తెలంగాణా రాష్ట్రంలోని ఉద్యాన రైతులకు అధునాతన శాస్త్రీయ సలహాలు, సూచనలు అందించేందుకు గాను అన్ని హాంగులతో కూడిన ఉద్యాన టెక్నాలజీ సమాచార కేంద్రాన్ని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రధాన పరిపాలన కార్యాలయంలో త్వరలోనే ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నామని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ డాక్టర్ డి. రాజిరెడ్డి అన్నారు. ప్రముఖ వ్యవసాయ రంగ నిపుణులు డాక్టర్ దిలీప్ ఉద్యానవర్సిటీని సందర్శించిన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. రైతులకు విస్తరణ సేవలు మరింత బలోపేతం చేసేందుకు ఈ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉద్యాన పంటల్లో డ్రోన్ టెక్నాలజీ పంటల చీడ, పీడల నిఘా, నియంత్రణ తద్వారా దిగుబడి, నాణ్యత పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఉద్యాన పంటల్లో మోడల్ డ్రోన్ వాడకం దేశానికే ఆదర్శంగా ఎదిగేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే ఉద్యాన రంగంలో ఆవిష్కరణల పెంపొందింపు, అంకుర పరిశ్రమల ఏర్పాటుకు ఊతమిచ్ౘ్ేందుకు హార్టీ ఇన్నోవేషన్ సెంటర్ నెలకొల్పుతామని తెలిపారు. ఉద్యాన రంగంలో మొక్కలు నాటడం మొదలుకొని కోత, కోత అనంతరం విలువ జోడింపు వరకు స్టార్టప్‌ల స్థాపనకు మేలైన అవకాశాలు ఉన్నాయని డాక్టర్ దిలీప్ తెలిపారు. రైతులు, విద్యార్థులు, ఔత్సాహికులకు ఇవి బాగా ఉపయోగపడతాయని అన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్టార్ డాక్టర్ భగవాన్, హార్టికల్ౘ్ర్ డీన్ డాక్టర్ జె. చీనా, పరిశోధన సంచాలకులు డాక్టర్ డి. లక్ష్మీనారాయణ, విస్తరణ సంచాలకులు డాక్టర్ సురేష్ కుమార్, కంట్రో…ర్ ఆఫ్ ఎగ్ౙామినేషన్స్ డాక్టర్ ఎన్ శ్రీనివాసన్, కన్సల్టెంట్ డాక్టర్ వీరాంజనేయులు, డాక్టర్ సునందిని, ప్రొఫెసర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

11 Mar, 2026
ఉద్యాన టెక్నాలజీ సమాచార కేంద్రం త్వరలో ఏర్పాటు
#AgricultureInnovation, #agriculturestartups, #agriculturetechnology, #AgricultureUpdates, #AgriStartups, #AgriTech, #DroneAgriculture, #DroneFarming, #FarmerDevelopment, #FarmersNews, #FarmerSupport, #FarmingFuture, #farmingtips, #Horticulture, #HorticultureDevelopment, #horticulturefarmers, #horticultureinnovation, #horticulturetechnology, #horticultureuniversity, #IndianAgriculture, #ModernFarming, #raithunestham news, #SmartFarming, #SustainableFarming, #TelanganaFarmers, #TelanganaHorticulture, agri news, Agriculture, Andhra Pradesh, natural farming, telangana, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
