తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్లో సాగయిన శనగ, మినుములు, వేరుసెనగ, పొద్దుతిరుగుడు పంట ఉత్పత్తులను మద్దతు ధరలతో కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని వ్యవసాయమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రమంత్రికి లేఖ రాయడంతో పాటు ఫోన్లో మాట్లాడగా కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ ఈ మేరకు నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. రాష్ట్రం నుంచి 1.25 లక్షల టన్నుల పప్పుధాన్యాలు, నూనెగింజలను కొనాలని. దీనికి సుమారు రూ. 894 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. కేంద్రం ఆమోదం లభించడంతో రాష్ట్రంలో మార్కెఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేపట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.

12 Mar, 2026
