కూరగాయపంటలకు తెగుళ్ళ బెడద ఎక్కువగా ఉంటుంది

కూరగాయ పంటలకు తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటోందని.. రైతులు అప్రమత్తంగా ఉంటూ.. వాటి నివారణకు కృషి చేయాలని ఉద్యాన శాస్త్రవేత్తలు సూచించారు. హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ కూరగాయల పరిశోధన కేంద్రంలో ‘అఖిల భారత సమన్వయ పథకం’ 44వ వార్షిక సమావేశం ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా ఉద్యాన వర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి, ఐకార్ ఏడీజీ సుధాకర్ పాండే, వారణాసి భారతీయ కూరగాయల పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్ రాజేశ్‌కుమార్, బెంగళూరులోని ఐఐహెచఆర్ డైరెక్టర్ టీకే బెహరా, ఎన్‌బీపీజీఆర్ డైరెక్టర్ జీపీ సింగ్, ఎనఐఆర్‌సీఏ డైరెక్టర్ శేషు మాధవ్, మాజీ వీసీ లావాండే, ఇతర శాస్త్రవేత్తలు పలు సూచనలు చేశారు.

Read More

పెరిగిన తమలపాకుల ధర

వంద పంతాల తమలపాకుల ధర రూ.7 వేలకు ఎగబాకింది. గతేడాది ఇదే రోజుల్లో రూ.2,500 నుంచి రూ.3,000 మాత్రమే ఉంది. రైతుల నుంచి వ్యాపారులు ఒక పంతం (కట్టకు 170-180 ఆకులు) రూ.70కి కొనుగోలు చేస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిధిలో తమలపాకు సాగు ఎక్కువ. చింతలపూడి, ములుకుదురు, మాచవరం, ఆరెమండ, దండమూడి, నిడుబ్రోలు తదితర ప్రాంతాల్లో సుమారు 700 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇక్కడి నుంచి చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు, మహారాష్ట్ర, దిల్లీ తదితర ప్రాంతాలకు ఎగుమతవుతాయి. ఇటీవలి తుపాను ప్రభావంతో కడప, నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో సాగవుతున్న తమలపాకు మొక్కల్లో ఎదుగుదల లోపించడంతో దిగుబడులపై ప్రభావం పడింది. గతంలో ఎకరాకు 3 వేల పంతాల లోపు దిగుబడి వచ్చేది. ప్రస్తుతం 800 నుంచి 1200 లోపు మాత్రమే వస్తుండటం.. ధర పెరుగుదలకు దోహదపడిందని రైతులు చెబుతున్నారు. ధర పెరగడంతో అన్నదాతల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది.

Read More

రోజుకు 400 గ్రాములు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినాలి

ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల వినియోగం తగ్గుతోంది. హైదరాబాదు నగరంలో చాలామంది రోజుకు 250 గ్రాములకు మించి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు లాంటివి తినడం లేదని నిపుణులు చెబుతున్నారు. అది కూడా రోజూ ఏదో ఒక రకం పండు లేదంటే ఆకుకూరకు పరిమితమవుతున్నారు. రోజూ 250 గ్రాములు ఆకుకూరలు, కూరగాయలుంటే మరో 150 గ్రాముల వరకు పండ్ల శాతం ఉండాలంటున్నారు.
ప్రయోజనాలు..
పండ్లు, కూరల్లో మేలు చేసే విటమిన్లు, పోషకాలు, ఫోలిక్ యాసిడ్, సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పండ్లు, ఆకుకూరలు, కూరగాయల్లో పీచు ఎక్కువ. పండ్లలోని సాల్యుబుల్ పీచు వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా చూస్తాయి. పీచు ఆలస్యంగా జీర్ణం అవుతుంది. కడుపు నిండుగా ఉన్న భావనతో చిరుతిళ్ల జోలికి పోరు. ఫలితంగా ఊబకాయం రాదు. పండ్లు, ఆకుకూరల్లో ఉన్న పీచు వల్ల మలబద్దకం దరిచేరదు. మధుమేహం నియంత్రణలో ఉంటుంది. పండ్లు, కూరల్లో పొటాషియం వల్ల అధిక రక్తపోటు సమస్య తగ్గుతుంది. వీటిలోని యాంటి ఆక్సిడెంట్లు శరీరంలోని కణజాలాన్ని ఉత్తేజితం చేస్తాయి. జుట్టు రాలటం, చర్మం ముడతలు, వృద్ధాప్య సమస్యలను తగ్గిస్తాయి.
మంచి బ్యాక్టీరియా పెరుగుతంది : డాIIలక్ష్మయ్య మాజీ శాస్త్రవేత్త, జాతీయ పోషకాహార సంస్థ
నగరంలో జంక్ ఫుడ్స్ వినియోగం పెరిగి చాలామంది పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం లేదు. వివిధ అనారోగ్య సమస్యలకు ఆహారపుటలవాట్లే కారణం. పండ్లు, ఆకుకూరలు విరివిగా తీసుకుంటే పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. జబ్బులకు అడ్డుకట్ట వేయవచ్చు. నిత్యం పెద్దలు 400 గ్రాములు, 18 ఏళ్లలోపు పిల్లలు 250 గ్రాముల పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఆహారంలో మిళితం చేసుకోవాలి.

Read More

‘సైలో’ పద్ధతిలో పంట ఉత్పత్తులను రెండేళ్ళ వరకు నిల్వ చేయవచ్చు

‘సైలో’ పద్ధతిలో పంటలను రెండేళ్ల వరకు సురక్షతంగా నిల్వ చేసుకునే వీలుందని, తెలంగాణా రాష్ట్రంలో ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా ప్రభుత్వానికి రూ. వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమకుమార్‌ రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‌ లోని రాష్ట్ర సచివాలయంలో భారత ఆహార సంస్థ, రాష్ట్ర పౌర సరఫరాలశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఇంటిగ్రేటెడ్‌ క్లీనర్లు, డ్రయర్ల సాయంతో మక్కలు, వరి, సోయాబీన్‌ లాంటి పంట ఉత్పత్తుల్లోని తేమను ఆధునిక పద్ధతిలో తొలగించడంతో ఎక్కువ కాలం నిల్వ చేసుకునే ఆస్కారం ఉంటుంది. రైతులకు భరోసా ఇచ్చేందుకు, ధాన్యాన్ని పరిరక్షంచేందుకు దీన్ని అమలు చేయనున్నాం. ఎక్కువ కాలం నిల్వ ఉన్న ధాన్యం, పాత బియ్యానికి మార్కెట్‌లో అధిక ధర లభిస్తుందని ఉత్తమ్‌ పేర్కొన్నారు.

Read More

మొక్కజొన్న పంట సాగు, దిగుబడులు పెరగాలి

మొక్కజొన్నను ఇథనాల్‌ ఉత్పత్తికి వాడటము వలన డిమాండ్‌ భారీగా పెరిగిందని, అందుకు అనుగుణంగా సాగు, దిగుబడులు పెంచేందుకు పరిశోధనలు జరుగుతున్నాయని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్‌) డైరెక్టర్‌ హెచ్‌ఎస్‌ జాట్‌ తెలిపారు. హైదరాబాద్‌లో జాతీయ వ్యవసాయ పరిశోధన విస్తరణ సంస్థ (నార్మ్‌)లో ‘మొక్కజొన్న పరిశోధనలో డేటా సేకరణ, విశ్లేషణ’ అంశంపై జాతీయ సదస్సును ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. డేటా ఆధారిత పరిశోధన విధానాలు మొక్కజొన్న సాగు విస్తరణలో కీలకపాత్ర పోషిస్తాయి. మొక్కజొన్నలు ఇథనాల్‌ ఉత్పత్తికి అనుకూలంగా ఉండటంతో కంపెనీలు అధికశాతం ఆ పంట వైపు మొగ్గు చూపుతున్నాయి’ అని సూచించారు. నార్మ్‌ డైరెక్టర్‌ గోపాల్‌ లాల్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ పౌల్ట్రీ రీసెర్చ్‌ ఛటర్జీ, అగ్రివర్సిటీ సీడ్స్‌ డైరెక్టర్‌ నగేశ్‌కుమార్‌ లుథియానా వ్యవసాయ శాస్త్రవేత్త సునిల్‌ పాల్గొన్నారు.

Read More

జీవ ఎరువుల తయారీ కోసం వియత్నాం సంస్థతో ఒప్పందం

హైదరాబాద్‌లోని జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆధునిక సాంకేతికతతో దేశంలోనే తొలిసారిగా ఆరు గంటల్లోనే వివిధ జీవ వ్యర్థ పదార్థాల(బయోవేస్ట్‌)ను పోషకాలు అధికంగా ఉండే ఎరువు(బయో ఫెర్టిలైజర్‌) గా మార్చే భారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఈ మేరకు వియత్నాంకు చెందిన ప్రసిద్ధ జీవ ఎరువుల తయారీ సంస్థ ‘బయోవే’తో అగ్రి వర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)లో రెండు నెలల్లో దీన్ని ఏర్పాటు చేసి ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు వర్సిటీ ఉపకులపతి అల్దాస్‌ జానయ్య తెలిపారు. బయోవే.. 11 దేశాలకు జీవ ఎరువులను ఎగుమతి చేస్తోంది. ఇటీవల విదేశీ పర్యటన సందర్భంగా ఈ కంపెనీ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన జానయ్య.. అగ్రివర్సిటీలో ప్లాంటును ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి వారు అంగీకరించి.. ఒప్పందం కుదుర్చుకున్నారు. వీసీ సమక్షంలో బయోవే సీఈవో లీతి కామ్‌టెన్‌, అగ్రి వర్సిటీ రిజిస్ట్రార్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌లు దీనిపై సంతకం చేశారు. ఈ సంస్థ అగ్రి వర్సిటీలో ఎకరం స్థలంలో ప్లాంటు ఏర్పాటుచేసి.. రెండేళ్లపాటు ఉత్పత్తి, ప్లాంటు నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది. ప్రస్తుతం మన దేశంలో జీవ ఎరువుల తయారీకి ఆరు నుంచి ఏడు రోజుల సమయం పడుతోంది. కొన్ని వ్యర్థాలను మాత్రమే దీనికి వినియోగిస్తున్నారు. బయోవే సంస్థ మాత్రం తమ దేశంలో లభించే వరి, మక్క, ఇతర ఆహార, ఉద్యాన పంటల వ్యర్థాలు, మాంసం వ్యర్థాలు, కుళ్లిపోయిన కూరగాయలు, పండ్లు, గుర్రపుడెక్కతోపాటు ఆహార పదార్థాల వ్యర్థాలను మర ఆడించి ఆ మిశ్రమంలో వాల్కనో నుంచి ఉద్భవించిన బ్యాక్టీరియాను కలిపి ఆరు గంటల్లోనే జీవ ఎరువులను తయారు చేస్తోంది. పది డాలర్ల విలువైన 35 కిలోల ఎరువుల బస్తాను ప్రస్తుతం ఎకరం పొలంలో వాడుతుండగా అది సత్ఫలితాలను ఇస్తోంది. అధిక దిగుబడితోపాటు ఆరోగ్యకరమైన పంటలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ ఎరువుల సాయంతో మేలిమి రకం వరిసాగులో వియత్నాం అగ్రస్థానంలో నిలుస్తోంది.

Read More