పసుపు ఉత్పత్తి, నాణ్యత పెంచడం కోసం సమగ్ర ప్రణాళిక

పసుపు ఉత్పత్తి, నాణ్యత, విలువను పెంచడం కోసం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని, వచ్చే ఐదేళ్లలో పసుపు ఎగుమతులను బిలియన్‌ డాలర్లకు పెంచుతామని జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి భవానిశ్రీ తెలిపారు. 2025లో క్వింటాకు రూ. 18,000-19,000 ఉన్న ధరను రాబోయే మూడేళ్లలో రూ. 25,000-26,000కి పెంచడమే తమ మొదటి లక్ష్యమని చెప్పారు.

Read More

పట్టు రైతులకు రూ.14 కోట్లు విడుదల

2023-24, 2024-25 సంవత్సరాలకు సంబంధించి సిల్క్‌ సమగ్ర -2 పథకం కింద ఆంధ్ర రాష్ట్ర వాటా కింద రూ.14 కోట్ల నిధుల్ని పట్టు పరిశ్రమల శాఖకు విడుదల చేశామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ నిధులతో 13,663 మంది పట్టు రైతులకు లబ్ధి చేకూరిందని బుధవారం ఓ ప్రకటనలో వివరించారు.

Read More

ఉద్యాన పంటల సాగుతో రైతుల ఆదాయం మెరుగుపడుతుంది

జీడిమెట్లలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో ఇజ్రాయెల్‌ అగ్రికల్చర్‌ ప్రాజెక్టు, రాష్ట్ర ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ‘కూరగాయల సాగు- మెలకువలు’ అంశంపై శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఉద్యాన పంటలను సాగు చేస్తే.. మెరుగైన ఆదాయం వస్తుందని తెలంగాణా రాష్ట్ర ఉద్యానశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ రామలక్ష్మి తెలిపారు. ప్రస్తుతమిక్కడ శిక్షణ పొందినవారు.. మట్టి లేకుండానే కూరగాయల సాగు, బిందు సేద్యంతోపాటు నీటిలో కరిగే ఎరువుల యాజమాన్య పద్ధతులపైనా సమగ్ర అవగాహన పొందారని తెలిపారు. కూరగాయల పెంపకంలో నిపుణులైన ఇజ్రాయెల్‌ అగ్రికల్చర్‌ ప్రాజెక్టు ఉన్నతాధికారులు రాబిన్‌ స్టీన్‌, డేనియల్‌ హదాబ్‌, మేడ్చల్‌ జిల్లా ఉద్యాన అధికారి శ్రీధం, 12 రాష్ట్రాల నుంచి 40 మంది అధికారులు పాల్గొన్నారు.

Read More

పెరుగుతున్న మిరప ధరలు

గతేడాది పడిపోయిన మిర్చి ధరలు ప్రస్తుతం నాణ్యతను బట్టి ఒక్కో రకం రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు పెరిగింది. కర్ణాటకలోని బ్యాడిగ అంతర్జాతీయ మార్కెట్‌లో డబ్బి బ్యాడిగ రకం మిర్చి క్వింటాలు గరిష్ఠంగా రూ.71,199 అమ్ముడుపోయింది. బ్యాడిగ కడ్డీ రకం రూ. 54 వేలు పలికింది. బ్యాడిగ రకాల్లో నాణ్యతను బట్టి సగటున రూ. రూ.55 వేల నుంచి రూ.65 వేలకు వరకు ధర పలుకుతుండటంతో రైతులు లాభాలు చూస్తున్నారు. విత్తన రకాలైన తేజ, 5531, 2043, 273 ధరలు గతేడాది క్వింటాలు రూ.11 వేల లోపు ఉండగా ఈసారి రూ.16 వేల నుంచి రూ.22 వేల వరకు పలుకుతున్నాయి. జూన్‌లో పంట సాగు చేసిన రైతులకు ఈ నెల తొలి వారంలో మొదటి కోత చేతికొచ్చింది. మార్కెట్‌లో డిమాండ్‌ ఉండటంతో రైతులు తీసుకొచ్చిన పంటను వ్యాపారులు వెంటనే కొనుగోలు చేస్తున్నారు.

Read More

రైతుల ఆదాయం పెరగాలి

వ్యవసాయంలో ఆవిష్కరణలు, పరిశోధనలు, ప్రయోగ ఫలితాలు క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులోకి రావాలని, అన్నదాతల ఆదాయం రెట్టింపు అయ్యేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు కృషిచేయాలని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పిలుపునిచ్చారు. అగ్రివర్సిటీ ఉపకులపతి అల్దాస్‌ జానయ్య, రిజిస్ట్రార్‌ విద్యాసాగర్‌, పరీక్షల నియంత్రణాధికారి మల్లారెడ్డిలు… సోమవారం లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వ్యవసాయ వర్సిటీ ప్రగతి నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. ‘వాతావరణ మార్పులు, మార్కెట్‌ ఒడుదొడుకులతో ధరల పతనం, ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టాలు ఎదుర్కొంటున్నారు. వీటికి వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిష్కారం చూపాలి. అగ్రివర్సిటీ చేపట్టిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం సత్ఫలితాలనిచ్చింది. అధిక ఉష్ణోగ్రతలు, భారీ వర్షాలు, కరువు, చీడపీడలను ఎదుర్కొనే విత్తన రకాలను కనిపెట్టాలి’ అని సూచించారు. వర్సిటీలో పెండింగులో ఉన్న మూడు బ్యాచ్‌లకు వచ్చే ఫిబ్రవరిలో స్నాతకోత్సవం నిర్వహించి 2,800 మందికి పీహెచ్‌డీ, పీజీ, డిగ్రీ పట్టాలు ప్రదానం చేస్తామని ఈ సందర్భంగా వీసీ తెలిపారు.

Read More

హార్టీకల్చర్‌ డిగ్రీ కోర్సులకు 17న కౌన్సెలింగ్‌

ఈ నెల 17న కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని ఉద్యాన కళాశాలల్లో ఖాళీగా ఉన్న బీఎస్సీ (హార్టికల్చర్‌) డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వీసీ రాజిరెడ్డి తెలిపారు. ఉదయం 10.30 నుంచి హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఎగ్జామినేషన్‌ సెంటర్‌లో కౌన్సెలింగ్‌ ఉంటుందని వెల్లడించారు. రాజేంద్రనగర్‌లోని ఉద్యాన కళాశాలలో 15 సీట్లు, వనపర్తి జిల్లా మోజెర్ల ఉద్యాన కళాశాలలో 32 సీట్లు, మహబూబాబాద్‌ జిల్లాలోని మల్యాల కళాశాలలో 10 సీట్లను కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తామన్నారు. మరిన్ని వివరాలకు www.skltghu.ac.in, www.pjtau.edu.in లేదా 9652456779 నంబరులో సంప్రదించవచ్చని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Read More

ఆంధ్రప్రదేశ్‌కి పండ్లు, చేపల ఉత్పత్తిలో మొదటి స్థానం

రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2024-25 ఆర్థిక సంవత్సరం గణాంకాలు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 1.93 కోట్ల టన్నుల పండ్లు ఉత్పత్తి చేస్తూ దేశంలోనే ప్రథమస్థానాన్ని దక్కించుకుంది. తర్వాత మహారాష్ట్ర 1.68 కోట్ల టన్నుల ఉత్పత్తితో రెండోస్థానంలో ఉంది. మధ్యప్రదేశ్‌ 1.02 కోట్ల టన్నుల ఉత్పత్తితో మూడోస్థానంలో ఉంది. 8.07 లక్షల హెక్టార్లలో పండ్లతోటలు సాగు చేస్తూ దేశంలో రెండోస్థానంలో ఏపీ ఉండగా 8.96 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉంది. చేపల ఉత్పత్తిలో కూడా దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ నిలిచింది. రాష్ట్రంలో 51.58 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతుంది. ఆ తర్వాత పశ్చిమబెంగాల్‌ 22 లక్షల టన్నులతో రెండోస్థానంలో, ఉత్తర్‌ప్రదేశ్‌ 11.60 లక్షల టన్నులతో మూడోస్థానంలో ఉన్నాయి.

*రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.15.93 లక్షల కోట్లు* ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2024-25లో రూ.15.93 లక్షల కోట్లుగా రిజర్వు బ్యాంకు పేర్కొంది. స్థిరధరల వద్ద రూ.8.65 లక్షల కోట్లుగా తేల్చింది. సగటున రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.2,66,240 (ప్రస్తుత ధరల్లో), రూ. 1,41,609 (స్థిర ధరల వద్ద) గా పేర్కొంది. సగటు రాష్ట్ర నికర ఉత్పత్తి ప్రస్తుత ధరల వద్ద రూ.14.22 లక్షల కోట్లు కాగా స్థిర ధరల వద్ద రూ.7.56 లక్షల కోట్లు బియ్యం ఉత్పత్తి 81.59 లక్షల టన్నులు, ఆహారధాన్యాల ఉత్పత్తి రాష్ట్రం మొత్తమ్మీద 1.17 కోట్ల టన్నులు రాష్ట్రవ్యాప్తంగా వరిసాగు 20.77 లక్షల హెక్టార్లు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో 74 మార్కులతో ఆంధ్రప్రదేశ్‌ పదో స్థానంలో ఉంది. తెలంగాణ కూడా ఇదే స్థానంలో నిలిచింది.

*సగటు జీవన కాలం 70 ఏళ్లు* ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో సగటు జీవనకాలం 70 ఏళ్లు. పురుషులు 68 ఏళ్లు జీవిస్తుండగా, మహిళలు ఐదేళ్లు ఎక్కువగా 73 ఏళ్లు జీవిస్తున్నారు. జాతీయ సగటు కూడా 70 ఏళ్లతో తెలుగు రాష్ట్రాలు సమంగా ఉన్నాయి. అత్యధిక జీవితకాలం ఉన్న జాబితాలో తెలుగు రాష్ట్రాలది 9వ

Read More

పత్తి కొనుగోలులో సీసీఐ నిబంధనలు సడలించాలి

కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) 18% తేమ ఉన్నా పత్తి కొనుగోలు చేసేలా నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలుగుదేశం పార్లమెంటు పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఆయన గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో దీనిపై మాట్లాడారు. ”పత్తి కొనుగోలు చేయాలంటే అందులో తేమశాతం 8-12%కి మించకూడదన్న నిబంధన రైతులకు గుది బండగా మారింది. ఆంధ్రరాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల కారణంగా తీరప్రాంతంలో తేమశాతం దీనికంటే ఎక్కువగా ఉంటుంది. రైతులకు ఎల్‌1/ఎల్‌2/ఎల్‌ జిన్నింగ్‌ మిల్లులు కేటాయించడం వల్ల వాళ్లు తమ సమీపంలో ఉన్న మిల్లులను ఎంచుకొనే వీల్లేకుండా పోతోంది. దానివల్ల వారు తక్కువ ధరలకే దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. అందువల్ల ఆంధ్రప్రదేలో ఉన్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సీసీఐ నిబం ధనలను సడలించాలి. అదే సమయంలో అన్ని జిన్నింగ్‌ మిల్లులను తెరిచి 18% వరకు తేమ ఉన్న పత్తిని కొనుగోలుచేసి ఆ నిష్పత్తి ప్రకారం కనీస మద్దతు ధర చెల్లించేలా నిర్దేశించాలి. వర్షం నీరు తాకిన, రంగుమారిన పత్తిని ప్రత్యేక కేటగిరీ కింద తగిన ధరకు కొనుగోలు చేయాలి. రాష్ట్ర రైతులు ఇప్పటికే పలు వైపరీత్యాలతో ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో నిబంధనలతో వారి కష్టాలను రెట్టింపు చేయడం భావ్యం కాదు. వ్యవసాయదారుల జీవనోపాధిని రక్షించి, రాష్ట్రంలో పత్తిసాగును కాపాడేం దుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రైతులను ఆదుకోవాలి. దేశంలో అత్యధికంగా పత్తి సాగుచేసే తొలి ఐదు రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ యేటా 20 లక్షల బేళ్లు అందిస్తోంది. 2025-26 ఖరీఫ్‌ సీజన్‌లో 5.39 లక్షల హెక్టార్లలో పంట సాగైంది. సుమారు 8 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. అయితే మొంథా తీవ్రతుపాను కారణంగా 1.08 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతింది. సుమారు 1.25 లక్షల టన్నుల పత్తి రంగుమారింది. తీరప్రాంతంలోని ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని రైతులు తీవ్ర ప్రభావానికి గురయ్యారు” అని లావు పేర్కొన్నారు.

Read More

కేంద్ర విత్తన చట్టంలో తెలంగాణ ఉద్యాన నర్సరీల చట్టాన్ని చేర్చాలి

తెలంగాణ ఉద్యాన నర్సరీల నమోదు (నియంత్రణ) చట్టం-2010ని కేంద్ర విత్తన చట్టం-2025లో చేర్చాలని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖను కోరింది. వర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి నేతృత్వంలో కేంద్ర విత్తనచట్టం ముసాయిదా కోసం రూపొందించిన ప్రతిపాదనలను గురువారం కేంద్రానికి పంపింది. ‘ప్రైవేటు కూరగాయల విత్తనాలు, పండ్ల నర్సరీలను నియంత్రించడంలో తెలంగాణ ఉద్యాన నర్సరీల రిజిస్ట్రేషన్‌ నియంత్రణ చట్టం విజయం సాధించింది. రైతులు ప్రయోజనాల పరిరక్షణతో పాటు లైసెన్సును తనిఖీ చేయడం, నిలిపివేయడం, రద్దు చేసే అధికారాన్ని ఈ చట్టం కల్పించింది. దీనిని నమూనాగా తీసుకొని భారతదేశ ఉద్యాన రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కేంద్ర విత్తన చట్టం రూపొందించాలి’ అని ఉద్యాన వర్సిటీ కేంద్రాన్ని అభ్యర్థించింది.

Read More

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగ పనితీరులో పశ్చిమగోదావరి జిల్లా అగ్రస్థానం

పశ్చిమగోదావరి జిల్లా వ్యవసాయ రంగ పని తీరు సూచికల్లో 89 స్కోర్‌తో అగ్రస్థానంలో నిలిచింది. ఎన్టీఆర్‌ 82, కృష్ణా 80, శ్రీసత్యసాయి 80, నంద్యాల 78 స్కోర్లతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ‘ఏ’ గ్రేడ్‌లో 7 జిల్లాలు, ‘బి’ గ్రేడ్‌ 19 జిల్లాలు ఉన్నాయి. అన్నమయ్య 53, చిత్తూరు 59, శ్రీకాకుళం 61 స్కోర్లకు పరిమితమై అట్టడుగున నిలిచాయి.

ఈ ఏడాది ధాన్యం ఉత్పత్తి పెరిగింది. గతేడాదితో పోలిస్తే సగటున 23.59% అధిక ఉత్పత్తి లభిస్తుందని అంచనా. దూది (పత్తి) ఉత్పత్తి కూడా గతేడాది కంటే 30.97% పెరుగుతుందని పేర్కొ న్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో అధిక ఉత్పత్తి లభించనుంది. మొక్కజొన్న ఉత్పత్తిలో ప్రకాశం, పల్నాడు జిల్లాలు తొలి స్థానాల్లో నిలిచాయి.

Read More