పాడి పరిశ్రమకు ప్రోత్సాహంనిధుల కేటాయింపులు రూ.6,190 కోట్లకు పెంపుకేంద్ర మంత్రి మండలి నిర్ణయం

దేశంలో పాల ఉత్పత్తిని పెంచడంతో పాటు పాడి పరిశ్రమకు అవసరమైన ఆధునిక మౌలిక వసతుల కల్పన దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సవరించిన రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌ (ఆర్జీఎం), నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ (ఎన్‌పీడీడీ) పథకాల ద్వారా చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు అదనంగా రూ. 2వేల కోట్ల నిధులను కేటాయించింది. దీంతో ఈ పథకాలకు అందుబాటులోకి వచ్చే నిధులు మొత్తం రూ.6,190 కోట్లకు పెరిగింది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌కు తాజాగా మరో రూ. వెయ్యి కోట్లు కేటాయించింది. దీంతో ఆర్జీఎం కార్యక్రమానికి 15వ ఆర్థిక సంఘం కాలం (2021-22 నుంచి 2025-26 వరకు)లో వెచ్చించే మొత్తం రూ.3,400 కోట్లకు చేరింది. ఎన్‌పీడీడీ కార్యక్రమానికి కూడా అదనంగా రూ. వెయ్యి కోట్ల నిధులను సమకూర్చాలని నిర్ణయించడంతో 15వ ఆర్థిక సంఘం కాలంలో వెచ్చించే మొత్తం రూ.2,790 కోట్లకు చేరింది. పాల సేకరణ, సేకరించిన పాల శుద్ధికి అవసరమైన మౌలిక వసతుల ఆధునికీకరణతో పాటు నాణ్యమైన పాడి పశువుల సంతతి వృద్ధికీ ఈ నిధులను వెచ్చించనున్నారు. దీంతో రైతుల ఆదాయం మరింత పెరుగుతుందని ప్రధాని మోదీ సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు.

Read More

పశు బీమాతో పాడి రెతులకు అండ

ఆంధ్రప్రదేవ్‌ ప్రభుత్వం తాజాగా పశు బీమా నమోదుకు చర్యలు చేపట్టింది. ఇటీవల కాలంలో పశువులు, జీవాలకు పలు రకాల వ్యాధులు సోకడం, ప్రమాదాల వల్ల మృత్యువాత పడటంతో పాడి పోషకులు, జీవాల పెంపకందారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం సూచించిన బీమా చెల్లిస్తే దీని నుంచి ఉపశమనం పొందేందుకు అవకాశం ఉంటోంది. బీమా చెల్లింపులో రాయితీలు కల్పించడం, మూడేళ్ల వరకు బీమా పాలసీ అమలులో ఉండే విధంగా నిబంధనలు తీసుకురావడంతో పలువురు తమ పశువులకు బీమా చేయించేందుకు ముందుకు వస్తున్నారు. పశు బీమా నమోదు ప్రక్రియకు ప్రభుత్వం తగు ఏర్పాట్లు చేసింది. జాతి ఆధారంగా ప్రీమియం చెల్లించేలా చర్యలు తీసుకుంటుంది. ఇందులో ప్రభుత్వం వాటా పోగా రైతులు కొంతమేర చెల్లించాల్సి ఉంది. ఒకసారి ప్రీమియం చెల్లిస్తే మూడేళ్ల వరకు వర్తిస్తోంది.
పరిహారం పొందేందుకు దోహదం
పశు బీమాని రైతులు వినియోగించుకోవాలి. తొలి విడతలో ఆవులు, గేదేలకు అవకాశం కల్పించారు. పశువులకు అనుకోని నష్టం వాటిల్లితే దీని ద్వారా పరిహారం పొందవచ్చు. రైతు సేవా కేంద్రాల్లో పశు సంవర్ధక సిబ్బంది రైతుల నుంచి బీమా చేయిస్తున్నారు.
పశుబీమా (రూ..) ప్రీమియం రాయితీ రైతువాటా
15వేలు 960 786 199
30వేలు 1920 1538 398
35వేలు 2240 1536 729
40వేలు 2560 1536 1060
45వేలు 2880 1536 1392
50వేలు 3200 1536 1723

Read More

రాయితీపై సూక్ష్మ సేద్య పరికరాలుమంత్రి అచ్చెన్నాయుడు

ఉద్యాన పంటలు పండించే జిల్లాలను 7 క్లస్టర్లుగా ఏర్పాటు చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్రం నుంచి మార్గదర్శకాలు వచ్చాక నిధులు ఎన్ని వస్తాయనే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ‘క్లస్టర్లలో ఉద్యాన పంటల ప్రోత్సాహానికి కేంద్ర సాయం అందుతుంది. ధరలను నియంత్రించే వెసులుబాటు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉద్యాన పంటలు 46 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. గడచిన 8 నెలల్లో లక్ష హెక్టార్లకు సూక్ష్మ సేద్య పరికరాలు అందించాం. ఈ ఏడాది నుంచి ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం రాయితీ ఇస్తాం. రాయలసీమ జిల్లాల్లో 10 ఎకరాలు ఉన్న వారికి 90% సబ్సిడీపై ఇస్తాం. సూక్ష్మ సేద్య పరికరాలు, యాంత్రీకరణకు కేంద్రం నుంచి 60% రాయితీ వస్తుంది’ అని తెలిపారు.

Read More

పసుపు పంటకు కేంద్రం మద్దతు ధర ఇవ్వాలి: అన్వేష్‌ రెడ్డి

కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పసుపు పంటకు మద్దతు ధర ఇవ్వాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ అన్వేష్‌ రెడ్డి కోరారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో తాను నిజామాబాద్‌ జిల్లాలో పర్యటించానని.. అక్కడ పసుపులో తేమ శాతం చూసే యంత్రాలు లేవని తెలిపారు.

Read More

చిన్న, సన్నకారు రైతుల్లో పౌష్టికాహారలోపం

వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు

తెలంగాణలోని చిన్న, సన్నకారు రైతులు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని ఆచార్య జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తెలిపారు. విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘మానసిక పోషకాహార నాణ్యతలు, వ్యక్తి వికాసంపై ప్రభావం’ అనే అంశంపై సోమవారం సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ప్రణాళిక విభాగం డైరెక్టర్‌ శశికళ, రిజిస్ట్రార్‌ విద్యాసాగర్‌, కమ్యూనిటీ సైన్స్‌ డీన్‌ విజయలక్ష్మి తదితరులు ప్రసంగించారు. రాష్ట్రంలోని రైతుల్లో 68 శాతం మంది చిన్న, సన్నకారు రైతులేనని, పంటలను పండిస్తూ వారు సొంత ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారని తెలిపారు. అధిక పురుగుమందుల వినియోగం వల్ల పంట సారం దెబ్బతింటోందని, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Read More

అమరావతిలో పురుగుమందులు లేని ఆహారం అందేలా చూస్తాం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు

ఒకసారి దావోస్‌లో మాట్లాడే సమయంలో గ్లోబల్‌ వార్మింగ్‌లో ప్రకృతి వ్యవసాయం కూడా ముఖ్యం అని చర్చ వచ్చింది. ఆ చర్చ సమయంలో ఏం చేయాలని ముందుచూపుతో ఆలోచించి, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్‌ పాలేకర్‌ గారిని పిలిపించి మాట్లాడి శిక్షణా తరగతులు నిర్వహించి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ విజయకుమార్‌ గారిని సిఈఓగా నియమించి, ప్రకృతి వ్యవసాయాన్ని సపోర్టు చేయడం వలన ఇప్పుడు ప్రపంచం మొత్తం మనం అవలంభించే ప్రకృతి వ్యవసాయం చూడటానికి వస్తున్నారు. రాబోయే ఐదు సంవత్సరాలలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసి ప్రపంచానికే ఆదర్శంగా మనం తయారు కాబోతున్నాం. రాబోయే అసెంబ్లీ సమావేశాలలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో పండించిన ఆహారాన్ని అందించాలని చెప్పడం జరిగిందని, అమరావతిలో పురుగు మందులు లేని ఆహారాన్ని అందించేలా చూడటానికి ప్రయత్నిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు అసెంబ్లీలో ఉపన్యసించారు.

Read More

పామాయిల్‌ ధర సమస్య పరిష్కరిస్తాం

వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు

‘ఆయిల్‌ పామ్‌ రైతులకు సరైన ధర రావడంలో ప్రస్తుతం ఉన్న ఇబ్బందులను తొలగిస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో ఆధునిక టెక్నాలజీతో ఎనిమిది ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి. రైతుల సమక్షంలో అక్కడ ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ రేటు (ఓఈఆర్‌) ఎంత ఉందో తనిఖీ చేయిస్తాం. ఎక్కడ ఎక్కువ ఓఈఆర్‌ రేటు వస్తే దానిని పరిగణనలోకి తీసుకుని ధర చెల్లించేలా త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. అంతవరకు అడ్‌హాక్‌గా రైతులందరికీ టన్నుకు రూ. 20,700లు ధర ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం’ అని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. శాసనసభలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో పామాయిల్‌కు మద్దతు ధర అంశంపై ఎమ్మెల్యే ఆర్‌.వి.ఎస్‌. కె.కె.రంగారావు ప్రశ్నించారు. పామాయిల్‌ పంటకు కనీస మద్దతు ధర పెంచే ఆలోచన ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని మంత్రి చెబుతూ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మంచి ధర ఇస్తోందని అన్నారు. పెదవేగిలో పాత ఫ్యాక్టరీ ఉండటం వల్ల అక్కడ రేటు సరిగా గుర్తించకపోవడం వల్ల రైతులు ధర విషయంలో ఇబ్బందులు పడుతున్నారని, ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ‘ఈ ఆయిల్‌ పామ్‌కు కేంద్ర ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ ఇస్తోంది. అది రూ. 17,877గా ఉంది. ఇది స్థిరంగా ఉంటుంది. ఏపీలో టన్నుకు రూ.20,725 ఇస్తున్నాం. అందువల్ల రైతులు ఈ పథకం పరిధిలోకి వెళ్లవద్దని కోరడంతో మనం వెళ్లలేదు. అవసరమైనప్పుడు ఎప్పుడైనా కేంద్ర పథకంలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని మంత్రి వివరించారు.

Read More

నాఫెడ్‌ ద్వారా పసుపు కొనుగోలు చేయాలి

కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్‌కు మంత్రి తుమ్మల లేఖ

భారత వ్యవసాయ సహకార మార్కెటింగ్‌ సమాఖ్య (నాఫెడ్‌) ద్వారా మార్కెట్‌ జోక్య పథకం (ఎంఐఎస్‌) కింద తెలంగాణలో పసుపు పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు బుధవారం ఆయనకు లేఖ రాశారు. మార్చి నెలలో అధిక మొత్తంలో పసుపు పంట మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉన్నందున రైతులు నష్టపోకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు.

Read More

పాఠశాలల్లో కూరగాయల సాగు

ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రతిపాదన
ప్రభుత్వ పాఠశాలల్లో కూరగాయల సాగు, పండ్ల మొక్కల పెంపకం చేపట్టాలని కొండా లక్ష్మణ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనిద్వారా మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన కూరగాయలు, పండ్లు లభ్యం కావడంతో పాటు.. విద్యార్థులకు ఉద్యాన సాగుపై అవగాహన కలుగుతుందని పేర్కొంది. తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా 26,287 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. ఇందులోభాగంగా కూరగాయలు, పండ్ల కొనుగోలుకు ఏటా రూ.100 కోట్ల మేర నిధులు వెచ్చిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా కూరగాయలు, పండ్ల తోటలను సాగుచేస్తోంది.

Read More

వరి కంటే ఆ పంటలే లాభదాయకం

జనరల్‌ నేచర్‌ అధ్యయనంలో వెల్లడి

వరి కంటే చిరుధాన్యాలు, జొన్న, మొక్కజొన్న పంటల సాగు లాభదాయకమని జనరల్‌ నేచర్‌ కమ్యూనికేషన్స్‌ తాజా అధ్యయనంలో వెల్లడైంది. వాతావరణంలో మార్పులు, వర్షాభావం, ఇతర ప్రతికూల పరిస్థితుల్లో వరి ఉత్పత్తి ప్రభావితం అవుతోందని.. ఇది భవిష్యత్తులో ఆహారభద్రతకు సమస్యగా మారే ప్రమాదమున్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచించింది. వరి నుంచి ఇతర పంటలకు మారిన అన్నదాతలు 11% లాభాలు గడించినట్లు అధ్యయనం వెల్లడించింది. వరి, జొన్న, చిరుధాన్యాలు, మొక్కజొన్నలకు సంబంధించిన గణాంకాలను ఇక్రిశాట్‌ నుంచి పొందినట్లు పేర్కొంది. అధ్యయన బృందంలో భారతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, హైదరాబాద్‌లోని ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌ అసోసియేట్‌ ప్రొ. అశ్విని ఛాత్రే తదితరులున్నారు.

Read More