తెలంగాణ ఉద్యాన స్టాలుకు ప్రథమ బహుమతి

అక్టోబరు 29 నుంచి నవంబరు 2 వరకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌ నగర్‌లో జరిగిన రాష్ట్రీయ కృషి ప్రగతి ఉద్యాన ప్రదర్శనలో తెలంగాణ ఉద్యానశాఖ స్టాల్‌కు ప్రథమ బహుమతి లభించింది. ఈ ప్రదర్శనలో 20 రాష్ట్రాలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. అందులో కూరగాయలు, పండ్లు, సుగంధద్రవ్యాల ఉత్పత్తులు, వాటి ఉపయోగాలను వివరిస్తూ రాష్ట్ర ఉద్యానశాఖ స్టాల్‌ను ఏర్పాటు చేసింది. ప్రదర్శన చివరి రోజు ప్రథమ బహుమతికి ఎంపిక చేసి, కేంద్ర సహాయ మంత్రి ఎస్పీ సింగ్‌ రాష్ట్ర ఉద్యాన అధికారులకు జ్ఞాపికను బహూకరించారు.

Read More

ఆంధ్రప్రదేశ్‌లో పంట నష్టం జాబితాలపై గ్రామస్థాయిలో సామాజిక తనిఖీ

గ్రామస్థాయిలో పంటనష్టం నమోదు జాబితాలను సామాజిక తనిఖీకి సిద్ధంగా ఉంచాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్‌ మనజీర్‌ జిలానీ మండల వ్యవసాయ అధికారుల్ని ఆదేశించారు. పంట నష్టపోయిన ప్రతి రైతు వివరాలు జాబితాలో ఉండాలని, వారి నుంచి వినతులు తీసుకోవాలని సూచించారు.

Read More

పిజెటిఏయు, వెస్టర్న్‌ సిడ్నీ యూనివర్సిటీల మధ్య కీలక ఒప్పందం

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్య నేతృత్వంలో విశ్వవిద్యాలయం డీన్స్‌ బృందం సిడ్నీలోని వెస్టర్న్‌ సిడ్నీ విశ్వవిద్యాలయాన్ని నేడు సందర్శించింది. డబ్ల్యుఎస్‌యు ఉపకులపతి, ప్రెసిడెంట్‌ జార్జ్‌ విలియం ఏవో, ఇతర అధికారులతో పిజెటిఏయు బృందం అనేక అంశాలపై విస్తృత చర్చలు జరిపింది. బిఎస్సీ (అగ్రికల్చర్‌) కోర్సుని సంయుక్తంగా అందించేందుకు వీలు కల్పించే కీలక ఒప్పందంపై రెండు విశ్వవిద్యాలయాల ఉపకులపతులు సంతకాలు చేశారు. దేశంలోనే తొలిసారిగా అందించే ఈ నాలుగేళ్ల సంయుక్త కోర్సులో విద్యార్థులు మూడేళ్లు రాజేంద్రనగర్‌ లోని కళాశాలలోనూ, మరో ఏడాది డబ్ల్యుఎస్‌యు లోనూ విద్యను అభ్యసించే అవకాశం ఈ ఒప్పందం ద్వారా కలుగుతుంది. సుమారు 40 మంది తెలంగాణ విద్యార్థులు ఏడాది పాటు డబ్ల్యుఎస్‌యులో చదువుకునే అవకాశాన్ని ఈ ఒప్పందం కల్పించనుందని పిజెటిఏయు ఉపకులపతి అల్దాస్‌ జానయ్య తెలిపారు. అదే విధంగా ఆసక్తి కలిగిన విద్యార్థులు మరో ఏడాది చదివి ఎంఎస్సీ డిగ్రీ పొందే అవకాశం ఉందని జానయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పిజెటిఏయులో చేపట్టిన వివిధ సంస్కరణల్లో భాగంగా ఈ ఒప్పందం ద్వారా విద్య, పరిశోధన విభాగాల్ని ప్రముఖ అంతర్జాతీయ సంస్థలతో అనుసంధానించి సంయుక్త పరిశోధనలు చేపట్టే అవకాశం కలుగుతుందని జానయ్య వివరించారు. ఈ సంయుక్త డిగ్రీ కోర్సులో ఇప్పటికే 25 మంది విద్యార్థులు చేరారని త్వరలో మరో 10 మంది చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానంలో ఈ కోర్సుని నిర్వహించనున్నట్లు జానయ్య తెలిపారు. అదేవిధంగా పిజెటిఏయు అధికారుల బృందం డబ్ల్యుఎస్‌యు లోని వివిధ అధునాతన ప్రయోగశాలల్ని, పరిశోధనా విభాగాల్ని సందర్శించింది. వ్యవసాయ రంగంలో అగ్రి రోబోటిక్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ఆధారిత పరిశోధనలకు సంబంధించి కూడా రెండు విశ్వవిద్యాలయాల మధ్య అవగాహన కుదిరిందని అల్దాస్‌ జానయ్య వివరించారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యుఎస్‌యు ఉపకులపతి, ప్రెసిడెంట్‌ జార్జ్‌ విలియం ఏవో, ప్రొ. విసి ప్రొఫెసర్‌ ఇయాన్‌ అండర్సన్‌ (రీసెర్చ్‌ అండ్‌ ఎంటర్‌ ప్రెజ్‌), ప్రొ. విసి (ఎడ్యుకేషనల్‌ పార్టర్న్‌ షిప్స్‌ అండ్‌ క్వాలిటీ) డాక్టర్‌ నికోలెన్‌ ముర్డోఖ్‌, పిజెటిఏయు ఉపకులపతి ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్య, డీన్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ డాక్టర్‌ కె. ఝాన్సీ రాణి, పరిశోధన సంచాలకులు డాక్టర్‌ మరాఠి బలరాం, విద్యార్థి వ్యవహారాల డీన్‌ డాక్టర్‌ సీహెచ్‌. వేణుగోపాల్‌ రెడ్డి, అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీ డీన్‌ డాక్టర్‌ కెవి రమణరావు, డీన్‌ ఆఫ్‌ పీజీ స్టడీస్‌ డాక్టర్‌ కెబి ఈశ్వరిలు పాల్గొన్నారు.

Read More

పంట నష్ట అంచనాను పారదర్శకంగా చేపట్టాలి

ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుపాను వల్ల జరిగిన పంట నష్టం అంచనాను పారదర్శకంగా చేపట్టాలని, ఏపీ ఎయిమ్స్‌ పంట నమోదు యాప్‌ ద్వారా మాత్రమే పంట నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ తెలిపారు. పంట నష్ట నమోదు నుంచి జియో కోఆర్డినేట్‌, క్షేత్రస్థాయి ఫొటోలు అప్‌లోడ్‌ను ప్రభుత్వం మినహాయించినట్లు ఆయన చెప్పారు. ఈ-పంటలో నమోదైన వాస్తవ సాగుదారులనే నమోదు చేయాలన్నారు.

Read More

తెలంగాణా నుంచి పెరగనున్న బియ్యం ఎగుమతులు పౌరసరఫరాల కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర

బియ్యం ఎగుమతులను తెలంగాణ నుంచి విదేశాలకు పెంచేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. గురువారం ఢిల్లీలో ప్రారంభమైన భారత్‌ ఇంటర్నేషనల్‌ రైస్‌ కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, పౌరసరఫరాల శాఖలు తెలంగాణ బియ్యం స్టాల్‌ను ఏర్పాటు చేశాయి. దీనిని రవీంద్ర ప్రారంభించారు. ఎంటీయూ 1010, ఆర్‌ఎన్‌ఆర్‌ 15048, బీపీటీ 5204, కేఎన్‌ఎం 1638, కేఎన్‌ఎం 118, జై శ్రీరాం, హెచ్‌ఎంటీ సోనా, చిట్టిముత్యాలు వంటి ప్రీమియం రకాల బియ్యాన్ని ఈ స్టాల్‌లో ప్రదర్శించారు. ఇప్పటికే ఫిలిప్పీన్సుకు ఎగుమతి చేస్తున్నామని, త్వరలోనే ఆఫ్రికా తదితర దేశాలకు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నామని రవీంద్ర చెప్పారు. కువైట్‌ తదితర దేశాల ప్రతినిధులు, ఇండియన్‌ రైస్‌ ఎక్స్పోర్టర్స్‌ ఫెడరేషన్‌ అధ్యకక్షుడు ప్రేమ్‌ గార్గ్‌ స్టాల్‌ను సందర్శించారు.

Read More

తడిసిన ధాన్యం కొంటాం

తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా 4.47 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాలు అందాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కొంటామని, ప్రతి రైతునూ ఆదుకుంటామని చెప్పారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఖమ్మంలో మున్నేరు వరద ప్రభావిత కాలనీలు, నయాబజార్‌ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని మంత్రి సందర్శించారు. బాధితులకు భరోసా కల్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో క్లౌడ్‌ బరస్ట్‌ అయి… అక్కడి నుంచి మున్నేరుకు భారీగా వరద వస్తుండటంతో ఖమ్మంలోని కాలనీలు ముంపునకు గురయ్యాయని తెలిపారు.

Read More

రాజస్థాన్‌లో ఆవులకు గోపాష్టమి పూజలు

రాజస్థాన్‌ పశుసంసవర్ధక శాఖతోపాటు గోధామం నిర్వాహకులు స్వామి రాజేంద్రదాస్‌ మహరాజ్‌ ఆధ్వర్యంలో రాజస్థాన్‌లోని డీగ్‌ జిల్లాలో గల శ్రీ జడ్‌ఖోర్‌ గోధామంలో బుధవారం గోపాష్టమి పూజలు మొదలయ్యాయి. సూర్యోదయంతో గంటల మోతలు, శంఖ నాదాలు, ఆవుల అరుపులతో ఆ ప్రాంగణం మార్మోగింది. అందంగా అలంకరించిన గోశాల వద్ద భక్తులు హారతి పళ్లేలతో ‘జై గోమాత’, ‘జై గోపాల్‌’ అంటూ నినదించారు. గోధామంలోని 10 వేల ఆవులకు ఏక కాలంలో పూజలు జరిగాయి. ఇందులో 9 వేల గోవులు స్మగ్లర్ల నుంచి రక్షించి గోధామంలో ఆశ్రయం కల్పించినవి కావడం విశేషం. పవిత్ర గోమాత ‘సురభి’ దర్శనంతో మొదలైన వేడుకల్లో భక్తులు వేలాది ఆవుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. గోరక్షా సంకల్పం పేరుతో అందరూ ప్రమాణం చేశారు.

Read More

వెల్లుల్లి సాగుతో మంచి ఆదాయం

అగ్రికల్చర్‌ బీఎస్సీ చేసిన హరియాణా యువరైతు రవి పూనియా (27) వ్యవసాయాన్నే తన వృత్తిగా ఎంచుకొన్నారు. అధిక పెట్టుబడితో, తక్కువ లాభాలను ఇచ్చే వరి, గోధుమ, ఆవాల వంటి సంప్రదాయ పంటలకు స్వస్తి చెప్పి.. సేంద్రియ పద్ధతిలో సొరకాయలు, కశ్మీరీ వెల్లుల్లి (గోల్డెన్‌ గార్లిక్‌) సాగు చేసి రూ. లక్షల్లో ఆదాయం గడిస్తున్నారు. ఫతేహాబాద్‌ జిల్లాలోని భూథన్‌ ఖుర్ద్‌ గ్రామానికి చెందిన రవి తాను సాగుచేస్తున్న ఆరడుగుల సొరకాయలతో ఎకరానికి ఏడాదికి రూ.6 లక్షలు సంపాదిస్తున్నారు. ఔషధాల తయారీలో వినియోగించే కశ్మీరీ వెల్లుల్లి ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చి ఖర్చులు పోగా, రూ. 15 లక్షల ఆదాయం సాధించి పెడుతోంది. మరో వైపు.. అఫ్గాన్‌కు చెందిన జీవన్‌ రకం వెల్లుల్లిని కూడా సాగు చేస్తున్నారు.

Read More

‘తెలంగాణ రైస్‌’ ఎగుమతులు పెరగాలి

బియ్యం ఎగుమతుల నిపుణుడు, వరల్డ్‌ ఫుడ్‌ ఫౌండేషన్‌ పురస్కార గ్రహీత సమరేందు మహంతి తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులు మరింతగా పెరగాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అగ్రిహబ్‌లో మంగళవారం బియ్యం ఎగుమతులపై జరిగిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘తెలంగాణలో బియ్యం ఉత్పత్తి 2014-2024 మధ్య మూడు రెట్లు పెరిగింది. ఇప్పటికే ‘తెలంగాణ రైస్‌’ అనే బ్రాండ్‌ పేరుతో ఇక్కడి బియ్యం ఫిలిప్పైన్స్‌కి ఎగుమతి అవుతున్నాయి. దాన్ని మరింత పెంచాలి’ అని సూచించారు. దీనికై ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని పౌరసరఫరాల కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. వ్యవసాయ సంచాలకుడు గోపి, పౌరసరఫరాల శాఖ సంచాలకులు హనుమంత్‌ కొండిబ, అగ్రివర్సిటీ పరిశోధన సంచాలకుడు బలరాం తదితరులు పాల్గొన్నారు.

Read More

వెటర్నరీ వర్సిటీలో పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో 253 బోధనా సిబ్బంది ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 2005లో ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించగా, ఈ స్థాయిలో నియామకాలు చేపట్టడం ఇదే తొలిసారి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రత్యక్ష నియామకాలు చేపట్టేలా నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (పశుసంవర్ధక శాఖ) బి. రాజశేఖర్‌ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఈ 253 ఉద్యోగాల్లో 81 బ్యాక్‌ లాగ్‌ పోస్టులు ఉన్నాయి. మొత్తంగా ఆచార్యులు-56, సంయుక్త ఆచార్యులు-78, సహాయ ఆచార్యులు-119 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సమ్మతించింది.

Read More