ఆంధ్రప్రదేవ్ ప్రభుత్వం తాజాగా పశు బీమా నమోదుకు చర్యలు చేపట్టింది. ఇటీవల కాలంలో పశువులు, జీవాలకు పలు రకాల వ్యాధులు సోకడం, ప్రమాదాల వల్ల మృత్యువాత పడటంతో పాడి పోషకులు, జీవాల పెంపకందారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం సూచించిన బీమా చెల్లిస్తే దీని నుంచి ఉపశమనం పొందేందుకు అవకాశం ఉంటోంది. బీమా చెల్లింపులో రాయితీలు కల్పించడం, మూడేళ్ల వరకు బీమా పాలసీ అమలులో ఉండే విధంగా నిబంధనలు తీసుకురావడంతో పలువురు తమ పశువులకు బీమా చేయించేందుకు ముందుకు వస్తున్నారు. పశు బీమా నమోదు ప్రక్రియకు ప్రభుత్వం తగు ఏర్పాట్లు చేసింది. జాతి ఆధారంగా ప్రీమియం చెల్లించేలా చర్యలు తీసుకుంటుంది. ఇందులో ప్రభుత్వం వాటా పోగా రైతులు కొంతమేర చెల్లించాల్సి ఉంది. ఒకసారి ప్రీమియం చెల్లిస్తే మూడేళ్ల వరకు వర్తిస్తోంది.
పరిహారం పొందేందుకు దోహదం
పశు బీమాని రైతులు వినియోగించుకోవాలి. తొలి విడతలో ఆవులు, గేదేలకు అవకాశం కల్పించారు. పశువులకు అనుకోని నష్టం వాటిల్లితే దీని ద్వారా పరిహారం పొందవచ్చు. రైతు సేవా కేంద్రాల్లో పశు సంవర్ధక సిబ్బంది రైతుల నుంచి బీమా చేయిస్తున్నారు.
పశుబీమా (రూ..) ప్రీమియం రాయితీ రైతువాటా
15వేలు 960 786 199
30వేలు 1920 1538 398
35వేలు 2240 1536 729
40వేలు 2560 1536 1060
45వేలు 2880 1536 1392
50వేలు 3200 1536 1723

20 Mar, 2025
