రాజస్థాన్ పశుసంసవర్ధక శాఖతోపాటు గోధామం నిర్వాహకులు స్వామి రాజేంద్రదాస్ మహరాజ్ ఆధ్వర్యంలో రాజస్థాన్లోని డీగ్ జిల్లాలో గల శ్రీ జడ్ఖోర్ గోధామంలో బుధవారం గోపాష్టమి పూజలు మొదలయ్యాయి. సూర్యోదయంతో గంటల మోతలు, శంఖ నాదాలు, ఆవుల అరుపులతో ఆ ప్రాంగణం మార్మోగింది. అందంగా అలంకరించిన గోశాల వద్ద భక్తులు హారతి పళ్లేలతో ‘జై గోమాత’, ‘జై గోపాల్’ అంటూ నినదించారు. గోధామంలోని 10 వేల ఆవులకు ఏక కాలంలో పూజలు జరిగాయి. ఇందులో 9 వేల గోవులు స్మగ్లర్ల నుంచి రక్షించి గోధామంలో ఆశ్రయం కల్పించినవి కావడం విశేషం. పవిత్ర గోమాత ‘సురభి’ దర్శనంతో మొదలైన వేడుకల్లో భక్తులు వేలాది ఆవుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. గోరక్షా సంకల్పం పేరుతో అందరూ ప్రమాణం చేశారు.

30 Oct, 2025
రాజస్థాన్లో ఆవులకు గోపాష్టమి పూజలు
#Bhakti, #CowProtection, #CowWorship, #Devotion, #FaithAndTradition, #GoDham, #Gomata, #GoMataKiJai, #Gopashtami, #GoPuja, #Goraksha, #GoSeva, #Goshala, #HinduFestivals, #IndianTradition, #Rajasthan, #RajasthanCulture, #RajasthanNews, #ReligiousCeremony, #RuralIndia, #SpiritualIndia, #SwamiRajendradassMaharaj, #గోపాష్టమి, #గోమాత, agri news, Agriculture, Andhra Pradesh, natural farming, telangana, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
