విదేశీ ఫలాల సాగుతో 10వేల కోట్లు ఆదా!

ఉత్తమ పోషక విలువలు, మార్కెటింగ్‌ సామర్థ్యం గల స్ట్రాబెర్రీ.. డ్రాగన్‌ఫ్రూట్‌.. అవకాడో.. రాంబూటాన్‌.. బ్లూబెర్రీ.. లాంగన్‌.. మకాడమియా నట్‌.. కివీ.. మ్యాంగోస్టీన్‌.. ఇలాంటి విదేశీ రకాల ఫలాలను మన దేశంలో సాగు చేయడం రైతులకు లాభదాయకమని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వెల్లడించింది. 2024-25లో రూ.10 వేల కోట్ల విలువైన ఇలాంటి ఫలాలను దిగుమతి చేసుకున్న నేపథ్యంలో.. మన దేశంలో వీటి సాగును పెంచడం ద్వారా ఏటా ఆ మొత్తం ఆదా అవుతుందని వెల్లడించింది. ‘విదేశీ ఫలాల’ సాగుపై అధ్యయనం చేపట్టి తాజాగా నివేదికను విడుదల చేసింది. అందులోని ముఖ్యాంశాలివి..
కొన్ని రకాల విదేశీ ఫలాలకు మన దేశంలో ఆదరణ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వీటి సాగును ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ అవకాడో, డ్రాగన్‌ ఫ్రూట్‌, స్ట్రాబెర్రీ, ప్యాషన్‌ ఫ్రూట్‌ వంటి రకాలను పండిస్తున్నారు. సాగు వ్యయం కొంత ఎక్కువైనా.. తక్కువ నీటితోనే ఇవి పండుతాయి. పెట్టుబడికి తగిన లాభాలు వస్తాయి. దేశంలో వీటి సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హార్టికల్చరల్‌ రీసెర్చ్‌ ఈ పంటలపై పరిశోధన, సాగు అభివృద్ధి, సాంకేతికత వ్యాప్తిలో కీలకపాత్ర పోషిస్తోంది. డ్రాగన్‌ ఫ్రూట్‌, అవకాడో వంటి పంటలకు ప్రామాణిక సాగు నియమావళిని అభివృద్ధి చేసింది. కేంద్రం సిఫార్సులివీ..
ఉద్యాన పంటలను ప్రోత్సహించడానికి అన్ని రాష్ట్రాల ఉద్యాన విభాగాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు.. విస్తృతంగా రైతు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. మార్కెటింగ్‌తో పాటు కోల్డ్‌ స్టోరేజి సౌకర్యాలు, ప్యాక్‌ హౌస్‌లు, గ్రేడింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల మధ్య అనుసంధానాలను బలోపేతం చేయాలి. ప్రైవేటు వ్యవసాయ వ్యాపార సంస్థలు, స్టార్టప్‌లు, సహకార సంస్థల సహకారంతో సంబంధిత మౌలిక సదుపాయాల వృద్ధి, సాంకేతిక సహకారం, పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలి.

Read More

యాప్‌’ ద్వారా సాగునీటి ప్రాజెక్టుల వివరాలు

తెలంగాణాలో సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ప్రత్యేకంగా ఒక యాప్‌ను నీటిపారుదల శాఖ రూపొందించింది. ప్రాజెక్టు నిర్మాణం ఏ థలో ఉంది, రోజువారీ ఎంత పని జరుగుతోంది, ఏ ప్రాంతాల్లో ఏ తరహా పనులు జరుగుతున్నాయో నిరంతరం పరిశీలించేందుకు ఈ యాప్‌ దోహద పడనుంది. 19 నీటిపారుదల సర్కిళ్లకు సంబంధించిన అన్ని రకాల పనులను యాప్‌ పరిధిలోకి తెస్తున్నారు. శుక్రవారం సీఈలతో శాఖ అధికారులు సమీక్ష నిర్వహించారు.

Read More

రైతన్నా.. మీకోసం’ ఈ నెల 24 నుంచి 29 వరకు

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు, రైతులకు దిశానిర్దేశం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు ‘రైతన్నా.. మీ కోసం’ కార్యక్రమాన్ని రూపొందించారని, ఈ నెల 24 నుంచి 29 వరకూ రాష్ట్రవ్యాప్తంగా దీన్ని నిర్వహించనున్నట్లు వ్యవసాయ మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Read More

అగ్రి కోర్సుల్లో ప్రవేశాలకు చివరి విడత కౌన్సెలింగ్‌ 24 నుంచి

2025-26 విద్యా సంవత్సరానికి బీఎస్సీ (హానర్స్‌) వ్యవసాయం, బీటెక్‌ (ఫుడ్‌ టెక్నాలజీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 24, 25, 27, 28, 29, 30 తేదీల్లో చివరి విడత కౌన్సె లింగ్‌ నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ ఎం. వి. రమణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు బిదీవీజీబితి.బిబీ.రిదీ వెబ్‌సైట్‌లో చూడాలన్నారు

Read More

నూతన ఆవిష్కరణలతో రైతాంగానికి మహర్దశ

  • ఎర్త్‌ సమ్మిట్‌ స్టార్టప్స్‌కు బాటలు వేయాలి
  • రైతాంగానికి చేయూతగా నిలిచిన నాబార్డ్‌కు ధన్యవాదాలు
  • ఎర్త్‌ సమ్మిట్‌ హైదరాబాద్‌ ఎడిషన్‌ కార్యక్రమంలో మంత్రి తుమ్మల

గ్రామీణ భారతావణి అభివృద్ధికి సంస్కరణలు నూతన ఆవిష్కరణలతో బాటలు వేయొచ్చని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారంనాడు హైదరాబాద్‌ హైటెక్స్‌లో నాబార్డ్‌ మరియు ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో రెండు రోజుల ఎర్త్‌ సమ్మిట్‌ సదస్సులో పాల్గొన్న మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతాంగానికి చేయూతగా నిలిచిన నాబార్డ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ధన్యవాదాలు, గ్రామీణ భారతదేశంలో రైతాంగానికి వెన్నుదన్నుగా ఉన్న నాబార్డ్‌ సేవలు అభినందనీయమన్నారు.

వ్యవసాయ రంగంలో స్టార్టప్స్‌కు సమ్మిట్‌ బాటలు వేయాలనీ సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో స్టార్టప్స్‌ను ప్రోత్సహిస్తున్నామనీ ఎఫ్‌.పీ.ఓ లు స్టార్టప్స్‌ ఏర్పాటు చేస్తున్నాయన్నారు. మారిన వాతావరణ మార్పులకు తగ్గట్టుగా ఆవిష్కరణలు జరగాలి, అందుకోసం మార్కెటింగ్‌ కోఆపరేటివ్‌తోపాటు అన్ని వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలన్నారు.

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు బాటలు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి నూతన ఆవిష్కరణలు దోహదం చేస్తాయన్నారు మంత్రి తుమ్మల.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నూతన ఆవిష్కరణలు పాలనా సంస్కరణలతోనే సాధ్యమని, భారత రైతాంగానికి మరియు నిరుద్యోగ యువతకు మేలు జరిగేలా నాబార్డ్‌ చేపట్టిన ఎర్త్‌ సమ్మిట్‌కు ప్రభుత్వపక్షాన ధన్యవాదాలు తెలిపారు మంత్రి తుమ్మల.

ఈ కార్యక్రమంలో నాబార్డ్‌ చైర్మన్‌ షాజీ కేవీ డిప్యూటీ ఎండీ గోవర్ధన్‌ సింగ్‌ రావత్‌ మరియు డి. ఎండీ డాక్టర్‌ అజయ్‌ కుమార్‌ సూద్‌ పాల్గొన్నారు.

Read More

రేపే రైతుల ఖాతాలో ఏడు వేల రూపాయలు

రైతుల ఖాతాల్లోకి కేంద్రం రూ.2 వేలు, రాష్ట్రం రూ.5 వేల చొప్పున పీఎం కిసాన్‌-అన్న దాతా సుఖీభవ నిధులు ఈ నెల 19న విడుదల కానున్నాయి. వైఎస్సార్‌ కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46.86 లక్షల మంది కర్షకుల ఖాతాలకు రూ.7 వేల చొప్పున మొత్తం రూ. 3,135 కోట్లు జమ చేస్తామని ప్రభుత్వం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. పీఎం కిసాన్‌- అన్నదాతా సుఖీభవ కింద ఆగస్టులో మొదటి విడతగా రూ.3,174 కోట్లు విడుదలయ్యాయి. రెండు విడతల్లో కలిపి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి రూ.6,309.44 కోట్లు వెచ్చిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమాల్లో కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనాలని సీఎం చంద్రబాబు సూచించారు. నిధుల విడుదల కార్యక్రమాన్ని రాష్ట్రంలోని 10 వేలకు పైగా రైతు సేవా కేంద్రాల్లో (ఆర్‌ ఎస్‌ కే) ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. ‘రైతుల ఖాతాల్లోకి నిధులు మాత్రమే కాకుండా.. వ్యవసాయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు కూడా అందులో వివరించేలా కార్యక్రమం రూపొందించి ప్రసారం చేయాలి. అగ్రిటెక్‌, డిమాండ్‌ ఉన్న పంటల సాగు, మార్కెట్‌ సౌకర్యాల పెంపు, ప్రకృతి సేద్యం, భూసార పరీక్షలు, పంట ఉత్పత్తులకు ఆహారశుద్ధి ద్వారా అధిక ధర లభించేలా చేయడం తదితర అంశాలపై రైతులకు అవగా హన కల్పించాలి’ అని సూచించారు. నిధుల విడుదలకు సంబంధించి రైతుల ఫోన్లకు ఒకరోజు ముందే మెసేజ్‌లు వెళ్లాలని అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి సోమవారం ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘రైతుల సందేహాల నివృత్తికి టోల్‌ ఫ్రీ నంబరు అందుబాటులో ఉంచాలి. అర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు డెత్‌ మ్యుటేషన్‌ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలి. తొలి విడతలో నగదు జమ కాని రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులు పరిశీలించి అర్హత ఉన్నవారికి అందేలా చూస్తాం” అని అచ్చెన్నాయుడు చెప్పారు.

Read More

వరి కంకులతో ఉపాధి

గుమ్మాలకు కట్టుకోవడంతోపాటు శుభకార్యాల్లో అలంకరణగా, బహుమతులుగా ఇచ్చేందుకు ధాన్యం కుచ్చులు తయారు చేసి విక్రయించడాన్ని ఉపాధిగా మలిచారు నిర్మల్‌ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిణి (డీఆర్డీవో) విజయలక్ష్మి. మూడేళ్ల క్రితం 50 కుచ్చులతో ప్రారంభించి, గతేడాది 400 వరకు వాటిని తయారుచేసి విక్రయించారు. ఈ ఏడాది గ్రామ సమాఖ్యల ఆధ్వర్యంలో సుమారు వెయ్యికిపైగా కుచ్చుల తయారీకి నిర్ణయించారు. కొద్దిగా పచ్చగా ఉన్నప్పుడే దొడ్డురకం వరిని కోసుకొచ్చి.. ఒక్కో కర్రను తీసుకుని.. అందులో ధాన్యం కలిగిన దాని వెన్నును తీస్తారు. అలా తీసిన వెన్నును దారంకు అల్లుతారు. ఇలా కుచ్చును తీర్చిదిద్ది ఒక్కో దానిని రూ.300 చొప్పున విక్రయిస్తున్నారు.

Read More

అనిశ్చిత వాతావరణం కారణంగా దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి

మొంథా తుపాను, అకాల వర్షాలు, అనిశ్చిత వాతావరణం కారణంగా తెలంగాణలో పత్తి, సోయా బీన్‌, మొక్కజొన్న కొనుగోళ్లలో ఏర్పడుతున్న సమస్యలను పరిష్కరించాలని, తీవ్రంగా దెబ్బతిన్న మూడు పంటల కొనుగోళ్లపై ప్రత్యేక సడలింపులివ్వాలని, లక్షల మంది రైతులకు ఆదుకునేలా నిర్ణయాలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు ఆయన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, జౌళిశాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌లకు గురువారం లేఖలు రాశారు. ”మొంథా తుపాను వల్ల పత్తి పంట దెబ్బతింది. రైతులు నష్టపోకుండా సీసీఐ తేమ శాతం 20కి పెంచి కొనేలా ఆదేశాలివ్వాలి. ఎకరానికి 11.74 క్వింటాళ్ల మేరకు పత్తి రాష్ట్రంలో పండగా.. సీసీఐ 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసే నిబంధన తేవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో 3.66 లక్షల ఎకరాల్లో సోయాబీన్‌ వేయగా.. వర్షాల వల్ల పంటకు తీవ్రనష్టం వాటిల్లింది. నాఫెడ్‌ ద్వారా నాణ్యత ప్రమాణాలు సడలించి కొనుగోలు చేయాలి. రాష్ట్రంలో 6.74 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పండించగా… మార్కెట్లో ధర క్వింటాకు రూ.1,959కి పడిపోయింది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రూ.2,400 రావడంలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కొనుగోళ్లు చేపట్టింది. ఇప్పటివరకు 14,519 మంది రైతుల నుంచి 48,757 టన్నులను కొన్నది. మొత్తం పంట కొనేందుకు కేంద్రమే చొరవచూపాలి” అని తుమ్మల కోరారు.

Read More

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తుంది

తెలంగాణలో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, ఉచిత పంపిణీ పథకం అవసరాలకు వాటినే వినియోగిస్తామని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మంగళవారం హెచ్‌ఐసీసీలో ప్రపంచ ఆక్వాకల్చర్‌-2025 సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. రూ. 123 కోట్లతో ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం అమలు చేస్తున్నాం. దీని కింద 26 వేల నీటి వనరుల్లో 84 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను చెరువుల్లో వేస్తున్నాం. ఉచిత పంపిణీ పథకానికి ప్రస్తుతం ప్రైవేటు సంస్థల నుంచి చేపపిల్లలను కొనుగోలు చేస్తున్నాం. సొంతంగా పంపిణీ చేసేందుకు వీలుగా ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభిస్తాం. రాష్ట్రంలోని 5 లక్షల మంది మత్స్యకారులకు రూ.1.40 లక్షలతో బీమా పథకం చేపట్టాం’ అని, మధ్యాహ్న భోజనం పథకంలో చేపలను ఆహారంగా చేర్చే అంశంపై సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని శ్రీహరి తెలిపారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ బండా ప్రకాశ్‌ మాట్లాడుతూ.. చేపల పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మత్స్య శాఖ కేంద్ర సంయుక్త కార్యదర్శి నీతూకుమారి ప్రసాద్‌, రాష్ట్ర సంచాలకురాలు నిఖిల, ఐకార్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ జాయ్‌కృష్ణ, జాతీయ మత్స్య అభివృద్ధి మండలి సీఈవో బిజయ్‌కుమార్‌ బెహెరా, పశువైద్య విశ్వవిద్యాలయ వీసీ జ్ఞానప్రకాశ్‌, రాష్ట్ర మత్స్యసహకార సంస్థ ఛైర్మన్‌ సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.* తెలంగాణలో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, ఉచిత పంపిణీ పథకం అవసరాలకు వాటినే వినియోగిస్తామని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మంగళవారం హెచ్‌ఐసీసీలో ప్రపంచ ఆక్వాకల్చర్‌-2025 సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. రూ. 123 కోట్లతో ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం అమలు చేస్తున్నాం. దీని కింద 26 వేల నీటి వనరుల్లో 84 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను చెరువుల్లో వేస్తున్నాం. ఉచిత పంపిణీ పథకానికి ప్రస్తుతం ప్రైవేటు సంస్థల నుంచి చేపపిల్లలను కొనుగోలు చేస్తున్నాం. సొంతంగా పంపిణీ చేసేందుకు వీలుగా ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభిస్తాం. రాష్ట్రంలోని 5 లక్షల మంది మత్స్యకారులకు రూ.1.40 లక్షలతో బీమా పథకం చేపట్టాం’ అని, మధ్యాహ్న భోజనం పథకంలో చేపలను ఆహారంగా చేర్చే అంశంపై సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని శ్రీహరి తెలిపారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ బండా ప్రకాశ్‌ మాట్లాడుతూ.. చేపల పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మత్స్య శాఖ కేంద్ర సంయుక్త కార్యదర్శి నీతూకుమారి ప్రసాద్‌, రాష్ట్ర సంచాలకురాలు నిఖిల, ఐకార్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ జాయ్‌కృష్ణ, జాతీయ మత్స్య అభివృద్ధి మండలి సీఈవో బిజయ్‌కుమార్‌ బెహెరా, పశువైద్య విశ్వవిద్యాలయ వీసీ జ్ఞానప్రకాశ్‌, రాష్ట్ర మత్స్యసహకార సంస్థ ఛైర్మన్‌ సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More

ఆంధ్రరాష్ట్రంలోని వ్యవసాయరంగ పరిస్థితులను కేంద్రమంత్రికి వివరించిన చంద్రబాబు నాయుడు

2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు కలిపి ప్రధాన మంత్రి రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన (పీఎంఆర్కేవీవై), పీడీఎంసీ పథకాల కింద రాష్ట్రానికి రూ. 695 కోట్లు ఇవ్వాలని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. వాటర్‌షెడ్‌ మహోత్సవంలో పాల్గొనేందుకు గుంటూరు వచ్చిన చౌహాన్‌.. చంద్రబాబు ఆహ్వానం మేరకు మంగళవారం ఉండవల్లిలోని ఆయన నివాసానికి వెళ్లారు. వారిద్దరూ సుమారు గంటసేపు సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం పరిస్థితులు, మైనర్‌ ఇరిగేషన్‌ వంటి అంశాలపై చర్చ జరిగింది. మొంథా తుపాను వల్ల జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. మైనర్‌ ఇరిగేషన్‌ కింద సాగు చేసే రైతుల సంక్షేమానికి కేంద్రం సహకరించాలని సీఎం కోరారు. తోతాపురి మామిడి రైతులకు మార్కెట్‌ జోక్యం కింద ఇచ్చిన మద్దతు ధరలో కేంద్ర ప్రభుత్వ వాటా కింద ఇవ్వాల్సిన రూ.100 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

Read More