మొక్కజొన్నను ఇథనాల్ ఉత్పత్తికి వాడటము వలన డిమాండ్ భారీగా పెరిగిందని, అందుకు అనుగుణంగా సాగు, దిగుబడులు పెంచేందుకు పరిశోధనలు జరుగుతున్నాయని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్) డైరెక్టర్ హెచ్‌ఎస్ జాట్ తెలిపారు. హైదరాబాద్‌లో జాతీయ వ్యవసాయ పరిశోధన విస్తరణ సంస్థ (నార్మ్)లో ‘మొక్కజొన్న పరిశోధనలో డేటా సేకరణ, విశ్లేషణ’ అంశంపై జాతీయ సదస్సును ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. డేటా ఆధారిత పరిశోధన విధానాలు మొక్కజొన్న సాగు విస్తరణలో కీలకపాత్ర పోషిస్తాయి. మొక్కజొన్నలు ఇథనాల్ ఉత్పత్తికి అనుకూలంగా ఉండటంతో కంపెనీలు అధికశాతం ఆ పంట వైపు మొగ్గు చూపుతున్నాయి’ అని సూచించారు. నార్మ్ డైరెక్టర్ గోపాల్ లాల్, డైరెక్టర్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ ఛటర్జీ, అగ్రివర్సిటీ సీడ్స్ డైరెక్టర్ నగేశ్‌కుమార్ లుథియానా వ్యవసాయ శాస్త్రవేత్త సునిల్ పాల్గొన్నారు.

9 Jan, 2026
