జిన్నింగ్‌ మిల్లులను వెంటనే ప్రారంభించాలని ఆదేశం

తెలంగాణా రాష్ట్రంలో ఇంకా ప్రారంభంకాని జిన్నింగ్‌ మిల్లులను వెంటనే ప్రారంభించాల్సిందిగా వ్యవసాయ శాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్‌ మరియు సీసీఐ అధికారులను వ్యవసాయాశాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా సీసీఐ కొనుగోలు కేంద్రాలుగా 328 జిన్నింగ్‌ మిల్లులు నోటిఫై చేసినప్పటికీ, వాటిలో కొన్ని ఇప్పటికీ కొనుగోళ్లు చేపట్టకపోవడం మంత్రి దృష్టికి వచ్చినట్లు తెలిపారు. జిన్నింగ్‌ మిల్లర్లు సమ్మె విరమించి మిల్లులన్నీ ప్రారంభిస్తామని చెప్పినప్పటికీ, ఇంకా కొన్నిచోట్ల మిల్లులు పనిచేయకపోవడం పట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జిన్నింగ్‌ మిల్లుల అసోసియేషన్‌ అధ్యకక్షుడు రవీందర్‌తో కూడా మాట్లాడిన మంత్రి, మిగిలిన మిల్లులన్నీ వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి అంతరాయం లేకుండా పత్తి కొనుగోళ్లు నిరంతరంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఇప్పటికే 1.32 లక్షల మంది రైతుల నుండి 2.35 లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తి సేకరించామని పేర్కొంటూ, కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలన్నారు.

Read More

గనోడెర్మా పుట్టగొడుగుల సాగు

హరియాణాలోని బడియాల్‌ గ్రామానికి చెందిన వీరేంద్ర బజ్వాన్‌.. గనోడెర్మా పుట్టగొడుగులను శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. వీటి పెంపకంపై సోలన్‌లోని మష్రూమ్‌ రీసెర్చ్‌ డైరెక్టరేట్‌లో వీరేంద్ర శిక్షణ పొందారు. గనోడెర్మా పుట్ట గొడుగులకు ఉండే ఔషధ గుణాల వల్ల దీన్ని ‘మ్యాజికల్‌ మష్రూమ్‌’ అని పిలుస్తారు. ఈ పుట్టగొడుగు నుంచి తయారైన ఉత్పత్తులు షుగర్‌ నియంత్రణ, క్యాన్సర్‌, అల్సర్లు, చర్మ వ్యాధులను నియంత్రించడంలో ఉపయోగపడతాయి. ‘వీఎండబ్ల్యూ న్యూట్రాస్యూటికల్స్‌’ అనే కంపెనీని స్థాపించిన వీరేంద్ర బజ్వాన్‌.. గనోడెర్మా, శిటాకే, కార్డి సెప్స్‌ వంటి హెర్బల్‌ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. తన ఉత్పత్తులను 28 దేశాలకు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బజ్వాన్‌ తెలిపారు. కొన్నిదేశాలకు ఎగుమతి ప్రక్రియ ప్రారంభమైందని.. మరికొన్నింటిలో లైసెన్స్‌ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం గనోడెర్మా పౌడర్‌ను కిలో రూ.21,000లకు అమ్ముతున్నట్లు తెలిపారు. ఈ సాగులో మంచి ఫలితాలు సాధించిన వీరేంద్రను 2025 ఆగస్టు 21న హరియాణా ముఖ్యమంత్రి నాయబ్‌ సింగ్‌ సైనీ సత్కరించారు. హిస్సార్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ప్రగతిశీల రైతు అవార్డును పొందారు. అంతేకాదు పుట్టగొడుగుల ప్రచార కమిటీలో వీరేంద్రను సభ్యుడిగా నియమిస్తూ హరియాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటి పెంపకంపై లక్ష మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చే బాధ్యతను ఆయనకు అప్పగించింది.

Read More

రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల

రైతునేస్తం కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విత్తన ముసాయిదా బిల్లుపై రైతులతో తెలంగాణా వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖాముఖి చర్చించారు. రైతువేదికల ద్వారా అనేక జిల్లాల నుండి అధికసంఖ్యలో రైతులు హజరైనారు. ఎన్‌.ఎఫ్‌.ఎస్‌.ఎం పథకంలో భాగంగా విత్తనాల సరఫరా మరియు పంట అవశేషాలు కాల్చకుండా తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు వివరించిచారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్‌, వ్యవసాయ కమిషన్‌ చైర్మన్‌ కొదండరెడ్డి, తెలంగాణ సీడ్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌ అన్వేష్‌ రెడ్డి పాల్గొన్నారు.

Read More

నిరుద్యోగులకు వ్యవసాయ, అనుబంధ రకాలు దన్నుగా నిలిచాయి

తెలంగాణా రాష్ట్రంలో గత మూడు నెలల్లో నిరుద్యోగ రేటు 6.9 నుంచి 5.7 శాతానికి తగ్గింది.. తయారీ, సేవారంగాల్లో ఉపాధి స్వల్పంగా నెమ్మదించినప్పటికీ వ్యవసాయ, అనుబంధ రంగాలు దన్నుగా నిలిచినట్లు కార్మిక బలగం సర్వే (జులై-సెప్టెంబరు, 2025) నివేదిక వెల్లడించింది. గత మూడు నెలల్లోనే ఈ రంగంలో ఉపాధి పొందిన వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు పేర్కొంది. ఇదే సమయంలో 15-29 ఏళ్ల యువతలో నిరుద్యోగం స్థిరంగా 20.2 శాతంగా (యువతుల్లో 21.7%, యువకుల్లో 19.5%) నమోదైనట్లు వెల్లడించింది. గ్రామీణ యువతలో నిరుద్యోగం 18.0 శాతం ఉంటే.. పట్టణాల్లో 22.7 శాతంగా ఉన్నట్లు తెలిపింది. గ్రామీణ మహిళల్లో నిరుద్యోగ రేటు తక్కువ ఉంటే.. పట్టణ మహిళల్లో ఎక్కువగా ఉంది. నివేదికలోని ముఖ్యాంశాలివి..
రాష్ట్రంలో వ్యవసాయరంగంలో ఉపాధి పొందుతున్నవారు జూన్‌ నాటికి 32.9% మంది ఉంటే.. ప్రస్తుతం 40.5% ఉన్నారు. వర్షాలు పడటం, సాగు విస్తీర్ణం పెరగడంతో మూడు నెలల్లో ఈ రంగంపై ఆధారపడిన గ్రామీణుల శాతం 50.1 (ఏప్రిల్లో) నుంచి 60.1కి (సెప్టెంబరు నాటికి) చేరింది.
పట్టణాల్లో వ్యవసాయ రంగంపై ఆధారపడిన కార్మికుల వాటా మూడు నెలల క్రితం 4.1% ఉంటే.. ఇటీవల 6.2 శాతానికి చేరింది.
రాష్ట్రంలో తయారీ, క్వారీ, మైనింగ్‌ రంగాల్లో ఉపాధి తగ్గింది. జూన్‌ నాటికి ఈ రంగాల్లో 29.1% ఉంటే.. సెప్టెంబరు నాటికి 22.2 శాతానికి పడిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా సేవారంగంలోనూ స్వల్పంగా 38 నుంచి 37.3 శాతానికి తగ్గింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని సేవా రంగాల్లో ఉపాధి రేటు 20.8 నుంచి 21.3 శాతానికి పెరిగింది.
జాతీయ స్థాయిలో పరిశీలిస్తే స్వయంఉపాధి పొందుతున్నవారి సంఖ్య పెరిగింది. జూన్‌ నాటికి 39% మంది స్వయంఉపాధి పొందుతుండగా.. సెప్టెంబరు నాటికి అది 40.6 శాతానికి చేరింది. పురుషుల్లో 41.3 నుంచి 43.2 శాతానికి పెరిగింది.

Read More

రైతన్నా మీ కోసం’ తొలి రోజు 4.07 లక్షల కుటుంబాల వద్దకు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘రైతన్నా.. మీ కోసం’ వారోత్సవాల మార్గదర్శకాలు విడుదల చేసింది. రైతు సేవా కేంద్రం యూనిట్‌గా వ్యవసాయ / ఉద్యాన/పట్టు సహాయకుడు, పశుసంవర్ధక/మత్స్య సహాయకుడు, గ్రామ రెవెన్యూ అధికారి, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌, ఎనర్జీ అసిస్టెంట్‌, అభ్యుదయ రైతు, సహకార పరపతి సంఘాలు, నీటి వినియోగదారుల సంఘాలు, మార్కెట్‌ కమిటీల సభ్యులు బృందంగా ఏర్పడి కార్యక్రమాన్ని నిర్వహించాలని పేర్కొంది. ‘సీఎం చంద్రబాబు రాసిన లేఖ అందించడంతోపాటు రైతు సంక్షేమంపై కరపత్రాలు, పంచసూత్రాలతో పాటు ఏపీఏఐఎంఎస్‌ యాప్‌ వివరాలు రైతులకు తెలియజేయాలి. ప్రతి ఆర్‌ఎస్‌కే బృందం ఆరు రోజుల్లో 540 కుటుంబాల్ని చేరుకోవాలి. 24 నుంచి 29వ తేదీ వరకు ఇంటింటి ప్రచారం చేయాలి. నవంబరు 30 నుంచి డిసెంబరు 2 వరకు రైతు కుటుంబాల వారీగా సమాచారం సేకరించాలి. డిసెంబరు 3న సదస్సు నిర్వహించి 2026-27 వార్షిక ప్రణాళిక తయారుచేయాలి’ అని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 71.58 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. రైతన్నా మీ కోసం కార్యక్రమంలో భాగంగా సోమవారం 8,451 రైతు సేవా కేంద్రాల పరిధిలోని 11. 93 లక్షల కుటుంబాల వద్దకు వెళ్లాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్ణయించింది. 4.07 లక్షల కుటుంబాల వద్దకు బృందాలు వెళ్లాయి. అన్నమయ్య, వైఎస్సార్‌ కడప, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో లక్ష్యంలో 50% పైగా సాధించారు. అనంతపురం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, కర్నూలు, శ్రీసత్యసాయి, శ్రీకాకుళం జిల్లాల్లో లక్ష్యంలో 30% లోపే ఉంది.

Read More

పందిరి సాగుతో స్థిరమైన ఆదాయం

బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పి. గుడిపాడులో గతంలో ఎక్కువ మంది వాణిజ్య పంటలు సాగు చేనే వారు. వస్తే అధిక లాభాలు.. లేదంటే తీవ్ర నష్టాలతో సతమతమయ్యేవారు. రెండు థాబ్దాల క్రితం కొంతమంది రైతులకు వచ్చిన ఆలోచన ప్రస్తుతం ఆ గ్రామ స్వరూపాన్నే మార్చేసింది. పందిరి విధానంలో కూరగాయలు సాగు చేస్తూ వారి ఆర్థిక స్వయం సమృద్ధికి బాటలు వేసింది. స్థిరమైన ఆదాయం కోసం వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించగా పందిరి విధానంలో కూరగాయల సాగు చేపట్టాలని సూచించారు. దీంతో కొందరు కర్షకులు పందిరి సాగులో ప్రసిద్ధి చెందిన నారాకోడూరు వెళ్లి పరిశీలించారు. అనంతరం పి.గుడిపాడులో తొలుత 20 ఎకరాల్లో కర్ర పందిరితో దొండ, కాకర సాగు చేశారు. వాటిలో లాభాలు రావడంతో మిగిలినవారూ దీనివైపు మొగ్గు చూపారు. 2014లో ప్రభుత్వం రాళ్లతో కూడిన శాశ్వత పందిళ్లకు రాయితీ అందించింది. ప్రస్తుతం గ్రామంలో 550కు పైగా ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తుండగా అందులో 480 ఎకరాల్లో పందిరి సాగు చేస్తు న్నారు. దీని ద్వారా దొండ, కాకర, సొర, బీర పండిస్తున్నారు.

Read More

విదేశీ ఫలాల సాగుతో 10వేల కోట్లు ఆదా!

ఉత్తమ పోషక విలువలు, మార్కెటింగ్‌ సామర్థ్యం గల స్ట్రాబెర్రీ.. డ్రాగన్‌ఫ్రూట్‌.. అవకాడో.. రాంబూటాన్‌.. బ్లూబెర్రీ.. లాంగన్‌.. మకాడమియా నట్‌.. కివీ.. మ్యాంగోస్టీన్‌.. ఇలాంటి విదేశీ రకాల ఫలాలను మన దేశంలో సాగు చేయడం రైతులకు లాభదాయకమని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వెల్లడించింది. 2024-25లో రూ.10 వేల కోట్ల విలువైన ఇలాంటి ఫలాలను దిగుమతి చేసుకున్న నేపథ్యంలో.. మన దేశంలో వీటి సాగును పెంచడం ద్వారా ఏటా ఆ మొత్తం ఆదా అవుతుందని వెల్లడించింది. ‘విదేశీ ఫలాల’ సాగుపై అధ్యయనం చేపట్టి తాజాగా నివేదికను విడుదల చేసింది. అందులోని ముఖ్యాంశాలివి..
కొన్ని రకాల విదేశీ ఫలాలకు మన దేశంలో ఆదరణ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వీటి సాగును ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ అవకాడో, డ్రాగన్‌ ఫ్రూట్‌, స్ట్రాబెర్రీ, ప్యాషన్‌ ఫ్రూట్‌ వంటి రకాలను పండిస్తున్నారు. సాగు వ్యయం కొంత ఎక్కువైనా.. తక్కువ నీటితోనే ఇవి పండుతాయి. పెట్టుబడికి తగిన లాభాలు వస్తాయి. దేశంలో వీటి సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హార్టికల్చరల్‌ రీసెర్చ్‌ ఈ పంటలపై పరిశోధన, సాగు అభివృద్ధి, సాంకేతికత వ్యాప్తిలో కీలకపాత్ర పోషిస్తోంది. డ్రాగన్‌ ఫ్రూట్‌, అవకాడో వంటి పంటలకు ప్రామాణిక సాగు నియమావళిని అభివృద్ధి చేసింది. కేంద్రం సిఫార్సులివీ..
ఉద్యాన పంటలను ప్రోత్సహించడానికి అన్ని రాష్ట్రాల ఉద్యాన విభాగాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు.. విస్తృతంగా రైతు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. మార్కెటింగ్‌తో పాటు కోల్డ్‌ స్టోరేజి సౌకర్యాలు, ప్యాక్‌ హౌస్‌లు, గ్రేడింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల మధ్య అనుసంధానాలను బలోపేతం చేయాలి. ప్రైవేటు వ్యవసాయ వ్యాపార సంస్థలు, స్టార్టప్‌లు, సహకార సంస్థల సహకారంతో సంబంధిత మౌలిక సదుపాయాల వృద్ధి, సాంకేతిక సహకారం, పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలి.

Read More

యాప్‌’ ద్వారా సాగునీటి ప్రాజెక్టుల వివరాలు

తెలంగాణాలో సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ప్రత్యేకంగా ఒక యాప్‌ను నీటిపారుదల శాఖ రూపొందించింది. ప్రాజెక్టు నిర్మాణం ఏ థలో ఉంది, రోజువారీ ఎంత పని జరుగుతోంది, ఏ ప్రాంతాల్లో ఏ తరహా పనులు జరుగుతున్నాయో నిరంతరం పరిశీలించేందుకు ఈ యాప్‌ దోహద పడనుంది. 19 నీటిపారుదల సర్కిళ్లకు సంబంధించిన అన్ని రకాల పనులను యాప్‌ పరిధిలోకి తెస్తున్నారు. శుక్రవారం సీఈలతో శాఖ అధికారులు సమీక్ష నిర్వహించారు.

Read More

రైతన్నా.. మీకోసం’ ఈ నెల 24 నుంచి 29 వరకు

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు, రైతులకు దిశానిర్దేశం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు ‘రైతన్నా.. మీ కోసం’ కార్యక్రమాన్ని రూపొందించారని, ఈ నెల 24 నుంచి 29 వరకూ రాష్ట్రవ్యాప్తంగా దీన్ని నిర్వహించనున్నట్లు వ్యవసాయ మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Read More

అగ్రి కోర్సుల్లో ప్రవేశాలకు చివరి విడత కౌన్సెలింగ్‌ 24 నుంచి

2025-26 విద్యా సంవత్సరానికి బీఎస్సీ (హానర్స్‌) వ్యవసాయం, బీటెక్‌ (ఫుడ్‌ టెక్నాలజీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 24, 25, 27, 28, 29, 30 తేదీల్లో చివరి విడత కౌన్సె లింగ్‌ నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ ఎం. వి. రమణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు బిదీవీజీబితి.బిబీ.రిదీ వెబ్‌సైట్‌లో చూడాలన్నారు

Read More