వంద పంతాల తమలపాకుల ధర రూ.7 వేలకు ఎగబాకింది. గతేడాది ఇదే రోజుల్లో రూ.2,500 నుంచి రూ.3,000 మాత్రమే ఉంది. రైతుల నుంచి వ్యాపారులు ఒక పంతం (కట్టకు 170-180 ఆకులు) రూ.70కి కొనుగోలు చేస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిధిలో తమలపాకు సాగు ఎక్కువ. చింతలపూడి, ములుకుదురు, మాచవరం, ఆరెమండ, దండమూడి, నిడుబ్రోలు తదితర ప్రాంతాల్లో సుమారు 700 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇక్కడి నుంచి చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు, మహారాష్ట్ర, దిల్లీ తదితర ప్రాంతాలకు ఎగుమతవుతాయి. ఇటీవలి తుపాను ప్రభావంతో కడప, నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో సాగవుతున్న తమలపాకు మొక్కల్లో ఎదుగుదల లోపించడంతో దిగుబడులపై ప్రభావం పడింది. గతంలో ఎకరాకు 3 వేల పంతాల లోపు దిగుబడి వచ్చేది. ప్రస్తుతం 800 నుంచి 1200 లోపు మాత్రమే వస్తుండటం.. ధర పెరుగుదలకు దోహదపడిందని రైతులు చెబుతున్నారు. ధర పెరగడంతో అన్నదాతల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది.

19 Jan, 2026
పెరిగిన తమలపాకుల ధర
#అన్నదాత, #ఆకులవ్యవసాయం, #ఎగుమతులు, #గుంటూరుజిల్లా, #గ్రామీణఆర్థికవ్యవస్థ, #చెన్నై, #తమలపాకులధర, #తమలపాకులు, #తుపానుప్రభావం, #దిల్లీ, #పంటదిగుబడి, #పంటధరలు, #పొన్నూరుమండలం, #బెంగుళూరు, #మహారాష్ట్ర, #మార్కెట్రేట్లు, #రైతులజీవితం, #రైతులసంతోషం, #వ్యవసాయం, #వ్యవసాయఆర్థికం, #వ్యవసాయవార్తలు, #హైదరాబాద్, agri news, Agriculture, Andhra Pradesh, natural farming, telangana, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
