ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయదారులు 11.17 లక్షల టన్నుల సేంద్రియ ఎరువులు కొన్నారని, ఇది గతం కంటే 3.5 రెట్లు ఎక్కువని, దేశంలో రైతులు క్రమంగా సేంద్రియ ఎరువుల దిశగా మళ్లుతున్నారని కేంద్రం సోమవారం వెల్లడించింది. దేశంలో చాలినన్ని ఎరువుల నిల్వలు ఉన్నాయని, ఎరువుల అందుబాటు విషయంలో ఎలాంటి సమస్యలూ లేవని స్పష్టం చేసింది. “2026 ఖరీఫ్‌నకు సంబంధించి ఎరువుల అవసరాన్ని వ్యవసాయ శాఖ తిరిగి అంచనా వేసింది. సీజన్‌లో మొత్తం 383.9 లక్షల టన్నుల ఎరువులు అవసరమవుతాయని వ్యవసాయశాఖ నిర్ధారించుకుంది. ప్రస్తుతం దేశంలో 197.56 లక్షల టన్నుల నిల్వలు ఉన్నాయి” అని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ అదనపు కార్యదర్శి అపర్ణా ఎస్ శర్మ వెల్లడించారు.

9 Jun, 2026
