భూమి రసాయనమయంగా మారుతుంది

అధిక రసాయన ఎరువుల వాడకంతో భూమి సారం కోల్పోయి రసాయనమయంగా మారుతోందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్‌స్వామి అన్నారు. రైతుల శ్రేయస్సు, సహజ సాగు విధానాలపై అవగాహన కోసం ఆయన మంగళవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ప్రధాన కూడలి వరకూ రైతు సుఫలా యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక బౌద్ధ మహా స్తూపం వద్దనున్న సిద్ధార్థ యోగా విద్యాలయంలో రైతులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని చినజీయర్ మాట్లాడారు. భూమికి సైతం విరామం అవసరమని, పంటల మార్పిడి, వ్యవధి పాటించడం వంటి పద్ధతులతో ముందుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. సేంద్రియ ఎరువుల వాడకంతో సగానికి పైగా సమస్య పరిష్కార మవుతుందన్నారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు చినజీయర్‌కు నాగలి బహూకరించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వైద్యులు డా. పద్మారామచంద్రారావు, పర్యావరణవేత్త విజయ్‌రాం, సీపీఐ నాయకుడు నారాయణ, రాష్ట్ర సమాచార కమిషనర్ శ్రీనివాస్, ఏర్నేని రామారావు, రైతునేస్తం వెంకటేశ్వరరావు, గున్నా రాజేందర్రెడ్డి పాల్గొన్నారు.

Read More

పురుగు మందుల నాణ్యతా ప్రమాణాలకు ప్రాధాన్యం

మనదేశంలో పురుగు మందులు వినియోగిస్తే కొన్నిసార్లు పురుగులు కాకుండా పంటలు నాశనమవడం, తెగుళ్లపై ఎలాంటి ప్రభావం కనిపించకపోవడం, రైతులు మరణించడం, పర్యావరణానికి తీవ్ర హాని జరగడం సర్వసాధారణంగా మారింది. మరోవైపు ఈ విపరిణామాల బాధ్యులు చట్టం నుంచి సులువుగా తప్పించుకుం టున్నారు. ఈ ధోరణిని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం నాణ్యతకు, ప్రాణాలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ… వాటిని ఉల్లంఘించిన వారికి రూ. అర కోటి జరిమానాతో పాటు ఐదేళ్ల జైలు శిక్ష విధించేలా వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నూతన పురుగు మందుల నిర్వహణ (పెస్టిసైడ్స్ మేనేజ్‌మెంట్) చట్టం తెస్తోంది. ముసాయిదా బిల్లుపై అభిప్రాయాలు తెలపాలంటూ తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు లేఖలు పంపింది. రైతులు, పౌరసమాజం సైతం సూచనలు చేయడానికి ఫిబ్రవరి 4వ తేదీ వరకు గడువునిచ్చింది. ముసాయిదా బిల్లును మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ agriwelfare.gov.inలోనూ ఉంచింది.
కేంద్రానికి సర్వాధికారాలు
ప్రస్తుతం అమలులో ఉన్న పురుగు మందుల చట్టం(1968), పురుగు మందుల నిబంధన(1971)ల్లో ఉన్న లోపాలను సవరించడానికే కొత్త చట్టం తెస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ‘పురుగు మందుల తయారీ, అమ్మకం నుంచి వాడకం వరకు పారదర్శకతను తీసుకురావడం, రైతులకు నాణ్యమైనవే అందేలా చూడటం, వాటి ప్రమాణాలు గుర్తింపు సామర్థ్యం పెంచడం, నకిలీలను నియంత్రించడం, కఠిన జరిమానాలు విధించడం, తయారయ్యే ప్రతి మందునూ ప్రయోగశాలల్లో పరీక్షల అనంతరమే ధ్రువీకరించడం, జీవ పురుగు మందుల వినియోగాన్ని ప్రోత్సహించడం, మానవులు, జంతువులు, పర్యావరణానికి కలిగే ముప్పును తగ్గించడం, స్వదేశీ తయారీ భారీఎత్తున పెంచడం” తమ లక్ష్యాలని వెల్లడించింది. ఈ చట్టం అమలులోకి వచ్చాక దేశవ్యాప్తంగా పురుగు మందుల నాణ్యత, పంపిణీ అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి సంక్రమిస్తాయి.
తయారీదారులు ప్రమాణాలు పాటించాలి
పురుగు మందు పేరు, బ్యాచ్ నంబరు, గడువు తేదీలను డబ్బాపై ముద్రించాలి. తయారీ సంస్థ పేరు, చిరునామా, ఉత్పత్తి స్థలం, వాడిన రసాయనాలు, ఇతర వివరాలుండాలి. ప్యాకేజింగ్ ప్రమాణాలను పాటించాలి. లైసెన్స్ ఉన్న ప్రాంగణాల్లో, భద్రత ప్రమాణాలకు అనుగుణంగా మాత్రమే ఉత్పత్తి జరగాలి. క్యూఆర్ కోడ్ ద్వారా వివరాలు వెల్లడించే సాంకేతికతను వినియోగించాలి.
ఉల్లంఘిస్తే శిక్ష
పురుగు మందుల రసాయన మిశ్రమంలో మార్పులు ఉండి, ప్రభావాన్ని చూపలేకపోయినా, రైతుల ఆరోగ్యానికి హాని కలిగించినా, నాణ్యత తగ్గించేలా ఇతర పదార్థాలు కలిపినా తీవ్ర నేరంగా పరిగణిస్తారు. చట్ట నిబంధనలను ఉల్లంఘించి పురుగుమందుల తయారీ, దిగుమతి చేసుకున్నా… వాటి విక్రయంతో ఎవరైనా మృతి చెందినా, తీవ్రంగా గాయపడినా… ఉత్పత్తిదారుడు, సంస్థను బాధ్యులుగా పరిగణిస్తారు. వారికి ఐదేళ్ల వరకు జైలుశిక్ష, లేదంటే రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. నేర తీవ్రతను బట్టి ఒకేసారి రెండూ విధించొచ్చు. రెండోసారి నేరం చేస్తే… మొదటిసారి విధించిన జరిమానా కంటే రెట్టింపు జరిమానా వేస్తారు. మూడోసారి నేరం చేస్తే… సంబంధిత సంస్థ రిజిస్ట్రేషన్, లైసెన్స్ శాశ్వత రద్దుకు పెస్టిసైడ్ ఇన్‌స్పెక్టర్ సిఫార్సు చేస్తారు. జరిమానాను చెల్లించకుంటే రిజిస్ట్రేషన్ కమిటీ ఇచ్చే రికవరీ సర్టిఫికెట్ ఆధారంగా జిల్లా కలెక్టర్ ఆ మొత్తాన్ని భూమి శిస్తు బకాయిల్లా వసూలు చేస్తారు. అవసరమైతే ఆస్తిని జప్తు చేస్తారు.

Read More

పెరిగిన తమలపాకుల ధర

వంద పంతాల తమలపాకుల ధర రూ.7 వేలకు ఎగబాకింది. గతేడాది ఇదే రోజుల్లో రూ.2,500 నుంచి రూ.3,000 మాత్రమే ఉంది. రైతుల నుంచి వ్యాపారులు ఒక పంతం (కట్టకు 170-180 ఆకులు) రూ.70కి కొనుగోలు చేస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిధిలో తమలపాకు సాగు ఎక్కువ. చింతలపూడి, ములుకుదురు, మాచవరం, ఆరెమండ, దండమూడి, నిడుబ్రోలు తదితర ప్రాంతాల్లో సుమారు 700 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇక్కడి నుంచి చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు, మహారాష్ట్ర, దిల్లీ తదితర ప్రాంతాలకు ఎగుమతవుతాయి. ఇటీవలి తుపాను ప్రభావంతో కడప, నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో సాగవుతున్న తమలపాకు మొక్కల్లో ఎదుగుదల లోపించడంతో దిగుబడులపై ప్రభావం పడింది. గతంలో ఎకరాకు 3 వేల పంతాల లోపు దిగుబడి వచ్చేది. ప్రస్తుతం 800 నుంచి 1200 లోపు మాత్రమే వస్తుండటం.. ధర పెరుగుదలకు దోహదపడిందని రైతులు చెబుతున్నారు. ధర పెరగడంతో అన్నదాతల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది.

Read More

రోజుకు 400 గ్రాములు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినాలి

ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల వినియోగం తగ్గుతోంది. హైదరాబాదు నగరంలో చాలామంది రోజుకు 250 గ్రాములకు మించి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు లాంటివి తినడం లేదని నిపుణులు చెబుతున్నారు. అది కూడా రోజూ ఏదో ఒక రకం పండు లేదంటే ఆకుకూరకు పరిమితమవుతున్నారు. రోజూ 250 గ్రాములు ఆకుకూరలు, కూరగాయలుంటే మరో 150 గ్రాముల వరకు పండ్ల శాతం ఉండాలంటున్నారు.
ప్రయోజనాలు..
పండ్లు, కూరల్లో మేలు చేసే విటమిన్లు, పోషకాలు, ఫోలిక్ యాసిడ్, సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పండ్లు, ఆకుకూరలు, కూరగాయల్లో పీచు ఎక్కువ. పండ్లలోని సాల్యుబుల్ పీచు వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా చూస్తాయి. పీచు ఆలస్యంగా జీర్ణం అవుతుంది. కడుపు నిండుగా ఉన్న భావనతో చిరుతిళ్ల జోలికి పోరు. ఫలితంగా ఊబకాయం రాదు. పండ్లు, ఆకుకూరల్లో ఉన్న పీచు వల్ల మలబద్దకం దరిచేరదు. మధుమేహం నియంత్రణలో ఉంటుంది. పండ్లు, కూరల్లో పొటాషియం వల్ల అధిక రక్తపోటు సమస్య తగ్గుతుంది. వీటిలోని యాంటి ఆక్సిడెంట్లు శరీరంలోని కణజాలాన్ని ఉత్తేజితం చేస్తాయి. జుట్టు రాలటం, చర్మం ముడతలు, వృద్ధాప్య సమస్యలను తగ్గిస్తాయి.
మంచి బ్యాక్టీరియా పెరుగుతంది : డాIIలక్ష్మయ్య మాజీ శాస్త్రవేత్త, జాతీయ పోషకాహార సంస్థ
నగరంలో జంక్ ఫుడ్స్ వినియోగం పెరిగి చాలామంది పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం లేదు. వివిధ అనారోగ్య సమస్యలకు ఆహారపుటలవాట్లే కారణం. పండ్లు, ఆకుకూరలు విరివిగా తీసుకుంటే పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. జబ్బులకు అడ్డుకట్ట వేయవచ్చు. నిత్యం పెద్దలు 400 గ్రాములు, 18 ఏళ్లలోపు పిల్లలు 250 గ్రాముల పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఆహారంలో మిళితం చేసుకోవాలి.

Read More

తెలంగాణాలో సన్నరకం వడ్లు విక్రయించిన రైతులకు బోనస్‌ విడుదల

క్వింటాకు రూ.500 చొప్పున బోనస్‌ కింద సన్నరకం వడ్లు విక్రయించిన రైతులకు మరో రూ.500 కోట్లను పౌరసరఫరాల శాఖ సోమవారం విడుదల చేసింది. వీటిని రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రకటనలో తెలిపింది. వీటితో కలిపి ఇప్పటివరకు రైతులకు విడుదల చేసిన బోనస్‌ రూ.1,425.91 కోట్లకు చేరింది.

Read More

ఎన్‌టిఆర్‌ జిల్లాలో ఉచిత పశువైద్య శిబిరాలు

ఎన్‌టిఆర్‌ జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉచిత పశువైద్య శిబిరాలు ఈ నెల 19వ తేదీ నుంచి 31 వరకు నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ జి. లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. పశువులు, లేగ దూడలు, గొర్రెలు, మేకలకు నట్టల నిర్మూలన మందులు ఉచితంగా వేస్తారని చెప్పారు. గొర్రెలకు బొబ్బ వ్యాధి నిరోధక టీకాలు, కోళ్లల్లో కొక్కెర తెగులు నివారణకు టీకాలు వేయనున్నట్టు పేర్కొన్నారు. అనారోగ్య పశువులకు వైద్య పరీక్షలను నిర్వహించి మందులు ఇవ్వనున్నట్టు వివరించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మద్దు హనుమంతరావు, డీఆర్డీఏ పీడీ ఎ.ఎన్‌.వి. నాంచారరావు తదితరులు పాల్గొన్నారు.

Read More

‘కర్ల-18’ చెరకు రకంతో పలు ప్రయోజనాలు

అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్లోనూ సాగుకు అనుకూలంగా ఉండి, మంచి దిగుబడినిచ్చే కొత్తరకం చెరకు వంగడం ‘కర్ణ-18 (సీవో-18022)’ను హరియాణాలోని కర్నాల్‌లో ఉన్న సుగర్‌కేన్‌ బ్రీడింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రాంతీయ కేంద్రం అభివృద్ధి చేసింది. అత్యధికంగా చెరకు ఉత్పత్తి చేసే వాయవ్య భారతంలోని రైతులకు కర్ణ-18 రకం చెరకు వంగడం మంచి బహుమతి లాంటిదని ఈ కేంద్ర సీనియర్‌ శాస్త్రవేత్త ఎం. ఆర్‌. మీనా తెలిపారు. ఇది లవణీయత, కరవు పరిస్థితులను కూడా తట్టుకొంటుందని.. చెరకును పట్టి పీడించే ఎర్ర, టాప్‌ బోరర్‌ వంటి తెగుళ్ల బెడద కూడా ఉండదన్నారు. ఇది రాటూన్‌ క్రాప్‌నకు (ప్రధాన పంటను కోసిన తర్వాత మిగిలిపోయిన వేర్లు/మొద్దుల నుంచి వచ్చే ద్వితీయపంట) కూడా అనుకూలమన్నారు. ఈ రకం చెరకు దిగుబడి హెక్టారుకు 98.6 టన్నులుగా.. చక్కెర మిల్లుల వద్ద రికవరీ దాదాపు 11 శాతంతో హెక్టారుకు 12.6 టన్నుల పంచదార ఉత్పత్తి ఉంటుందని మీనా తెలిపారు.

Read More

80 ఎకరాలలో ఐస్‌బర్గ్‌ లెట్యూస్‌ సాగు

హరియాణాలోని కురుక్షేత్రకు చెందిన బిన్వంత్‌ సింగ్‌కు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ సొంతూరిపై ఉన్న మక్కువతో ఆ ఉద్యోగం వదులుకొని 2003లో స్వగ్రామానికి వచ్చేశారు. వ్యవసాయంలో ఏముంది అని తండ్రి వారించినా.. చైనా, జపాన్‌ వంటి దేశాల్లో అధ్యయనం చేసి మరీ సాగుకు శ్రీకారం చుట్టారు. అప్పుడప్పుడే భారత్‌లో విస్తరిస్తున్న మెక్‌ డొనాల్డ్స్‌ కంపెనీకి ‘ఐస్‌బర్గ్‌ లెట్యూస్‌’ అనే సలాడ్‌ ఆకుకూర అవసరమని గ్రహించి, ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఆకులను సలాడ్లు, శాండ్‌విచ్‌లు, బర్గర్లలో విరివిగా వాడుతారు. 80 ఎకరాల్లో ఈ ఆకుకూరను సాగు చేస్తున్నారు. పొలంలో ఏర్పాటుచేసిన వ్యాక్యూమ్‌ ప్రీ కూలింగ్‌ సదుపాయంతో కోసిన 20 నిమిషాల్లోనే ఆకు కూరల ఉష్ణోగ్రత 4 డిగ్రీలకు చేరి పాడవకుండా తాజాగా ఉంటాయి. ఈ సాగుతో 40 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు.

Read More

తెలంగాణ స్టేట్‌ సీడ్‌ & ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ అథారిటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ అడపా కిరణ్‌కుమార్‌కు ‘రైతునేస్తం’ అభినందన

రైతునేస్తం పురస్కార గ్రహీత ప్రొఫెసర్‌ అడపా కిరణ్‌ కుమార్‌ గారు ఈరోజు తెలంగాణ స్టేట్‌ సీడ్‌ అండ్‌ ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ అథారిటీ డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రైతునేస్తం వేంకటేశ్వరరావు, కిరణ్‌కుమార్‌గారిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించడం జరిగింది.

Read More

‘సైలో’ పద్ధతిలో పంట ఉత్పత్తులను రెండేళ్ళ వరకు నిల్వ చేయవచ్చు

‘సైలో’ పద్ధతిలో పంటలను రెండేళ్ల వరకు సురక్షతంగా నిల్వ చేసుకునే వీలుందని, తెలంగాణా రాష్ట్రంలో ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా ప్రభుత్వానికి రూ. వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమకుమార్‌ రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‌ లోని రాష్ట్ర సచివాలయంలో భారత ఆహార సంస్థ, రాష్ట్ర పౌర సరఫరాలశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఇంటిగ్రేటెడ్‌ క్లీనర్లు, డ్రయర్ల సాయంతో మక్కలు, వరి, సోయాబీన్‌ లాంటి పంట ఉత్పత్తుల్లోని తేమను ఆధునిక పద్ధతిలో తొలగించడంతో ఎక్కువ కాలం నిల్వ చేసుకునే ఆస్కారం ఉంటుంది. రైతులకు భరోసా ఇచ్చేందుకు, ధాన్యాన్ని పరిరక్షంచేందుకు దీన్ని అమలు చేయనున్నాం. ఎక్కువ కాలం నిల్వ ఉన్న ధాన్యం, పాత బియ్యానికి మార్కెట్‌లో అధిక ధర లభిస్తుందని ఉత్తమ్‌ పేర్కొన్నారు.

Read More