ఎన్టిఆర్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉచిత పశువైద్య శిబిరాలు ఈ నెల 19వ తేదీ నుంచి 31 వరకు నిర్వహించనున్నట్టు కలెక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. పశువులు, లేగ దూడలు, గొర్రెలు, మేకలకు నట్టల నిర్మూలన మందులు ఉచితంగా వేస్తారని చెప్పారు. గొర్రెలకు బొబ్బ వ్యాధి నిరోధక టీకాలు, కోళ్లల్లో కొక్కెర తెగులు నివారణకు టీకాలు వేయనున్నట్టు పేర్కొన్నారు. అనారోగ్య పశువులకు వైద్య పరీక్షలను నిర్వహించి మందులు ఇవ్వనున్నట్టు వివరించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మద్దు హనుమంతరావు, డీఆర్డీఏ పీడీ ఎ.ఎన్.వి. నాంచారరావు తదితరులు పాల్గొన్నారు.

13 Jan, 2026
