ఆంధ్రప్రదేశ్ వెల్లమిల్లి గ్రామానికి చెందిన యువ రైతు రాజేంద్రప్రసాద్ చేస్తున్న సమీకృత వ్యవసాయం విధానాన్ని నల్లమాడులో ఏర్పాటు చేసిన వివిధ రకాల ప్రదర్శనలో ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. ఎకరా విస్తీర్ణంలో వరి, మత్స్య, కూరగాయలు సాగు చేస్తున్న తీరును రైతు చంద్రబాబుకు వివరించారు. ఇదే సాగును పది ఎకరాల్లో చేయగలవా? అని సీఎం ఆరా తీయగా, చేయగలనని రాజేంద్రప్రసాద్ బదులిచ్చారు.

3 Dec, 2025
