ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రతిపాదన
ప్రభుత్వ పాఠశాలల్లో కూరగాయల సాగు, పండ్ల మొక్కల పెంపకం చేపట్టాలని కొండా లక్ష్మణ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనిద్వారా మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన కూరగాయలు, పండ్లు లభ్యం కావడంతో పాటు.. విద్యార్థులకు ఉద్యాన సాగుపై అవగాహన కలుగుతుందని పేర్కొంది. తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా 26,287 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. ఇందులోభాగంగా కూరగాయలు, పండ్ల కొనుగోలుకు ఏటా రూ.100 కోట్ల మేర నిధులు వెచ్చిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా కూరగాయలు, పండ్ల తోటలను సాగుచేస్తోంది.

13 Mar, 2025
