క్వింటాకు 42 వేల రూపాయలు పలికిన ‘సింగిల్ పట్టి’ మిర్చి
తెలంగాణాలోని ములుగు జిల్లా పొట్లాపూర్ గ్రామానికి చెందిన కె. లింగమూర్తి అనే రైతు 7 బస్తాల సింగిల్ పట్టి మిర్చి ఎనుమాముల మార్కెట్‌కు తీసుకురాగా.. క్వింటాకు రూ.42 వేల ధర వచ్చింది. ఈ సీజన్‌లో ఈ స్థాయిలో ధర రావడం ఇదే తొలిసారి అని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఈ రకం మిర్చి తక్కువ కారం ఉండి.. మంచి రంగు ఉంటుందని మార్కెట్ అధికారులు తెలిపారు.




