34,196 టన్నుల పంట ఉత్పత్తులు కిసాన్‌ రైళ్ల ద్వారా రవాణా

బుధవారం లోక్‌సభలో తెదేపా ఎంపీలు కేశినేని శివనాథ్‌, లావు శ్రీకృష్ణదేవరాయలు, దగ్గుమళ్ల ప్రసాదరావులు అడిగిన ప్రశ్నకు కిసాన్‌ రైల్‌ పథకాన్ని 2020 ఆగస్టు 7న ప్రారంభించినప్పటినుంచి ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్‌ నుంచి 116 సర్వీసుల ద్వారా 34,196 టన్నుల పంట ఉత్పత్తులను రవాణా చేసినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి అస్సాం, బిహార్‌, పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ, త్రిపురలకు అరటి, మామిడి, ఉల్లితోపాటు మరికొన్ని పంట ఉత్పత్తులు రవాణా చేసినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నడిపిన 2,364 కిసాన్‌ రైళ్ల ద్వారా 7.9 లక్షల టన్నులు రవాణా చేసినట్లు చెప్పారు. ఈ రైలు సేవల ద్వారా రూ.318.68 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.

Read More

యాసంగిలో 43 లక్షల ఎకరాలకు సాగునీరు

బుధవారం హైదరాబాద్‌లోని జలసౌధలో సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివమ్‌) సమావేశం ఈఎన్సీ అంజద్‌ హుస్సేన్‌ అధ్యక్షతన జరిపి యాసంగి పంట కాలంలో 43 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నీటిపారుదల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. డిసెంబరు మూడో వారం నుంచి ఆయకట్టుకు నీటి విడుదల చేయాలని ఇందులో నిర్ణయించారు. సమావేశంలో చర్చించిన అంశాలిలా ఉన్నాయి.

  • రాష్ట్రవ్యాప్తంగా భారీ, మధ్యతరహా, చిన్నతరహా ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో ప్రస్తుతం సాగునీటి వినియోగానికి 370 టీఎంసీల లభ్యత ఉంది. దీన్ని దాదాపు 43 లక్షల ఎకరాలకు అందించాలని నిర్ణయించారు.
  • ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీ, మిడ్‌మానేరు, నిజాంసాగర్‌, నాగార్జునసాగర్‌, శ్రీశైలం తదితర భారీ ప్రాజెక్టుల్లో జూన్‌ నెలాఖరు నాటికి తాగునీటి అవసరాలు పోను 288.64 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. 30.97 లక్షల ఎకరాలకు సాగు నీరివ్వాలని ప్రతిపాదన చేశారు.
  • చిన్నతరహా ప్రాజెక్టుల పరిధిలో 42.11 టీఎంసీలతో 7.5 లక్షల ఎకరాలకు, ఐడీసీ లిఫ్టుల కింద 10 టీఎంసీలతో 1.70 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు.
  • మధ్యతరహా ప్రాజెక్టుల్లో 28.95 టీఎంసీలు ఉన్నాయి. వీటి ద్వారా 2.78 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు.
  • 24.61 లక్షల ఎకరాల తరి, 18.45 లక్షల ఎకరాల ఆరుతడి పంటకు నీరు ఇవ్వనున్నారు.
Read More

ఆరోగ్యకరమైన ఉత్పత్తులు తీయడంపై దృష్టిసారించాలి* : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

సేంద్రీయ వ్యవసాయ ఆవశ్యకత, రసాయన ఎరువుల మరియు పురుగుమందుల విచ్చలవిడి వినియోగంతో నేల ఆరోగ్యం దెబ్బతింటుందని రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలో ఆసియా పిజిపిఆర్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఈ రోజు జరిగిన మహాకిసాన్‌ మేళ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులతో అన్నారు. రసాయన ఎరువుల వినియోగం తెలంగాణలో గత పదేళ్లలో గణనీయంగా పెరిగిందని, ప్రస్తుతం భారతదేశ వినియోగం, అన్ని రకాల ఎరువులు కలుపుకొని 600 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉంటే, ఒక్క తెలంగాణ రాష్ట్రములోనే 40 లక్షల మెట్రిక్‌ టన్నులుగా ఉందని, అదేవిధంగా దేశంలో సగటు పురుగుమందులు వినియోగం కంటే కూడా తెలంగాణ వినియోగం అధికంగా ఉందని, కావున మనమిప్పుడు కేవలం ఉత్పత్తి మీదనే కాకుండా ఆరోగ్యకరమైన ఉత్పత్తులు తీయడం మీద దృష్టిసారించాలని హితవు పలికారు.అదేవిధంగా గత 30 సంవత్సరాలలో ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్న రైతులు ఏ విధంగా ఆర్థికాభివృద్ధి సాధించారో వివరిస్తూ.. ప్రస్తుతం ఆ పంట సాగుకు గల అవకాశాలు మరియు ఆయిల్‌ పామ్‌ పంటలో వేయగల అంతరపంటల సాగు గురించి తన అనుభవాలను పంచుకొన్నారు.తరువాత వివిధ జిల్లాల నుండి ఎంపిక చేసిన ఆదర్శరైతులకు రైతురత్న అవార్డులను అందచేశారు. మహాకిసాన్‌ మేళాలో భాగంగా రైతుల ప్రయోజన నిమిత్తం ఏర్పాటు చేసిన 70 స్టాల్స్‌ రైతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పిజిపిఆర్‌ సొసైటీ చైర్మన్‌ ఎం.ఎస్‌ రెడ్డి, వ్యవసాయ కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి మరియు మాజీ సిబిఐ డైరెక్టర్‌ కార్తికేయన్‌ తదితరులు పాల్గొన్నారు.సేంద్రీయ వ్యవసాయ ఆవశ్యకత, రసాయన ఎరువుల మరియు పురుగుమందుల విచ్చలవిడి వినియోగంతో నేల ఆరోగ్యం దెబ్బతింటుందని రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలో ఆసియా పిజిపిఆర్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఈ రోజు జరిగిన మహాకిసాన్‌ మేళ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులతో అన్నారు. రసాయన ఎరువుల వినియోగం తెలంగాణలో గత పదేళ్లలో గణనీయంగా పెరిగిందని, ప్రస్తుతం భారతదేశ వినియోగం, అన్ని రకాల ఎరువులు కలుపుకొని 600 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉంటే, ఒక్క తెలంగాణ రాష్ట్రములోనే 40 లక్షల మెట్రిక్‌ టన్నులుగా ఉందని, అదేవిధంగా దేశంలో సగటు పురుగుమందులు వినియోగం కంటే కూడా తెలంగాణ వినియోగం అధికంగా ఉందని, కావున మనమిప్పుడు కేవలం ఉత్పత్తి మీదనే కాకుండా ఆరోగ్యకరమైన ఉత్పత్తులు తీయడం మీద దృష్టిసారించాలని హితవు పలికారు.అదేవిధంగా గత 30 సంవత్సరాలలో ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్న రైతులు ఏ విధంగా ఆర్థికాభివృద్ధి సాధించారో వివరిస్తూ.. ప్రస్తుతం ఆ పంట సాగుకు గల అవకాశాలు మరియు ఆయిల్‌ పామ్‌ పంటలో వేయగల అంతరపంటల సాగు గురించి తన అనుభవాలను పంచుకొన్నారు.తరువాత వివిధ జిల్లాల నుండి ఎంపిక చేసిన ఆదర్శరైతులకు రైతురత్న అవార్డులను అందచేశారు. మహాకిసాన్‌ మేళాలో భాగంగా రైతుల ప్రయోజన నిమిత్తం ఏర్పాటు చేసిన 70 స్టాల్స్‌ రైతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పిజిపిఆర్‌ సొసైటీ చైర్మన్‌ ఎం.ఎస్‌ రెడ్డి, వ్యవసాయ కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి మరియు మాజీ సిబిఐ డైరెక్టర్‌ కార్తికేయన్‌ తదితరులు పాల్గొన్నారు

Read More

పదెకరాల్లో సమీకృత వ్యవసాయం చేయగలను

ఆంధ్రప్రదేశ్‌ వెల్లమిల్లి గ్రామానికి చెందిన యువ రైతు రాజేంద్రప్రసాద్‌ చేస్తున్న సమీకృత వ్యవసాయం విధానాన్ని నల్లమాడులో ఏర్పాటు చేసిన వివిధ రకాల ప్రదర్శనలో ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. ఎకరా విస్తీర్ణంలో వరి, మత్స్య, కూరగాయలు సాగు చేస్తున్న తీరును రైతు చంద్రబాబుకు వివరించారు. ఇదే సాగును పది ఎకరాల్లో చేయగలవా? అని సీఎం ఆరా తీయగా, చేయగలనని రాజేంద్రప్రసాద్‌ బదులిచ్చారు.

Read More

జీనోమ్‌ ఎడిటింగ్‌తో కొర్రల్లో కొత్త వంగడాలు

చిరుధాన్యాలను ప్రతిఒక్కరూ ఆహారంలో భాగం చేసుకునేందుకు వీలుగా హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యా లయం(హెచ్‌సీయూ)లోని మిల్లెట్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌ ‘జీనోమ్‌ ఎడిటింగ్‌’ ద్వారా నూతన వంగడాలను సృష్టిస్తోంది. కొర్రల్లో ఫైటిక్‌ యాసిడ్‌ ఎక్కువగా ఉండి… జీర్ణక్రియ స్వల్పంగా మందగించేలా చేస్తుంది. అందుకే ఎక్కువ మంది ఆహారంగా తీసుకునేందుకు ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో ఫైటిక్‌ యాసిడ్‌ను తగ్గించడంపై మిల్లెట్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌ పరిశోధకులు దేశంలోనే తొలి సారిగా రెండేళ్ల క్రితం జీనోమ్‌ (జన్యు) ఎడిటింగ్‌ ప్రక్రియను చేపట్టారు. అందులో భాగంగా హైదరాబాద్‌ శివారులోని ఇక్రిశాట్‌ నుంచి 155 రకం కొర్రలను, దిల్లీ శివారులోని వ్యవసాయ వర్సిటీ నుంచి 185 రకాన్ని తెప్పించారు. ల్యాబ్‌లో ప్రయోగాల ద్వారా 155 రకంలో ఫైటిక్‌ యాసిడ్‌ను 70 శాతానికి.. 185 రకంలో 81 శాతానికి తగ్గించి కొత్త రకం వంగడాలను సృష్టించారు.

Read More

సజ్జకు మద్దతు ధర దక్కడం లేదు

ఆంధ్రప్రదేశ్‌లో సజ్జల క్వింటాలుకు మద్దతు ధర రూ.2,775 ఉంటే.. రైతుకు రూ. 2వేలు కూడా దక్కడం లేదు. ఎకరానికి సగటున రూ.25 వేల పెట్టుబడి పెట్టారు. నాణ్యత లేదంటూ ప్రకాశం, ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో క్వింటాలు రూ.1,600 నుంచి రూ.1,800కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఖరీఫ్‌ లో రాష్ట్ర వ్యాప్తంగా 64 వేల ఎకరాల్లో సజ్జ సాగైంది. ప్రకాశం జిల్లాలో 17 వేల ఎకరాలు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 28,000, ఉమ్మడి అనంతపురం జిల్లాలో 11 వేల ఎకరాల్లో వేశారు. అక్టోబరులో కురిసిన భారీ వర్షాలతో పాటు తుపాను ప్రభావంతో పంట దెబ్బతింది. అధిక శాతం రైతులకు ఎకరానికి 2-3 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. పంట నాణ్యతా తగ్గింది. ఈ తరుణంలో ధరలు లేక రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం మద్దతు ధరపై మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

Read More

చెట్ల కొమ్మలకు కోళ్ళ వసతి

వివిధ సమయాల్లో కోళ్ళకు వచ్చే వ్యాధులు, కోళ్ళ పేను తదితర సమస్యలతో చాలామంది పెరటి కోళ్ళ పెంపకందారులు ఇబ్బందులు పడుతన్నారు. కొందరు తగు జాగ్రత్తలు తీసుకుంటూ వాటి పెంపకాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా కోళ్లు.. గుడ్లను పొదిగే సమయంలో వాటికి పేను ఆశించే అవకాశం ఉంటుంది. దీన్ని నివారించేందుకు చెట్టుకు కోళ్ల గంపలను వేలాడదీసి అందులో కోడి గుడ్లను పొదిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణాలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం కొదురుపాకలో ఓ రైతు తమ ఇంటి ఆవరణలో చెట్ల కొమ్మలకు గూళ్లను కట్టి కోళ్లు పొదిగే ఏర్పాటు చేశారు.

Read More

మధ్యతరగతి పిల్లలకు పోషకాహారం ఇవ్వాలి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ ఉద్యాన హబ్‌ ప్రణాళిక రూపొందించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి పాల్గొని దేశంలో 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చాం. మధ్య తరగతి పిల్లలకు పోషకాహారం ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు పప్పులు, కూరగాయలు, పండ్లు అవసరం. సీఎం ఈ అవసరాన్ని గుర్తించి రాయలసీమలోని 9 జిల్లాల్లో కూరగాయలు, పండ్లు పండించి ఎగుమతి చేస్తామంటున్నారు. ఎక్కడ మార్కెట్‌ ఉంటే అక్కడికి రవాణా చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తేనే రైతులకు తక్షణ ప్రయోజనాలు అందుతాయి. రాయలసీమ హబ్‌కు అవసరమైన ఇన్ఫ్రా ఏర్పాటుకు బ్యాంకులు సాయం చేయాలి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, ప్యాకేజి యూనిట్లు, రవాణా వ్యవస్థ, కోల్డ్‌ స్టోరేజి యూనిట్ల ఏర్పాటుకు, ఉత్తమ విత్తనాల సరఫరాకు బ్యాంకులు తోడ్పాటు అందించాలి. ఈ హబ్‌ ప్రభావం కేవలం సీమ జిల్లాలకే పరిమితం కాదు. రాష్ట్రం యావత్తూ ఉంటుంది. తమిళనాడు నుంచి కొబ్బరి, మహారాష్ట్ర నుంచి అరటి ముంబయి, దిల్లీ వంటి నగరాలకు రవాణా చేసేందుకు కేంద్రం వారానికి 2, 3 సార్లు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. అలా రాయలసీమ నుంచీ పంపాలి’ అని నిర్మలా సీతారామన్‌ సూచించారు.

Read More

తెలంగాణాలో ధాన్యం కొనుగోలు ఊపందుకుంది

తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల్లో వరి కోతలు ముమ్మరం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం భారీగా వస్తోంది. శుక్రవారం నాటికి 35.96 లక్షల టన్నులు కొనుగోళ్లు జరిగాయి. మద్దతు ధరతో పాటు బోనస్‌ కలిపి రూ. 6,688.63 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. 10,434 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. 8,465 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకోగా, 8,361 కేంద్రాలను ప్రారంభించారు. దొడ్డు రకం 22.86 లక్షల టన్నులు, సన్నాలు 18.66 కలిపి మొత్తం 41.52 లక్షల టన్నులు కేంద్రాలకు రాగా, 35.96 లక్షల టన్నుల ధాన్యం కొన్నారు. ఇందులో 35.39 లక్షల టన్నులు మిల్లులకు తరలించారు. గోదాముల్లో 2,750 టన్నులు నిల్వ చేశారు. 54,241 టన్నుల వడ్లను కేంద్రాల నుంచి మిల్లులకు తరలించాల్సి ఉంది. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌.. అక్టోబరులో ధాన్యం కొను గోళ్ల ప్రక్రియలో జాప్యమైంది. సీఎం రేవంత్రెడ్డి ఈ అంశంపై దృష్టి పెట్టి.. ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో నవంబరులో కొనుగోళ్లు వేగవంతమయ్యాయి.

Read More

ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 28,29 తేదీల్లో డిగ్రీ కోర్సులకి తుది కౌన్సిలింగ్‌

* రైతు కోటాలో ఖాళీగా ఉన్న సుమారు 22 సీట్లు

.* రైతు కూలీల కోటాలో ఖాళీగా ఉన్న సుమారు 40 సీట్లకి 28వ తేదీన కౌన్సిలింగ్‌ 2025-26 విద్యా సంవత్సరానికి ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని వివిధ రెగ్యులర్‌ డిగ్రీ, స్పెషల్‌ కోటా యూజీ కోర్సులలో ప్రవేశాలకు చివరి థ కౌన్సిలింగ్‌ ఈనెల 28వ తేదీ (శుక్రవారం) ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలిపింది. రైతు కోటాలో సుమారు 22 సీట్లు, రైతు కూలీల కోటాలో సుమారు 40 సీట్లు ఖాళీగా ఉన్నాయని వాటిని ఈ కౌన్సిలింగ్‌ ద్వారానే భర్తీ చేయనున్నట్లు విశ్వవిద్యాలయం పేర్కొంది. తల్లిదండ్రులు, విద్యార్థులు కేటగిరీల వారీగా సీట్ల వివరాలని వెబ్‌సైట్‌లో చూసి కౌన్సిలింగ్‌కి హాజరు కావాల్సిందిగా విశ్వవిద్యాలయం సూచించింది. అదేవిధంగా నవంబర్‌ 29న (శనివారం) మధ్యాహ్నం రెండు గంటలకు ఎన్‌ఆర్‌ఐ / ఎన్‌ఆర్‌ఐ ప్రాయోజిత కోటా బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్‌, బీటెక్‌ (ఫుడ్‌ టెక్నాలజీ), బిటెక్‌ (అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌), బిఎస్సీ (ఆనర్స్‌), కమ్యూనిటీ సైన్స్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి వాక్‌-ఇన్‌-కౌన్సిలింగ్‌ జరగనుందని విశ్వవిద్యాలయం తెలిపింది. ఈ రెండు కౌన్సిలింగ్‌లు రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలోనే జరగనున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు అన్ని ఒరిజినల్‌ ధ్రువపత్రాలు, వెబ్‌సైట్‌లో పేర్కొన్న రుసుముతో కౌన్సిలింగ్‌కు హాజరుకావాలనీ, పూర్తి వివరాలు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ *www.pjtau.edu.in* లో చూడవచ్చు.

Read More