వరల్డ్‌ జూనోసిస్‌ డే

జాలి గుండెలేని కొడుకు కన్న కుక్క మేలురా. అని ఓ మహాకవి తన గీతంలో పేర్కొన్నట్లు పెంపుడు జంతువులకు ఉండే విశ్వాసం కన్న కొడుకులకు కూడా ఉండదనే నానుడి ఏనాటి నుంచో వినిపిస్తుంది. పెంపుడు జంతువు కనబరిచే విశ్వాసం దాని పట్ల మనం ఏర్పర్చుకొనే ఆత్మీయత మనసుకు ఎంతో ఉల్లాసాన్నిస్తుంది. మనిషి జంతువు మధ్య ఇలాంటి బంధం ఏర్పడితే అది కలకాలం కొనసాగుతుంది. ఈ బంధం వెనుక ప్రాణాలను హరించే అంటురోగాల ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో వాటిపై ప్రేమను పెంచుకోవడం ఎంత అవసరమో అందుకు తగ్గ జాగ్రత్తలు కూడా అంతే అవసరం. ఆప్యాయతలోనూ అప్రమత్తత! పెంపుడుజంతువుల పెంపకంలో జాగ్రత్తలు అవసరం . ముఖ్యంగా జంతులన్నింటిలో ఇళ్ళ దగ్గర ప్రత్యేకంగా మక్కువగా పెంచి పోషించడం తరతరాలుగా ఒక సంప్రదాయంగా వస్తుంది. జమిందారుల నుంచి రైతు కూలి వరకు తనకు సహాయంగా కుక్క ఉంటుందని పెంచుకుంటారు. కొన్ని చోట్ల యజమాని ఇంటి వద్ద లేనప్పుడు ఇంటికి కాపలా కాయడం మనకు తెలిసిందే. దొంగలను తరిమికొట్టడం దగ్గర నుంచి నాగుపాములను సైతం ఇంట్లోకి చొరబడకుండా అడ్డుకునే సంఘటనలు కూడా ఉన్నాయి. అటువంటి చోట పెంపుడు జంతువులన్నిటికన్నా ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ వాటి వల్ల వచ్చే రేబిస్‌ వ్యాధి కూడా అంతటి భయంకరమైనదే.

రేబిస్‌ వ్యాధినివారణకు సకాలంలో వ్యాక్సిన్‌ తీసుకోకపోతే ప్రాణానికే నష్టం. గ్రామీణ ప్రాంతాల్లో ఈ కుక్కకాటు మరణాలు ఎక్కువగా కన్పిస్తుంటాయి. ఆస్పత్రుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రేబిస్‌ నివారణ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉండక ఎన్నో ప్రాణాలు హరించుకుపోతున్నాయి.

వ్యాక్సిన్‌ ఉత్పత్తి అంతంత మాత్రంగా ఉండడంతో కొరత చాలా ఎక్కువగా కన్పిస్తుంది. ఒక్క మనదేశంలోనే కాదు ఎన్నో దేశాల్లో ఇది తీవ్రమైన సమస్యగా ఉంటుంది. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో 95 శాతం మానవ మరణాల్లో రేబిస్‌ వ్యాధి వల్ల మృతులైనవారే ఎక్కువ శాతం మంది ఉంటున్నారు. 5 నుంచి 14 ఏళ్ల పిల్లలకు కుక్కకాటు వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆఫ్రికా దేశాల్లో వ్యాక్సిన్‌ధర 40 డాలర్లు ఉంటే ఆసియా దేశాల్లో 49 డాలర్ల వరకు వ్యాక్సిన్‌కు ఖర్చుపెడితే కానీ దొరకడం లేదు. సామాన్యుని సగటు సంపాదన రెండు డాలర్లకు మించి లేనప్పుడు ఈ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసి వినియోగించడం అనేది తన శక్తికి మించిన పని. అందుకనే ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030 నాటికి రేబిస్‌ రహిత ప్రపంచంగా మార్చాలని విశ్వప్రయత్నం చేస్తోంది. ఏటా పదిహేను మిలియన్‌ ప్రజలు కుక్కకాటు వల్ల రేబిస్‌ వ్యాధికి గురవుతున్నారు. పెంపుడు జంతువుల నుంచి సహజ సిద్ధంగా సంక్రమించే వ్యాధులను జునోసెస్‌ అంటారు. ఇలాంటి జూనోటిక్‌ వ్యాధులు దాదాపు200వరకు ఉన్నాయి.

అసలు జూనోసిస్‌ అంటే..

జూనోటిక్‌ అనే ఇటాలియన్‌ పదం నుంచి పుట్టిందే జూనోసిస్‌. ‘జూ’ అంటే జంతువులకు సంబంధించిన అంశం. మనుషుల నుంచి పశువులకు, పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల్నే జూనోటిక్‌ వ్యాధులంటారు. ఇలాంటి వాటిని ఇప్పటి వరకు 253 వరకు గుర్తించారు.

వీటిలో ‘ర్యాబిస్‌’ (పిచ్చికుక్క వ్యాధి) అనేది అత్యంత ప్రమాదకరమైనది, ప్రాణాంతకరమైన వ్యాధి. లూయిస్‌పాశ్చర్‌ అనే వ్రఖ్యాత శాస్త్రవేత్త పిచ్చికుక్క కాటుకు గురైన వ్యక్తికి జూలై ఆరు 1885 వ సంవత్సరంలో మొట్ట మొదటిసారిగా యాంటీర్యాబిస్‌ టీకాను వేసి సఫలీకృతులయ్యారు. ఆ రోజును అంటే జూలై ఆరో తేదీని ఆనాటి నుంచి వ్రతి సంవత్సరం ‘వరల్డ్‌ జూనోసిస్‌ డే’గా నిర్వహిరచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ జూనెటిక్‌ వ్యాధుల గురించి వ్రజలను అవ్రమత్తర చేసి, రోగాల బారిన వడకుండా చేయటమే వరల్డ్‌ జూనోసిస్‌ డే ప్రధానోద్దేశ్యము . జంతువులు, వక్షులకు సంభంధించిన కొన్ని వ్యాధులు మనుషులకు సరక్రమించి సాధారణ సమస్యలతోపాటు ప్రాణహాని కలిగేంతటి వ్రమాద పరిస్థితులెదురవుతున్నాయి. ఈ కారణముగా జంతువులు, కోళ్లు, పక్షులను పెంచేవారు, ప్రయోగశాలలు, వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో వనిచేసేవారు, వశువుల ఆస్పత్రుల సిబ్బంది, చర్మము , తోళ్ల వరిశ్రమల కార్మికులు ఈ జూనోటిక్‌ ప్యాధుల వట్ల ఆప్రమత్తముగా ఉండటం ద్వారా ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడుకోవచ్చు.

ఇలాంటి జూనోటిక్‌ వ్యాధులు దాదాపు200వరకు ఉన్నాయి. వీటిలో ర్యాబిస్‌ (పిచ్చి కుక్క వ్యాధి) అనేది అత్యంత ప్రమాదకర మైన, ప్రాణాంతకమైన వ్యాధి. లూయీస్‌ పాశ్చర్‌ అనే ప్రఖ్యాత శాస్త్రవేత్త, పిచ్చికుక్క కాటుకు గురి అయిన వ్యక్తికి జూలై 6, 1885 వ తేదీన మొట్టమొదటిసారిగా ఏంటీ ర్యాబిస్‌ టీకాను విజయవంతంగా చేశారు.చారిత్రకంగా, సాంకేతికంగా, వైజ్ఞానికంగా చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపో యే ఆ రోజును అంటే జూలై 6వ తేదీని ఆనాటి నుండి ప్రతి సంవ త్సరం వరల్డ్‌ జూనోసిస్‌ డే (ప్ర పంచ జూనోసిస్‌ దినోత్సవం)గా నిర్వహించుకోవటం ఆనవాయితీగావస్తోంది.

జంతువుల నుండి మ నుషులకు,మనుషుల నుండి జంతువులకు సంక్రమించే ఈ జూనో టిక్‌ వ్యాధుల గురించి ప్రజలకు, రైతులకు, పశువైద్య సిబ్బందికి అవగాహనను కల్పించడం ద్వారా, వారిని అప్రమత్తం చేసి, రోగాల బారిన పడకుండా చేయడం వరల్డ్‌ జూనోసిస్‌ డే ప్రధాన ఉద్దేశ్యం. జంతువులు, పక్షులను పెంచుకునేవారు వాటితో సన్నిహితంగా ఉంటారు. పాలను, పాలఉత్పత్తులను,మాంసం, జంతు ఉత్పత్తుల ను ఉపయోగించనివారు బహుశా ఎవరూ ఉండరు. ఆ క్రమంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక జూనోటిక్‌ వ్యాధి బారినపడేఅవకాశం ప్రతి ఒకరికి ఉంటుంది. కాబట్టి వినియోగదారుల దృష్టిని ఆకర్షించి, ఈ వ్యాధులపట్ల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందరూ తెలుసుకునేలా, ప్రజలలో విస్తృత ప్రచారం కల్పించడానికి వరల్డ్‌ జూనోసిస్‌ డే నాడు పశు సంవర్థక శాఖ, పశు వైద్య కళాశాలలు, సంబంధిత సంస్థలు వివిధ కార్యక్రమాలను నిర్వహించటం జరుగు తుంది.

జూనోటిక్‌ వ్యాధులు మనుషులకు రావటానికి ఎన్నో మార్గాలున్నాయి. అవేంటంటే..మనిషి తన జీవనోపాధికి, పశువుల పెంపకం, గొర్రెల, మేకల పెంపకం, కోళ్లపెంపకం వంటి వృత్తుల పైన ఆధారపడటం సర్వసాధారణం. మరికొందరు వృత్తిగా కాకపోయినా,అవసరార్థం ఆసక్తితో,ఆకర్షణతో కొన్ని రకాల జంతువ్ఞలు, పక్షులను, పెంచుతూ ఉంటారు. వృత్తిగా చేపట్టినవారు ఆదాయాన్ని పొందుతున్నారు. దాంతో పాటే పాలు, గ్రుడ్లు,మాంసం వంటి పౌష్టి కాహారాన్ని తద్వారా ఆరోగ్యాన్ని పొందుతున్నారు. ఒక ఆసక్తితో పెంచేవారు ఆనందాన్ని, వినోదాన్ని పొందుతున్నారు.ఆదాయాన్ని ఆహారాన్ని, ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇచ్చే ఈ జంతువులు, పక్షుల పెంపకంలో కొన్ని సమస్యలు, ప్రమాదాలు కూడా పొంచిఉంటాయి.వృత్తిగా చేపట్టినా, ఆసక్తితో పెంచినా, యజమానులు, పనిచేసే వారు ఆయా జంతువులు, పక్షులకు అత్యంత సన్నిహితంగా మెలు గుతూఉంటారు.అలాంటప్పుడు ఆ జంతువులు,పక్షులకు సంబంధించిన కొన్ని వ్యాధులు మనుషులకు సంక్రమించి, సాధారణ సమస్యల నుండి ప్రాణ హానిని కూడా కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి పశువులు, జంతువులు, కోళ్ళు, పక్షులను పెంచేవారు, జంతు ప్రయోగశాలలు, వ్యాధినిర్ధారణా కేంద్రాలలో పనిచేసేవారు, పశు వైద్యశాల సిబ్బంది, చర్మం, తోళ్ల పరిశ్రమలలో పనిచేసేవారు, ధాన్యపు గిడ్డంగుల్లో పనిచేసేవారు ఈ జూనోటిక్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండటం ద్వారా ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడుకోవచ్చు. బ్యాక్టీరియా, వైరస్‌,ప్రోటోజోవా, ఫంగస్‌, క్లామిడే వంటి జీవుల వలన ఈ జూనోటిక్‌ వ్యాధులు వస్తాయి. 

వ్యక్తుల వయసు, ఆరోగ్య పరిస్థితి, శరీరంలోని వ్యాధినిరోధకశక్తి వంటి అంశాలను అనుసరించి ఈ వ్యాధులు సోకటం,వాటి తీవ్రత అవి కలిగించేహానీ ఆధారపడి ఉంటాయి. అలాగే వ్యాధి కారకం మనిషికి ఎంత వరకు హాని కలిగించగలుగుతుంది అనేది ఆ వ్యాధి కారకం రకం. జాతిపైన ఆధారపడి ఉంటుంది. గాలి, నీరు, ఆహారం, జంతు ఉత్పత్తులను వినియోగించటం ద్వారా వ్యాధి సంక్రమణ జరుగుతుంది.

  • వైరస్‌ ద్వారా వ్యాపించే జూనోటిక్‌ వ్యాధులు ర్యాబిస్‌, మెదడు వాపు, మ్యాడ్‌కౌ.
  • బాక్టీరియావల్ల వ్యాపించే జూనో టిక్‌ వ్యాధులు బ్రూసెల్లోసిస్‌, క్షయ, సాల్మొనెల్లోసిస్‌, ఆంత్రాక్స్‌, గ్లాండర్స్‌,
  • పరాన్న జీవుల వలన వ్యాపించే జూనోటిక్‌ వ్యాధులు ఏంకైలో, స్టోమియాసిస్‌, హైడాటియోసిస్‌, అలర్జీ, ఎగ్జిమా(గజ్జి) అమీబియాసిస్‌, బాలంటీడియోసిస్‌, టాక్సోప్లాస్మా.

ఏయే వృత్తుల లో ఉన్న వారికి ఏయే జూనోటిక్‌ వ్యాధులు రాగల అవకాశం ఉందో పరిశీలిద్దాం. పిచ్చి కుక్క కాటు వలన ర్యాబిస్‌, కుక్కపిల్లలతో ఆడే వారికి టాక్సోకారియాసిస్‌, కుక్కులను, లేగదూడలను తాకినప్పుడు గజ్జి, చర్మవ్యాధులు,పందులు, దోమలవలన మెదడువాపు వ్యాధి, అపరిశుభ్రమైన పాలు, గ్రుడ్లు,మాంసం వల్ల బ్రూసెల్లోసిస్‌, ఎలుకల వలన ప్లేగు, పశువులతో సన్నిహితంగా మెలగటం వల్ల క్షయవ్యాధి, ఉన్ని, తోళ్ల పరిశ్రమలలో పనిచేసేవారికి దొమ్మరోగం ( ఆంత్రాక్స్‌), సరిగా వుడకని గ్రుడ్లు, మాంసం వలన సాల్మొనెల్లోసిస్‌, పంది మాంసం వలన టినియా సోలియం, కర్ర కోత పనిచేసేవారికి సాల్మ నెల్లోసిస్‌, గొర్రెలు, మేకల కాపరులకు గజ్జి దురద, కోళ్ల ద్వారా రాణికెట్‌, సిట్టకోసిస్‌, మాంసపు పరిశ్రమలలోని కూలీలకు క్యూఫీవర్‌ వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంది.

ప్రపంచాన్ని వణికించిన ముఖ్యమయిన జూనోటిక్‌ వ్యాధులు:

ర్యాబిస్‌ : పిచ్చికుక్క కాటు వలన ఈ వ్యాధి కలుగుతుంది. మన దేశంలో ప్రతి సంవత్సరం 30వేల మంది ఈ వ్యాధి వలన చని పోతున్నట్లు ఒక అంచనా. మూగజీవాల ద్వారా మనుషులకు సోకే ప్రాణాంతకమైన వ్యాధుల్లో అత్యంత భయంకరమైనది రాబిస్‌. తోడేళ్లు, నక్కలు, ముంగిసల్లో ఈవ్యాధికారక క్రిములు ఎప్పుడూ ఉంటాయి.
ఆంత్రాక్స్‌: జూనోటిక్‌ వ్యాధుల్లో , ఆంత్రాక్స్‌ ప్రాణాంతకమైనవి. ఈవ్యాధి స్పోర్స్ ఉన్న పచ్చగడ్డి ద్వారా పశువులకు సంక్రమిస్తుంది. గాలి ద్వారా మరొకరికి వ్యాపిస్తుంది. వ్యాధి నివారించాలంటే ఆంత్రాక్స్‌ వ్యాధి గుర్తించిన ఆరు కిలోమీటర్ల పరిధిలో ఐదేళ్లపాటు నిర్ణీతగడువులో వ్యాధినిరోధకటీకాలు చేయించాలి. మనుషుల్లో వ్యాధి సోకినట్లు అనిపిస్తే పరీక్షలు చేయించి అత్యవసర చికిత్స అందించాలి.

మెదడువాపు : మెదడు వాపు ని ఆంగ్ల భాషలో ఎన్‌సెఫలైటిస్ అని పిలుస్తారు. మెదడులోని కణజాలం ఒరుపుని (ఇన్‌ఫ్లమేషన్) మెదడు వాపు అని పిలుస్తారు. ఇది సాధారణంగా వైరస్‌ల వల్ల వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా దీనిలో అనేక రకాలను గుర్తించారు. భారతదేశంలో జపనీస్ ఎన్‌సెఫలైటిస్ వైరస్ వల్ల మెదడు వాపు వస్తుంది. ఈ వైరస్ లు పక్షులు, పందులు, ఎలుకల్లాంటి వాటిలో ఉంటాయి. ఈ జీవులు వైరస్ లకు ఆశ్రయంగా పనిచేస్తాయి. వీటి నుంచి క్యూలెక్స్ దోమకాటు ద్వారా మానవుడిలోకి ప్రవేశిస్తాయి.ఈ వ్యాధి పందుల శరీరంపైన ఉండే దోమలు కాటు వేయటం ద్వారా సోకుతుంది. ఎందరో చిన్న పిల్లలు ఈ వ్యాధి వలన మరణిస్తున్నారు. తలనొప్పి, జ్వరం, మెదడు సక్రమంగా పనిచేయక ఒకవైపు పక్షవాతం కలగడం, మూర్ఛ రావడం లాంటివి ఈ వ్యాధి లక్షణాలు.

మ్యాడ్‌ కౌ వ్యాధి : ఆహారం వలన కలిగే వ్యాధి (దీనిని ఆహారం వలన కలిగే రోగము మరియు వ్యవహారికంగా విషాహార వ్యాధి అంటారు). కలుషితమైన ఆహారం తినడం వల్ల ఇది సంభవిస్తుంది ఒకప్పుడు ఇంగ్లండ్‌లో ఈ వ్యాధి వలన విప రీతమైన జన నష్టం జరిగింది. మ్యాడ్‌ కౌ డిసీజ్‌ గతంలో యూరప్‌ దేశాలను వణికించిన మహమ్మారి ఇది! గొడ్డు మాంసం(బీఫ్‌) ద్వారా ఈ వ్యాధి మనిషి మెదడుకి వ్యాపిస్తుంది. దీంతో వ్యాధి సోకిన వ్యక్తి. వ్యవహార శైలిలో తీవ్రమైన మార్పు చోటు చేసుకుంటుంది. ఒక రకంగా మానసిక రోగిగా మారిపోతాడు. జ్ఞాపక శక్తి కోల్పోవడం, శారీరకంగా నీరసించిపోవడం, పొంతన లేకుండా మాట్లాడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ కారణంగా అప్పట్లో యూరప్‌ ప్రజలు లక్షలాదిగా గోవులను వధించారు. చాలా సంవత్సరాలపాటు గొడ్డు మాంసానికి దూరంగా ఉన్నారు.

బర్డ్‌ప్లూ: ఈ వ్యాధి అవయిన్‌లూప్లెంజా అనే సూక్ష్మక్రిమివల్ల వస్తుంది. ఇది గాలి ద్వారా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి వచ్చేటప్పుడు కోళ్ళుచాలా ఎక్కువగా చనిపోతాయి. ఈ వ్యాధితో ఉన్న కోళ్ళ మాంసం, రెట్టల ద్వారా మనుషులకూ వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా చలి కాలంలో వస్తుంది.
టీబీ: దీనిని ట్యూబోలలోసిస్ అంటారు. ఇది బ్యాక్టిరీయా ద్వారా మనుషులకు, పశువులకు వచ్చి ప్రతీ సంవత్సరం అనే మంది చనిపోతున్నారు. టీబీతో ఉన్న పశువుల పాలు బాగా మరిగించకుండా తాగినట్లైయితే మనుషులకు, చిన్న పిల్లలకు ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • వ్యాధి సోకిన జంతువులు, కోళ్ల మాంసం తినకూడదు, పూర్తిగా ఉడికిన మాంసాన్ని మాత్రమే తినాలి,సరిగా ఉడకని గ్రుడ్లను తిన కూడదు.
  • వ్యాధి సోకిన పశువుల పాలను సేవించకూడదు. చెడిపోయిన అపరిశుభ్రమైన పాలు, మాంసం, గ్రుడ్లు తినకూడదు. పాలను బాగా మరగించి తాగాలి.
  • పాడిపశువులను, జంతువులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి.పశువులు, జంతువులు, పక్షులు, కోళ్లకు కాలాను గుణంగా ఇవ్వాల్సిన వ్యాధినిరోధక టీకాలను తప్పనిసరిగా చేయించాలి.
  • పాలను క్షేత్ర స్థాయిలో తప్పనిసరిగా ప్రాథమికంగా పరీక్షించాలి. పశువులు,జంతువులు, పక్షుల కొనుగోలు, అమ్మకాల కేంద్రాలలో డాక్టర్‌ సర్టిఫికేట్‌ తీసుకునే విధానం సక్రమంగా అమలు చేయాలి.
  • పోస్ట్‌మార్టం పరీక్షలు విధిగా నిర్వహించాలి, వధశాలల దగ్గర శుభ్రత, జంతువుల ఆరోగ్యంపైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి. ర్యాబిస్‌,ఆంత్రాక్‌, గ్లాండర్స్‌ వంటి వ్యాధులగురించి రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించాలి.
  • మృత జంతు కళేబరాలను లోతైన గోతిలో సున్నం చల్లి వూడ్చివెట్టాలి.
  • జంతు ఆవాసాలను అప్పుడప్పుడు క్రిమిసంహారాకాలతో శుభ్రము చేయాలి
  • పెంపుడుకుక్కలకు తప్పనిసరిగా ఏంటీ ర్యాబిస్‌ టీకాను వేయించాలి. కుక్కలను పెంచేవారు, పశువైద్య సిబ్బంది ఏంటీర్యాబిస్‌ టీకాను ముందుగానే వేయించుకోవాలి.
  • పశువులు, జంతువులకు విధిగా నట్టల నివారణ చేయాలి, పౌల్ట్రీఫారాలు, జంతుప్రదర్శన శాలలు, సర్కస్‌ కంపెనీలలో పనిచేసే వారు, డైరీ ఫారాలలో పనిచేసేవారు, పశుపోషకులు,జంతుప్రేమికుల వ్యక్తి గత పరిశుభ్రతపై ఎక్కువ శ్రద్ధచూపాలి. మాస్క్‌ ధరించటం శ్రేయ స్కరం. మృత జంతు కళేబరాలను లోతైన గోతిలో సున్నంచల్లి పూడ్చిపెట్టాలి.

పాటించాల్సిన జాగ్రత్తలివీ..

  • వీధి కుక్కల నిర్మూలన,
  • ఊరికి దూరంగా 3, 4 కిలోమీటర్ల దూరంలో పరిశుభ్రమైన వాతావరణంలో పందులు పెంచాలి.
  • పశుపెంపకం దారులు పాలఉత్పత్తిలో పరిశుభ్రత పాటించాలి.
  • పెంపుడు కుక్కలకు తప్పక రాబిస్‌ నిరోధక టీకాలు వేయించాలి.
  • చిన్నపిల్లలు కుక్కలతో ఆడేటపుడు నోట్లో చేతులు పెట్టకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి.

పశుసంవర్థకశాఖ, ఆరోగ్యశాఖ,పంచాయితీ, మున్సిపల్‌ అధికారులు ర్యాబిస్‌ నివారణకు సంయుక్త కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలి. స్వచ్ఛంద సంస్థలు, జూనోటిక్‌ వ్యాధుల ప్రచారం, నివారణలో క్రియాశీలక పాత్ర వహించాలి. జూనోసిస్‌ డేను విజయవంతం చేసి ప్రజలలో అవగాహనను పెంచటంలో అందరూ సహకరించాలి.

కుక్క కరిస్తే తప్పక రాబిస్‌ వ్యాధి వస్తుందా?

  • మనుషుల్ని కుక్కలు కరవడం అనేది సర్వసాధారణమైన విషయం. ఇలా కుక్కలు కరవడం వలన మనకు రాబిస్‌ వ్యాధి వచ్చేమాట నిజమే అయినా అది అన్ని కుక్కలకూ వర్తించదు. కేవలం పిచ్చి కుక్క కరిచినప్పుడు మాత్రమే మనకు రాబిస్‌ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. మరి మనల్ని కరిచిన కుక్క పిచ్చిదో కాదో ఎలా తెలుస్తుంది అంటారా? అందుకో చక్కటి ఉపాయం ఉంది.
  • ఏదైనా ఒక కుక్క ఎటుపోవాలో ఎందుకు పోవాలో తెలీకుండా ఎక్కడి కంటే అక్కడికి పోతూ ఉండటం, దాని నోటి నుంచి చొంగ కారుతూ ఉండటం, అది ఎవరినిపడితే వారిని అకారణంగా కరుస్తూ ఉండటం వంటివి చేసినట్లయితే అది నిస్సందేహంగా పిచ్చికుక్కే అయి ఉంటుంది. అలాగే ఏదైనా ఓ కుక్క మనల్ని కరిచిన తరువాత పదిరోజుల్లోగా చనిపోయినా అది పిచ్చికుక్క అని తేలినట్లే.
  • ఏదేమైనా కుక్క కరిచినప్పుడు మన శరీరంపై అయ్యే గాయాలను కనీసం 5 -10 సార్లు సబ్బు నీటితో శుభ్రంగా కడగాలి. దాంతో పాటు స్పిరిట్‌తో గానీ, అయోడిన్‌తోగానీ గాయాలను శుభ్రం చేస్తే కుక్కకాటు వల్ల సంభవించేందుకు అవకాశం ఉన్న ప్రమాదం నుండి మనం 90 శాతం బయటపడినట్లే. అయినాసరే, ఈ ప్రథమచికిత్స చేశాక డాక్టర్ని తప్పక సంప్రదించాలి.
  • ఏదేమైనా మనల్ని కరిచిన కుక్క పిచ్చిదో కాదో తెలుసుకోవడం కొంచెం కష్టమైన వ్యవహారం కాబట్టి, కుక్క కరిచినప్పుడు ముందుజాగ్రత్త చర్యగా టీకాలు వేసుకోవడమే మంచిది.
  • డాక్టర్.జి.రాంబాబు, పశువైద్య సహాయ శస్త్ర చికిత్సకులు, కడప. Ph: 9494588885
Read More

ఎన్‌టిఆర్‌ జిల్లాలో ఉచిత పశువైద్య శిబిరాలు

ఎన్‌టిఆర్‌ జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉచిత పశువైద్య శిబిరాలు ఈ నెల 19వ తేదీ నుంచి 31 వరకు నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ జి. లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. పశువులు, లేగ దూడలు, గొర్రెలు, మేకలకు నట్టల నిర్మూలన మందులు ఉచితంగా వేస్తారని చెప్పారు. గొర్రెలకు బొబ్బ వ్యాధి నిరోధక టీకాలు, కోళ్లల్లో కొక్కెర తెగులు నివారణకు టీకాలు వేయనున్నట్టు పేర్కొన్నారు. అనారోగ్య పశువులకు వైద్య పరీక్షలను నిర్వహించి మందులు ఇవ్వనున్నట్టు వివరించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మద్దు హనుమంతరావు, డీఆర్డీఏ పీడీ ఎ.ఎన్‌.వి. నాంచారరావు తదితరులు పాల్గొన్నారు.

Read More