ఈనెల 13 వరకు హైదరాబాద్‌లో ప్రపంచ ఆక్వాకల్చర్‌ సదస్సు

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ప్రపంచ ఆక్వాకల్చర్‌ సదస్సు-2025 సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రపంచ ఆక్వాకల్చర్‌ సొసైటీ, భారత వ్యవసాయ పరిశోధన మండలి, జాతీయ అభివృద్ధి మండలి, తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 13 వరకు నిర్వహించే ఈ సదస్సులో 20కి పైగా దేశాలు పాల్గొంటున్నాయి. ప్రపంచ జనాభాకు అనుగుణంగా మత్స్యరంగం, ఆక్వాకల్చర్‌ విస్తరణ లక్ష్యంతో నిర్వహించే ఈ సదస్సులో ‘దేశంలో నీలి విప్లవంతో ఆక్వా ఎగుమతుల వృద్ధి’ అంశంపై మంగళవారం నుంచి 13వ తేదీ వరకు చర్చాగోష్ఠులు జరగనున్నాయి.

Read More

పత్తి కొనుగోలు కేంద్రాల సంఖ్య పెరగాలి

తెలంగాణ రాష్ట్రంలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు మొత్తం 321కి గాను సోమవారం వరకు 251 కేంద్రాలే ఏర్పాటు కావడంతో అరకొరగా కొనుగోళ్లు జరుగుతాయని, మరో 70 కేంద్రాలు ఏర్పాటు చేయిస్తేనే పూర్తిస్థాయిలో కొనుగోళ్లు జరుగుతాయని రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం నివేదిక అందజేసింది. 45.32 లక్షల ఎకరాల్లో 28.29లక్షల టన్నుల పత్తి పండగా.. సోమవారం వరకు 36,567.38 టన్నుల మేరకు కొనుగోళ్లు జరిగాయని తెలిపింది. మొత్తం 42 లక్షల మంది రైతుల్లో 19,922 మంది మాత్రమే పత్తిని విక్రయించారని పేర్కొంది. మార్క్‌ఫెడ్‌ ద్వారా 129 కేంద్రాల్లో 12,025 మంది రైతుల నుంచి 38,648.90 టన్నుల మొక్కజొన్న. 38 కేంద్రాల్లో 1,884మంది రైతుల నుంచి 3,438 టన్నుల సోయాబీన్‌ను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది.

Read More

ప్రధాన మంత్రి పంటల బీమా పథకంకు రూ.44.06 కోట్లు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.44.06 కోట్లు రబీలో ప్రధాన మంత్రి పంటల బీమా పథకం (పీఎంఎఫ్‌బీవై) అమలుకు విడుదల చేసింది. అడ్వాన్స్‌ ప్రీమియం కింద రాష్ట్ర వాటాగా ఈ మొత్తాన్ని ఎస్క్రోఖాతాలో డిపాజిట్‌ చేయాలని ఆదేశిస్తూ వ్యవసాయ శాఖ ఎక్స్‌అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Read More

మామిడికి ప్రత్యామ్నాయంగా పామాయిల్ సాగు

మామిడి సాగులో రైతులు భారీగా నష్టాలు చవిచూస్తున్నారు. ప్రత్యామ్నాయంగా పామాయిల్పై దృష్టి సారిస్తున్నారు. దీర్ఘకాలం ఇష్టంతో పెంచుకున్న తోటలను నిలువునా నరికేస్తున్నారు. ప్రస్తుతం పామాయిల్కు గిరాకీ నేపథ్యంలో, మామిడి నష్టాలను పూడ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో నూజివీడు తర్వాత అత్యధికంగా మామిడి సాగుకు మైలవరం నియోజకవర్గం పేరుగాంచింది. నియోజకవర్గ వ్యాప్తంగా నాలుగు మండలాల పరిధిలో ఐదారు దశాబ్దాల కిందటి నుంచి సాగు చేస్తున్న రైతులను మోతుబరులను చేసింది. రారాజుగా, అధిక విస్తీర్ణంలో సాగు చేసిన పంటగా ఘనత దక్కించుకున్న మామిడి నేడు రైతులను నిరాశలో ముంచెత్తుతోంది. గడిచిన నాలుగైదేళ్లుగా సగానికిపైగా మామిడి సాగు రైతులు కనీస ఆదాయాన్ని చూడలేదంటే అతిశయోక్తి కాదు. ఏయేటికాయేడు అనుకూల పరిస్థితుల కోసం ఆశగా ఎదురుచూసినా, ఈ ఏడాది ఎదురైన ప్రతికూల పరిస్థితులు వారి ఆశలపై పూర్తిగా నీళ్లు చల్లాయి. నాలుగైదేళ్లు కిందటి వరకు గోదావరి జిల్లాలకే పరిమితమైన పామాయిల్ సాగు క్రమేపీ ఎన్టీఆర్ జిల్లాకు ప్రవేశించింది. ప్రభుత్వ మద్దతు ధర ఉండడంతో పాటు, కరోనా సమయంలో, మద్దతు ధర కంటే రెట్టింపు ధరలు పలకడంతో రైతుల్లో ఈ సాగుపై మక్కువ పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మొక్కలను ఉచితంగా ఇవ్వడమే గాక, అంతర పంటలకు ప్రోత్సాహం, రాయితీపై బిందు సేద్య పరికరాలు, ఉపాధిహామీ పథకానికి అనుసంధానించడంతో రైతుల్లో పామాయిల్ సాగుపై మరింత ఆసక్తి పెరిగింది.

Read More

తెలంగాణాలో ఇప్ప పవ్వు ఆహార ఉత్పత్తులు

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పపువ్వు లడ్డూ యూనిట్లను స్థాపించనున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలానికి చెందిన భీంబాయి ఆది వాసీ మహిళా సహకార సంఘం ఇప్పపువ్వు లడ్డూలను విక్రయించి రూ.1.27 కోట్ల వార్షిక టర్నోవర్ సాధించి, రూ. 36 లక్షల ఆదాయాన్ని పొందింది. ఈ ఏడాది మార్చిలో మన్కీబాత్ లో ప్రధాని మోదీ ప్రశంసలు పొందిన ఈ సంఘం స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పపువ్వు, దాని అనుబంధ ఆహార ఉత్పత్తుల యూనిట్లను స్థాపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ప్రతిపాదనలు రూపొందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్చ్)ను ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లోని కుమ్రభాగుబాయి నేతృత్వంలోని భీంబాయి ఆదివాసీ మహిళ సంఘంతో సెర్ప్ సీఈవో దివ్యాదేవరాజన్ లడ్డూల తయారీ యూనిట్ను మంజూరు చేయించారు. ఈ సంఘం బహిరంగ మార్కెట్లో విక్రయాలతో పాటు ఐటీడీఏ పరిధిలో 77 ఆశ్రమ పాఠశాలలకు పంపిణీ చేస్తోంది. ఇంకా ఉమ్మడి జిల్లాల కలెక్టరేట్లు, హైదరాబాద్ శిల్పారామంలోని ఇందిరా మహిళాశక్తి బజార్, బాలాపూర్లో సంఘం విక్రయ కేంద్రాల్లో లడ్డూలు అమ్ముతున్నారు. ఆదివాసీ మహిళల సాధికారతను తెలుసుకున్న మంత్రి సీతక్క, ఇలాంటి యూనిట్లను తెలంగాణలో ఏర్పాటు చేయిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి అనుగుణంగా సెర్ఫ్ ఏర్పాట్లు చేస్తోంది. మహిళా సంఘాలకు సబ్సిడీలతో పాటు ప్రభుత్వం రుణసాయం అందించనుంది.

Read More

మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా రైతులు సాగులో మార్పులు చేసుకోవాలి

ప్రపంచమంతా ఆహారపు అలవాట్లు మారి అన్నం తినేవారు తగ్గిపోతున్నారు. ఇందుకు అనుగుణంగా సాగులో మార్పులకు సిద్ధమవ్వాలి. ‘రైతులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. ఖర్చులు తగ్గించుకుని, దిగుబడి పెంచుకోవాలి. తద్వారా ఆదాయం పెరగాలి. ఈ మేరకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌ దేశానికి అన్నపూర్ణగా ఉన్నాయి. పంజాబ్‌లో పురుగుమందుల వాడకం పెరగడంతో క్యాన్సర్‌ బాధితులు చికిత్స కోసం పంజాబ్‌ నుంచి దిల్లీకి రోజూ రెండు రైళ్లలో వెళుతున్నారు. ఇలాంటివి నివారించాలంటే ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గించాలి. ప్రత్యామ్నాయంగా పదేళ్ల కిందటే ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాను. ఇప్పుడు దానికి సాంకేతికతను జోడించి, అభివృద్ధి చేస్తాం’ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అని చెప్పారు. ‘ఆధునిక రాజ్యాంగ సంస్థలు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కార్యక్రమంలో చంద్రబాబు వ్యవసాయ రంగంలో కృషి చేసిన రైతు కుంచాల రామకృష్ణ, శాస్త్రవేత్త కుర్రా శ్రీనివాసబాబులను సన్మానించారు. ఎన్జీ రంగా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు శ్రావణ్‌ కుమార్‌, నసీర్‌ అహ్మద్‌, మాధవి, రామాంజనేయులు, ఎన్జీరంగా కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

Read More

జీవ ఎరువుల తయారీ కోసం వియత్నాం సంస్థతో ఒప్పందం

హైదరాబాద్‌లోని జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆధునిక సాంకేతికతతో దేశంలోనే తొలిసారిగా ఆరు గంటల్లోనే వివిధ జీవ వ్యర్థ పదార్థాల(బయోవేస్ట్‌)ను పోషకాలు అధికంగా ఉండే ఎరువు(బయో ఫెర్టిలైజర్‌) గా మార్చే భారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఈ మేరకు వియత్నాంకు చెందిన ప్రసిద్ధ జీవ ఎరువుల తయారీ సంస్థ ‘బయోవే’తో అగ్రి వర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)లో రెండు నెలల్లో దీన్ని ఏర్పాటు చేసి ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు వర్సిటీ ఉపకులపతి అల్దాస్‌ జానయ్య తెలిపారు. బయోవే.. 11 దేశాలకు జీవ ఎరువులను ఎగుమతి చేస్తోంది. ఇటీవల విదేశీ పర్యటన సందర్భంగా ఈ కంపెనీ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన జానయ్య.. అగ్రివర్సిటీలో ప్లాంటును ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి వారు అంగీకరించి.. ఒప్పందం కుదుర్చుకున్నారు. వీసీ సమక్షంలో బయోవే సీఈవో లీతి కామ్‌టెన్‌, అగ్రి వర్సిటీ రిజిస్ట్రార్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌లు దీనిపై సంతకం చేశారు. ఈ సంస్థ అగ్రి వర్సిటీలో ఎకరం స్థలంలో ప్లాంటు ఏర్పాటుచేసి.. రెండేళ్లపాటు ఉత్పత్తి, ప్లాంటు నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది. ప్రస్తుతం మన దేశంలో జీవ ఎరువుల తయారీకి ఆరు నుంచి ఏడు రోజుల సమయం పడుతోంది. కొన్ని వ్యర్థాలను మాత్రమే దీనికి వినియోగిస్తున్నారు. బయోవే సంస్థ మాత్రం తమ దేశంలో లభించే వరి, మక్క, ఇతర ఆహార, ఉద్యాన పంటల వ్యర్థాలు, మాంసం వ్యర్థాలు, కుళ్లిపోయిన కూరగాయలు, పండ్లు, గుర్రపుడెక్కతోపాటు ఆహార పదార్థాల వ్యర్థాలను మర ఆడించి ఆ మిశ్రమంలో వాల్కనో నుంచి ఉద్భవించిన బ్యాక్టీరియాను కలిపి ఆరు గంటల్లోనే జీవ ఎరువులను తయారు చేస్తోంది. పది డాలర్ల విలువైన 35 కిలోల ఎరువుల బస్తాను ప్రస్తుతం ఎకరం పొలంలో వాడుతుండగా అది సత్ఫలితాలను ఇస్తోంది. అధిక దిగుబడితోపాటు ఆరోగ్యకరమైన పంటలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ ఎరువుల సాయంతో మేలిమి రకం వరిసాగులో వియత్నాం అగ్రస్థానంలో నిలుస్తోంది.

Read More

రైతుల సంక్షేమం కోసం నాబార్డు భాగస్వామ్యం అవసరం – మంత్రి తుమ్మల

రాష్ట్ర రైతుల ప్రయోజనాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని నాబార్డు అధికారులను మంత్రి కోరారు. శుక్రవారం మంత్రి కార్యాలయంలో నాబార్డు సీజిఎం ఉదయ్‌ భాస్కర్‌తో కలిసి నాబార్డు ద్వారా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాబార్డు అధికారులు గ్రామీణాభివృద్ధి కోసం ప్రభుత్వంతో భాగస్వామ్యం, మైక్రో ఇరిగేషన్‌ పథకం కోసం నిధుల విడుదల, బహుళోపయోగ ప్రాథమిక సహకార సంఘాల (M-PACS) ఏర్పాటు వంటి అంశాలపై మంత్రితో చర్చించారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, సూక్ష్మ సాగు, సహకార రంగ బలోపేతం వంటి అంశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నాబార్డ్‌ మద్దతు అందిస్తోందని ఇదేంతో ప్రశంసనీయమని మంత్రి అన్నారు. ఇందుకోసం గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఆర్‌ఐడిఎఫ్‌) కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి నాబార్డ్‌ రూ. 300 కోట్లు రాష్ట్రానికి కేటాయించినట్లు నాబార్డు అధికారులు తెలిపారు. ఈ నిధులు తక్కువ వడ్డీ రేటుతో (ప్రస్తుతం 4.25%) అందిస్తున్నట్టు, రాష్ట్ర ప్రభుత్వం నవంబర్‌ 2025 ముగిసేలోపు కొత్త ఆర్‌ఐడిఎఫ్‌ ప్రాజెక్టు ప్రతిపాదనలు సమర్పించినట్లయితే ఈ నిధులను వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుందని మంత్రికి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్‌ఐడిఎఫ్‌ కింద రూ. 41.37 కోట్లు మాత్రమే డ్రా చేసుకుందని, కొనసాగుతున్న ప్రాజెక్టుల కోసం రూ. 1811 కోట్ల డ్రాయబుల్‌ గ్యాప్‌ ఉందని, రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన ఈ ఆర్‌ఐడిఎఫ్‌ రుణాలను వినియోగించుకోవాలని అధికారులు మంత్రికి సూచించారు. ఈ విషయమై త్వరలోనే ముఖ్యమంత్రితో మాట్లాడుతానని మంత్రి అధికారులకు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 32 జిల్లాలలో మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో నాబార్డు తెలంగాణ రాష్ట్రానికి మైక్రో ఇరిగేషన్‌ ఫండ్‌ (ఎంఐఎఫ్‌) కింద రూ. 144 కోట్ల నిధులను ఆమోదించినట్టు, ఈ నిధుల విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బిఐతో ఒప్పంద ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉందని అధికారులు తెలియజేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో 197 కొత్త ఖ-ఆజ్పుఐల ఏర్పాటుకు నాబార్డ్‌ అనుమతి ఇచ్చింది. ఈ ప్రతిపాదనలను రాష్ట్ర సహకార అభివృద్ధి కమిటీ (ఐ్పుఈ్పు) ద్వారా త్వరితగతిన ఆమోదించాల్సి ఉందని మంత్రి దృష్టికి తీసుకురాగా మంత్రిగారు వీటన్నిటిపై త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యల వలన రైతుల ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయని తెలిపారు. పెరిగిన ఉత్పత్తులను అనుగుణంగా నిల్వ సామార్థ్యాలతో గోదాములు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గోదాముల నిల్వ సామార్థ్యం, రైతుల ఉత్పత్తి సామార్థ్యానికి అనుగుణంగా లేదని అన్నారు. గతంలో నాబార్డు వారు తక్కవ వడ్డీతో ఇచ్చిన రుణాలతో ప్రభుత్వం గోదాముల నిర్మాణం చేపట్టేదని గుర్తుచేశారు. అదే ప్రక్రియను తిరిగి కొనసాగించి గోదాములు నిర్మించేందుకు తక్కువ వడ్డీతో రుణాలు అందించాలని కోరారు. రైతుల ప్రయోజనాల కోసం, వారి అర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అందుకు అనుగుణంగా అనేక పథకాలు పునరుద్ధరిస్తున్నట్టు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో నాబార్డు భాగస్వామం కొనసాగించాలని ఈ సందర్భంగా నాబార్డు అధికారులను కోరారు.

Read More

కూరగాయల సాగుకు ఎకరాకు రూ. 9600/- సబ్సిడీ

తెలంగాణా రాష్ట్రంలో కూరగాయల కొరతను అధిగమించేందుకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 10 వేల ఎకరాల్లో సాగు చేపట్టేందుకు వీలుగా రైతులకు సబ్సిడీ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఒక్కో ఎకరంలో ఆరుటన్నుల కూరగాయల ఉత్పత్తి ఖర్చును అంచనా వేసి అందులో 40 శాతం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్యానశాఖను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.35 లక్షల ఎకరాల్లో ఏటా 14.64 లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తవుతున్నాయి. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ సర్వే ప్రకారం రాష్ట్ర అవసరాలకు 26 లక్షల టన్నులు అవసరం. ఇందుకు అదనంగా 1.33 లక్షల ఎకరాల్లో 12.68 లక్షల టన్నులు ఉత్పత్తి చేయించాలని ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగా ఈఏడాది 10 వేల ఎకరాల్లో అదనంగా కూరగాయల సాగు చేపట్టాలన్నది లక్ష్యం. దీని కోసం సమీకృత ఉద్యాన మిషన్‌ పథకం కింద సాయం అందించేందుకు మంత్రి ఆదేశించారు. ఎకరంలో కూరగాయల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలు, సస్యరక్షణ, పోషక యాజమాన్యం కోసం రూ.24 వేలు ఖర్చవుతుందని ఉద్యానశాఖ గుర్తించింది. ఇందులో 40 శాతం.. అంటే రూ. 9600 సాయం అందించేందుకు సిఫార్సు చేయగా.. మంత్రి ఆమోదం తెలిపారు. టమాటా, వంకాయ, బెండ, క్యాబేజీ, కాలీఫ్లవర్‌, మిర్చి, బీర, క్యాప్సికం, చిక్కుడు, కాకర, దొండ, సొరకాయ తదితర తోటల సాగుకు ముందుకొచ్చే రైతులు స్థానిక ఉద్యాన అధికారికి దరఖాస్తు చేసుకుంటే ఈ ప్రాజెక్టు కింద ఎంపిక చేస్తారు. సాగు ప్రారంభించిన వెంటనే నారు, విత్తనాలను ఉద్యానశాఖకు చెందిన లేదా గుర్తింపు పొందిన నర్సరీల నుంచి కొనుగోలు చేస్తే వారికి 40 శాతం సబ్సిడీ సాయం రూ.9600 రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఒక్కో రైతుకు 2.50 ఎకరాల చొప్పున సబ్సిడీ సాయం అందిస్తారు. సాగుకు అవసరమైన నారును సిద్దిపేట జిల్లా ములుగు, హైదరాబాద్‌ సమీపంలోని జీడిమెట్లలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లలో ఉద్యానశాఖ సాగు చేస్తోంది. ఎంపికైన రైతులకు విత్తనాలను సబ్సిడీపై అందజేస్తుంది.

Read More

ఉల్లి రైతులకు హెక్టారుకి 50 వేల ఆర్థిక సాయం

ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లి రైతులు నష్టపోకూడదనే ఆలోచనతోనే సీఎం చంద్రబాబు హెక్టారుకు రూ.50 వేల చొప్పున ప్రకటించారని, ఉల్లి రైతులకు త్వరలో ఆర్థికసాయం అందిస్తామని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కర్నూలు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో మొత్తం 20,913 మంది రైతులకు రూ.104.57 కోట్ల లబ్ది కలగనుందని పేర్కొన్నారు. క్వింటాలు ఉల్లి రూ.1,200 చొప్పున మార్కెటింగ్‌ శాఖ, మార్క్‌ఫెడ్‌ ద్వారా రూ.18 కోట్ల విలువైన సరకు కొనుగోలు చేశామని, ఇప్పటికి రూ.10 కోట్లు చెల్లించామని వివరించారు. మిగిలిన రూ.8 కోట్లు త్వరలో అందిస్తామన్నారు.

Read More