆర్‌ డీజీ, ఇక్రిశాట్‌ డీజీ ఇంకా అనేక మంది ప్రముఖులు, మాజీ ఉపకులపతులు, వ్యవసాయ మంత్రులని ఈ వేడుకలకు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. మహబూబ్‌ నగర్‌ వాసి, విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) చైర్మన్‌ శ్రీనివాసులు శెట్టి కూడా ఈ వేడుకలకు హాజరవుతారని అన్నారు.
రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో వ్యవసాయ కళాశాలలను ప్రారంభించడానికి ముందే తమ ముందస్తు అనుమతి ఉండాలని ఐసిఏఆర్‌ ఈ మధ్య అన్ని రాష్ట్రాల చీఫ్‌ సెక్రటరీ లకి లేఖ రాసిందని జానయ్య తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఈ విషయం గురించి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తానన్నారు. ప్రైవేట్‌ కళాశాలల ప్రలోభాలకు గురికావద్దని ఉపకులపతి సూచించారు.

Read More

తుఫాను గండం… వరి రైతులు అప్రమత్తంగా ఉండాలి

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం సోమవారం ఉదయానికి అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడింది. వాయుగుండం ప్రభావంతో బంగాళాఖాతంలో తేమ మేఘాలు ఆవరించాయి. దీంతో ఈనెల 27, 28 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల, ఉత్తరకోస్తాలో చెదురుమదురుగా వర్షాలు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. 29న కోస్తా, రాయలసీమల్లో ఎక్కువ చోట్ల వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మంగళ, బుధవారాల్లో దక్షిణ కోస్తా జిల్లాల్లో గంటకు 50 నుంచి 75 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దక్షిణ కోస్తా జిల్లాల్లో మంగళవారం తరువాత వరికోతలు నిలిపివేయాలని సూచించింది. కోసిన, నూర్చిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని కోరింది. ఉద్యాన తోటల్లో చెట్లు పడిపోకుండా బాదులతో ఊతం అందించాలని, పల్లపు పొలాల్లో నీరు నిలబడకుండా వాతులు చేసుకోవాలని సూచించింది.

Read More

ప్రకృతి సేద్యానికి రూ. 2,481 కోట్లు

రెండేళ్లలో కోటిమంది రైతులకు లబ్ధి
కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం

రైతుల్ని ప్రకృతి సేద్యం వైపు మళ్లించడానికి వీలుగా రాబోయే రెండేళ్లలో రూ. 2,481 కోట్లు ఖర్చు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2025-26 నాటికి సుమారు కోటి మంది రైతులు 7.5 లక్షల హెక్టార్లలో రసాయనాల రహిత సాగును చేపట్టడానికి ఈ నిధులు వెచ్చిస్తారు. భూసార నాణ్యతను, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సోమవారం జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార-ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ విలేకరులకు వెల్లడించారు. సుముఖత వ్యక్తం చేసిన పంచాయతీల పరిధిలో 15,000 క్లస్టర్లు ద్వారా ప్రకృతి సేద్యం జరిగేలా ప్రభుత్వం చూస్తుందని చెప్పారు. 2019-20 నుంచి ప్రయోగాత్మకంగా చేపట్టిన పనులు ఇప్పటికే 10 లక్షల హెక్టార్లకు విస్తరించాయన్నారు.
Read More

మహబూబ్‌నగర్‌లో రైతు సదస్సు

ఈనెల 28, 29, 30 తేదీల్లో తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో నిర్వహించే రైతు పండుగ విజయవంతంగా నిర్వహించడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు కలసి పనిచేయాలని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, దామోదర్‌ రాజనర్సింహ లు అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఈనెల 28,29,30 తేదీలలో నిర్వహించే రైతు సదస్సు ఏర్పాట్లపై నేడు సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహా, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యకక్షులు డాక్టర్‌ చిన్నారెడ్డి, తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ ఎం. కోదండ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్‌, కలెక్టర్లు, ఎస్‌.పి లు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మరే రంగానికి లేని విధంగా వ్యవసాయ రంగానికి అధిక మొత్తం నిధులు కేటాయించిందని, ముఖ్యంగా రైతు రుణమాఫీతో రాష్ట్రంలోని ప్రతీ అసెంబ్లీ నియోజక వర్గంలో కనీసం 20 వేల మంది నుండి 30 వేల మంది రైతులకు లబ్ది చేకూరిందని గుర్తు చేశారు. రైతులకు పెద్ద ఎత్తున చేకూరిన ఈ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు, వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక మార్పులు, ఆదర్శ రైతుల ప్రసంగాలు, ఈ రైతు సదస్సులో ప్రధాన అంశాలుగా ఉంటాయని తెలిపారు. ఈనెల 28 న ఉదయం 10 గంటలకు ఈ రైతు సదస్సు ప్రారంభమవుతుందని, ఈ మొదటి రోజు సదస్సుకు ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాకు చెందిన రైతులు హాజరవుతారని, ఈ ప్రారంభ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా తాను ప్రారంభిస్తానని, ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు హాజరవుతారని తుమ్మల చెప్పారు. రెండోరోజైన 29 న మహబూబ్‌ నగర్‌ జిల్లాయేతర ప్రాంతాలనుండి రైతులు హాజరవుతారని, 30న రాష్ట్రంలోని అన్ని జిల్లాలనుండి కనీసం లక్ష మంది రైతులు ఈ రైతు సదస్సుకు హాజరవుతారని వివరించారు. మొదటి రెండు రోజులు ప్రతీ రోజు 5000 మంది రైతులు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. 30వ తేదీన సదస్సుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.
ఈ మూడు రోజులు రైతు సదస్సు వేదికపై ఆదర్శ రైతులచే ప్రసంగాలు, ఆధునిక వ్యవసాయ విధానాలపై వివరణలు, వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ మత్స్య తదితర రంగాలకు చెందిన ఆదర్శ రైతులచే ప్రసంగాలు, విజయగాధలపై వీడియో ప్రదర్శనలు ఉంటాయని వివరించారు. ఒక్కొక్క పంటకు సంబంధించి ఒక్కొక్క ఆదర్శ రైతును గుర్తించి వారి అనుభవాలు ఈ సదస్సులో వివరిస్తారని మంత్రి తెలిపారు.
ఆధునిక వ్యవసాయ యంత్ర సామాగ్రి, వివిధ రకాల పంట రీతులు, హైబ్రిడ్‌ వంగడాలు, ప్రభుత్వం అమలుచేస్తున్న పలు పథకాలపై ప్రదర్శన స్టాళ్ళను సంబంధిత శాఖలు ఏర్పాటు చేస్తాయని తెలిపారు. ఈ మూడురోజుల కార్యక్రమాలను రాష్ట్రంలోని 560 రైతు వేదికల ద్వారా లైవ్‌ ప్రసారం చేయాలని వ్యవసాయ శాఖా మంత్రి ఆదేశించారు. ఈ రాష్ట్ర స్థాయి సదస్సుకు వాహనాల పార్కింగ్‌, ట్రాఫిక్‌, స్టాళ్ళ ఏర్పాటు, రైతులకు అవగాహన తదితర కార్యక్రమాలు పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు.
ఈ సమీక్ష సమావేశానికి ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కె.దామోధర్‌ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు డా. శ్రీహరి, మేఘా రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీ కృష్ణ, పర్ణీక రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస రాజు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, జిఏడీ కార్యదర్శి రఘునందన్‌, టిజిఎస్‌పిడిసిఎల్‌ సియండి ముషారఫ్‌ అలీ ఫరూఖీ, సమాచార శాఖ స్పెషల్‌ కమీషనర్‌ హరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More

సీటొస్తే… కొలువు గ్యారంటీ!

15 ఏళ్లుగా వంద శాతం ప్రాంగణ నియామకాలు
వ్యవసాయ, అనుబంధ రంగాల్లో సేవలకూ అవకాశం
‘నార్మ్‌’లో పీజీడిప్లొమా కోర్సు

ఇక్కడ సీటొస్తే చాలు.. మంచి వేతనాలతో ఉద్యోగం లభిస్తోంది. కోర్సులో చేరిన విద్యార్థులు కూడా శతశాతం ఉత్తీర్ణత సాధిస్తుంటారు. ఇదీ హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ (నార్మ్‌) ఘనత. ఇక్కడ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ - అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం-ఏబీఎం) కోర్సును పూర్తిచేసినవారు 100% ఉద్యోగాలు పొందుతున్నారు. రెండేళ్ల కోర్సులో మొదటి సంవత్సరం పూర్తవగానే విద్యార్థులకు ప్రాంగణ నియామకాలు ప్రారంభమవుతున్నాయి. ఏఐసీటీఈతో పాటు 'న్యాక్‌' గుర్తింపుపొందిన ఈ వ్యవసాయ అనుబంధ కోర్సుకు మంచి డిమాండ్‌ ఉంది.

వ్యవసాయ పరిశోధనలో మేటిగా…
భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్‌)కి అనుబంధంగా వ్యవసాయ పరిశోధన విద్యా నిర్వహణకు సంబంధించి 1976లో నార్మ్‌ ఏర్పాటయింది. వ్యవసాయ పరిశోధనలో జాతీయ, అంతర్జాతీయ నిపుణుల సామర్థ్యాన్ని పెంపొందించడం.. మెరుగైన సలహాలను అందించడంతో పాటు రైతులు, శాస్త్రవేత్తలతో సహా వివిధ వాటాదారులకు పేటెంట్లు వంటివి లభించేందుకు నార్మ్‌ కృషి చేస్తోంది. వ్యవసాయ, అనుబంధ రంగాలతో పారిశ్రామిక, వ్యాపార రంగాల అధ్యయనాలను సమ్మిళితం చేసి సంబంధిత రంగాల్లో ఉద్యోగాలు పొందేందుకు విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు దోహదపడేలా 2009లో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సును ప్రారంభించింది. 2019 వరకు ఇది పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లామా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ అగ్రికల్చర్‌ (పీజీడీఎంఏ) పేరిట ఉండేది. 2020 నుంచి దాన్ని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ – అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం-ఏబీఎం)గా నిర్వహిస్తున్నారు.

ప్రతిభావంతులకు పట్టం…
బీఎస్సీ వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య, మత్స్య నాలుగేళ్ళ కోర్సులు ఉత్తీర్ణులైన వారు క్యాట్‌, సీమాట్‌ పరీక్షలు రాయాలి. అర్హత సాధించినవారు నార్మ్‌లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకుంటారు. పీజీడీఎం-ఎంబీఎంలో 60 సీట్లు ఉండగా… ఏటా వెయ్యిమందికి పైగా దరఖాస్తు చేస్తున్నారు. ఆయా అభ్యర్థులకు ఎనలిటికల్‌ రైటింగ్‌స్కిల్స్‌ టెస్ట్‌, బృందచర్చలు, మౌఖిక పరీక్షలు నిర్వహించి ప్రతిభ చూపిన వారికే ప్రవేశాలు కల్పిస్తారు. కేంద్రీయ విద్యాసంస్థల మాదిరే రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. ప్రవేశాలు పొందినవారికి ఒక్కో విద్యార్థికి ఒక్కో గది చొప్పున హాస్టల్‌ వసతి ఉంటుంది. విశాలమైన తరగతి గదులుంటాయి. జాతీయ అంతర్జాతీయ వ్యవసాయ, వాణిజ్య ప్రమాణాలకు అనుగుణంగా కరిక్యులం ఉంటుంది. బోధకుల్లో 70% మంది శాస్త్రవేత్తలు, నిపుణులు ఉండగా.. 30% మంది పారిశ్రామికరంగం నుంచి వచ్చి బోధన చేస్తారు. విద్యార్థులకు తరగతి గదుల్లో పాఠాలతో పాటు అసైన్‌మెంట్లు, కేస్‌ స్టడీస్‌, ముఖాముఖి చర్చలు, పారిశ్రామిక ప్రముఖులతో భేటీలు, క్షేత్రస్థాయి పరిశీలనలు వంటివి ఉంటాయి. సెమినార్లు, వర్క్‌షాపులు, సింపోజియాలలోనూ పాల్గొంటారు. వారికి కార్పొరేట్‌ కంపెనీల కోసం కొత్త ప్రాజెక్టుల రూపకల్పనకు అవకాశం కల్పిస్తారు. రెండేళ్ళ కోర్సులో ఆరు ట్రిమిస్టర్లు ఉంటాయి. ఫైనాన్స్‌ బ్యాంకింగ్‌ మేనేజ్‌మెంట్‌, ఇంటర్న్‌షిప్‌, ప్రజెంటేషన్‌ స్కిల్స్‌, సప్లైచెయిన్‌, రాజకీయ, ఆర్థిక తరగతులు వంటివి ఇందులో భాగంగా ఉంటాయి.

  • మూడో ట్రిమిస్టర్‌ నుంచే కంపెనీలు నార్మ్‌కు వచ్చి విద్యార్థులను ఇంటర్న్‌షిప్‌కి ఎంపిక చేసుకుంటున్నాయి. ఐదో ట్రిమిస్టర్‌ లోనూ మళ్లీ కంపెనీలు వచ్చి ఇంటర్న్‌షిప్‌ ఇస్తున్నాయి. అది పూర్తయిన వెంటనే ప్రాంగణ నియామకాలు మొదలవుతున్నాయి. విద్యార్థలకు శిక్షణ ఇచ్చిన కంపెనీలే సగానికి పైగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తుండగా.. మిగిలినవారిని ఇతర కంపెనీలు ఎంపిక చేస్తున్నాయి.
  • వ్యవసాయ, విత్తన, ఎరువులు, పురుగు మందులు, పశువైద్య, మత్స్య, జీవశాస్త్ర, బ్యాంకింగ్‌ ఆర్థిక, బీమా, వాణిజ్య సంస్థలు, గృహోపకరణాలు, అగ్రిటెక్‌ తదితర రంగాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఇంతవరకు నియమితులైనవారికి సగటున రూ. 10.7 లక్షల ప్యాకేజీ ఉంది. గత ఏడాది అత్యధికంగా రూ. 15 లక్షల ప్యాకేజీ వచ్చింది. నార్మ్‌లో ప్రవేశాలు పొందుతున్న విద్యార్థులో 50% మేరకు అమ్మాయిలు ఉంటున్నారు.

సీట్ల సంఖ్య రెట్టింపునకు యోచన
‘మా విద్యార్థులు మెరికలు. 15 ఏళ్లుగా ఇక్కడ చదివిన ప్రతి విద్యార్థి ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం పొందారు. ఈ కోర్సుకు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా సీట్ల సంఖ్యకు 120కి పెంచాలని ఆలోచిస్తున్నాం’ అని నార్మ్‌ ప్రాంగణ నియామకాల సమన్వయకర్త గణేశ్‌కుమార్‌ తెలిపారు. ‘ఈ కోర్సులో చేరిన వారు 15 ఏళ్ళుగా వంథాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. క్రమశిక్షణతో పాటు పర్యావరణ హితమైన వాతావరణంలో తరగతులు సాగుతున్నాయి. ఉద్యోగాలు పొందిన వారు వ్యవసాయ రంగానికి గణనీయమైన సేవలందిస్తున్నారు’ అని చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ అనీజా తెలిపారు.

Read More