కేంద్రమంత్రి శివరాజ్ సింగ్‌కు మంత్రి తుమ్మల లేఖ
భారత వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య (నాఫెడ్) ద్వారా మార్కెట్ జోక్య పథకం (ఎంఐఎస్) కింద తెలంగాణలో పసుపు పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు బుధవారం ఆయనకు లేఖ రాశారు. మార్చి నెలలో అధిక మొత్తంలో పసుపు పంట మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉన్నందున రైతులు నష్టపోకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు.

