ఔషధ మొక్క… బర్రె సుగంధి పాల

సాధారణ నామం : సరవి, శ్వేత, సరివ, మారేడు గడ్డలు, నన్నారి, షర్బత్ గడ్డలు శాస్త్రీయ నామం: డెకాలెప్సిస్ హోమిల్టో కుటుంబం: పరిప్లొకేసి

ఏపుగా పెరిగే పెద్ద తీగ లాంటి మొక్క. కొమ్మలు అంటుకొని ఉండి తేలికపాటి కోణముతో కణుపుల వద్ద ఉబ్బి ఉంటుంది. లేత కొమ్మలు, ఆకులు మరియు ఆకు ఈనెలు మెరుస్తూ ఆకుపచ్ౘ్గులాబి రంగుతో నూగు లేకుండా ఉంటాయి. ఆకులు ఎదురెదురుగా ఉంటాయి. పుష్పాలు చిన్నవిగా ఉండి పసుపు రంగు కలిగి ఉంటాయి. మూడు శాఖలు గల గుత్తులుగా వస్తాయి. కాయలు ఎండినప్పుడు గట్టిగా కర్రలాగా అవుతాయి. విత్తనములు అనేకం ఉండి అండాకారము కలిగి 6þ4 మి.మీ. పరిమాణముతో పొడవైన తెల్లటి వెంట్రుకలు కలిగి ఉంటాయి. రాళ్ళతో కూడిన వాలు ప్రాంతాలలో మరియు రాళ్ళ పగుళ్ళలో ఎక్కువగా కనబడుతుంది..

ఉపయోగాలు : ఔషధరంగంలో …
– దీని వేర్ల (ఇన్‌సెట్) నుండి క్వెర్సిటిన్, కెంపిఫెరాల్, కౌమారిన్, రూటిన్, లూపియోల్, బీటా అమైరిన్, బెంజాల్డిహైడ్ మరియు ఫెరూలిక్ ఆమ్లము వంటి ఔషధ¬ గుణాలు గల రసాయనాలు లభిస్తాయి. వేర్లు తీపిదనం కలిగి ఉంటాయి. దీనికి కారణం ఇందులోని 4 మిథైల్ రిసార్సిల్ ఆల్డిహైడ్ (0.8%) అనబడు రసాయనము. ఇవేకాక వేర్లలో ఈనోసిటాల్ (0.4%), సాపోనిన్లు, టానిన్లు, క్రిస్టలైన్ రెసిన్ ఆమ్లము మొదలైనవి కూడా ఉంటాయి.

వేర్లు అజీర్ణ వ్యాధిని నయం చేస్తాయి. చలువ కల్గిస్తాయి. రక్తశుద్ది చేస్తాయి. షర్బత్ మరియు శీతల పానీయముల తయారీకి వాడుతున్నారు. సుగంధిపాల (హెమిడెస్స˜ ఇంఇకస్)కు దీనిని ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నారు.

వ్యవసాయరంగంలో

  • బర్రెసుగంధిపాల మిథనాల్ ద్రావణం గోధుమ, పెసరగింజల నిల్వ సమయంలో ఆశించే పురుగులు రైజోపెర్తా డామినికా, సైటోఫిలస్ ఒరైజె, ట్రైబోలియం కాస్టానియం, కొల్లసోబ్రూకస్ కైనెన్సిస్‌లను సమర్ధవంతంగా అరికట్టి గోధుమ, పెసర గింజలను కాపాడింది. నిల్వ చేసిన 3-4 నెలల వరకు యఫ1 సంతతిని తగ్గించింది. శుద్ధి చేసిన గింజల మొలక శాతంపై ఎటువంటి దుష్ప్రభావం చూపలేదు (రాజశేఖర్, అతని అనుచరులు, 2010).
  • ఈ మొక్క వేరు ద్రావణం రైస్‌వీవిల్, సైటోఫిలస్ ఒరైజె, లెస్సర్‌గ్రెయిన్ బోరర్, రైజోపెర్తా డామినికా, రస్ట్‌రెడ్‌ఫ్లోర్‌బీటిల్, ట్రైబోలియం క్యాస్టానియంలను సమర్ధవంతంగా నివారించింది. పురుగులు గుడ్లు పెట్టడాన్ని, పెద్ద పురుగులు విడుదలవడాన్ని తగ్గించింది. గింజల మొలక శాతంపై ఎటువంటి దుష్ప్రభావం చూపలేదు (జార్ౙి, అతని అనుచరులు).
  • మొక్క వేర్ల నుండి వేరు చేసిన డెకాలిసైడ్స్ । మరియు ॥ (ట్రైశాకరైడ్లు) ఇంటిలో సరుకులనాశించే పురుగులు, నిల్వధాన్యాన్నాశించే పురుగులపై విషపూరిత చర్యను ప్రదర్శించి సమర్ధవంతంగా అరికడతాయి (రాజశేఖర్, అతని అనుచరులు, 2012).
  • బర్రెసుగంధిపాల వేర్ల నుండి వేరు చేసిన సహజ పురుగుమందు, డెకాలెసైడ్ ॥ రైజోపెర్తా డామినిక, సైటోఫిలస్ ఒరైజె, ట్రైబోలియం కాస్టానియం, కొల్లసోబ్రూకస్ కైనెన్సిస్‌లను నిల్వ చేసిన 7వ రోజున 100% చంపింది (రాజశేఖర్ అండ్ శివనందప్ప, 2014).
  • బర్రె సుగంధిపాల నుండి వేరు చేసిన 2హైడ్రాక్సి4మిథాక్సిబెంజాల్డిహైడ్ వరిగింజల నుండి వేరు చేసిన ఆల్టర్నేరియా ఆల్టర్నేట, డ్రెష్లరా టెట్రామిర, ఫ్యుజేరియం ఆక్సిస్పోరం, ఫ్యుజేరియం ప్రాలిఫరేటం, పైరిక్యులేరియా ఒరైజె, ట్రైకోకోనిస్ పాడ్వికీ పై గణనీయమైన యాంటిఫంగల్ చర్యను ప్రదర్శించింది. (మోహన, అతని అనుచరులు, 2009).
  • బర్రెసుగంధిపాల మిథనాల్ వేరు ద్రావణం (250 మి.గ్రా. /కిలో) సైటోఫిలస్ ఒరైజెపై గణనీయమైన విషప్రభావాన్ని చూపింది (సౌజన్య, 2016).
  • బర్రెసుగంధిపాల వేరు మిథనాల్ మరియు బెంజీన్ ద్రావణాలు అనేక వ్యాధికారక బాక్టీరియాపై యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించాయి (పూర్ణచందర్, అతని అనుచరులు, 2013).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… ఇరుగుడు చెట్టు

ఇరుగుడు చెట్టు ఒక మధ్యమ పరిమాణం నుండి పెద్ద పరిమాణంలో ఉండే ఒక ఆకులు రాల్చే చెట్టు. ఇది 30 మీ. ఎత్తు పెరుగుతుంది. చెట్టు క్యానపి విస్తృతంగా వ్యాపించి, పలుచగా ఉంటుంది. బెరడు పలుచగా, బూడిద రంగులో, నిలువైన సాళ్ళు కలిగి ఉంటాయి. పొడవాటి ప్రధాన వేరు కలిగి ఉంటుంది. ఆకులలో 3-5 చిన్న ఆకులు కలిగి ఉంటాయి. ఇవి ఒక దాని తర్వాత ఒకటిగా ఏర్పడతాయి. 2.5-3.6 సెం.మీ. వ్యాసం కలిగి వెడల్పాటి అండాకారంలో ఉంటాయి. పూలు 5-8 మి.మీ. పొడవు, తెల్లబారిన తెలుపు నుండి పాలిపోయిన పసుపు పచ్చ రంగులో ఉంటాయి. కాయలు 5-7 సెం.మీ. x 8-13 మి.మీ. పరిమాణంలో 14 గింజలు కలిగి ఉంటుంది. గింజలు 6-8 x 4-5 మి.మీ. పరిమాణంలో కిడ్నీ ఆకారంలో లేతగోధుమ రంగులో ఉంటాయి..

సాధారణ నామం : షిషం/ఇండియన్‌రోజ్‌వుడ్ శాస్త్రీయ నామం : డాల్బెర్ౙియాసిస్సూ కుటుంబం: ఫాబేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • ఇరుగుడు చెట్టు అనేక భాగాలను సంప్రదాయకంగా అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు.
  • బెరడు, కొయ్య చేదు, వేడి, వగరుగా ఉండి లైంగికంగా ఉత్తేజితం, గర్భస్రావం, కఫహరం, కడుపులో ఏలిక పురుగుల నాశకం, జ్వరం తగ్గించే …క్షణాలు కలిగి ఉంటాయి. రక్తం ద్వారా సంక్రమించే వ్యాధులు, ల్యుకేమియా, డిసెంట్రిల నివారణలో ఉపయోగిస్తారు.
  • గనోరియా తీవ్ర దశలో ఉన్నప్పుడు ఆకుల కషాయాన్నిస్తారు. మూత్రంలో చీముని తొలగించడానికి, స్త్రీల బహిష్టు సమయంలో రక్త స్రావాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు. శరీరంపై బొబ్బలు, మొటిమలను నయం చేయడానికి కూడా ఉపయోగిస్తారు.
  • కొయ్యపేస్టుని పుండు దురదని, కురుపుల్ని, వాంతులు తగ్గించడానికి ఉపయోగిస్తారు.
  • ప్రజావైద్యంలో దీనిని ఉత్తేజితంగా, మందుగా ఉపయోగిస్తారు. గనోరియాకు, చర్మ వ్యాధులకు మంచి మందు.
  • ఆయుర్వేదంలో కంటి జబ్బులను నయం చేయడానికి దీనినుపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో

  • ఆకులు, లేతకాడలు, పచ్చి కాయలను పశువులకు మంచి మేతగా వేస్తారు.
  • ఇరుగుడు చెట్టు అనేక వాతావరణ, అటవీ వ్యవసాయ ప్రయోజనాలను కల్గిస్తుంది.
  • దీనిని గాలి నిరోధకంగా, షెల్టర్ బెల్ట్‌గా, మామిడి, టీ, కాఫీ తోటలలో అంతర పంటగా నీడనిచ్చే చెట్టుగా పెంచుతారు. దీని వేరు వ్యవస్థ నుండి పిలకలు వస్తాయి. దీనిని సాధారణంగా భూమి కోతను నివారించడానికి, నదీ ప్రవాహాల కట్టలపై భూమిని నిలకడగా ఉంచడానికి పెంచుతారు.
  • దీని వాసన నిచ్చే పూలు, నీడనిచ్చే కారణంగా దీనిని రోడ్ల ప్రక్కన, తోటలలో అలంకరణ మొక్కలుగా నాటుతారు.
  • ఇరుగుడు చెట్టు కాయలు ఇథనాల్ ద్రావణాలు మంచి నీటి నత్త భోంఫలారియా ఫీఫరీ గుడ్లపై మొల్లస్కిసైడ్ ప్రభావాన్ని చూపుతుంది.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

జామకాయ, మామిడికాయ, పచ్చిమిర్చి రోటి పచ్చడి

తయారుచేసే విధానం: జామకాయలని, మామిడి కాయలని, వెల్లుల్లి, పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చిని రుచికి తగినంత ఉప్పుని మామిడికాయ ముక్కలని కచ్చాపచ్చాగా రోటిలో బండతో దంచి, తదుపరి జామకాయ ముక్కలని వెల్లుల్లిని, చిటికెడు పసుపుని వేసి దంచుకోవాలి. రెండు చెంచాలు నూనె వేసి కలపాలి. ఒక గంట తర్వాత మామిడి కాయలో ఉన్న పులుపు వూరి, జామకాయ ముక్కలకి పట్టి కొంచం గ్రేవీగా వస్తుంది. అంతే! పచ్చడి రెడీ!!
ఈ పచ్చడి వేడివేడి అన్నంలోగానీ, రొట్టెలోగానీ, దోసెలోగానీ వేసుకుతింటే… రుచిగా ఉంటుంది!

కావలసిన పదార్థాలు:

  • జామకాయ – 1 (పావుకిలో సైజు)
  • మామిడికాయ – 1 (పావుకిలో సైజు))
  • పచ్చిమిర్చి – 30 గ్రాములు
  • ఉప్పు – రుచికి తగినంత
  • జీలకర్ర – 2 టేబుల్ స్పూన్లు
  • వెల్లుల్లి రేకలు – 10
  • పసుపు – చిటికెడు.
  • ఆయిల్ – రెండు చెంచాలు

రచన: ధనలక్ష్మి కొల్లిపర, గచ్చిబౌలి హైదరాబాద్

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

సేంద్రియ సేద్యం – రైతుకు నవశకం

ప్రస్తుత కాలంలో రైతులు, రసాయన ఎరువులు మరియు పురుగుమందుల వాడకాన్ని తగ్గించుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. రసాయన రహిత ఉత్పత్తులకు మార్కెట్‌లో డిమాండ్ వేగంగా పెరుగుతోంది. రసాయనాలు లేకుండా సహజ సిద్ధంగా పండించిన పంటలను కొనుగోలు చేయడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు.సేంద్రియ వ్యవసాయం అనేది కృత్రిమ రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా, కేవలం ప్రకృతి సిద్ధమైన వనరులతో పంటలు పండించే ఒక సాంప్రదాయ మరియు సుస్థిర సాగు పద్ధతి. దీనిని జీవ వ్యవసాయం లేదా పర్యావరణ వ్యవసాయం అని కూడా పిలుస్తారు.

సేంద్రియ వ్యవసాయం అంటే ఏమిటి?*
కృత్రిమ రసాయనాలు, జన్యుమార్పిడి విత్తనాలు, పురుగుమందుల వాడకాన్ని పూర్తిగా తొలగించి, ప్రకృతిలో లభించే సేంద్రియ పదార్థాల సహాయంతో చేసే వ్యవసాయమే సేంద్రియ వ్యవసాయం.
ఇందులో ఆవుపేడ, గోమూత్రం, శనగపిండి, బెల్లం, చెట్ల ఆకులు మొదలైన వాటితో ఎరువులను, పురుగుమందులను తయారు చేస్తారు. ఈ విధంగా పండించిన పంటల వల్ల కేవలం ఆరోగ్యానికి మేలు జరగడమే కాకుండా, భూమి సారాన్ని కూడా కాపాడుతుంది.

ప్రధాన సాగు పద్ధతులు
పంటల మార్పిడి: ఒకే రకమైన పంటను పదే పదే వేయకుండా, పంటను మార్చడం ద్వారా భూమిలో నత్రజని శాతం పెరిగి నేల సారవంతమవుతుంది.

పచ్చిరొట్ట పైర్లు: జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పైర్లను సాగు చేసి అవి పూతకు రాకముందే భూమిలో కలియదున్నడం.
వర్మికంపోస్ట్: వానపాముల సహాయంతో సేంద్రియ వ్యర్థాలను నాణ్యమైన ఎరువుగా మార్చి పొలానికి అందించడం.
జీవామృతం: ఇది నేల సారాన్ని పెంచడానికి మరియు పంటలకు అవసరమైన సూక్ష్మజీవులను అందించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది తయారు చేయడానికి ఒక పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ములో 200 లీటర్లు నీటికి, 10 కిలోల ఆవుపేడ, 10 లీటర్ల గోమూత్రాన్ని వేసి బాగా కలపాలి. తరువాత 2 కిలోల బెల్లం, 2 కిలోల పప్పు దినుసుల పిండిని, పుట్టమట్టి లేదా గట్టు మట్టిని ఒక గుప్పెడు నీటిలో వేర్వేరుగా గడ్డలు రాకుండా కలుపుకొని గోనె సంచి లేదా కాటన్ గుడ్డను కప్పాలి. తయారైన రోజు నుండి 10 నుండి 12 రోజుల లోపు దీనిని సాగు నీటితో కలిపి గాని, లేదా వడకట్టి పంటలపై నేరుగా పిచికారి చేయడానికి ఉపయోగించవచ్చు.
సహజ తెగుళ్ల నివారణః వేప కషాయం, బ్రహ్మాస్త్రం వంటి సహజ కషాయాలను వాడి చీడపీడలను అరికడతారు.

కలిగే ప్రయోజనాలు
రసాయన సాగు నుండి సేంద్రియ సాగుకు మారిన మొదటి రెండు, మూడేళ్లు దిగుబడి కొంత తగ్గే అవకాశం ఉంది. మార్కెట్‌లో ఆర్గానిక్ ఉత్పత్తులకు మంచి ధర లభించాలంటే ఖచ్చితమైన ఆర్గానిక్ సర్టిఫికేషన్ పొందడం రైతులకు కొంత ఖర్చుతో, ప్రక్రియతో కూడుకున్న పని. పండించిన పంటను సరైన ప్రీమియం ధరకు అమ్ముకోవడానికి కోల్డ్ స్టోరేజ్, రవాణా సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి. పేడ, బయో-ఫర్టిలైజర్స్ వంటి సహజ ఎరువుల తయారీకి, కలుపు తీయడానికి ఎక్కువ మందే కూలీలు అవసరమవుతారు.

ముగింపు:
మొదట్లో దిగుబడి కొంత తక్కువగా ఉన్నప్పటికీ, రెండు లేదా మూడు పంటల తర్వాత స్థిరమైన మరియు మెరుగైన దిగుబడులను సాధించవచ్చు. నేటి తరానికి విషరహిత ఆహారాన్ని అందించాలన్నా, రేపటి తరానికి జీవమున్న భూమిని వారసత్వంగా ఇవ్వాలన్నా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఎంతైనా అవసరం.

డా. వై. చైతన్య, పిహెచ్.డి. స్కాలర్, హైదరాబాద్, ఫోన్: 9949804951

Read More

లేగ దూడకు బొడ్డు వాపు / బొడ్డు కంతి / బొడ్డు పుండు

ఈ జబ్బు సాధారణంగా నెల లోపు వయస్సున్న దూడలకు వస్తుంది. బొడ్డు దగ్గర గట్టి వాపు, నొప్పి, చీము కారటం, జ్వరం, కీళ్ళనొప్పులు, కీళ్ళవాపులు వుంటాయి. పాలు త్రాగలేకపోతుంది.

కారణాలు : బొడ్డుకు మట్టి అంటుకోవడం, సూక్ష్మజీవులు ఆశించడం, అపరిశుభ్రమైన పరిసరాలు, దూడ బొడ్డును తల్లి నాకటం
హెర్నియాకు భేదాత్మక పరిశీలన చెయ్యాలి.

పరిష్కారాలు:
ఆయుర్వేదం: క్రింది వాటిలో ఏదైనా ఒక విధానం.

గృహవైద్యం:

  1. బొడ్డుకు పసుపు రాయాలి.
  2. ఉల్లిపాయలు నూనెలో ఉడికించి, వాపుపైపెట్టి కట్టు కట్టాలి.
  3. వన తులసి గింజలు నూరి, వాపుపై పెట్టి కట్టు కట్టాలి.
  4. పొగాకు రసం 10 గ్రా॥, నువ్వుల నూనె 100 గ్రా॥ కలిపి, కాచి, చల్లార్చి వాపుపై పూత పెట్టాలి.
  5. వెల్లుల్లిపాయను నలగగొట్టి వాపుపై పెట్టి కట్టు కట్టాలి.

పెరటి వైద్యం:
మర్కొండాకు, వేపాకు, వావిలాకు, గాడిద గడపాకు ఒక్కొక్కటి గుప్పెడు, కలబంద గుజ్జు 20 గ్రా॥, పసుపు 20 గ్రా॥ నీటి సున్నంలో కలిపి బొడ్డుపై పట్టు వేయాలి.

మూలికావైద్యం:

  1. బాలింతబోలు 50 గ్రా॥, ముసాంబరం 20 గ్రా॥, తగినంత నిమ్మకాయ రసంతో వెచ్చ చేసి వాపుపై రాయాలి.
  2. మహిసాక్షి 50 గ్రా॥, మెంతులు 50 గ్రా॥, మానుప్పు 20 గ్రా॥ నూరి బొడ్డు వాపుపై రాయాలి.

హోమియో:

  1. కాలెండులా Q/ ఎకినేషియా Q 10 చుక్కలు గాని, ఫెర్రం ఫాస్ చూర్ణం గానీ 50 మి.లీ. కొబ్బరి నూనెలో కలిపి వాపుపై రాయాలి.
  2. కాల్కేరియా ఫ్లోర్ 30 మందు 5 బిళ్ళలు ఉదయం, సాయంత్రం 10 రోజులు తినిపించాలి.
  3. పై పూతతో పాటు సైలీషియా 200 మందు మాత్రలు రోజుకు 10 చొ॥న తినిపించాలి.
  4. జ్వరం వుంటే, పైరోజెన్ 30 గానీ, ఎకోనైటం 30 గానీ ఆర్సెనికం ఆల్బం 30 గానీ, బెల్లడోన 30 గానీ 10 మాత్రలు రోజుకు 1 పర్యాయం చొ॥న తినిపించాలి.
  5. పుండు వాసనరాకుండా, మెర్క్‌సాల్ 200 ఉదయం, సాయంత్రం 5 మాత్రలు చొ॥న తినిపించాలి.
  6. బొడ్డుకు చీము వుంటే హెపార్ సల్ఫ్ 30 మందు 5 బిళ్ళలు రోజుకు 2 సార్లు తినిపించాలి.
  7. గాయం మాననప్పుడు మైరిస్టిక సెబిఫెర 30 మందు 5 మాత్రలు రోజుకు 2 సార్లు తినిపించాలి.
  8. హోమియో వ్యాధి నిరోధక టీకా :- స్ట్రెప్టోకోకినం 30 / ఈ. కొలై నోసోడ్ 30 దూడ పుట్టిన వెంటనే మొదటి మోతాదు, అప్పటి నుండి 24 గంటలకు 2వ మోతాదు, 48 గంటలకు 3 వ మోతాదు, 72 గంటలకు 4వ మోతాదు చొప్పున తినిపించాలి.

అల్లోపతి:

  1. ముందుగా బొడ్డు కంతిపై వున్న వెంట్రుకలను తీసివేయాలి.
  2. వాపు పక్వానికి వచ్చే వరకు, అయోడిన్ ఆయింటుమెంటు రాచి, కాపడం పెట్టాలి.
  3. పక్వానికి వచ్చిన తరువాత దానంతట అదే పగిలి, చీము బయటకు రాకుండా వుంటే, పశువైద్యుని సంప్రదించితే వారు గాటు పెట్టి చీము పిండి, పొటాషియం పర్మాంగనేట్ లోషన్‌తో శుభ్రపరుస్తారు.
  4. అయోడిన్ (IODENE) తో తడిపిన గుడ్డను వత్తిగా ఎక్కించాలి.
  5. డైక్రిస్టిసిన్ ఎస్ (DICRYSTICIN S) వంటి ఇంజక్షను, మడు రోజులు కండకు (I/Mగా) చేయించాలి.
  6. ఆక్సికామ్ వెట్ (OXYCAM VET) లేదా మెలోనెక్స్ ప్లస్ (MELONEX PLUS) వంటి ఇంజక్షను, 3 మి.లీ మడు రోజులు కండకు (I/M) చేయించాలి.

జాగ్రత్తలు:

  1. బొడ్డు రోజు రోజుకూ ఎండి పోతూ క్రమేణా రాలిపోతుంది.
  2. ఈనటానికి, దూడను బయటికి రప్పించటానికి సహాయ పడేవారు, శుభ్రంగా సబ్బుతో చేతులు కడుక్కొని ఆ పనికి పూనుకోవాలి.
  3. బొడ్డు ఊడిపోయేదాకా బొడ్డును కాకులు లాగకుండా, తల్లి నాకకుండా, బొడ్డుకు మట్టి అంటకుండా బొడ్డుకు కట్టు కట్టాలి.
  4. గాయంపై ఈగలు వాలకుండా వేపనూనె రాయాలి.

రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… గాజరగడ్డ

గాజరగడ్డ ఒక హెర్బల్ మొక్క. ఇది 30-60 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. గరుకు నూగు కలిగి బిగుతైన కాండం కలిగి ఉంటుంది. ఆకులు 3 చిన్న ఆకులు కలిగి ఉంటాయి. ముక్కోణాకారంలో ఉంటాయి. పూలు చిన్నవిగా, పాలిపోయిన తెలుపు రంగులో గుత్తులలో ఉంటాయి. పూలగుత్తి 3-4 అం. వెడల్పు కలిగి ఉంటుంది. మొగ్గ పింకు రంగులో, పూలు ఎరుపు లేదా ఊదా రంగులో ఉంటాయి. కాయలు గుడ్డు ఆకారంలో చదునుగా ఉంటాయి. కాయ చిన్నదిగా రక్షక నూగుతో కప్పబడి ఎండిపోయి ఉంటుంది. వన్యక్యారెట్ రోడ్డు ప్రక్కన, సాగు చేయని భూముల్లో ఉంటుంది.

సాధారణ నామం : వన్యక్యారెట్ శాస్త్రీయ నామం : డాకస్ కరోట కుటుంబం: ఎపియేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో …

  • గాజరగడ్డని ఆహారంగా, ఔషధంగా ఉపయోగించవచ్చు. గాజరగడ్డని ఉడికించి లేదా తాజాగా తినవచ్చు. పూల గుత్తులను ఫ్రెంచిఫ్రైస్ తయారీలో ఉపయోగించవచ్చు. వాసన కలిగిన గింజలను సూపులు, స్ట్రూల తయారీలో ఉపయోగించవచ్చు.
  • శతాబ్దాల తరబడి దీనిని ప్రత్యామ్నాయ ఔషధంగా ఉపయోగిస్తున్నారు. దీనిలో ఎసిటోన్, ఎసిటైల్‌కోలిన్, ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్, ఆల్ఫాపైసెన్, ఆల్పాటోకోఫెరాల్, ఎపిజెనిన్, అరాకిడోనిక్ యాసిడ్, ఆర్ౙినైన్, అసరోన్, యాస్కార్బిక్ యాసిడ్, బెర్లాప్టెన్, బీటాకెరోటిన్, బీటాసైటోస్టిరాల్, కెఫీక్‌యాసిడ్, క్యామ్‌ఫిర్, క్లోరోజెనిక్ యాసిడ్, క్లోరోఫిల్, క్రైసిన్, సిట్రాల్, సిట్రిక్ యాసిడ్, కౌమారిన్, ఎలెమిసిన్, ఎస్క్యులెటిన్, ఇథీనాల్, యూజెనాల్, ఫాల్కరినాల్, ఫెరూలిక్ యాసిడ్, ఫోలాసిన్, ఫార్మిక్ యాసిడ్, ఫ్రక్టోస్, గామాలినోలెనిక్ యాసిడ్, జిరానియాల్, గ్లూటామిన్, గ్లెåసిన్, హైడ్రోజన్ సయనైడ్, మిస్టిడిన్, కీంప్‌ఫెరాల్, లెసిథిన్, లియోనెన్, లినోలిక్ యాసిడ్, లిథియం, లూపియాల్, లూటిన్, లూటెయోరిన్, లైకోపెన్, మెగ్నీషియం, మాంగనీస్, మిథియోనైన్, మ్యూఫా, మైర్సెన్, మైరిసెటిన్, మిరిస్టిసిన్, నియాసిన్, ఓలిక్‌యాసిడ్, పాంటోథనిక్ యాసిడ్, పెక్టిన్, ఫినైల్ అలనైన్, పొటాషియం, సొరాలెన్, క్వెర్సెటిన్, స్కోపోలెటిన్, స్టిగ్మాస్టెరాల్, సుక్రోస్, థయామిన్, ట్రిప్టోఫాన్, ట్రైరోసిన్, అంబెల్లిఫెరోన్, క్ౙాంతోటాక్సిన్, అనేక విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవన్నీ ఈ క్రింది చర్యలను కలిగి ఉంటాయి. అనాల్ౙెసిక్, యాంటిఆర్థ్రెåటిక్, యాంటిడిప్రెసెంట్, యాంటిసైకోటిక్, యాంటిస్కైజోఫ్రినిక్, యాంటిడోట్, యాంటిఇన్‌ఫ్లమేటరి, యాంటీబాక్టీరియల్, యాంటికన్వల్సెంట్, యాంటిడయాబెటిక్, యాంటిఈస్ట్రోజెనిక్, యాంటిఫ్లూ, యాంటిహిస్టామినిన్, యాంటి ఆక్సిడెంట్, యాంటిసెప్టిక్, యాంటి స్పాస్మోడిక్, యాంటిఎపిలెప్టిక్, యాంటియాంక్ౙె åటి, యాంటిస్ట్రెస్, యాంటిహ్యాంగఓవర్, యాంటివైరల్, క్యాన్సర్‌ప్రివెంటివ్, ఎక్స్‌పెక్టొరెంట్, ఫంగిస్టాట్, ఇమ్యునోస్టిమ్యులెంట్, సెడెటిన్, ట్రాంక్విలైజర్, ఎఫ్రోడిసియాక్, స్వీటెనర్, పిట్యుటరిస్టిమ్యులెంట్.
  • ఇది అతి విలువైన మొక్క. అల్ౙీమర్స్, పార్కిన్‌సన్‌వ్యాధి, క్రోన్స్‌వ్యాధి, ఇన్‌ఫెర్టిలిటి, ఆస్త్మాప్రివెంటివ్, అనేక రకాల క్యాన్సర్, డయాబెటిస్, ల్యుకేమియా, ఎయిడ్స్, స్పైనాబిఫిడ, మైగ్రెయిన్‌హెడఏక్, ఒబేసిటి, సాధారణ జలుబు వ్యాధుల నివారణకుపయోగపడుతుంది.

వ్యవసాయరంగంలో

  • క్యారట్ ద్రావణం (1 మి.లీ.) ట్రైబోలియం కాస్టానియంపై అత్యుత్తమ కీటకనాశక చర్యను ప్రదర్శించింది. క్యారట్ ద్రావణం (1మి.లీ.) { లెవిస్టికం అఫిసినేల్ (2 మి.లీ.) ద్రావణం అత్యంత సమర్ధవంతంగా ట్రైబోలియం కాస్టానియంని అరికట్టాయి. (హ్రుడోవ, అతని అనుచరులు, 2006)
  • క్యారట్ గింజల నుండి వేరుచేసిన ఎసెన్షియల్ ఆయిల్ ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్‌పై యాంటి ఫంగల్ చర్యను ప్రదర్శించింది. (దివేరి, డుబె, 1995). క్యారట్ వేర్ల నుండి తీసిన ఎసెన్షియల్ ఆయిల్ అఫ్లాటాక్సిన్ ఉత్పత్తిని నివారించింది. (జస్సికామిసియాన్, అతని అనుచరులు, 2004; బెండియాడెల్లా, అతని అనుచరులు, 2014). క్యారట్ ఆయిల్‌లోని కెరటాల్ ఆల్టర్నేరియా ఆల్టర్నేట శిలీంద్ర పెరుగుదల నరికట్టింది (జాస్సికా మిసియాన్, అతని అనుచరులు, 2004).
  • క్యారట్ గింజల నూనె ఆస్పర్ౙిల్లస్ పారసైటికస్ పెరుగుదలనరికట్టి అఫ్లాటాక్సిన్ ఉత్పత్తవకుండా చేసింది (భట్, అతని అనుచరులు, 1983).
  • క్యారట్ గింజల నుండి వేరు చేసిన రెండు పెప్టెåడ్లు వర్టిసిల్లియం డాలియే పెరుగుదలను సమర్ధవంతంగా అరికట్టాయి (ఇల్లి, అతని అనుచరులు, 2006).
  • క్యారట్ పూల నుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్ స్పోడోప్టెరా లిట్టోరాలిన్ 3వ దశ లార్వాలపై ఫ్యూమిగెంట్ చర్యను ప్రదర్శించింది (సలాహెడ్ౙిన్, అతని అనుచరులు, 2013).
  • క్యారట్ ఎసెన్షియల్ ఆయిల్ క్యూలెక్స్ పిపియెన్‌స్పాల్లెన్స్, డి. మాగ్న దోమలపై లార్విసైడల్ ప్రభావాన్ని చూపింది (పార్క్, పార్క్, 2012).
  • క్యారట్ పూల నుండి వేరు చేసిన ఆవిరయ్యే నూనె స్పోడోప్టెరా లిట్టొరాలిస్ 3వ దశ లార్వాలపై విషప్రభావాన్ని చూపింది. (సౌగ్విర్, అతని అనుచరులు, 2013).
  • క్యారట్ ఆయిల్ బాసిల్లస్ సబ్‌టైలస్, సాల్మొనెల్లా టైఫిన్యూరియం బాక్టీరియా పెరుగుదలనరికట్టింది (గ్రోవర్, రావు, 1976, 1978, 1979).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

అర్నాబ్ తుఫాను వేళ పశుసంపద రక్షణే రైతులకు శ్రీరామరక్ష!*

పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకందారులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలురైతులకు పశువైద్య నిపుణుల సూచనలుతుఫాను ముప్పు.. పశుసంపదపై ప్రత్యేక శ్రద్ధ అవసరం!ప్రకృతి వైపరీత్యాలు రైతు జీవితాన్ని ఒక్కసారిగా అతలాకుతలం చేస్తాయి. ముఖ్యంగా తుఫానులు, భారీ వర్షాలు, వరదలు, ఈదురుగాలుల వల్ల పంటలతోపాటు పశుసంపద కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అర్నాబ్ తుఫాను నేపథ్యంలో పశుపోషకులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, ప్రభుత్వ శాఖలు జారీ చేసే హెచ్చరికలను పాటించడం ద్వారా పశువుల ప్రాణాలను కాపాడుకోవడంతోపాటు ఆర్థిక నష్టాలను కూడా తగ్గించుకోవచ్చు.ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్, విజయవాడ 25 అక్టోబర్ 2026న జారీ చేసిన సర్క్యులర్‌లో తుఫానుకు ముందు, తుఫాను సమయంలో, తుఫాను అనంతరం చేపట్టాల్సిన చర్యలను వివరించింది. పశువులను ఎత్తైన ప్రాంతాలకు తరలించడం, అత్యవసర పశువైద్య బృందాలను సిద్ధం చేయడం, పశుగ్రాసం మరియు మందులను అందుబాటులో ఉంచడం, వ్యాధుల నివారణ చర్యలు చేపట్టడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది.పశువులు రైతులకు కేవలం జీవాలు మాత్రమే కాదు. అవి కుటుంబానికి నిరంతర ఆదాయాన్ని అందించే ఆస్తులు. అందువల్ల తుఫాను వచ్చే వరకు వేచి చూడకుండా ముందుగానే ప్రణాళిక రూపొందించుకోవాలి.

*1. తుఫానుకు ముందే పశువుల రక్షణకు ప్రణాళిక*తుఫాను సమయంలో పశువుల మరణాలకు ప్రధాన కారణాలు వరదల్లో చిక్కుకోవడం, షెడ్లు కూలిపోవడం, బలమైన గాలులకు పైకప్పులు ఎగిరిపోవడం, మేత మరియు తాగునీరు అందుబాటులో లేకపోవడం.రైతులు ముందుగా తమ పశువుల సంఖ్య, వాటి ఆరోగ్య పరిస్థితి, షెడ్ల భద్రత, మేత నిల్వలు, తరలించడానికి అనువైన సురక్షిత ప్రాంతాలను గుర్తించాలి.• పశువుల షెడ్ల పైకప్పులు, రేకులు, స్తంభాలు, తలుపులను పరిశీలించి మరమ్మతులు చేయాలి.• వరద ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాల నుంచి పశువులను ముందుగానే ఎత్తైన, సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.• పశువులను చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర, బలహీనమైన గోడల పక్కన కట్టకూడదు.• కనీసం 3–5 రోజులకు సరిపడా పొడి గడ్డి, పశుగ్రాసం, దాణా నిల్వ చేసుకోవాలి.• శుభ్రమైన తాగునీటిని అందుబాటులో ఉంచాలి.• పశువుల గుర్తింపు ట్యాగులు, బీమా పత్రాలు, టీకాల వివరాలను భద్రపరచుకోవాలి.• గర్భిణీ పశువులు, చిన్న దూడలు, ఇటీవల ఈనిన పశువులు, అనారోగ్యంతో ఉన్న జీవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.పశువులను తరలించాల్సిన పరిస్థితి ఏర్పడితే వరద ప్రవాహాలు లేని సురక్షిత మార్గాన్ని ఎంచుకోవాలి. ప్రాణాపాయం ఉన్న సమయంలో పశువులను రక్షించడానికి ప్రయత్నిస్తూ మనుషులు ప్రమాదంలో పడకూడదు. పశువుల తరలింపుపై స్థానిక అధికారులు ఇచ్చే సూచనలను పాటించాలి.

*2. పాడి పశువుల సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు*పాడి పశువుల ద్వారా రైతులకు ప్రతిరోజూ ఆదాయం లభిస్తుంది. తుఫాను సమయంలో పశువులు భయాందోళనలకు గురికావడం, ఆహారం సరిగా తీసుకోకపోవడం, కలుషిత నీటిని తాగడం వల్ల పాల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది.పశువుల షెడ్లలోకి వర్షపు నీరు రాకుండా చూసుకోవాలి. నేలపై నీరు నిల్వ ఉండకుండా పారుదల సౌకర్యం కల్పించాలి. పశువులు జారిపడకుండా నేలను శుభ్రంగా ఉంచాలి.వర్షపు నీటితో కలుషితమైన గడ్డి, బురద అంటుకున్న మేత, బూజు పట్టిన దాణాను తినిపించకూడదు. పరిశుభ్రమైన తాగునీరు అందించాలి. పశువులు ఆకలి తగ్గడం, జ్వరం, విరేచనాలు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు చూపిస్తే వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి.

*3. గొర్రెలు, మేకల పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలి*గొర్రెలు, మేకలు సాధారణంగా బహిరంగ ప్రదేశాల్లో మేత మేస్తాయి. తుఫాను సమయంలో వీటిని మేతకు పంపడం ప్రమాదకరం. బలమైన గాలులు, వర్షం, వరద నీరు, చల్లటి వాతావరణం వల్ల ముఖ్యంగా చిన్న పిల్లలు, గర్భిణీ జీవాలు, బలహీనమైన జంతువులు ఇబ్బందులకు గురవుతాయి.

*రైతులు పాటించాల్సిన సూచనలు:*• తుఫాను హెచ్చరికల సమయంలో గొర్రెలు, మేకలను బహిరంగ మేతకు పంపకూడదు.• సురక్షితమైన, ఎత్తైన ప్రదేశంలో షెడ్లు ఏర్పాటు చేసుకోవాలి.• షెడ్లలో నీరు నిల్వ ఉండకుండా, నేల పొడిగా ఉండేలా చూడాలి.• ఎండిన గడ్డి, సురక్షితమైన పచ్చిమేత, తగిన దాణాను ముందుగానే నిల్వ చేసుకోవాలి.• చిన్న పిల్లలు, గర్భిణీ జీవాలను ప్రత్యేకంగా సంరక్షించాలి.• వరద నీటితో కలుషితమైన మేతను తినిపించకూడదు.తుఫాను తరువాత గొర్రెలు, మేకల్లో జ్వరం, దగ్గు, విరేచనాలు, కుంటడం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా పశువైద్య సహాయం పొందాలి.

*4. కోళ్ల ఫారాల యజమానులు తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలు*కోళ్ల పెంపకంలో తుఫానుల వల్ల ఒక్కసారిగా పెద్ద మొత్తంలో ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంది. షెడ్ల పైకప్పులు ఎగిరిపోవడం, వర్షపు నీరు లోపలికి రావడం, లిట్టర్ తడవడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల కోళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.కాబట్టి కోళ్ల పెంపకందారులు ఈ చర్యలు చేపట్టాలి:• షెడ్ల పైకప్పులు, రేకులు, తలుపులు, పక్క తెరలను బలంగా బిగించాలి.• వర్షపు నీరు షెడ్‌లోకి రాకుండా పారుదల ఏర్పాటు చేయాలి.• లిట్టర్ తడవకుండా చూసుకోవాలి. అవసరమైన పొడి పరుపు పదార్థాన్ని సిద్ధంగా ఉంచాలి.• కోళ్లకు సరిపడా దాణా, స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉంచాలి.• విద్యుత్ అంతరాయాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ విద్యుత్ ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలి.• గాలి ప్రసరణ పూర్తిగా ఆగిపోకుండా జాగ్రత్తపడాలి.• తడిసిన దాణా, బూజు పట్టిన పదార్థాలను తొలగించాలి.కోళ్లలో మరణాల సంఖ్య పెరగడం, దాణా తీసుకోవడం తగ్గడం, శ్వాస సమస్యలు కనిపించడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి.

*5. పశుగ్రాసం నిల్వలు.. అత్యవసర ప్రణాళికలో కీలకం*తుఫాను సమయంలో రహదారులు దెబ్బతినడం, రవాణా నిలిచిపోవడం, పొలాలు నీట మునగడం వల్ల పశుగ్రాసం కొరత ఏర్పడుతుంది. అందువల్ల పశుగ్రాసాన్ని ముందుగానే నిల్వ చేసుకోవడం అత్యంత ముఖ్యం.పశుపోషకులు పొడి గడ్డి, ఎండు మేత, పశుదాణాను వర్షం తగలని సురక్షిత ప్రదేశంలో నిల్వ చేయాలి. మేతను నేలపై నేరుగా ఉంచకుండా తేమ చేరకుండా జాగ్రత్తపడాలి. నిల్వ చేసిన మేత బూజు పట్టకుండా తరచుగా పరిశీలించాలి.ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ సర్క్యులర్‌లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పొడి, పచ్చి పశుగ్రాసం లభ్యతను గుర్తించి, అవసరమైన ప్రాంతాలకు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అవసరాన్ని బట్టి పశుదాణా పంపిణీకి కూడా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.రైతులు పశుగ్రాస కొరత ఎదురైనప్పుడు స్థానిక పశువైద్యశాల లేదా సంబంధిత అధికారులను సంప్రదించి అందుబాటులో ఉన్న ప్రభుత్వ సహాయంపై వివరాలు తెలుసుకోవాలి.

*6. పశువైద్య అత్యవసర బృందాలు, 1962 అంబులెన్స్ సేవలు*తుఫాను సమయంలో పశువులు గాయపడటం, అనారోగ్యానికి గురికావడం, వరద ప్రాంతాల్లో చిక్కుకోవడం వంటి అత్యవసర పరిస్థితులు ఎదురుకావచ్చు. ఇలాంటి సందర్భాల్లో సకాలంలో పశువైద్య సహాయం అందడం చాలా ముఖ్యం.పశుసంవర్ధక శాఖ సర్క్యులర్ ప్రకారం, పశువైద్య సహాయక సర్జన్, పారా వెటర్నరీ సిబ్బంది, అటెండర్, గోపాలమిత్రతో కూడిన అత్యవసర ప్రతిస్పందన బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఈ బృందాలకు అవసరమైన ప్రథమ చికిత్స కిట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలి.తుఫాను ప్రభావిత గ్రామాల్లో పశువైద్య బృందాలు అందుబాటులో ఉండి, గాయపడిన మరియు అనారోగ్యంతో ఉన్న జీవాలకు చికిత్స అందించాలి. అవసరమైన చోట 1962 పశువైద్య అంబులెన్స్ సేవలను సిద్ధంగా ఉంచాలని కూడా శాఖ ఆదేశించింది.రైతులు తమ సమీప పశువైద్యశాల ఫోన్ నంబర్‌ను ముందుగానే తెలుసుకోవాలి. అత్యవసర సమయంలో పశువుల పరిస్థితి, గ్రామం పేరు, చేరుకోవడానికి అనువైన మార్గం వంటి వివరాలను స్పష్టంగా తెలియజేయాలి.

*7. తుఫాను సమయంలో తప్పనిసరిగా నివారించాల్సిన పనులు*• వరద నీటిలో పశువులను బలవంతంగా నడిపిస్తూ తరలించకూడదు.• తెగిపడిన విద్యుత్ తీగల దగ్గరకు వెళ్లకూడదు.• కలుషితమైన వరద నీటిని పశువులకు తాగించకూడదు.• తడిసిన, బూజు పట్టిన మేతను తినిపించకూడదు.• పశువైద్యుడి సలహా లేకుండా యాంటీబయాటిక్స్, ఇతర మందులను విచక్షణారహితంగా వాడకూడదు.• బలమైన గాలులు వీచే సమయంలో బలహీనమైన షెడ్లలో పశువులను ఉంచకూడదు.• ప్రమాదకర పరిస్థితుల్లో పశువులను రక్షించే ప్రయత్నంలో మనుషుల ప్రాణాలను పణంగా పెట్టకూడదు.

*8. తుఫాను అనంతరం వ్యాధుల నివారణకు ప్రత్యేక శ్రద్ధ*తుఫాను తగ్గిన తరువాత కూడా రైతుల బాధ్యత ముగియదు. వరద నీరు తగ్గిన తరువాత కలుషితమైన నీరు, తడి వాతావరణం, నిల్వ ఉన్న చెత్త, దోమలు, పేలు వంటి వ్యాధి వాహకాల వల్ల పశువులకు వివిధ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.తుఫాను అనంతరం రైతులు చేపట్టాల్సిన చర్యలు:• పశువుల షెడ్లలోని బురద, చెత్తను తొలగించి శుభ్రపరచాలి.• పశువులకు పరిశుభ్రమైన తాగునీరు, నాణ్యమైన మేత అందించాలి.• గాయపడిన జీవాలకు వెంటనే చికిత్స అందించాలి.• జ్వరం, విరేచనాలు, దగ్గు, శ్వాస సమస్యలు వంటి లక్షణాలను గమనించాలి.• పశువైద్య అధికారుల సూచనల మేరకు అవసరమైన టీకాలు, వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలి.• చనిపోయిన జంతువుల కళేబరాలను బహిరంగ ప్రదేశాల్లో వదిలేయకూడదు. స్థానిక అధికారుల సూచనల మేరకు సురక్షితంగా తొలగించాలి.ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ సర్క్యులర్‌లో తుఫాను అనంతరం పశువైద్య బృందాలు ప్రభావిత గ్రామాలను సందర్శించి పశువుల నష్టాలను నమోదు చేయాలని, గాయపడిన మరియు అనారోగ్యంతో ఉన్న జీవాలకు చికిత్స అందించాలని సూచించారు. అంటువ్యాధుల నివారణకు అవసరమైన టీకాలు వేయడం, వ్యాధుల వ్యాప్తిని పర్యవేక్షించడం, పశుగ్రాసం మరియు తాగునీటి సరఫరాను సమన్వయం చేయడం వంటి చర్యలకు ప్రాధాన్యం ఇచ్చారు.

*9. పశుసంపద నష్టాల నమోదు.. రైతులు చేయాల్సిన పని*తుఫాను వల్ల పశువులు చనిపోయినా, షెడ్లు దెబ్బతిన్నా, పశుగ్రాసం నష్టపోయినా రైతులు వెంటనే స్థానిక పశువైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలి.నష్టపోయిన పశువుల సంఖ్య, వాటి వివరాలు, షెడ్ల నష్టం, పశుగ్రాస నష్టం వంటి సమాచారాన్ని నమోదు చేసుకోవాలి. సాధ్యమైనప్పుడు సురక్షితంగా ఫొటోలు తీసి, సంబంధిత అధికారులకు అందించాలి. బీమా ఉన్న పశువుల విషయంలో బీమా సంస్థ నిబంధనల ప్రకారం సమాచారం అందించాలి.శాఖ సర్క్యులర్ ప్రకారం, పశువుల నష్టాలు, భవనాల నష్టాలు, పశుగ్రాస నష్టాల వివరాలను సంబంధిత అధికారులకు వెంటనే నివేదించాలి. జిల్లా స్థాయిలో నియంత్రణ గదుల ద్వారా సమాచారం సేకరించి, అవసరమైన సహాయక చర్యలను సమన్వయం చేయాలని సూచించారు.

*10. ప్రతి రైతు సిద్ధం చేసుకోవాల్సిన అత్యవసర కిట్*ప్రతి పశుపోషకుడు ఒక అత్యవసర సంరక్షణ కిట్ సిద్ధం చేసుకోవడం మంచిది. అందులో ఈ వస్తువులు ఉంచుకోవాలి:• టార్చ్‌లైట్, అదనపు బ్యాటరీలు.• బలమైన తాళ్లు, పశువుల గుర్తింపు వివరాలు.• శుభ్రమైన నీటి పాత్రలు.• ప్రథమ చికిత్సకు అవసరమైన సామగ్రి.• పశువైద్యశాల ఫోన్ నంబర్.• పశువుల బీమా పత్రాలు, టీకాల రికార్డులు.• కొన్ని రోజుల పాటు సరిపడా పొడి గడ్డి, దాణా.గ్రామంలోని రైతులు పరస్పరం సహకరించుకుంటూ అత్యవసర సమయంలో పశువులను ఎక్కడికి తరలించాలి, మేతను ఎలా సరఫరా చేయాలి, చికిత్స ఎక్కడ అందుబాటులో ఉంటుంది అనే అంశాలపై ముందుగానే ప్రణాళిక రూపొందించుకోవాలి.తుఫానులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలను పూర్తిగా నివారించలేకపోయినా, ముందస్తు ప్రణాళికతో వాటివల్ల కలిగే నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చు. పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించడం, పశుగ్రాసాన్ని నిల్వ చేసుకోవడం, షెడ్లను బలోపేతం చేయడం, పరిశుభ్రమైన నీరు అందించడం, వ్యాధుల లక్షణాలను ముందుగానే గుర్తించడం ద్వారా రైతులు తమ పశుసంపదను కాపాడుకోవచ్చు.ప్రభుత్వ శాఖల సూచనలు, పశువైద్య బృందాల సహకారం, రైతుల అప్రమత్తత కలిసివస్తే తుఫాను ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కోవచ్చు.*“పశుసంపదను కాపాడుకుందాం — రైతు కుటుంబ ఆర్థిక భద్రతను నిలబెట్టుకుందాం!

”**- డా.జి.రాంబాబు,* పశువైధ్యాధికారి, కడప 9618499184

Read More

ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా వివిధ రంగాలపై దీని యొక్క ప్రభావం

తెలంగాణలో యాసంగి పంటలు రైతుల ఆదాయాన్ని పెంచడంలో, ఆహార భద్రతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సీజన్లో వరి, మొక్కజొన్న, శనగ, మినుములు వంటి పంటలను సాగు చేసి రైతులు మంచి దిగుబడులు సాధించవచ్చు. నీటి వనరుల సమర్థ వినియోగం, సరైన పంటల ఎంపిక, శాస్త్రీయ యాజమాన్య పద్ధతుల ద్వారా యాసంగి సాగును మరింత లాభదాయకంగా మార్చుకోవచ్చు. గాలిలో వచ్చే చిన్న మార్పు ప్రపంచ దేశాల వాతావరణాన్ని తలకిందులు చేయగలదనడానికి ఎల్ నినో ఒక ఉదాహరణ. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం వల్ల ఏర్పడే ఈ వాతావరణ చక్రం కేవలం దక్షిణ అమెరికా తీరానికే పరిమితం కాకుండా ఆసియా-ఆఫ్రికా దేశాల రుతుపవనాలను, ముఖ్యంగా భారతీయ వ్యవసాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. వర్షాభావం, కరువు కాటకాలు, తాగునీటి కొరత నుంచి ద్రవ్యోల్బణం వరకు ఎల్నినో సృష్టించే అవకాశం ఉంది.

ఎల్ నినో అంటే
ఎల్ నినో అనేది స్పానిష్ భాషా పదం. దీని అర్థం “చిన్న బాలుడు” లేదా “క్రీస్తు బాలుడు”. దక్షిణ అమెరికాలోని పెరూ దేశ తీర ప్రాంతానికి సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో డిసెంబర్ సమయంలో ఉష్ణోగ్రతల్లో మార్పులు కనిపించడం వల్ల దీనికి ఆ పేరు పెట్టారు. ఇది కేవలం ఒక ప్రాంతీయ పరిణామం కాదు. ఇది ప్రపంచ వాతావరణ వ్యవస్థను, ముఖ్యంగా ఆసియా-ఆఫ్రికా దేశాల రుతుపవనాలను తీవ్రంగా ప్రభావితం చేసే ఒక పెద్ద వాతావరణ చక్రం. దీనిని శాస్త్రీయంగా ఎల్ నినో -సదరన్ ఆసిలేషన్ చక్రంలో భాగంగా పిలుస్తారు.

ఎల్ నినో ఏర్పడే విధానం
ప్రతి 5 లేదా 7 సంవత్సరాలకు ఒకసారి దక్షిణ అమెరికాలోని పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతంలో ఉష్ణ జలరాశి అధికంగా పేరుకుపోవడం వల్ల అక్కడి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ పరిస్థితిని ఎల్ నినో అంటారు. సాధారణంగా తూర్పు నుంచి పడమర వైపు వీచే వాణిజ్య పవనాలు బలహీనపడటంతో వెచ్చని సముద్రజలం తూర్పు పసిఫిక్ వైపు కదులుతుంది. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వాతావరణంపై పడుతుంది.

వర్షాభావం – కరువు
చారిత్రక డేటా ప్రకారం భారతదేశంలో సంభవించిన అనేక కరువు సంవత్సరాలు (ఉదాహరణకు 1972, 1982, 2002, 2009, 2015, 2026) ఎల్నినో సంవత్సరాలతో ముడిపడి ఉన్నాయి. అయితే ఎల్ నినో ఉన్న ప్రతి సంవత్సరంలోనూ కరువు తప్పనిసరిగా వస్తుందని చెప్పలేం; ఇతర వాతావరణ పరిస్థితులూ ప్రభావం చూపుతాయి.

భారతదేశంపై ప్రభావం
నైరుతి రుతుపవనాలు బలహీనపడటం వల్ల ఖరీఫ్ సీజన్లో వరి, పత్తి, వేరుశనగ వంటి పంటల సాగు తగ్గిపోవచ్చు. ఎల్నినో సంవత్సరాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదై తీవ్రమైన వడగాల్పులు, వర్షాభావ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. వర్షాలు తగ్గడంతో రైతులు బోర్లు, బావులపై ఆధారపడటం పెరుగుతుంది. ఫలితంగా భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోవచ్చు.

వ్యవసాయంపై ప్రభావం
పంట దిగుబడులు తగ్గిపోవడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పై ప్రభావం ఉంటుంది. వ్యవసాయ కూలీలకు పనిదినాలు తగ్గి ఉపాధి సమస్య తలెత్తుతుంది. పంటల ఉత్పత్తి తగ్గడం వల్ల రైతుల ఆదాయం పడిపోవచ్చు.

లా నినో
పెరూ తీరానికి పక్కగా వెళ్లే హంబోల్ట్ శీతల ప్రవాహం కారణంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తగ్గి, అధిక పీడన పరిస్థితులు ఏర్పడే దశను లా నినా అంటారు. భారతదేశం వైపు రుతుపవనాలు బలంగా వీచే పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఏర్పడి, సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అయితే ప్రభావం ప్రతి సంవత్సరంలో ఒకేలా ఉండదు.

ఇతర ప్రధాన ప్రభావాలు
ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం
వ్యవసాయోత్పత్తులు తగ్గడం వల్ల ఆహార ధాన్యాల ధరలు విపరీతంగా పెరిగి ద్రవ్యోల్బణం పెరగవచ్చు. ఇది దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

మత్స్య సంపద నాశనం
పెరూ తీరంలో చల్లని నీరు పైకి రాకపోవడం వల్ల ఫైటోప్లాంక్టన్ తగ్గి, చేపల సంతతి ముఖ్యంగా ఆంకోవి చేపలు—తీవ్రంగా ప్రభావితమవుతుంది.

తాగునీరు, విద్యుత్ కొరత
జలాశయాల్లో నీరు అడుగంటిపోవడం వల్ల జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గి, తాగునీటి సమస్యలు తలెత్తవచ్చు.

డా. కె. శేఖర్, అసిస్టెంట్ ప్రోఫెసర్ (అగ్రోనోమి), వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్
డా. రజిని దేవి, అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎకనామిక్స్), వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్
Ph: 9032128124

Read More

ఔషధ మొక్క… నిమ్మగడ్డి

నిమ్మగడ్డి వార్షిక హెర్బల్ మొక్క. ఇది 2 నుండి 4 అ. ఎత్తు పెరుగుతుంది. 2 నుంచి 3 అ. వెడల్పు విస్తరిస్తుంది. ఆకు సువాసనతో, నిత్యహరితంగా ఉంటుంది. ఈ మొక్క అరుదుగా పూస్తుంది. ఆకులు 0.51 అం. వెడల్పు, సుమారు 3 అ. పొడవు ఉండి ఆకు చివర్లు వాలి ఉంటాయి. నిత్యహరిత ఆకులు కాంతివంతమైన నీలిఆకుపచ్చ రంగులో ఉండి నలిపితే నిమ్మ వాసననిస్తాయి. పూలరెమ్మలు 30-60 సెం.మీ. పొడవుంటాయి..

సాధారణ నామం : లెమన్‌గ్రాస్ శాస్త్రీయ నామం : సింబోపోగాన్ సిట్రేటస్ కుటుంబం: పోయేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • అర్ౙెంటైనాలో ఆకు కషాయాన్ని గొంతునొప్పి తగ్గించడానికి లోపలికి తీసుకుంటారు.
  • బ్రెజిల్‌లో ఆకులతో తయారు చేసిన టీని శరీరంలో ఈడ్పులు తగ్గడానికి, బాధ నివృత్తి ఔషధంగా, వాపు తగ్గించడానికి, జ్వరం తగ్గించడానికి, మూత్రం సాఫీగా పారడానికి, ఉద్రేకం తగ్గించడానికి సేవిస్తారు.
  • క్యూబాలో ఎండిన ఆకులను, కాండాన్ని వేడి నీటిలో మరగించిన కషాయాన్ని జలుబు, కీళ్ళవాతం తగ్గించడానికి త్రాగిస్తారు. ఈజిప్టులో ఎండిన ఆకులు, కాండంతో తయారు చేసిన కషాయాన్ని మూత్రపిండాలలో ఈడ్పుని తగ్గించడానికి, మూత్రవర్థకంగా ఉపయోగిస్తారు.
  • భారతదేశంలో మొత్తం తాజా మొక్క పాములను వికర్షిస్తుంది. 2-3 చుక్కలు నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్‌ని వేడినీటిలో కలిపి త్రాగితే గ్యాస్ట్రిక్ సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. కలరా వ్యాధిగ్రస్థులకు నిమ్మరసంలో కొన్ని చుక్కలు నిమ్మగడ్డి నూనెని కలిపి త్రాగిస్తారు. తీవ్ర తలనొప్పి, జ్వరం తగ్గడానికి ఎండిన ఆకుల వేడి నీటి ద్రావణాన్ని స్నానానికి ఉపయోగిస్తారు. కేంద్ర నాడీమండల ఉపశమనానకి నిమ్మగడ్డితో తయారు చేసిన టీని త్రాగుతారు. మలేషియా, ఇండోనేషియాలో మొత్తం మొక్కతో తయారు చేసిన వేడి నీటి ద్రావణాన్ని ఒక రుతు విడుదలను ప్రోత్సహించే ఔషధంగా త్రాగుతారు.
  • థాయ్‌లాండ్‌లో సువాసనకి మొత్తం మొక్కను పీలుస్తారు. ఆకులను ఆకలి పుట్టించు పదార్థంగా తింటారు. ఎండిన మొక్క వేడి నీటి ద్రావణాన్ని ఆకలి పుట్టించడానికి త్రాగుతారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు వేరుతో తయారు చేసిన వేడి నీటి ద్రావణాన్ని త్రాగుతారు.
  • అమెరికాలో మొత్తం మొక్క వేడి నీటి ద్రావణాన్ని గాయాలను మాన్పడానికి, విరిగిన ఎముకల వల్ల కలిగే నొప్పి తగ్గించడానికి ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో

  • నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్, సిట్రాల్ ఈగల లార్వాలను, పెద్ద పురుగులను చంపాయి (పింటో, అతని అనుచరులు, 2015).
  • నిమ్మగడ్డి మొక్కలు దోమలను వికర్షిస్తాయి. సిట్రొనెల్లా ఆయిల్ దోమలను వికర్షిస్తుంది. నిమ్మగడ్డి నూనె చెదలు, పొడినల్లులు, గోమార్లను కీటకనాశక చర్య ద్వారా నివారిస్తుంది. నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్ డెంగూ జ్వరం వ్యాప్తి చేసే దోమలను చంపుతుంది.
  • నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్‌ని వరి ధాన్యం నిల్వ సమయంలో ఆశించే ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్ పెరుగుదలను, అఫ్లాటాక్సిన్ ఉత్పత్తిని నివారించడానికి ఉపయోగించవచ్చు. (పరనగమ, అతని అనుచరులు, 2003).
  • నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్ గొర్రెల నాశించే కెడ్ (గోమారి), మెలోఫాగస్ ఓవినస్‌పై అత్యధిక కీటకనాశక చర్యను ప్రదర్శించింది. దీనిని కెడ్ జీవ నియంత్రణలో శక్తి వంతమైన భాగంగా పరిగణనలోకి తీసుకోవచ్చు. (గెమెడ, అతని అనుచరులు, 2014).
  • నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్‌ని జీవపురుగు మందుగా ఉపయోగించవచ్చు. దీనిని గొంగళిపురుగుల నివారణలో ఉపయోగించారు (శిల అడ్నియాన, అతని అనుచరులు, 2011). నిమ్మ గడ్డి ఎసెన్షియల్ ఆయిల్ (0.5%) 5 నిమిషాలలో గొంగళిపురుగులను పూర్తిగా చంపింది.
  • నిమ్మగడ్డి నూనె కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ పెద్ద పురుగులపై వికర్షక చర్యను ప్రదర్శించింది (పరానగమ, అతని అనుచరులు, 2002).
  • నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్ (1%) క్యాబేజి డైమండ్ బ్యాక్‌మాత్ పురుగుల సంఖ్యను తగ్గించే చర్య కలిగి ఉంది. దీనిని డైమండ్ బ్యాక్‌మాత్ నివారణకు జీవ పురుగు మందుగా సిఫారసు చేశారు. ఇది క్యాబేజి పంటకు ఎటువంటి హాని కల్గించదు (సుదార్త, అతని అనుచరులు, 2013).
  • నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్ మొక్కజొన్న కండెల నిల్వ సమయంలో సైటోఫిలస్ జియామెయిస్ ఆశించకుండా కాపాడింది (కబేర, అతని అనుచరులు, 2011).
  • నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్ ఆస్పర్ౙిల్లస్ నైగర్ పెరగుదల నరికట్టింది (డెబిల్లర్‌బెక్, అతని అనుచరులు, 2001). అంతేగాక నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్ ఆస్పర్ౙిల్లస్ నైగర్ అఫ్లాటాక్సిన్ ఉత్పత్తి చేయకుండా నివారిస్తుంది (హెలాల్, అతని అనుచరులు, 2006, 2007).
  • నిమ్మగడ్డి పేనుబంక, మైజస్ పెర్సికె, పై కీటకనాశక చర్యను ప్రదర్శించింది (స్నీ˜ అండ్ క్లింగాఫ్, 1990).
  • నిమ్మగడ్డి, రోజ్‌మేరి, థైమస్ ఎసెన్షియల్ ఆయిల్, వాటి రసాయన మిశ్రమాలను కలిపి క్యాబేజి సెమిలూపర్, ట్రైకోప్లూసియా ని పై వాటి ప్రభావాన్ని పరీక్షించినపుడు ఈ నూనెలు, వాటి రసాయన మిశ్రమాలు పురుగు క్యూటికల్ లోనికి ప్రవేశించి వాటిని చంపాయి (టక్, 2015).
  • నిమ్మగడ్డి ద్రావణం (1గ్రా. 150 గ్రా. గింజలకు) మొక్కజొన్న గింజల నిల్వ సమయంలో ఆశించే వీవిల్ సైటోఫిలస్ జియామెయిస్‌ని 50%కి పైగా చంపింది. 6 గ్రా. మోతాదువద్ద 90% పురుగులు చంపబడ్డాయి. నిమ్మగడ్డి మొక్క సులభ లభ్యత, దాని అధిక కీటక నాశక చర్య దానిని ఆకర్షణీయమైన జీవ పురుగు మందుగా నిరూపించాయి (ఒబోహ, 2016).
  • నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్ శాండ్ ఫ్లెå, ఫ్లెబోటోమస్ డుబోస్క్వ్ పెద్దపురుగులను 100% చంపింది. ఆడపురుగులు గణనీయంగా తక్కువ గుడ్లను పెట్టాయి (కిముటాయ్, అతని అనుచరులు, 2015).
  • నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్ సహజ దోమల వికర్షక మందుగా పనిచేస్తుంది. ఇది రసాయన వికర్షక పురుగు మందుల కన్నా సురక్షితమైనది (ప్రభాకర్, అతని అనుచరులు, 2013).
  • నిమ్మగడ్డి కీటకనాశినిగానే గాక, యాంటిఫీడెంట్, వికర్షకచర్యలను కూడా ప్రదర్శిస్తుంది. దోమలు, ఈగలు, పేనుబంక, నిల్వ ధాన్యంలో ఆశించే పురుగులను సమర్ధవంతంగా నివారిస్తుందని రుజువైంది.
  • నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్‌ని పురుగు వికర్షిణిగా ఉపయోగించవచ్చు. లేదా నీటిలో కలిపి ఎమల్షన్‌గా తయారుచేసి పంటలపై పిచికారి చేయవచ్చు.
  • వేర్ల నుండి రసం తీసి నీటితో కలిపి పంటలపై పిచికారి చేసి పురుగులను సమర్ధవంతంగా నివారించవచ్చు.
  • నిమ్మగడ్డిని నులి పురుగులు, నల్లుల నివారణలో కూడా ఉపయోగించవచ్చు. నులి పురుగులెక్కువగా ఉన్న భూమిలో నిమ్మగడ్డిని నాటి వాటి సంఖ్యను తగ్గించవచ్చు..
  • నిమ్మగడ్డి సంబంధిత సింబోపోగాన్ నార్డస్ మొక్క యాంటి ఫీడెంట్, వికర్షక చర్యలను కలిగి ఉంటుంది. పండు ఈగలను అధికంగా ఆకర్షిస్తుంది. ఈ లక్షణం వల్ల పండు ఈగల నివారణలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. (ప్లూక్, అతని అనుచరులు, 1999).
  • అలసంద పంటలో తీవ్ర నష్టం కల్గించే మారుకా కాయతొలుచు పురుగు (మారుకా విట్రేట), కాయ రసం పీల్చే నల్లి (క్లావిగ్రల్లా టోమెంటోసికోల్లిస్) పురుగులను మొక్కల పురుగు మందుల మిశ్రమాలతో నివారించడానికి పరిశోధనలు జరిపారు. వేప{నిమ్మగడ్డి, వేప{ ఆఫ్రికన్ కర్రి, వేప{టమాట, వేప{కాకర, యూకలిప్టస్{ఆఫ్రికన్ బుష్ టీ ఆకుల మిశ్రమ ద్రావణాలు పిచికారి చేసిన పంటలో కాయతొలుచు పురుగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. వేప{ఆఫ్రికన్ కర్రి, వేప{నిమ్మగడ్డి, వేప{టమాట, వేప{కాకర, యూకలిప్టస్{ఆఫ్రికన్ బుష్ టీ ఆకుల మిశ్రమ ద్రావణాలు పిచికారి చేసిన పంటపై కాయరసం పీల్చే పురుగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ ద్రావణాల మిశ్రమాలు మొక్కలలో కాయల నష్టాన్ని అధికంగా తగ్గించి, గింజ దిగుబడులను పెంచాయి (ఒపరీక్, అతని అనుచరులు, 2005).
  • నిమ్మగడ్డి, తులసి వేడి మరియు చల్లని ఆకు ద్రావణాలు అలసందలో యాంత్రాక్నోస్ తెగులు కల్గించే శిలీంద్రం కొల్లెటోట్రైకం లిండముథియానం శిలీంద్ర బీజాలు మొలకశాతాన్ని, శిలీంద్ర పెరుగుదలను సమర్ధవంతంగా తగ్గించాయి. నిమ్మగడ్డి చల్లని ఆకు ద్రావణం అత్యధికంగా శిలీంద్రం పెరుగుదలను తగ్గించి పొలంలో ఆంత్రాక్నోస్ తెగులు వ్యాప్తిని అరికట్టింది. నిమ్మగడ్డిని అలసంద నాశించే ఆకుమచ్చ తెగులు నివారణకు మొక్క ఆధారిత పురుగు మందుగా ఉపయోగించవచ్చు. (అమడియోహ అండ్ ఓబి, 1999).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… కామాక్షి / మదన

కామాక్షి చెట్టు మొదలు లావుగా ఉండి మందమైన కార్క్ వంటి బెరడుతో కప్పబడి ఉంటుంది. చెట్టు చివరన పొడవాటి, ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగు, మెరిసే ఆకులు ఏర్పడతాయి. ప్రతి ఆకు 150 నుండి 170 సెం.మీ. పొడవుండి 54 నుండి 110 చిన్న ఆకులు కలిగి ఉంటుంది.. మగ కామాక్షి మొక్కలు పసుపుగోధుమ రంగు అండాకారపు కోన్స్ కలిగి ఉంటాయి. ఇవి 24-48 సెం.మీ. పొడవు, 12-18 సెం.మీ. వ్యాసం కలిగి ఉంటాయి. ఆడ మొక్కలో కోన్స్ ఏర్పడవు. అవి పొడవాటి, ఆకువంటి స్పోరోఫిల్స్‌పై గింజలు కలిగి ఉంటాయి. అవి కురచగా, వత్తుగా ఉన్న నారింజ రంగు నూగు కలిగి 20-35 సెం.మీ. పొడవుంటాయి. కామాక్షి గింజలు చిన్నవిగా 3-9 మి.మీ. పొడవుండి లేత ఎరుపుపసుపు రంగు గుజ్జుతో కప్పబడి ఉంటాయి. చెట్టు 3-5 మీ. ఎత్తు పెరుగుతుంది.

సాధారణ నామం : సాగోపామ్ శాస్త్రీయ నామం : సైకాస్ సిర్సినాలిస్ కుటుంబం: సైకడేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • పుప్పొడి నార్కోటిక్, కామాక్షి మొక్క బెరడు, గింజలను నూరి నూనెతో కలిపి పేస్టు చేసి గాయాలు, వాపులపై పట్టీగా వేస్తారు.
  • లేత ఆకుల రసాన్ని వాంతుల చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ మొక్క పిత్ నుండి సగ్గుబియ్యం తయారు చేస్తారు. ఆకుల కషాయాన్ని దగ్గు నివారణకు త్రాగుతారు.

వ్యవసాయరంగంలో

  • సంప్రదాయ వ్యవసాయంలో కామాక్షి పూలను పురుగుల యాజమాన్యంలో ఉపయోగిస్తారు. దీని మగపూలు కుళ్ళినపుడు ఒక ఘాటైన వాసనని విడుదల చేస్తాయి (మమన్నన్ & నటరాజన్, 2010).
  • కామాక్షి మగచెట్టు, పూవులను కోసి వరి పంట స్థాయి కన్నా ఎక్కువ ఎత్తు ఉన్న కర్రలకు కట్టాలి.
  • ఈ కర్రలను గడ్డితో చుట్టి పూలను కట్టి వరి పొలంలో 10-15 చోట్ల పాతాలి. వీటి వాసనకు కంకినల్లి పెద్ద పురుగులు వికర్షింపబడి 2 వారాల పాటు పొలంలోకి ప్రవేశించలేవు. ఈ సమయానికి పాలుపోసుకునే దశ పూర్తయి, పంట పరిపక్వ దశకు చేరుకుంటుంది.
  • కామాక్షి పూలలో ఉన్న సైకాస్టిన్ అనే రసాయనం కీటకనాశక మరియు నిరోధక లక్షణాలు కలిగి ఉంది. శ్రీలంక వరి రైతులు ‘కెమ్ కామ’ పద్ధతులు అనే పురుగు యాజమాన్య పద్ధతులను మొక్క ఆధారిత పదార్థాలు మరియు సాగు పద్ధతులనుపయోగించి వృద్ది చేశారు. మొక్కలలోని రసాయన పదార్థాలను గురించి అవగాహన లేనప్పటికీ శ్రీలంక వరి రైతులు ఈ విజయవంతమైన సస్యరక్షణ పద్ధతిని వృద్ధి చేయడానికి కొన్ని దేశీయ మొక్కలను గుర్తించారు. ఈ కెమ్ పద్ధతులు పురుగు మందు ప్రభావం, జిగట ఎరలు, దీపపు ఎరలు వంటి వివిధ రకాల చర్యలను కలిగి ఉంటాయి. ఆధునిక విజ్ఞానం వృద్ధి చెందడంతో, కెమ్ పద్ధతిలో దాగి ఉన్న రహస్యాలను ఏ మొక్క ఆధారిత రసాయనం ఏ పురుగుకి సరైన ఎంపిక అనే విషయాన్ని పరిశోధించవచ్చు. వరి పొలాల దగ్గర కదురు (సెర్బెరమ్‌గడ్డి) కర్రలను మంట పెట్టడం వల్ల దీపపు ఎరతో పాటు రసాయన వికర్షకాన్ని కూడా పురుగుల నివారణకు ఉపయోగించినట్లు పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇది ఒక ‘కెమ్ కామ’ పద్ధతి. కామాక్షి పూలలో సైకాసిన్ ఒక ముఖ్య రసాయనం. దీనికి కీటకనాశక మరియు కీటక నిరోధక లక్షణాలున్నాయి. దీని ద్వారా ఆధునిక శాస్త్రీయ పరిశోధనలు పురాతన కెమ్ పద్ధతిలో పోలి వున్నాయని విశదమయింది. ఇటువంటి చర్యలు గల అనేక మొక్క జాతులున్నాయి. జిల్లేడు, మీలియా, క్రోటాన్ లాసిఫర్, యూఫర్బియా యాంటిక్సోరం సంప్రదాయ పద్ధతులతో సరితూగుతున్నాయి. ఇవి పర్యావరణహిత పద్ధతులు.

సంప్రదాయ ‘కెమ’ పద్ధతులు
మొక్క: క్రోటాన్ లాసిఫెర
నివారించబడే పురుగు: వరి కంకినల్లి
పనిచేసే విధానం: మొక్కల కట్టను వరి పొలంలో మొక్కలపై లాగుతూ పోతే వికర్షక చర్యవల్ల నివారించడతాయి.

మొక్క: కదురు
నివారించబడే పురుగు: వరి కంకినల్లి
పనిచేసే విధానం: వరి పొలాల దగ్గర మంటలు వేయడం ద్వారా దీపపు ఎరలా పురుగులను ఆకర్షిస్తుంది.

మొక్క: కామాక్షి
నివారించబడే పురుగు: వరి కంకినల్లి
పనిచేసే విధానం: కామాక్షి మగపూవు కుళ్ళేటపుడు ఘాటైన వాసన విడుదల చేస్తుంది. ఈ మగపూవుని ఉదయం వేళలో కత్తిరించి ఈ భాగాలను కర్రలకు కట్టి వివిధ ప్రాంతాలలో పాతాలి. మరుసటి రోజు ఈ పూల భాగాలపై నీరు చల్లాలి.

మొక్క: మీలియా
నివారించబడే పురుగు: వివిధ పురుగులు
పనిచేసే విధానం: ఘాటైన వాసన గల మీలియా ద్రావణాన్ని తాటాకులపై చల్లి వరి పొలంలో వివిధ ప్రదేశాలలో ఉంచుతారు. ఈ ద్రావణంలోని ఆల్కలాయిడ్లు, ఫ్లేవనాయిడ్స్, టానిన్స్, టెర్పెనిన్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ పురుగులను తినకుండా, గుడ్లు పెట్టకుండా నిరోదిస్తాయి.

మొక్క: జిగట ఎరలు
నివారించబడే పురుగు: రసంపీల్చే పురుగులు
పనిచేసే విధానం: ఇతర పురుగులు విసనకర్ర, కర్ర లేదా తాడుకి జిగురు పూసి (జిల్లేడు, పాలపొద పాలు) పంటపై కదిలిస్తే పురుగులు జిగురుకు అంటుకుంటాయి.

మొక్క: దీపపు ఎరలు
నివారించబడే పురుగు: ఎగిరే పురుగులు
పనిచేసే విధానం: మధుకా లాంగిఫోలియా, వేప, కనారం జీవానికం నూనె ద్రావణాలతో దీపాలను వెలిగించి పెడితే ఆకర్షింపబడిన పురుగులను నాశనం చేయాలి.
(విడనపతిరాన అండ్ దస్సనాయకె, 2013).

  • కామాక్షి ఓవ్యూలఎండోటెస్టా మిథనాల్ ద్రావణం బాసిల్లస్ సెరియస్, స్టఫైలోకోకస్ ఆరియస్, ఎస్కరిచియా కోలి, క్ౙాంతోమోనాస్ కాంపెస్ట్రిస్ మాల్వేసియారం లపై వాంకోమైసిన్, పెనిసిలిన్, బాక్టీరిమైసిన్ (యాంటిబయాటిక్స్) కన్నా గణనీయంగా అధిక యాంటీబాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది (కల్పశ్రీ అండ్ దవీష, 2013).
  • వరిలో కాండం తొలుచు పురుగు ఆశించడం గమనించగానే కామాక్షి పూలను నలగ్గొట్టి పొలంలో నిల్వ ఉన్న నీటిలో కలపాలి (విమలకీర్తి, 2002), అమువిత గమ 2002).
  • కామాక్షి, వేప, నిమ్మగడ్డి, పొగాకు ఆకులను నీటిలో వేసి మరగించి కొంత సమయం నానబెట్టాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని వడపోసి 2-4 రోజులు నిల్వ ఉంచాలి. తర్వాత కూరగాయల పంటపై పిచికారి చేస్తే ఈ ద్రావణం ఆకుతొలిచే పురుగు, దీపపు పురుగులు, ఆకుగూడు పురుగు, కొమ్మునల్లి, వీవిల్స్, లార్వాలు, చిత్తపురుగులను వికర్షిస్తుంది (ఒకులోన్‌లోల అండ్ అకిన్‌రిన్నోల, 2013).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More