ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా వివిధ రంగాలపై దీని యొక్క ప్రభావం

తెలంగాణలో యాసంగి పంటలు రైతుల ఆదాయాన్ని పెంచడంలో, ఆహార భద్రతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సీజన్లో వరి, మొక్కజొన్న, శనగ, మినుములు వంటి పంటలను సాగు చేసి రైతులు మంచి దిగుబడులు సాధించవచ్చు. నీటి వనరుల సమర్థ వినియోగం, సరైన పంటల ఎంపిక, శాస్త్రీయ యాజమాన్య పద్ధతుల ద్వారా యాసంగి సాగును మరింత లాభదాయకంగా మార్చుకోవచ్చు. గాలిలో వచ్చే చిన్న మార్పు ప్రపంచ దేశాల వాతావరణాన్ని తలకిందులు చేయగలదనడానికి ఎల్ నినో ఒక ఉదాహరణ. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం వల్ల ఏర్పడే ఈ వాతావరణ చక్రం కేవలం దక్షిణ అమెరికా తీరానికే పరిమితం కాకుండా ఆసియా-ఆఫ్రికా దేశాల రుతుపవనాలను, ముఖ్యంగా భారతీయ వ్యవసాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. వర్షాభావం, కరువు కాటకాలు, తాగునీటి కొరత నుంచి ద్రవ్యోల్బణం వరకు ఎల్నినో సృష్టించే అవకాశం ఉంది.

ఎల్ నినో అంటే
ఎల్ నినో అనేది స్పానిష్ భాషా పదం. దీని అర్థం “చిన్న బాలుడు” లేదా “క్రీస్తు బాలుడు”. దక్షిణ అమెరికాలోని పెరూ దేశ తీర ప్రాంతానికి సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో డిసెంబర్ సమయంలో ఉష్ణోగ్రతల్లో మార్పులు కనిపించడం వల్ల దీనికి ఆ పేరు పెట్టారు. ఇది కేవలం ఒక ప్రాంతీయ పరిణామం కాదు. ఇది ప్రపంచ వాతావరణ వ్యవస్థను, ముఖ్యంగా ఆసియా-ఆఫ్రికా దేశాల రుతుపవనాలను తీవ్రంగా ప్రభావితం చేసే ఒక పెద్ద వాతావరణ చక్రం. దీనిని శాస్త్రీయంగా ఎల్ నినో -సదరన్ ఆసిలేషన్ చక్రంలో భాగంగా పిలుస్తారు.

ఎల్ నినో ఏర్పడే విధానం
ప్రతి 5 లేదా 7 సంవత్సరాలకు ఒకసారి దక్షిణ అమెరికాలోని పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతంలో ఉష్ణ జలరాశి అధికంగా పేరుకుపోవడం వల్ల అక్కడి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ పరిస్థితిని ఎల్ నినో అంటారు. సాధారణంగా తూర్పు నుంచి పడమర వైపు వీచే వాణిజ్య పవనాలు బలహీనపడటంతో వెచ్చని సముద్రజలం తూర్పు పసిఫిక్ వైపు కదులుతుంది. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వాతావరణంపై పడుతుంది.

వర్షాభావం – కరువు
చారిత్రక డేటా ప్రకారం భారతదేశంలో సంభవించిన అనేక కరువు సంవత్సరాలు (ఉదాహరణకు 1972, 1982, 2002, 2009, 2015, 2026) ఎల్నినో సంవత్సరాలతో ముడిపడి ఉన్నాయి. అయితే ఎల్ నినో ఉన్న ప్రతి సంవత్సరంలోనూ కరువు తప్పనిసరిగా వస్తుందని చెప్పలేం; ఇతర వాతావరణ పరిస్థితులూ ప్రభావం చూపుతాయి.

భారతదేశంపై ప్రభావం
నైరుతి రుతుపవనాలు బలహీనపడటం వల్ల ఖరీఫ్ సీజన్లో వరి, పత్తి, వేరుశనగ వంటి పంటల సాగు తగ్గిపోవచ్చు. ఎల్నినో సంవత్సరాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదై తీవ్రమైన వడగాల్పులు, వర్షాభావ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. వర్షాలు తగ్గడంతో రైతులు బోర్లు, బావులపై ఆధారపడటం పెరుగుతుంది. ఫలితంగా భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోవచ్చు.

వ్యవసాయంపై ప్రభావం
పంట దిగుబడులు తగ్గిపోవడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పై ప్రభావం ఉంటుంది. వ్యవసాయ కూలీలకు పనిదినాలు తగ్గి ఉపాధి సమస్య తలెత్తుతుంది. పంటల ఉత్పత్తి తగ్గడం వల్ల రైతుల ఆదాయం పడిపోవచ్చు.

లా నినో
పెరూ తీరానికి పక్కగా వెళ్లే హంబోల్ట్ శీతల ప్రవాహం కారణంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తగ్గి, అధిక పీడన పరిస్థితులు ఏర్పడే దశను లా నినా అంటారు. భారతదేశం వైపు రుతుపవనాలు బలంగా వీచే పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఏర్పడి, సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అయితే ప్రభావం ప్రతి సంవత్సరంలో ఒకేలా ఉండదు.

ఇతర ప్రధాన ప్రభావాలు
ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం
వ్యవసాయోత్పత్తులు తగ్గడం వల్ల ఆహార ధాన్యాల ధరలు విపరీతంగా పెరిగి ద్రవ్యోల్బణం పెరగవచ్చు. ఇది దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

మత్స్య సంపద నాశనం
పెరూ తీరంలో చల్లని నీరు పైకి రాకపోవడం వల్ల ఫైటోప్లాంక్టన్ తగ్గి, చేపల సంతతి ముఖ్యంగా ఆంకోవి చేపలు—తీవ్రంగా ప్రభావితమవుతుంది.

తాగునీరు, విద్యుత్ కొరత
జలాశయాల్లో నీరు అడుగంటిపోవడం వల్ల జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గి, తాగునీటి సమస్యలు తలెత్తవచ్చు.

డా. కె. శేఖర్, అసిస్టెంట్ ప్రోఫెసర్ (అగ్రోనోమి), వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్
డా. రజిని దేవి, అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎకనామిక్స్), వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్
Ph: 9032128124

Read More

ఔషధ మొక్క… నిమ్మగడ్డి

నిమ్మగడ్డి వార్షిక హెర్బల్ మొక్క. ఇది 2 నుండి 4 అ. ఎత్తు పెరుగుతుంది. 2 నుంచి 3 అ. వెడల్పు విస్తరిస్తుంది. ఆకు సువాసనతో, నిత్యహరితంగా ఉంటుంది. ఈ మొక్క అరుదుగా పూస్తుంది. ఆకులు 0.51 అం. వెడల్పు, సుమారు 3 అ. పొడవు ఉండి ఆకు చివర్లు వాలి ఉంటాయి. నిత్యహరిత ఆకులు కాంతివంతమైన నీలిఆకుపచ్చ రంగులో ఉండి నలిపితే నిమ్మ వాసననిస్తాయి. పూలరెమ్మలు 30-60 సెం.మీ. పొడవుంటాయి..

సాధారణ నామం : లెమన్‌గ్రాస్ శాస్త్రీయ నామం : సింబోపోగాన్ సిట్రేటస్ కుటుంబం: పోయేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • అర్ౙెంటైనాలో ఆకు కషాయాన్ని గొంతునొప్పి తగ్గించడానికి లోపలికి తీసుకుంటారు.
  • బ్రెజిల్‌లో ఆకులతో తయారు చేసిన టీని శరీరంలో ఈడ్పులు తగ్గడానికి, బాధ నివృత్తి ఔషధంగా, వాపు తగ్గించడానికి, జ్వరం తగ్గించడానికి, మూత్రం సాఫీగా పారడానికి, ఉద్రేకం తగ్గించడానికి సేవిస్తారు.
  • క్యూబాలో ఎండిన ఆకులను, కాండాన్ని వేడి నీటిలో మరగించిన కషాయాన్ని జలుబు, కీళ్ళవాతం తగ్గించడానికి త్రాగిస్తారు. ఈజిప్టులో ఎండిన ఆకులు, కాండంతో తయారు చేసిన కషాయాన్ని మూత్రపిండాలలో ఈడ్పుని తగ్గించడానికి, మూత్రవర్థకంగా ఉపయోగిస్తారు.
  • భారతదేశంలో మొత్తం తాజా మొక్క పాములను వికర్షిస్తుంది. 2-3 చుక్కలు నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్‌ని వేడినీటిలో కలిపి త్రాగితే గ్యాస్ట్రిక్ సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. కలరా వ్యాధిగ్రస్థులకు నిమ్మరసంలో కొన్ని చుక్కలు నిమ్మగడ్డి నూనెని కలిపి త్రాగిస్తారు. తీవ్ర తలనొప్పి, జ్వరం తగ్గడానికి ఎండిన ఆకుల వేడి నీటి ద్రావణాన్ని స్నానానికి ఉపయోగిస్తారు. కేంద్ర నాడీమండల ఉపశమనానకి నిమ్మగడ్డితో తయారు చేసిన టీని త్రాగుతారు. మలేషియా, ఇండోనేషియాలో మొత్తం మొక్కతో తయారు చేసిన వేడి నీటి ద్రావణాన్ని ఒక రుతు విడుదలను ప్రోత్సహించే ఔషధంగా త్రాగుతారు.
  • థాయ్‌లాండ్‌లో సువాసనకి మొత్తం మొక్కను పీలుస్తారు. ఆకులను ఆకలి పుట్టించు పదార్థంగా తింటారు. ఎండిన మొక్క వేడి నీటి ద్రావణాన్ని ఆకలి పుట్టించడానికి త్రాగుతారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు వేరుతో తయారు చేసిన వేడి నీటి ద్రావణాన్ని త్రాగుతారు.
  • అమెరికాలో మొత్తం మొక్క వేడి నీటి ద్రావణాన్ని గాయాలను మాన్పడానికి, విరిగిన ఎముకల వల్ల కలిగే నొప్పి తగ్గించడానికి ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో

  • నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్, సిట్రాల్ ఈగల లార్వాలను, పెద్ద పురుగులను చంపాయి (పింటో, అతని అనుచరులు, 2015).
  • నిమ్మగడ్డి మొక్కలు దోమలను వికర్షిస్తాయి. సిట్రొనెల్లా ఆయిల్ దోమలను వికర్షిస్తుంది. నిమ్మగడ్డి నూనె చెదలు, పొడినల్లులు, గోమార్లను కీటకనాశక చర్య ద్వారా నివారిస్తుంది. నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్ డెంగూ జ్వరం వ్యాప్తి చేసే దోమలను చంపుతుంది.
  • నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్‌ని వరి ధాన్యం నిల్వ సమయంలో ఆశించే ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్ పెరుగుదలను, అఫ్లాటాక్సిన్ ఉత్పత్తిని నివారించడానికి ఉపయోగించవచ్చు. (పరనగమ, అతని అనుచరులు, 2003).
  • నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్ గొర్రెల నాశించే కెడ్ (గోమారి), మెలోఫాగస్ ఓవినస్‌పై అత్యధిక కీటకనాశక చర్యను ప్రదర్శించింది. దీనిని కెడ్ జీవ నియంత్రణలో శక్తి వంతమైన భాగంగా పరిగణనలోకి తీసుకోవచ్చు. (గెమెడ, అతని అనుచరులు, 2014).
  • నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్‌ని జీవపురుగు మందుగా ఉపయోగించవచ్చు. దీనిని గొంగళిపురుగుల నివారణలో ఉపయోగించారు (శిల అడ్నియాన, అతని అనుచరులు, 2011). నిమ్మ గడ్డి ఎసెన్షియల్ ఆయిల్ (0.5%) 5 నిమిషాలలో గొంగళిపురుగులను పూర్తిగా చంపింది.
  • నిమ్మగడ్డి నూనె కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ పెద్ద పురుగులపై వికర్షక చర్యను ప్రదర్శించింది (పరానగమ, అతని అనుచరులు, 2002).
  • నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్ (1%) క్యాబేజి డైమండ్ బ్యాక్‌మాత్ పురుగుల సంఖ్యను తగ్గించే చర్య కలిగి ఉంది. దీనిని డైమండ్ బ్యాక్‌మాత్ నివారణకు జీవ పురుగు మందుగా సిఫారసు చేశారు. ఇది క్యాబేజి పంటకు ఎటువంటి హాని కల్గించదు (సుదార్త, అతని అనుచరులు, 2013).
  • నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్ మొక్కజొన్న కండెల నిల్వ సమయంలో సైటోఫిలస్ జియామెయిస్ ఆశించకుండా కాపాడింది (కబేర, అతని అనుచరులు, 2011).
  • నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్ ఆస్పర్ౙిల్లస్ నైగర్ పెరగుదల నరికట్టింది (డెబిల్లర్‌బెక్, అతని అనుచరులు, 2001). అంతేగాక నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్ ఆస్పర్ౙిల్లస్ నైగర్ అఫ్లాటాక్సిన్ ఉత్పత్తి చేయకుండా నివారిస్తుంది (హెలాల్, అతని అనుచరులు, 2006, 2007).
  • నిమ్మగడ్డి పేనుబంక, మైజస్ పెర్సికె, పై కీటకనాశక చర్యను ప్రదర్శించింది (స్నీ˜ అండ్ క్లింగాఫ్, 1990).
  • నిమ్మగడ్డి, రోజ్‌మేరి, థైమస్ ఎసెన్షియల్ ఆయిల్, వాటి రసాయన మిశ్రమాలను కలిపి క్యాబేజి సెమిలూపర్, ట్రైకోప్లూసియా ని పై వాటి ప్రభావాన్ని పరీక్షించినపుడు ఈ నూనెలు, వాటి రసాయన మిశ్రమాలు పురుగు క్యూటికల్ లోనికి ప్రవేశించి వాటిని చంపాయి (టక్, 2015).
  • నిమ్మగడ్డి ద్రావణం (1గ్రా. 150 గ్రా. గింజలకు) మొక్కజొన్న గింజల నిల్వ సమయంలో ఆశించే వీవిల్ సైటోఫిలస్ జియామెయిస్‌ని 50%కి పైగా చంపింది. 6 గ్రా. మోతాదువద్ద 90% పురుగులు చంపబడ్డాయి. నిమ్మగడ్డి మొక్క సులభ లభ్యత, దాని అధిక కీటక నాశక చర్య దానిని ఆకర్షణీయమైన జీవ పురుగు మందుగా నిరూపించాయి (ఒబోహ, 2016).
  • నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్ శాండ్ ఫ్లెå, ఫ్లెబోటోమస్ డుబోస్క్వ్ పెద్దపురుగులను 100% చంపింది. ఆడపురుగులు గణనీయంగా తక్కువ గుడ్లను పెట్టాయి (కిముటాయ్, అతని అనుచరులు, 2015).
  • నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్ సహజ దోమల వికర్షక మందుగా పనిచేస్తుంది. ఇది రసాయన వికర్షక పురుగు మందుల కన్నా సురక్షితమైనది (ప్రభాకర్, అతని అనుచరులు, 2013).
  • నిమ్మగడ్డి కీటకనాశినిగానే గాక, యాంటిఫీడెంట్, వికర్షకచర్యలను కూడా ప్రదర్శిస్తుంది. దోమలు, ఈగలు, పేనుబంక, నిల్వ ధాన్యంలో ఆశించే పురుగులను సమర్ధవంతంగా నివారిస్తుందని రుజువైంది.
  • నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్‌ని పురుగు వికర్షిణిగా ఉపయోగించవచ్చు. లేదా నీటిలో కలిపి ఎమల్షన్‌గా తయారుచేసి పంటలపై పిచికారి చేయవచ్చు.
  • వేర్ల నుండి రసం తీసి నీటితో కలిపి పంటలపై పిచికారి చేసి పురుగులను సమర్ధవంతంగా నివారించవచ్చు.
  • నిమ్మగడ్డిని నులి పురుగులు, నల్లుల నివారణలో కూడా ఉపయోగించవచ్చు. నులి పురుగులెక్కువగా ఉన్న భూమిలో నిమ్మగడ్డిని నాటి వాటి సంఖ్యను తగ్గించవచ్చు..
  • నిమ్మగడ్డి సంబంధిత సింబోపోగాన్ నార్డస్ మొక్క యాంటి ఫీడెంట్, వికర్షక చర్యలను కలిగి ఉంటుంది. పండు ఈగలను అధికంగా ఆకర్షిస్తుంది. ఈ లక్షణం వల్ల పండు ఈగల నివారణలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. (ప్లూక్, అతని అనుచరులు, 1999).
  • అలసంద పంటలో తీవ్ర నష్టం కల్గించే మారుకా కాయతొలుచు పురుగు (మారుకా విట్రేట), కాయ రసం పీల్చే నల్లి (క్లావిగ్రల్లా టోమెంటోసికోల్లిస్) పురుగులను మొక్కల పురుగు మందుల మిశ్రమాలతో నివారించడానికి పరిశోధనలు జరిపారు. వేప{నిమ్మగడ్డి, వేప{ ఆఫ్రికన్ కర్రి, వేప{టమాట, వేప{కాకర, యూకలిప్టస్{ఆఫ్రికన్ బుష్ టీ ఆకుల మిశ్రమ ద్రావణాలు పిచికారి చేసిన పంటలో కాయతొలుచు పురుగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. వేప{ఆఫ్రికన్ కర్రి, వేప{నిమ్మగడ్డి, వేప{టమాట, వేప{కాకర, యూకలిప్టస్{ఆఫ్రికన్ బుష్ టీ ఆకుల మిశ్రమ ద్రావణాలు పిచికారి చేసిన పంటపై కాయరసం పీల్చే పురుగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ ద్రావణాల మిశ్రమాలు మొక్కలలో కాయల నష్టాన్ని అధికంగా తగ్గించి, గింజ దిగుబడులను పెంచాయి (ఒపరీక్, అతని అనుచరులు, 2005).
  • నిమ్మగడ్డి, తులసి వేడి మరియు చల్లని ఆకు ద్రావణాలు అలసందలో యాంత్రాక్నోస్ తెగులు కల్గించే శిలీంద్రం కొల్లెటోట్రైకం లిండముథియానం శిలీంద్ర బీజాలు మొలకశాతాన్ని, శిలీంద్ర పెరుగుదలను సమర్ధవంతంగా తగ్గించాయి. నిమ్మగడ్డి చల్లని ఆకు ద్రావణం అత్యధికంగా శిలీంద్రం పెరుగుదలను తగ్గించి పొలంలో ఆంత్రాక్నోస్ తెగులు వ్యాప్తిని అరికట్టింది. నిమ్మగడ్డిని అలసంద నాశించే ఆకుమచ్చ తెగులు నివారణకు మొక్క ఆధారిత పురుగు మందుగా ఉపయోగించవచ్చు. (అమడియోహ అండ్ ఓబి, 1999).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… కామాక్షి / మదన

కామాక్షి చెట్టు మొదలు లావుగా ఉండి మందమైన కార్క్ వంటి బెరడుతో కప్పబడి ఉంటుంది. చెట్టు చివరన పొడవాటి, ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగు, మెరిసే ఆకులు ఏర్పడతాయి. ప్రతి ఆకు 150 నుండి 170 సెం.మీ. పొడవుండి 54 నుండి 110 చిన్న ఆకులు కలిగి ఉంటుంది.. మగ కామాక్షి మొక్కలు పసుపుగోధుమ రంగు అండాకారపు కోన్స్ కలిగి ఉంటాయి. ఇవి 24-48 సెం.మీ. పొడవు, 12-18 సెం.మీ. వ్యాసం కలిగి ఉంటాయి. ఆడ మొక్కలో కోన్స్ ఏర్పడవు. అవి పొడవాటి, ఆకువంటి స్పోరోఫిల్స్‌పై గింజలు కలిగి ఉంటాయి. అవి కురచగా, వత్తుగా ఉన్న నారింజ రంగు నూగు కలిగి 20-35 సెం.మీ. పొడవుంటాయి. కామాక్షి గింజలు చిన్నవిగా 3-9 మి.మీ. పొడవుండి లేత ఎరుపుపసుపు రంగు గుజ్జుతో కప్పబడి ఉంటాయి. చెట్టు 3-5 మీ. ఎత్తు పెరుగుతుంది.

సాధారణ నామం : సాగోపామ్ శాస్త్రీయ నామం : సైకాస్ సిర్సినాలిస్ కుటుంబం: సైకడేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • పుప్పొడి నార్కోటిక్, కామాక్షి మొక్క బెరడు, గింజలను నూరి నూనెతో కలిపి పేస్టు చేసి గాయాలు, వాపులపై పట్టీగా వేస్తారు.
  • లేత ఆకుల రసాన్ని వాంతుల చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ మొక్క పిత్ నుండి సగ్గుబియ్యం తయారు చేస్తారు. ఆకుల కషాయాన్ని దగ్గు నివారణకు త్రాగుతారు.

వ్యవసాయరంగంలో

  • సంప్రదాయ వ్యవసాయంలో కామాక్షి పూలను పురుగుల యాజమాన్యంలో ఉపయోగిస్తారు. దీని మగపూలు కుళ్ళినపుడు ఒక ఘాటైన వాసనని విడుదల చేస్తాయి (మమన్నన్ & నటరాజన్, 2010).
  • కామాక్షి మగచెట్టు, పూవులను కోసి వరి పంట స్థాయి కన్నా ఎక్కువ ఎత్తు ఉన్న కర్రలకు కట్టాలి.
  • ఈ కర్రలను గడ్డితో చుట్టి పూలను కట్టి వరి పొలంలో 10-15 చోట్ల పాతాలి. వీటి వాసనకు కంకినల్లి పెద్ద పురుగులు వికర్షింపబడి 2 వారాల పాటు పొలంలోకి ప్రవేశించలేవు. ఈ సమయానికి పాలుపోసుకునే దశ పూర్తయి, పంట పరిపక్వ దశకు చేరుకుంటుంది.
  • కామాక్షి పూలలో ఉన్న సైకాస్టిన్ అనే రసాయనం కీటకనాశక మరియు నిరోధక లక్షణాలు కలిగి ఉంది. శ్రీలంక వరి రైతులు ‘కెమ్ కామ’ పద్ధతులు అనే పురుగు యాజమాన్య పద్ధతులను మొక్క ఆధారిత పదార్థాలు మరియు సాగు పద్ధతులనుపయోగించి వృద్ది చేశారు. మొక్కలలోని రసాయన పదార్థాలను గురించి అవగాహన లేనప్పటికీ శ్రీలంక వరి రైతులు ఈ విజయవంతమైన సస్యరక్షణ పద్ధతిని వృద్ధి చేయడానికి కొన్ని దేశీయ మొక్కలను గుర్తించారు. ఈ కెమ్ పద్ధతులు పురుగు మందు ప్రభావం, జిగట ఎరలు, దీపపు ఎరలు వంటి వివిధ రకాల చర్యలను కలిగి ఉంటాయి. ఆధునిక విజ్ఞానం వృద్ధి చెందడంతో, కెమ్ పద్ధతిలో దాగి ఉన్న రహస్యాలను ఏ మొక్క ఆధారిత రసాయనం ఏ పురుగుకి సరైన ఎంపిక అనే విషయాన్ని పరిశోధించవచ్చు. వరి పొలాల దగ్గర కదురు (సెర్బెరమ్‌గడ్డి) కర్రలను మంట పెట్టడం వల్ల దీపపు ఎరతో పాటు రసాయన వికర్షకాన్ని కూడా పురుగుల నివారణకు ఉపయోగించినట్లు పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇది ఒక ‘కెమ్ కామ’ పద్ధతి. కామాక్షి పూలలో సైకాసిన్ ఒక ముఖ్య రసాయనం. దీనికి కీటకనాశక మరియు కీటక నిరోధక లక్షణాలున్నాయి. దీని ద్వారా ఆధునిక శాస్త్రీయ పరిశోధనలు పురాతన కెమ్ పద్ధతిలో పోలి వున్నాయని విశదమయింది. ఇటువంటి చర్యలు గల అనేక మొక్క జాతులున్నాయి. జిల్లేడు, మీలియా, క్రోటాన్ లాసిఫర్, యూఫర్బియా యాంటిక్సోరం సంప్రదాయ పద్ధతులతో సరితూగుతున్నాయి. ఇవి పర్యావరణహిత పద్ధతులు.

సంప్రదాయ ‘కెమ’ పద్ధతులు
మొక్క: క్రోటాన్ లాసిఫెర
నివారించబడే పురుగు: వరి కంకినల్లి
పనిచేసే విధానం: మొక్కల కట్టను వరి పొలంలో మొక్కలపై లాగుతూ పోతే వికర్షక చర్యవల్ల నివారించడతాయి.

మొక్క: కదురు
నివారించబడే పురుగు: వరి కంకినల్లి
పనిచేసే విధానం: వరి పొలాల దగ్గర మంటలు వేయడం ద్వారా దీపపు ఎరలా పురుగులను ఆకర్షిస్తుంది.

మొక్క: కామాక్షి
నివారించబడే పురుగు: వరి కంకినల్లి
పనిచేసే విధానం: కామాక్షి మగపూవు కుళ్ళేటపుడు ఘాటైన వాసన విడుదల చేస్తుంది. ఈ మగపూవుని ఉదయం వేళలో కత్తిరించి ఈ భాగాలను కర్రలకు కట్టి వివిధ ప్రాంతాలలో పాతాలి. మరుసటి రోజు ఈ పూల భాగాలపై నీరు చల్లాలి.

మొక్క: మీలియా
నివారించబడే పురుగు: వివిధ పురుగులు
పనిచేసే విధానం: ఘాటైన వాసన గల మీలియా ద్రావణాన్ని తాటాకులపై చల్లి వరి పొలంలో వివిధ ప్రదేశాలలో ఉంచుతారు. ఈ ద్రావణంలోని ఆల్కలాయిడ్లు, ఫ్లేవనాయిడ్స్, టానిన్స్, టెర్పెనిన్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ పురుగులను తినకుండా, గుడ్లు పెట్టకుండా నిరోదిస్తాయి.

మొక్క: జిగట ఎరలు
నివారించబడే పురుగు: రసంపీల్చే పురుగులు
పనిచేసే విధానం: ఇతర పురుగులు విసనకర్ర, కర్ర లేదా తాడుకి జిగురు పూసి (జిల్లేడు, పాలపొద పాలు) పంటపై కదిలిస్తే పురుగులు జిగురుకు అంటుకుంటాయి.

మొక్క: దీపపు ఎరలు
నివారించబడే పురుగు: ఎగిరే పురుగులు
పనిచేసే విధానం: మధుకా లాంగిఫోలియా, వేప, కనారం జీవానికం నూనె ద్రావణాలతో దీపాలను వెలిగించి పెడితే ఆకర్షింపబడిన పురుగులను నాశనం చేయాలి.
(విడనపతిరాన అండ్ దస్సనాయకె, 2013).

  • కామాక్షి ఓవ్యూలఎండోటెస్టా మిథనాల్ ద్రావణం బాసిల్లస్ సెరియస్, స్టఫైలోకోకస్ ఆరియస్, ఎస్కరిచియా కోలి, క్ౙాంతోమోనాస్ కాంపెస్ట్రిస్ మాల్వేసియారం లపై వాంకోమైసిన్, పెనిసిలిన్, బాక్టీరిమైసిన్ (యాంటిబయాటిక్స్) కన్నా గణనీయంగా అధిక యాంటీబాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది (కల్పశ్రీ అండ్ దవీష, 2013).
  • వరిలో కాండం తొలుచు పురుగు ఆశించడం గమనించగానే కామాక్షి పూలను నలగ్గొట్టి పొలంలో నిల్వ ఉన్న నీటిలో కలపాలి (విమలకీర్తి, 2002), అమువిత గమ 2002).
  • కామాక్షి, వేప, నిమ్మగడ్డి, పొగాకు ఆకులను నీటిలో వేసి మరగించి కొంత సమయం నానబెట్టాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని వడపోసి 2-4 రోజులు నిల్వ ఉంచాలి. తర్వాత కూరగాయల పంటపై పిచికారి చేస్తే ఈ ద్రావణం ఆకుతొలిచే పురుగు, దీపపు పురుగులు, ఆకుగూడు పురుగు, కొమ్మునల్లి, వీవిల్స్, లార్వాలు, చిత్తపురుగులను వికర్షిస్తుంది (ఒకులోన్‌లోల అండ్ అకిన్‌రిన్నోల, 2013).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… చలివిడి

కావాల్సిన పదార్థాలు

  • బియ్యం * బెల్లం * కొబ్బరి తురుము * యాలక్కాయలు – నాలుగు (అన్నీ బియ్యానికి తగినంతగా).

తయారుచేయు విధానం: బియ్యాన్ని రెండు గంటలు నానబెట్టి శుభ్రంగా కడుక్కోవాలి. నీళ్లు లేకుండా అయిన తర్వాత, మిక్సీలో వేసి పిండి పట్టుకోవాలి. దానిలోనే బెల్లం, యాలక్కాయలు వేసి కలిసే వరకు తిప్పుకోవాలి. తర్వాత కొబ్బరి తురుము వేసి, మళ్లీ ఒకసారి తిప్పుకుంటే చలివిడి సిద్ధం! (చలిమిడి అని కూడా అంటారు)

  • మెహర్ శాంతి కర్రి, అర్తమూరు, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఆవు దూడకు ఊదర బొడ్డు (UMBILICAL HERNIA)

కొన్ని దూడలకు పొట్ట దిగువ భాగాన బొడ్డు చుట్టూ కండ పూడనందు వల్ల, బొడ్డు దగ్గర రంధ్రంగా వుండి, దానిగుండా ప్రేగులు బొడ్డు తిత్తిలోకి చేరి వుంటాయి.

ఇది బొడ్డువాపువలే భ్రమింపజేస్తుంది. నిర్ధారణకు రెండు వ్రేళ్ళతో బొడ్డు భాగంలో నొక్కితే, లోపలకు చిన్న రంధ్రం ద్వారా వ్రేళ్ళు వెళ్ళినట్లయితే, అది ఊదర బొడ్డుగా నిర్ధారించవచ్చును.

పశువైద్య నిపుణునికి చూపించాలి. బొడ్డు వాపు (UMBILICAL ABSCESS) వ్యాధిగా పొరబడే అవకాశం వుంది.

పరిష్కారాలు:
ఆయుర్వేదం: క్రింది వాటిలో ఏదైనా ఒక విధానం

గృహవైద్యం

  1. పసుపు, వెన్నపూస మిశ్రమాన్ని బొడ్డుపై రాచి గట్టిగా గుడ్డ కట్టాలి.
  2. బొడ్డును లోపలకు నెట్టిన తరువాత, ఒక అడుగు వెడల్పు గల గుడ్డను 3,4 మడతలు మడిచి, బొడ్డుపై నుండి నడుముకు బిగించి ముడి వేయాలి. దాని వల్ల బొడ్డులోనికి జారిన ప్రేగులు పొట్టలోకి నెట్టేయబడి, కాల క్రమేణా ఆ రంధ్రం పూడిపోవడానికి దోహదపడుతుంది.

అల్లోపతి: ఈ విధంగా చేసిన తరువాత కూడా ప్రేగులు బొడ్డులోకి జారివున్నట్లయితే, నిపుణులచే శస్త్రచికిత్స ద్వారా సరిచేయించవచ్చు.

రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

Read More

వండని వంట… చింతకాయ నిలువ తొక్కు

కావాల్సిన పదార్థాలు

  • చింతకాయలు
  • పచ్చి మిరపకాయలు
  • మెంతులు * జీలకర్ర
  • ఉప్పు * పసుపు
  • ఎల్లిపాయలు
    (చింతకాయల పరిమాణాన్ని బట్టి సుమారుగా రుచికి సరిపడా మిగతా పదార్ధాలను వాడాలి)

తయారుచేయు విధానం: చింతకాయలను కడిగి ఆరిన తరువాత, చింతకాయలు, మిరపకాయలు, ఎల్లిపాయలు కొద్దికొద్దిగా రోట్లో వేసి దంచుకోవాలి. మెంతులు, జీలకర్రను పొడి చేసికొని దంచి ఉంచిన చింతకాయల మిశ్రమంలో మెంతి పొడి, జీలకర్ర పొడి పసుపు, ఉప్పు వేసి మళ్ళీ కొంచెం కొంచెం రోట్లో వేసి దంచుకోవాలి. ఒకటి రెండు రోజుల తరువాత, తొక్కులో ఏమైనా చింతగింజలు ఉంటే ఏరి పారెయ్యాలి. (పచ్చి మిరపకాయలకు బదులుగా పండు మిరపకాయలను కూడా వాడవచ్చు)
అంతే! సింపుల్ చింతకాయ తొక్కు రెడీ.

ఈ చింతకాయ తొక్కును అంబలిలో వేసుకొని తాగుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది. చాలా కాలం నిల్వ ఉంటుంది.
అన్ని రకాల పచ్చళ్ళలో నూనె పోసి నిల్వ చేస్తారు కానీ, చింతకాయ పచ్చడిలో నూనె పొయ్యకుండా నిల్వ చేస్తారు!

  • కర్నాటి శశికళ, బడంగ్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

జున్నుపాలు – ప్రత్యేకత

గోవు ఈనిన తరువాత 2, 3 రోజుల వరకు తయారయ్యే పాలు జున్ను పాలు. సాధారణ పాలకంటే జున్ను పాలలో ఎన్నో రెట్లు అధిక పోషక విలువలు గల పదార్థాలు వుంటాయి.

వ్యాధి నిరోధక శక్తిని కలిగించే యాంటీబాడీలు ఎక్కువ మొత్తంలో వుంటాయి. విటమిన్లు, ఖనిజ లవణాలు అధికంగా వుంటాయి.
జున్ను పాలు పుష్కలంగా త్రాగిన దూడలు మంచి ఆరోగ్యంతో వుండి, బాగా ఎదుగుతాయి. జున్నుపాలు మంచి విరేచనకారిగా పనిచేస్తాయి.

గోవు ఈనిన వెంటనే, అనగా అరగంట లోపుగా దూడకు జున్నుపాలు త్రాగించాలి. మాయ వేసినా, వేయకపోయినా, ఈనిన అరగంటకు దూడకు జున్నుపాలు త్రాగించడం చాలా ముఖ్యమైన విషయం. ఈ పాలు చాలా వ్యాధులు రాకుండా దూడను కాపాడతాయి. జీర్ణకోశ వ్యవస్థను సక్రమంగా వుంచుతాయి.

దూడకు రోజుకు 3 లీటర్ల జున్నుపాలు త్రాగించాలి. అంటే తడవకు 1 లీటరు చొప్పున 8 గంటల వ్యవధిలో, రోజుకు 3 పర్యాయాలుగా 3 రోజులు త్రాగించాలి. అంతకుమించి తల్లి దగ్గర పాలు వుంటే, వాటిని పూర్తిగా పిండెయ్యాలి. జున్నుపాలు ఎక్కువైతే తెల్లగా పారుతుంది. తక్కువైతే రేణం గట్టిగా వేసి, దూడ నీరసిస్తుంది.

ఆవు యొక్క నాలుగు చన్నుల నుండి దూడ పాలు త్రాగేటట్లు దగ్గరుండి కుడపాలి.
పాలు త్రాగిన తరువాత, దూడ నాలుక మీద కొద్దిగా ఉప్పు, బెల్లం రాయాలి. దూడకు త్రాగించే పాలు జున్ను పాలైనా, తరువాత మామలు పాలైనా, దూడ శరీర బరువులో 10% కంటే మించరాదు.

జున్నుపాలకు ప్రత్యామ్నాయం
దూడకు అవసరమైనన్ని జున్నుపాలు, తల్లి ఉత్పత్తి చేయలేని పరిస్థితులలో, పాత్రలను బహు జాగ్రత్తగా వేడి నీటిలో శుభ్రం చేసి, అరలీటరు వేడిపాలలో పావులీటరు గోరువెచ్చని నీరు కలిపి, రెండు కోడిగ్రుడ్ల పచ్చి సొన, 15 మి.లీ. అవిసెనూనె, 2 మి.లీ. ఆముదం కలిపి, జున్నుపాలకు ప్రత్యామ్నాయంగా, దూడ పుట్టిన 3 రోజుల వరకు త్రాగించవచ్చు. 4వ రోజు నుండి సాధారణ పాలు త్రాగించవచ్చు.

రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క…..కచోరము

సాధారణ నామం
తెల్లపసుపు / జెడోమరి

శాస్త్రీయ నామం
కర్కుమా జిడోమారియా

కుటుంబం: జింజిబెరేసి²

కచోరము ఒక హెర్బల్ బహువార్షిక మొక్క. ఇది భూమిలో ఉన్న దుంప నుండి నిటారుగా ఉన్న 75 సెం.మీ. పొడవున్న సూడోకాండాల మొద్దులను ఉత్పత్తి చేస్తుంది. ప్రతి సూడోకాండం 5 ఆకులను ఉత్పత్తి చేస్తుంది. ఆకు 35 సెం.మీ. పొడవు, 13 సెం.మీ. వెడల్పు కలిగి ఉంటుంది. దీనిని అలంకరణ మొక్కగాను, కొన్నిసార్లు వాణిజ్యపరంగా సుగంధ ద్రవ్యంగా, ఔషధ మొక్కగా పెంచుతారు. పూవులు పసుపు రంగులో మెరుస్తుంటాయి. ఆకులు కోడిగుడ్డు ఆకారంలో 1 నుండి 2 అ. పొడవుంటాయి. కాయలు ముక్కోణాకారంలో ఉంటాయి. గింజలు అండాకారం లేదా బల్లెం ఆకారంలో ఉంటాయి.

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • కచోరం పేస్టుని వాపు, గాయాలు, చర్మ వ్యాధులు, నొప్పి నివారణలో ఉపయోగిస్తారు. శరీర ఉత్ప్రేరకంగా పని చేసి రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
  • శ్వాస సంబంధిత వ్యాధులను సమర్ధవంతంగా నివారిస్తుంది. జీర్ణశక్తిని, కాలేయ పరిస్థితిని మెరుగుపరచి శరీర ఉష్ణోగ్రతను సాధారణ స్థితిలో ఉంచుతుంది. కచోరాన్ని పొడి రూపంలో తీసుకుంటే రుతుస్రవాన్ని క్రమబద్ధీకరిస్తుంది.
  • మూత్ర సంబంధ సమస్యలకు, మూత్రకోశ వ్యాధులకు మొక్క రసాన్ని త్రాగిస్తారు. పేగు అల్సర్ వత్తిడి తగ్గించడానికి ఉపయోగిస్తుంది.
  • దగ్గు, జలుబు, వాంతులు తగ్గించడానికి ఉపయోగిస్తారు. పొత్తికడుపు నొప్పి, కీళ్ళ నొప్పులకు ఉపశమనం కల్గిస్తుంది.
  • త్రాచుపాము విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. భారతదేశంలో ఈ మొక్కని తాజాగా వండి తినడానికి లేదా పచ్ౘ్ళ్ళు తయారీలో ఉపయోగిస్తారు. పేస్టుగా నూరి కూరలలో ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో…

  • కచోరం మొక్క వివిధ భాగాలనుపయోగించి తయారు చేసిన ద్రావణం వేరుశనగ పంటనాశించే పేనుబంక, ఎఫిన్‌గాసిపిని గణనీయంగా అధిక సంఖ్యలో (56-90%) చంపింది. క్యాబేజి పంటనాశించే డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లా పై కీటకనాశక చర్యను ప్రదర్శించింది. తక్కువ ప్యూపాలు ఏర్పడ్డాయి. తక్కువ పెద్ద పురుగులు ప్యూపాల నుండి వెలువడ్డాయి. యాంటిఫీడెంట్ చర్యను కూడా ప్రదర్శించింది (హెవేజ్, అతని అనుచరులు, 1997).
  • కచోరం వోలటైల్ ఆయిల్ (2000 పిపియం) కొల్లెటోట్రైకం ఫాల్కేటం పెరుగుదలను పూర్తిగా అరికట్టింది. చెరకు పంటనాశించే చెదపురుగు, ఒడొంటోటెర్మస్ ఒబెసస్‌పై కూడా మంచి కీటకనాశన చర్యను ప్రదర్శించింది. (గుర్దీప్‌సింగ్, అతని అనుచరులు, 2002)
  • అటవీ తోటలలో కచోరం మొక్కలను కమ్మర్షియల్‌గా పెంచి వోలటైల్ ఆయిల్‌ని డిస్టిలేషన్ ద్వారా పొందవచ్చు. (పట్టనసెరీ అండ్ పన్ బూన్‌మీ, 2016).
  • కచోరం ద్రావణం త్రాగించి పాడి ఆవుల రూమెన్ ద్రవంలో అత్యధిక రూమెన్ బాక్టీరియల్ అసిటిక్ యాసిడ్, ప్రోపియానిక్ యాసిడ్, బ్యుటిరిక్ యాసిడ్, అతి తక్కువ భార లోహాలను నమోదు చేశారు (నూర్డిన్, సుశాన్టి, 2015).
  • కచోరం ద్రావణాలు మానవులలో రొమ్ము క్యాన్సర్ కణాలు వృద్ధి చెందడాన్ని అరికడతాయి (మార్టిన్, అతని అనుచరులు, 2002).
  • కచోరం అనేక రకాల సూక్ష్మజీవులపై యాంటి మైక్రోబియల్ చర్యను ప్రదర్శించింది. దీనిని ఆహార పరిశ్రమలో ఆహార సంరక్షణకు ఉపయోగించవచ్చు. (వొరవుత్తు కుంచాయ్, 2007).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఆవుల్లో కవల దూడలు (TWINS) పుట్టుట

కవల దూడలు చాలా అరుదుగా పుడతాయి. గర్భకోశద్వారం గుండా రెండు దూడలు ఒకే పర్యాయం రాలేక, ఈనటం కష్టమవుతుంది. ఒక దూడ జన్మించిన తరువాత కొంత సమయానికి, మరల ప్రసవ వేదన ప్రారంభమై మరొక దూడ జన్మించు సందర్భాలలో, ఈనటం కష్టం అవదు. గర్భద్వారంలో దూడలు యిరుక్కున్న సందర్భాలలో, పశువైద్యనిపుణులను సంప్రదిస్తే, వారు దూడల స్థానాలను సరిచేసి గాని, శస్త్రచికిత్స చేసి గాని, దూడలను బయటకు తీస్తారు.

రెండు దూడలు మగవైనా, రెండు దూడలు ఆడవైనా సమస్య వుండదు.

ఒక మగ, ఒక ఆడ దూడ కలిసి (FREEMARTIN) పుడితే, మగదూడకు ఏ సమస్యా వుండదు. కాని ఆడ దూడలో గర్భకోశ సంబంధిత అవయవాలు అభివృద్ధి చెందక, పునరుత్పత్తి సామర్థ్యం వుండదు. ఇది చాలా వాటిల్లో జరుగుతుంది.

రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క…. పసుపు

సాధారణ నామం : టర్మరిక్ శాస్త్రీయ నామం : కర్కుమాలాంగా కుటుంబం: జింజి బరేసి

వ్యవసాయరంగంలో

  • పసుపు తాజారసం, నీటి ద్రావణం, ఎసెన్షియల్ ఆయిల్ పంటలనాశించే పురుగులపై కీటకనాశక చర్య, దోమలపై వికర్షక చర్య కలిగి ఉన్నాయి. పసుపు సహజ పురుగుమందుగా అనేక పంటలనాశించే పురుగుల నివారణకు రసాయన పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగడపడుతుంది. (డయాలస్, 2011).
  • పసుపు, అల్లం ద్రావణాలు నిల్వ ధాన్యంలో ఆశించే రెడ్‌ఫ్లోర్‌బీటిల్, ట్రైబోలియం కాస్టానియం లార్వా, ప్యూపా, పెద్ద పురుగుల విడుదలను గణనీయంగా తగ్గించాయి. గింజల బరువు నష్టాన్ని కూడా తగ్గించాయి. కాని ఈ రెండింటిలో అల్లం ద్రావణం బాగా పని చేసింది. ఈ రెండు ద్రావణాలను సమగ్ర సస్యరక్షణ పథకాలలో సమర్ధవంతమైన వస్తువులుగా ఉపయోగించవచ్చు. (సజ్జాద్ ఆలి, అతని అనుచరులు, 2014).
  • పసుపు, అల్లం ప్రపంచ వ్యాప్తంగా ముఖ్య సుగంధ ద్రవ్య పంటలు. ఇవి రెండు నిల్వ ధాన్యాలను ట్రైబోలియం క్యాస్టానియం ఆశించి నష్టం కలిగించకుండా కాపాడతాయి. ఇవి తమ ఫ్యూమిగెంట్ చర్య ద్వారా పురుగులను నివారిస్తాయి (రవీంద్రన్, 2007; లీ, అతని అనుచరులు). కాంటాక్ట్ ఇన్‌సెక్టిసైడ్స్ (బబ్రౌచ్, అతని అనుచరులు, 2010; గార్సికా, అతని అనుచరులు) యాంటీఫీడెంట్స్ లేదా వికర్షకాలుగా (గార్సిన్, అతని అనుచరులు, 2005), పురుగుల జీవిత కాలాన్ని, పెరుగుదల, పునరుత్పత్తిని కూడా నష్టపరుస్తాయి (హో, అతని అనుచరులు, 1996; రహ్మత్, అతని అనుచరులు, 2006).
  • పసుపు ద్రావణం (20%) ట్రైబోలియం కాస్టానియం అత్యధిక పురుగుల మరణాన్ని అతి తక్కువ లార్వాల విడుదల, అతి తక్కువ ప్యూపాల విడుదల, అతి తక్కువ పెద్ద పురుగుల విడుదలను నమోదు చేసింది (సజ్జాద్ ఆలి, అతని అనుచరులు, 2014).
  • పసుపు ద్రావణం ట్రైబోలియం కాస్టానియం ఒరైజీఫిలస్ సురిమెన్సిస్, క్రిప్టోలెస్టెస్ ఫెర్రుజినియస్, సైటోఫిలస్ ఒరైజె, కార్సిరా సిఫలోనికలపై వికర్షక చర్యను ప్రదర్శించింది (చందర్, అతని అనుచరులు, 2000).
  • పసుపు ఆకు ద్రావణాలలోని ఎసెన్షియల్ ఆయిల్ రైజోపెర్తాడామినికపై కాంటాక్ట్ యాక్షన్ చర్యను ప్రదర్శించింది. ట్రైబోలియం కాస్టానియం గుడ్లు పెట్టడాన్ని, గుడ్లు పొదగడాన్ని తగ్గించింది (త్రిపాఠి, అతని అనుచరులు, 2002).
  • పసుపుపొడిలోని రసాయనాలు ట్రైబోలియం కాస్టానియంపై బలమైన వికర్షక చర్యను ప్రదర్శించాయి. (సు, అతని అనుచరులు, 1981).
  • పసుపు పొడి, దానిలోని రసాయనాలు క్యాబేజీ లూపర్, ట్రైకోప్లూసియాని 3వ దశ లర్వాలను 10-20% చంపాయి. పసుపు పొడికి పైపరానిల్ బ్యుటాక్సైడ్ కలిపితే 90-97% లార్వాలు చనిపోయాయి (లావరెస్, అతని అనుచరులు, 2016).
  • పసుపుదుంప పొడి ఉత్పత్తుల నిల్వలో ఆశించే సైటోపిలస్ గ్రానేరియస్, రైజోపెర్తా డామినికలను సమర్ధవంతంగా నివారించింది (జిలాని అండ్ సు, 1983).
  • పసుపు పొడి (20 గ్రా. /కి.) { ఆవాల నూనె (4 మి.లీ. /కి.) సైటోఫిలస్ ఒరైజె పెద్ద పురుగుల విడుదలను అరికట్టి మరబట్టిన బియ్యాన్ని కాపాడింది (చాందర్, అతని అనుచరులు, 1991).
  • ఫ్లైయాష్ { పసుపుపొడి 10% మిశ్రమం వరి పంటనాశించే నఫలాక్రాసిస్ ఇన్సాలిటస్, ఆక్ౙియానిటిడ్యుల; వంగపంటనాశించే ఎపిలాక్న విజింటియోపంక్టేట, ఎఫిస్ గాసిపి, యురెంటియస్ హిస్ట్రిసెల్లస్, కాక్సియోహిస్టిక్స్ ఇన్సోలిటస్, బెండ పంటనాశించే ఆమ్రాస్కా దేవస్తాన్స్, టెట్రానికస్ నియోకాలెడోనికస్, డిస్టెర్కస్ సింగ్యులేటస్, ఆక్సికారెనసయ లినిపెన్సిస్, అనోమిస్ఫల్లేవ, స్పోడోప్టెరా లిటూర, ఈరియాస్ విట్టెల్లాలను 80% చంపింది (శంకరి అండ్ నారాయణసామి, 2007).
  • పసుపు దుంపపొడి నిల్వ ధాన్యంలో ఆశించే రైజోపెర్తా డామినికని సమర్ధవంతంగా అరికట్టింది. ప్రత్యేకంగా పసుపుపొడి (0.5%) 63.2% పెద్ద పురుగుల విడుదలను నివారించింది. పసుపుపొడి (14 గ్రా.) { నూనె 6 మి.లీ.) మిల్లాడించిన బియ్యంలో ఈ పురుగులను 100% చంపాయి (చందర్, అతని అనుచరులు, 2003).
  • పసుపు దుంప ద్రావణాలు ట్రైబోలియం కాస్టానియంని సమర్ధవంతంగా అరికట్టాయి. పెట్రోలియం ఈథర్ ద్రావణం అసిటోన్ మరియు ఇథనాల్ ద్రావణం కన్నా అధిక సమర్థవంతంగా పనిచేశాయి (జిలాని అండ్ సు, 1983).
  • పసుపు దుంప అసిటోన్ ద్రావణం జ్యూట్ ఫ్యాబ్రిక్ నాశించే ట్రైబోలియం కాస్టానియంని తక్కువ మోతాదులో 3 నెలల వరకు అత్యధిక సమర్థవంతంగా వికర్షక చర్య ద్వారా నివారించింది. (చందర్, అతని అనుచరులు, 1992, 1994). పసుపు ద్రావణం ట్రైబోలియం కాస్టానియం, ఒరైజెఫిలస్ సునామెన్సిస్, క్రిస్టోలెస్టెస్ పెర్రుజెనియస్, సైటోఫిలస్ ఒరైజె, కార్సిరా సెఫలోనికపై 3 నెలల వరకు వికర్షక చర్యను ప్రదర్శించింది (చందర్, అతని అనుచరులు, 2000).
  • గోధుమ గింజలనాశించే రైజెపెర్తా డామినిక పెద్ద పురుగులను పసుపు దుంప పెట్రోలియం ఈథర్ ద్రావణం 90.8% నివారించింది. పెట్రోలియం ఈథర్ ద్రావణం (4%) సైటోఫిలస్ ఒరైజెని పూర్తిగా అరికట్టింది. అసిటోన్ ద్రావణం 85% పురుగులనరికట్టింది. పెట్రోలియం ఈథర్ ద్రావణం రైజోపెర్తా డామినికా పెద్ద పురుగులపై 98.3% వికర్షక చర్యను ప్రదర్శించింది (మాటర్, అతని అనుచరులు, 2008).
  • పసుపు దుంప, పైభాగాల క్లోరోఫాం ద్రావణాలు ట్రైబోలియం కాస్టానియం పెద్ద పురుగులపై బలమైన వికర్షక చర్యను ప్రదర్శించాయి. కాని పై భాగాల ద్రావణం దుంప ద్రావణం కన్నా తక్కువ వికర్షక చర్యను ప్రదర్శించింది (అబిడ, అతని అనుచరులు, 2010).
  • పసుపు ఎసెన్షియల్ ఆయిల్ ట్రైబోలియం కాస్టానియంపై వికర్షక చర్యను ప్రదర్శించింది (జిలాని, అతని అనుచరులు, 1988). పసుపు ఎసెన్షియల్ ఆయిల్ రైజెపెర్తా డామినికా పెద్ద పురుగులను వికర్షించింది (జిలాని అండ్ సెగుక్సేనా, 1990).
  • పసుపు దుంప ఎసెన్షియల్ ఆయిల్ (1%) కార్డమమ్ ఎఫిడ్ (పెంటలోనియా నైగ్రోనర్వోసా)ని సమర్థవంతంగా నివారించింది (సాజు, అతని అనుచరులు, 1998).
  • పసుపు ఆకుల నుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యంలో ఆశించే బీటిల్స్, రైజోపెర్తా డామినితో, సైటోపిలస్ ఒరైజే, ట్రైబోలియం కాస్టానియంపై కాంటాక్ట్, ఫ్యూమిగేషన్ విష చర్యలను ప్రదర్శించింది. రైజోపెర్తా డామినికాపై కాంటాక్ట్ చర్యను ప్రదర్శించింది. సైటోఫిలస్ ఒరైజెపెద్దపురుగులపై ఫ్యూమిగేషన్ చర్యను ప్రదర్శించింది. ట్రైబోలియం కాస్టానియం గుడ్లు పెట్టడాన్ని, గుడ్లు పొదగడాన్ని నిరోధించింది (త్రిపాఠి, అతని అనుచరులు, 2002).
  • పసుపు పొడి నుండి వేరు చేసిన రెండు మిశ్రమాలు, ఆర్‌టర్మరోన్, టర్మరోన్ ట్రైబోలియం కాస్టానియంపై బలమైన వికర్షక చర్యను ప్రదర్శించింది (సు, అతని అనుచరులు, 1982).
  • పసుపు దుంపల ఎసెన్షియల్ నుండి వేరు చేసిన ఆర్‌టర్మరోన్ ఈడిస్ ఈజిప్టి లార్వాలపై కీటకనాశక చర్యను ప్రదర్శించింది (రోల్, అతని అనుచరులు, 1998).
  • ఆర్‌టర్మరోన్ (1000 పిపియం) సుడిదోమ (నీలపర్వత ల్యూజెన్స్) పెద్ద పురుగులను, ప్లూటెల్లా క్ౙెåలోస్టిల్లా లార్వాలను 100% చంపింది. మైజస్ పెర్సికె పెద్ద ఆడపురుగులు, స్పోడోప్టెరా లిటూర లార్వాలను ఆర్‌టర్మరోన్ (2000 పిపియం) సమర్ధవంతంగా నివారించింది (లీ. అతని అనుచరులు, 2001).
  • పసుపు దుంప నుండి వేరు చేసిన పదార్థాలను బోట్రైటిస్ సినరియా, ఎరిసిఫె గ్రామినిస్, ఫైటోఫ్తోరా ఇన్‌ఫెస్టాన్స్, పక్సినియా రీకాండిటా, పైరిక్యులేరియా ఒరైజె, రైజోక్టోనియా సొలానిల పై పరీక్షించారు (కిమ్, అతని అనుచరులు, 2003). హెక్సేన్ ద్రావణం (1000 మి.గ్రా / లీ.) ఎరిసిఫెగ్రామినిస్, ఫైటోఫ్తొరా ఇన్‌ఫెస్టాన్స్, రైజోక్టోనియాసొలానిపై ఫంగిసైడల్ చర్యను ప్రదర్శించింది. ఇథైల్ ఎసిటేట్ ద్రావణం బోట్రైటిస్ సినరియా, ఫైటోఫ్తోరా ఇన్ఫెస్టాన్స్, పక్సినియా రికాండిట, రైజోక్టోనియా సొలనిపై ఫంగిసైడల్ చర్యను ప్రదర్శించింది. ఇథైల్ అసిటేట్ ఫ్రాక్షన్ నుండి వేరు చేసిన కర్కుమిన్ (9500 మి.గ్రా./లీ.) ఫైటోఫ్తోరా ఇన్‌ఫెస్టాన్స్, పక్సినియా రికాండిటా, రైజోక్టోనియా సొలానిలను 100, 100, 63% నివారించింది.
  • పసుపు దుంపల మిథనాల్ ద్రావణం మిరప పంటలో ఆంత్రాక్నోస్ (కొల్లెటోట్రైకం కోకాయిడెస్) తెగులుని సమర్థవంతంగా నివారించింది. (చో, అతని అనుచరులు, 2006).
  • పసుపు దుంప మిథనాల్ ద్రావణంలో గుర్తింపబడిన కర్కుమిన్, డిమిథాక్సికర్కుమిన్, బిస్‌డిమిథాక్సికర్కుమిన్ కొల్లెటోట్రైకం కోకాడెస్, కొల్లెటోట్రైకం గ్లియోస్పోరియాయిడెస్, కొల్లెటోట్రైకం ఆక్యుటేటం శిలీంద్ర పెరుగుదలను సమర్ధవంతంగా అరికట్టాయి.
  • పసుపు ఎసెన్షియల్ ఆయిల్ నుండి వేరు చేసిన రెండు ఫ్రాక్షన్లు ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ఆస్పర్ౙిల్లస్ పారసైటికస్, ఫ్యుజేరియం మొనిలిఫార్మె, పెనిసిలియం డిజిటేటం పై యాంటిఫంగల్ చర్యను ప్రదర్శించాయి (జయప్రకాష, అతని అనుచరులు, 2001).
  • పసుపు ఆకుల నుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్, ఫ్యుజేరియం ఆక్సిస్పోరం డయాంతి, ఆల్టర్నేరియా డయాంతి (కార్నేషన్‌ని ఆశించే శిలీంద్రాలు), ఫ్యుజేరియం ఆక్సిస్పోరం గ్లాడియోలి, కర్వులేరియా ట్రైఫోలిగ్లాడియోలి (గ్లాడియోలస్‌ని ఆశించే శిలింద్రాలు)పై మంచి యాంటిఫంగల్ చర్యను ప్రదర్శించింది (బాబు, అతని అనుచరులు, 2007).
  • పసుపు దుంపల నుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యంలో ఆశించి నష్టం కలిగించే 7 శిలీంద్రాలపై శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించాయి. వీటిలో ముఖ్యమైనవి ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ఫ్యుజేరియం సెమిటెక్టం, కొల్లెటోట్రైకం గ్లియోస్పోరియాయిడెస్, కొల్లెటోట్రైకం మ్యూసే (దింగ్రా, అతని అనుచరులు, 2007).
  • 20 గ్రా. పసుపు దుంప పొడిని 1కి. గింజలకు కలిపి నిల్వ ధాన్యంలో ఆశించే పురుగుల నుండి కాపాడవచ్చు.
  • పసుపు ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యంలో ఆశించే సైటోఫిలస్ ఒరైజే, రైజోపెర్తా డామినికాపై కీటకనాశక చర్యను ప్రదర్శించింది (గంగ్వార్ అండ్ తివారి, 2017).
  • పసుపు హెక్సేన్ ద్రావణం రెటిక్యులిటెర్మెస్ ప్లాలిపెస్‌పై టెర్మిటిసైడల్ చర్యను ప్రదర్శించింది (రాజె, అతని అనుచరులు, 2015).
  • పసుపు ద్రావణం రైస్‌వీవిల్, సైటోఫిలస్ జియామెయిస్‌పై మధ్యమ వికర్షక చర్యను ప్రదర్శించింది (ఇషీ, అతని అనుచరులు, 2010).
  • పసుపు నీటి ద్రావణం సుడిదోమ (నీలపర్వత లూజెన్స్), ఆకుపచ్చ దీపపు పురుగులు (నెషోటెటిక్స్ స్పీ.), డైమండ్ బ్యాక్‌మాత్ (ఫ్లూటెల్లా క్ౙెåలాస్టెల్లా), ఆసియన్ కార్న్‌బోరర్ (ఆస్ట్రినియా ఫర్నాలిస్)పై కాంటాక్ట్ మరియు ఓవిసైడల్ విష చర్యలను ప్రదర్శించింది. (మొరాల్లోరీజీసస్, అతని అనుచరులు, 1993).
  • దక్షిణ భారతదేశంలోని వయనాడ్ జిల్లాలో రైతులు అత్యధికంగా ఉపయోగించే జీవపురుగు మందు మొక్కల ఇన్ఫర్మెంట్ కన్సెన్సన్ ఫాక్టర్ (ఐసియఫ్) ఈ క్రింది విధంగా ఉంది. వేప (1.00), వెల్లుల్లి (0.97), పొగాకు (0.94), అల్లం (0.71), కానుగ (0.64), పసుపు (0.64) (జాన్ అండ్ సుజన, 2014).
  • ప్రత్తిలో పంటనాశించే రసం పీల్చే పురుగులు, దీపపు పురుగులు (ఆమ్రాస్కారేవస్తాన్స్), తామర పురుగులు (త్రిప్స్‌లబాసి), తెల్లదోమ (బెమిసియా టబాసి)ల నివారణకు పెప్పర్‌మింట్ (మెంతా పైపరేట), పసుపు (కర్కుమ లాంగా), మిరప (క్యాప్సికం ఆన్యుయమ్), అల్లం (జింజిబెర్ అఫిసినాలిస్), జిల్లేడు (కలోట్రాపిస్ ప్రాసెర), కాకర (మోమార్డికా చారాంటియా), గోరింట (లాసోనియా ఇనర్మిస్)ల ప్రభావాన్ని క్షేత్ర ప్రయోగాలలో పరీక్షించారు. అన్ని మొక్కలు ప్రత్తి పంటనాశించే జాసిడ్స్, త్రిప్స్, తెల్లదోమల సంఖ్యను సమర్ధవంతంగా తగ్గించాయి. వీటిలో అల్లం అత్యంత సమర్ధవంతంగా 83.3% జాసిడ్స్‌ని చంపింది. మిరప 78.3%, కాకర 68.2% జాసిడ్స్‌ని చంపాయి అత్యధిక దిగుబడులు అల్లం (2304.4 కి./హె.), మిరప (2082.2 కి./హె.) కాకర (2000 కి.హె.)లో నమోదయ్యాయి (అసిఫ్, అతని అనుచరులు, 2016).
  • పసుపు, వేప, వెల్లుల్లి ఇథనాల్ ద్రావణాలు మాగుడు తెగులు కారక శిలీంద్రం పిథియం అఫానిడెర్మేటం శిలీంద్ర పెరుగుదలను అరికట్టాయి (పర్వీన్ అండ్ శర్మ, 2014; డన, అతని అనుచరులు, 2010; సింగ్, అతని అనుచరులు, 2010).
    రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More