ఆంధ్రప్రదేశ్లో సజ్జల క్వింటాలుకు మద్దతు ధర రూ.2,775 ఉంటే.. రైతుకు రూ. 2వేలు కూడా దక్కడం లేదు. ఎకరానికి సగటున రూ.25 వేల పెట్టుబడి పెట్టారు. నాణ్యత లేదంటూ ప్రకాశం, ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో క్వింటాలు రూ.1,600 నుంచి రూ.1,800కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఖరీఫ్ లో రాష్ట్ర వ్యాప్తంగా 64 వేల ఎకరాల్లో సజ్జ సాగైంది. ప్రకాశం జిల్లాలో 17 వేల ఎకరాలు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 28,000, ఉమ్మడి అనంతపురం జిల్లాలో 11 వేల ఎకరాల్లో వేశారు. అక్టోబరులో కురిసిన భారీ వర్షాలతో పాటు తుపాను ప్రభావంతో పంట దెబ్బతింది. అధిక శాతం రైతులకు ఎకరానికి 2-3 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. పంట నాణ్యతా తగ్గింది. ఈ తరుణంలో ధరలు లేక రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం మద్దతు ధరపై మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

1 Dec, 2025
