ఉద్యాన టెక్నాలజీ సమాచార కేంద్రం త్వరలో ఏర్పాటు

తెలంగాణా రాష్ట్రంలోని ఉద్యాన రైతులకు అధునాతన శాస్త్రీయ సలహాలు, సూచనలు అందించేందుకు గాను అన్ని హాంగులతో కూడిన ఉద్యాన టెక్నాలజీ సమాచార కేంద్రాన్ని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రధాన పరిపాలన కార్యాలయంలో త్వరలోనే ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నామని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ డి. రాజిరెడ్డి అన్నారు. ప్రముఖ వ్యవసాయ రంగ నిపుణులు డాక్టర్ దిలీప్ ఉద్యానవర్సిటీని సందర్శించిన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. రైతులకు విస్తరణ సేవలు మరింత బలోపేతం చేసేందుకు ఈ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉద్యాన పంటల్లో డ్రోన్ టెక్నాలజీ పంటల చీడ, పీడల నిఘా, నియంత్రణ తద్వారా దిగుబడి, నాణ్యత పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఉద్యాన పంటల్లో మోడల్ డ్రోన్ వాడకం దేశానికే ఆదర్శంగా ఎదిగేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే ఉద్యాన రంగంలో ఆవిష్కరణల పెంపొందింపు, అంకుర పరిశ్రమల ఏర్పాటుకు ఊతమిచ్ౘ్ేందుకు హార్టీ ఇన్నోవేషన్ సెంటర్ నెలకొల్పుతామని తెలిపారు. ఉద్యాన రంగంలో మొక్కలు నాటడం మొదలుకొని కోత, కోత అనంతరం విలువ జోడింపు వరకు స్టార్టప్‌ల స్థాపనకు మేలైన అవకాశాలు ఉన్నాయని డాక్టర్ దిలీప్ తెలిపారు. రైతులు, విద్యార్థులు, ఔత్సాహికులకు ఇవి బాగా ఉపయోగపడతాయని అన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్టార్ డాక్టర్ భగవాన్, హార్టికల్ౘ్ర్ డీన్ డాక్టర్ జె. చీనా, పరిశోధన సంచాలకులు డాక్టర్ డి. లక్ష్మీనారాయణ, విస్తరణ సంచాలకులు డాక్టర్ సురేష్ కుమార్, కంట్రో…ర్ ఆఫ్ ఎగ్ౙామినేషన్స్ డాక్టర్ ఎన్ శ్రీనివాసన్, కన్సల్‌టెంట్ డాక్టర్ వీరాంజనేయులు, డాక్టర్ సునందిని, ప్రొఫెసర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read More

కేంద్ర విత్తన చట్టంలో తెలంగాణ ఉద్యాన నర్సరీల చట్టాన్ని చేర్చాలి

తెలంగాణ ఉద్యాన నర్సరీల నమోదు (నియంత్రణ) చట్టం-2010ని కేంద్ర విత్తన చట్టం-2025లో చేర్చాలని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖను కోరింది. వర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి నేతృత్వంలో కేంద్ర విత్తనచట్టం ముసాయిదా కోసం రూపొందించిన ప్రతిపాదనలను గురువారం కేంద్రానికి పంపింది. ‘ప్రైవేటు కూరగాయల విత్తనాలు, పండ్ల నర్సరీలను నియంత్రించడంలో తెలంగాణ ఉద్యాన నర్సరీల రిజిస్ట్రేషన్‌ నియంత్రణ చట్టం విజయం సాధించింది. రైతులు ప్రయోజనాల పరిరక్షణతో పాటు లైసెన్సును తనిఖీ చేయడం, నిలిపివేయడం, రద్దు చేసే అధికారాన్ని ఈ చట్టం కల్పించింది. దీనిని నమూనాగా తీసుకొని భారతదేశ ఉద్యాన రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కేంద్ర విత్తన చట్టం రూపొందించాలి’ అని ఉద్యాన వర్సిటీ కేంద్రాన్ని అభ్యర్థించింది.

Read More

40 శాతం సబ్సిడీతో సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం

తెలంగాణ రాష్ట్రంలో 2025-26లో 40 శాతం రాయితీతో సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకాన్ని అమలు చేస్తున్నామని, దీన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర ఉద్యాన సంచాలకురాలు యాస్మీన్‌ బాషా కోరారు. పండ్లు, పూలతోటలు, సుగంధ ద్రవ్యాలు, అల్లం, పసుపు, వెల్లుల్లి, పుట్టగొడుగుల పెంపకానికి ఈ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. ఆసక్తి గల రైతులు స్థానిక ఉద్యాన అధికారులను సంప్రదించాలని కోరారు.

Read More

బాలానగర్‌ సీతాఫలానికి భౌగోళిక గుర్తింపునివ్వాలి!ఉద్యాన వర్సిటీ దరఖాస్తు

దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పాలమూరు బాలానగర్‌ సీతాఫలానికి భౌగోళిక గుర్తింపు ఇవ్వాలని కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం దరఖాస్తు చేసింది. చెన్నైలోని జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ రిజిస్ట్రీ (జీఐఆర్‌) కార్యాలయంలో మూడు రైతు ఉత్పత్తి సంస్థల పేరిట విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త, ప్రాజెక్టు ప్రధాన శాస్త్రవేత్త పిడిగం సైదయ్య, జీఐ ప్రాక్టీషనర్‌ సుభాజిత్‌ సాహాతో కలిసి దరఖాస్తును సమర్పించారు. దీనిపై త్వరలో జీఐఆర్‌ అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరతారు. అభ్యంతరాలేమీ రాని పక్షంలో బాలానగర్‌ సీతాఫలానికి జీఐ గుర్తింపును మంజూరు చేస్తారు.

Read More